breaking news
-
అఫీషియల్: ఓటీటీకి టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్'. ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. డీజే టిల్లుకు సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. గతంలో రిలీజైన డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 29 ప్రేక్షకుల ముందుకొచ్చిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ కావడంతో ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీకి స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకుంది. 'చరిత్ర పునరావృతం అవ్వడం సాధారణం. అదే టిల్లు వస్తే హిస్టరీ, మిస్టరీ, కెమిస్ట్రీ అన్నీ రిపీట్ అవ్వుతాయి. అట్లుంటది టిల్లుతోని. టిల్లు స్క్వేర్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 26న వస్తుంది.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. History repeat avvadam normal. Adhe Tillu vasthe History, mystery, chemistry anni repeat avvuthai. Atluntadhi Tilluthoni. ✨🥰 Tillu Square arrives on 26 April, on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi. pic.twitter.com/SwEzFgJujb — Netflix India South (@Netflix_INSouth) April 19, 2024 -
నెల రోజుల్లోపే ఓటీటీకి టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ డేట్ అదేనా?
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్'. ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. డీజే టిల్లుకు సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. గతంలో రిలీజైన డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 29 ప్రేక్షకుల ముందుకొచ్చిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. తాజా బజ్ ప్రకారం ఈనెలలోపే టిల్లు స్క్వేర్ ఓటీటీలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 26 నుంచే స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ డేట్ ఫిక్స్ అయితే కేవలం నెల రోజుల్లోపే ఓటీటీలో అలరించనుంది. -
ఐదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన 'రాధికా ఆప్టే' బోల్డ్ సినిమా
రాధికా ఆప్టే.. అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ నటిగా తన ఉనికిని చాటుకుంటున్న ఈమె 'ది వెడ్డింగ్ గెస్ట్' చిత్రంతో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 'స్లమ్‌డాగ్ మిలియనీర్' సినిమాతో పాపులర్ అయిన దేవ్ పటేల్‌తో ఈ చిత్రంలో మెప్పించింది. బ్రిటీష్-అమెరికన్ చిత్రంగా వచ్చిన ఈ సినిమా 2019లో విడుదలైంది. కానీ ఇండియాలో విడుదల కాలేదు. చివరకు ఓటీటీలో కూడా భారత్ యూజర్స్‌కు అందుబాటులో లేదు. మైఖేల్ వింటర్బాటమ్ దర్శకత్వం వహించిన 'ది వెడ్డింగ్ గెస్ట్' సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. తాజాగా నెట్‌ప్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు,హిందీ,ఇంగ్లీష్ భాషలలో విడుదలైంది. సుమారు ఐదేళ్ల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రావడంతో నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. ఈ సినిమాలో రాధికా ఆప్టే, దేవ్ పటేల్ శృంగారంలో పాల్గొన్న సీన్ విడుదలకు ముందే లీక్ కావడంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఈ విషయంపై నటి రాధికా ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ సినిమా టాపిక్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఈ సినిమాలో రాధికా ఆప్టే పూర్తిగా దుస్తులు తొలిగించిన సీన్స్ ఉండటంతో 'ది వెడ్డింగ్ గెస్ట్' చిత్రం బాగా వైరల్ అయింది. ఆ సీన్‌పై రాధికా ఆప్టే ఏమన్నారంటే బోల్డ్ సీన్స్‌లో నటించే విషయంలో తనకు ఎలాంటి భయాలు ఉండవని 'ది వెడ్డింగ్ గెస్ట్' సినిమా విడుదల సమయంలో రాధికా తెలిపింది. ఈ సినిమా కోసం ఆమె దుస్తులు లేకుండా కనిపించింది. ఆ విషయం గురించి ఓపెన్‌గానే మాట్లాడింది. చిన్నప్పటి నుంచి ఎన్నో హాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగడం. ఆపై విదేశాల్లో నటులు వేదిక మీద నగ్నంగా నటించడం చూశానని అప్పట్లో చెప్పుకొచ్చింది. నా శరీరాన్ని చూసి నేనెందుకు సిగ్గుపడాలని ఆమె ప్రశ్నించింది. ఓ నటిగా తన శరీరం కూడా ఒక సాధనమేనని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. -
ఓటీటీకి రూ.200 కోట్ల హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
అజయ్ దేవ్‌గణ్, తమిళ స్టార్లు జ్యోతిక, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సైతాన్. ఇటీవల థియేటర్లలో రీలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. మార్చి 8న విడుదలై ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో సైతాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్కు రానుందని టాక్ నడుస్తోంది. కాగా.. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మే 3వ తేదీ నుంచి సైతాన్ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని లేటేస్ట్ టాక్. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్ అయితే థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. వర్ష్ అనే గుజరాతీ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీకి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని వికాస్ బహ్ల్, జ్యోతి దేశ్‌పాండే, అజయ్ దేవ్‌గణ్, అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో జానకీ బోడీవాలా, అంగద్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించగా.. అమిత్ త్రివేదీ సంగీతం అందించారు. -
ఒక్క కఠిన నిర్ణయం.. నెట్‌ఫ్లిక్స్‌కు రికార్డ్ లాభాలు!
ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న ఒక్క కఠిన నిర్ణయంతో దాని లాభాలు అమాంతం పెరగనున్నాయి. ‘వన్ డే’ పాపులర్ షో విడుదల, పాస్వర్డ్ షేరింగ్ కట్టడి చర్యల తర్వాత నెట్‌ఫ్లిక్స్ లాభాలు కొత్త రికార్డును తాకనున్నాయి. వాల్ స్ట్రీట్ అంచనాల ప్రకారం.. ఈ స్ట్రీమింగ్ దిగ్గజం ఈ సంవత్సరంలో మొదటి మూడు నెలల్లో 4.7 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను సాధించింది. 2020 కోవిడ్ లాక్డౌన్ల తర్వాత సబ్స్క్రైబర్ల సంఖ్య పెరుగుదల ఇదే అత్యధికం. అయితే నెట్‌ఫ్లిక్స్ ఈ స్థాయిలో పుంజుకోవడానికి పాస్వర్డ్ షేరింగ్‌ను కట్టడి చేయడమే కారణంగా తెలుస్తోంది. అయితే 2022లో ప్రకటనలతో కూడిన చౌకైన నెలవారీ చెల్లింపు ప్లాన్‌ను ప్రవేశపెట్టినప్పటి నుండి నెట్‌ఫ్లిక్స్‌కు యూజర్ల సంఖ్య పెరిగింది. రీఫినిటివ్ (Refinitiv) డేటా ప్రకారం.. నెట్‌ఫ్లిక్స్ లాభాలు 50 శాతం కంటే ఎక్కువ పెరిగి దాదాపు రూ. 16 వేల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. కంపెనీకి సంబంధించి ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా మొదటి త్రైమాసికంలో ఇవే అత్యధిక లాభాలు కానున్నాయి. ఇది డిస్నీ, అమెజాన్, యాపిల్ వంటి దిగ్గజాలతో స్ట్రీమింగ్ వార్‌లో నెట్‌ఫ్లిక్స్‌ను దృఢంగా నెలబెట్టనుంది. నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. అమెజాన్ ప్రైమ్‌కు 20 కోట్ల మంది, డిస్నీ+కి 15 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019