breaking news
-
నెస్లే సెరెలాక్ మంచిదేనా..? పరిశోధనలో షాకింగ్ విషయాలు!
ఇటీవలకాలంలో కొన్ని ప్రముఖ ఫుడ్ బ్రాండ్లపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో క్యాడ్బరీ చాక్లెట్లు, బోర్నావిటా వంటి ప్రొడక్ట్స్‌పై ఆరోపణలు వచ్చాయి. వాటిల్లో అధిక చక్కెర ఉందని ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు తెలిపారు. అవి మరువక మునుపై తాజాగా ప్రముఖ బేబి బ్రాండ్ నెస్లేపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆ ప్రొడక్ట్స్‌పై జరిపిన అధ్యయనంలో చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏం జరిగిందంటే..నెస్లే బ్రాండ్‌కి సబంధించిన శిశువుల ప్రొడక్ట్స్ సెరెలాక్‌లో అధిక చక్కెర కలుపుతున్నట్లు పరిశోధనలో తేలింది. ఒక్కో స్పూన్లో దాదాపు మూడు గ్రాములు చక్కెర ఉన్నట్లు పరిధనలో గుర్తించారు. ఇది అంతర్జాతీయ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నట్లు పబ్లిక్ ఐ, అంతర్జాతీయ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్స్ అనే పరిశోధన సంస్థలు పేర్కొన్నాయి. దీని కారణంగా ఊబకాయం, దీర్థకాలిక వ్యాధులు తలెత్తుతాయిని తెలిపింది. ఈ ఉల్లంఘనలు కేవలం ఆసియా, ఆఫ్రికన్ మరియు లాటిన్ అమెరికన్ దేశాలలో మాత్రమే జరుగుతున్నట్లు గుర్తించింది. నెస్లే ద్వారా అమ్ముడవుతున్న రెండు రకాల బేబీ ఫుడ్ బ్రాండ్స్‌లలో అధిక స్థాయిలో చక్కెర ఉన్నట్లు పబ్లిక్ ఐ వెల్లడించింది. అయితే యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నెస్లే ఉత్పత్తుల్లో చక్కెర రహితం ఉన్నాయని పబ్లిక్ ఐ తెలిపింది. భారత్‌లో ఇదే బ్రాండ్ మొత్తం 15 సెరెలాక్ బేబీ ప్రొడక్ట్స్‌లో ఒక్కో సర్వింగ్‌లో సగటున దాదాపు మూడ గ్రాములు చక్కెర ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. అలాగే ఇథియోపియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో ఇదే బ్రాండ్ ప్రొడక్ట్స్‌లో ఏకంగా ఆరు గ్రాములు చక్కెర ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. మరీ జర్మనీ, యూకేలో మాత్రం చక్కెర జోడించకుండా విక్రయించడ గమనార్హం. నిజానికి ఈ నెస్లే ప్యాకేజింగ్‌పై షోషకాహార సమాచారంలో ఈ జోడించిన చక్కెర గురించి సమాచరం లేనట్లు నివేదిక పేర్కొంది. ఇది కేవలం తన ఉత్పత్తులపై విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాల గురించి ప్రముఖంగా హైలైట్ చేస్తుందని, పారదర్శకంగా లేదని నివేదిక వెల్లడించింది. నిపుణలు ఏం మంటున్నారంటే.. శిశువుల ఉత్పత్తుల్లో అధిక చక్కెర ప్రమాదకరమైనదని నిపుణలు చెబుతున్నారు. శివువులు, చిన్న పిల్లలకు అందించే ఆహారంలో చక్కెర ఎక్కువగా జోడించకూడదు. వాళ్లు ఈ రుచికి అలవాటు పడి చక్కెరకు సంబంధించిన ఆహారాలను తినేందుకు ఇష్టపడటం జరుగుతుంది. దీంతో క్రమంగా పోషకాహార రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుంది. ఫలితంగా కౌమర దశకు చేరుకోక మునుపే ఊబకాయం, మధుమేహం లేదా రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారని నిపుణులు వెల్లడించారు. అయితే పరిశోధన సంస్థపబ్లిక్ ఐ, ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్‌వర్క్‌లు నెస్లే కంపెనీ దృష్టికి తీసుకువెళ్లగా..గత ఐదేళ్లలో, నెస్లే ఇండియా ప్రపంచవ్యాప్తంగా శిశు తృణధాన్యాల పోర్ట్‌ఫోలియోలో (పాలు తృణధాన్యాల ఆధారిత కాంప్లిమెంటరీ ఫుడ్) వేరియంట్‌ను బట్టి 30% వరకు చక్కెరలను జోడించడం తగ్గించింది అని చెబుతుండటం విశేషం. (చదవండి: ఎవరీ ప్రియంవదా నటరాజన్? ఏకంగా టైమ్ మ్యాగజైన్లో..!) -
భారత్‌లో నెస్లే ఇండియా వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ నెస్లే ఇండియా 2025 నాటికి భారత్‌లో రూ.4,200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. ఇందులో భా గంగా ఒడిశా రాష్ట్రంలో దేశంలోనే 10వ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ చైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ తెలిపారు. రానున్న రోజుల్లో భారత మార్కెట్లో తమ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. 2023 మొదటి ఆరు నెలల్లో తాము రూ. 2,100 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు తెలిపారు. ఈ మొత్తంలో ఒకటో వంతు ఆహారోత్పత్తుల కోసమే వెచ్చించినట్టు పేర్కొన్నారు. చాక్లెట్లు, కన్ఫెక్షనరీ తయారీ కోసం ఒక వంతు, మిగిలిన మొత్తాన్ని న్యూట్రిషన్, ఇతర ఉత్పత్తుల తయారీపై ఖర్చు చేసినట్టు మీడియా సమావేశంలో ప్రకటించారు. మ్యాగీ నూడుల్స్, కిట్‌క్యాట్ చాక్లెట్లు, నెస్‌కేఫే తదితర పాపులర్ ఉత్పత్తులను ఈ సంస్థ విక్రయిస్తుండడం తెలిసిందే. 2023 నుంచి 2025 మధ్య మరో రూ.4,200 కోట్లు ఖర్చు చేస్తామని చెబుతూ, ఇందులో రూ.900 కోట్లతో ఒడిశాలో ప్లాంట్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఉన్నట్టు సురేష్ నారాయణన్ తెలిపారు. అలాగే, కాఫీ, బెవరేజెస్ కోసం నిధులు వెచి్చంచనున్నట్టు చెప్పారు. నెస్లే ఇండియా ఏర్పాటైన నాటి నుంచి గత 60 ఏళ్లలో భారత్‌లో రూ.7,000 కోట్లను ఖర్చు చేసినట్టు ప్రకటించారు. మహిళలకు మరింత ప్రాతినిధ్యం గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్‌లో నూడుల్స్‌తోపాటు కన్ఫెక్షనరీ తయారీ సామర్థ్యాలను నెస్లే విస్తరిస్తోంది. అలాగే పంజాబ్‌లోని మోగాలో, గోవాలోని పాండాలో ప్లాంట్లను విస్తరిస్తున్నట్టు నారాయణన్ తెలిపారు. మరింత మంది మహిళా ఉద్యోగులను చేర్చుకోనున్నట్టు చెప్పారు. కంపెనీ బోర్డులో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం ఉండగా, క్షేత్ర స్థాయి ఉద్యోగుల్లో 20 శాతం మంది మహిళలు పనిచేస్తున్నట్టు వెల్లడించారు. తమ కార్మిక శక్తిలో 25 శాతం మహిళల లక్ష్యానికి చేరువ అవుతున్నట్టు తెలిపారు. తమ సనంద్ ప్లాంట్‌లో అయితే సగం మంది కార్మికులు మహిళలే ఉన్నట్టు చెప్పారు. నెస్లే ఇండియాలో సుమారు 6,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
గ్రామీణ ప్రాంతాలపై పడిన నెస్లే దృష్టి.. అమ్మకాల వృద్ధికి కొత్త వ్యూహాలు!
న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ నెస్లే ఈ ఏడాది రెండంకెల విక్రయాలపై దృష్టి పెట్టింది. ద్రవ్యోల్బణం తగ్గుతుండడంతో ధరలపరమైన ఒత్తిళ్లు నిదానిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో తమ నెట్వర్క్ విస్తరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. కంపెనీకి 20 శాతం అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల నుంచే ఉంటున్నాయి. వచ్చే 12 - 18 నెలల్లో 2,000కు పైగా జనాభా ఉన్న 1.2 లక్షల గ్రామాలను చేరుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం 90వేల గ్రామాల్లో విక్రయాల నెట్వర్క్ ఉంది. నెస్లే హెల్త్‌సైన్స్ కింద ఫార్మసీ వ్యాపారాన్ని కూడా విస్తరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.. ‘‘ఎల్‌నినో కారణంగా వర్షాలపై మరీ ప్రతికూల ప్రభావం లేకపోతే తప్ప డిమాండ్ పరిస్థితి స్థిరంగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. రెండంకెల వృద్ధి దిశగా అడుగులు వేస్తాం. అమ్మకాల్లో తిరిగి వృద్ధిని చూస్తున్నాం. మొదటి త్రైమాసికంలో వృద్ధి 5 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి దిగొస్తే అప్పుడు అమ్మకాల పరిమాణం, విలువ పరంగా మరింత సమతుల్యమైన వృద్ధిని నమోదు చేస్తాం’’అని నెస్లే ఇండియా చైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ పేర్కొన్నారు. గడిచిన ఆరేడేళ్లుగా కంపెనీ కాంపౌండెడ్‌గా ఏటా 10 - 11 శాతం మేర వృద్ధిని చూస్తున్నట్టు చెప్పారు. ధరలు తగ్గిస్తారా..? ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు దిగొస్తే ఉత్పత్తుల ధరలను తగ్గించడం ద్వారా వినియోగదారులకు ఉపశమనం కల్పిస్తారా? అన్న ప్రశ్నకు.. సరైన చర్యలపై దృష్టి పెడతామని నారాయణన్ బదులిచ్చారు. ఇప్పటికైతే ధరలు తగ్గించేటంత సానుకూల స్థితికి చేరుకోలేదన్నారు. రానున్న రోజుల్లో తాము కొనుగోలు చేసే ముడి పదార్థాల ధరలు చెప్పుకోతగ్గంత తగ్గుముఖం పడితే అప్పుడు ఉత్పత్తుల ధరలు, బరువు పరంగా సర్దుబాటు చేస్తామని చెప్పారు. పాల ధరలు భగ్గుమంటున్నాయని చెబుతూ.. ఇదే పరిస్థితి కొనసాగితే పాల ఆధారిత ఉత్పత్తుల ధరల ను సవరించాల్సి రావచ్చన్నారు. గ్రామీణ ప్రాంతాల అమ్మకాలు 25 శాతానికి చేరుకుంటాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న ప్యాకెట్లకు ఎక్కువ ఆదరణ ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ కామర్స్ నుంచి 7 శాతం అమ్మకాలు వస్తున్నాయంటూ, ఇవి ఇంకా పెరగొచ్చన్నారు. -
నెస్లే ఇండియా భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: గ్లోబల్ ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే ఎస్ఏ దేశీయంగా భారీ పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. రానున్న మూడున్నరేళ్లలోగా అంటే 2025కల్లా రూ. 5,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ సీఈవో మార్క్ ష్నీడర్ వెల్లడించారు. తద్వారా దేశీ బిజినెస్‌కు జోష్‌నివ్వడంతోపాటు కొత్త వృద్ధి అవకాశాలను అందుకోనున్నట్లు తెలియజేశారు. నిధులను పెట్టుబడి వ్యయాలుగా వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. కొత్త ప్లాంట్ల ఏర్పాటు, ఇతర సంస్థల కొనుగోళ్లు, ప్రొడక్టు పోర్ట్‌ఫోలియో విస్తరణ తదితరాలను చేపట్టనున్నట్లు వివరించారు. కంపెనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9 ప్లాంట్లను నిర్వహిస్తోంది. కొత్తగా తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు తగిన ప్రాంతాలను అన్వేషిస్తున్నట్లు నెస్లే ఇండియా చైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ పేర్కొన్నారు. పెట్టుబడులకు అధికారిక సంస్థల నుంచి అనుమతులు లభించాల్సి ఉండగా.. మరింత మందికి ఉపాధి లభించే వీలుంది. ప్రస్తుతం 6,000 మంది సిబ్బంది ఉన్నారు. టాప్–10లో ఒకటి... నెస్లేకు ప్రాధాన్యతగల టాప్–10 మార్కెట్లలో ఒకటైన ఇండియాలో 2025కల్లా రూ. 5,000 కోట్లు వెచ్చించనున్నట్లు ష్నీడర్ తెలియజేశారు. కంపెనీ గత ఆరు దశాబ్దాలలో రూ. 8,000 కోట్లను వెచ్చించినట్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశీయంగా 110 ఏళ్ల క్రితమే కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ 1960 నుంచీ తయారీకి తెరతీసినట్లు వివరించారు. -
మరో రంగంలోకి రిలయన్స్ సునామీ: దిగ్గజాలకు దిగులే!
సాక్షి,ముంబై: రిలయన్స్ జియో పేరుతో టెలికాం రంగంలో సునామీ సృష్టించిన ఆయిల్-టు-టెలికాం దిగ్గజం రిలయన్స్ త్వరలోనే మరో రంగంలో ఎంట్రీ ఇస్తోంది. రిటైల్ విభాగం, రిలయన్స్ రిటైల్ వ్యాపారంలో భారీ వృద్ధి తర్వాత ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఎఫ్ఎంసీజీ) విభాగంలోకి అడుగు పెట్టనునున్నామని రిలయన్స్ మెగా ఈవెంట్లో ప్రకటన వెలువడింది. కంపెనీ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ విషయాన్ని వెల్లడించారు. హైక్వాలిటీ, సరసమైన ఉత్పత్తులను అభివృద్ధి, డెలివరీతో పాటు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో ఎఫ్ఎంసీజీ విభాగంలో అడుగుపెడుతున్నట్లు తెలిపారు .అలాగే కస్టమర్లకు షాపింగ్ అనుభవాన్ని మెరుగుపర్చే ఉద్దేశంతో 2021లో ప్రారంభించిన WhatsApp-JioMart భాగస్వామ్యం ఎలా పనిచేస్తుందో ప్రదర్శించి చూపించారు. ఇషా అంబానీ ఇంకా ఏమన్నారంటే.. ‘‘డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రతిరోజూ దాదాపు 6లక్షలకు ఆర్డర్లు డెలివరీ చేస్తున్నాం. ఇది గత సంవత్సరం కంటే 2.5 రెట్లు పెరిగింది. 260కి పైగా పట్టణాల్లో డెలివరీ చేస్తున్న జియోమార్ట్ ఆన్లైన్ గ్రోసరీ ఇండియా నంబర్ వన్ విశ్వసనీయ బ్రాండ్‌గా రేట్ సాధించింది. 42 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మా స్టోర్ల సంఖ్యను 15,000కు పైగా పెంచడానికి ఈ ఏడాది 2,500 స్టోర్లను ప్రారంభించాం. స్టోర్ నెట్వర్క్ , మర్చంట్ పార్టనర్ల జోడింపు ద్వారా మరింత మంది కస్టమర్లు మా ఖాతాలో చేరుతున్నారు. రిలయన్స్ రిటైల్ రాబోయే ఐదేళ్లలో 7,500 పట్టణాలు, 3 లక్షల గ్రామాలకు సేవలందించాలనేది మా లక్ష్యం’’ అని ఇషా అంబానీ వెల్లడించారు. ప్రతి భారతీయుడి రోజువారీ అవసరాలను తీర్చే లక్క్ష్యంతో ఈ రంగంలోకి అడుగు పెడుతున్నట్టు ఆమె తెలిపారు. అంతేకాదు భారతదేశం అంతటా గిరిజనులు, ఇతర అణగారిన వర్గాలు ఉత్పత్తి చేసే నాణ్యమైన వస్తువుల మార్కెటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. తద్వారా ఆయా కమ్యూనిటీలకు ఉపాధి, వ్యవస్థాపకత కోసం లాభదాయకమైన అవకాశాలను అందించడమే కాకుండా, సాంప్రదాయ భారతీయ కళాకారులు, ముఖ్యంగా మహిళల అద్భుతమైన ప్రతిభ, నైపుణ్యం, వారి క్రియేటివిటీని సంరక్షించడంలో సహాయపడుతుందని భావిస్తున్నామన్నారు. తద్వారా రిలయన్స్ రిటైల్ హిందుస్తాన్ యూనిలీవర్, నెస్లే బ్రిటానియా వంటి ఎఫ్ఎంసిజి దిగ్గజాలకు గట్టి షాకే ఇవ్వనుంది. చదవండి: Reliance Industries AGM: జియో 5జీ కోసం 2 లక్షల కోట్ల పెట్టుబడి 'అల్ట్రా-అఫర్డబుల్' 5జీ స్మార్ట్‌ఫోన్ త్వరలో: ముఖేశ్ అంబానీ
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019