breaking news
Ad - Sakshi_Home_Sticky
-
Lok sabha elections 2024: పదేళ్ల అభివృద్ధి.. ట్రైలర్ మాత్రమే: మోదీ
త్రిసూర్/తిరువనంతపురం/తిరునల్వేలి: గత దశాబ్దాకాలంగా ఎన్డీఏ పాలనాకాలంలో దేశం చవిచూసిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాకారంకానుందని ఆయన ప్రకటించారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యతనిస్తూ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ‘సంకల్ప పత్రం’ విడుదల చేసిన మరుసటి రోజే ప్రధాని మోదీ ఆ హామీలను పునరుద్ఘాటించారు. కేరళలోని కున్నమ్కులమ్, కట్టకడ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభల్లో మోదీ ప్రసంగించారు. రాహుల్‌గాంధీపై పరోక్ష విమర్శలు చేశారు. ‘‘ కాంగ్రెస్ యువరాజుకు ఉత్తరప్రదేశ్‌లో దశాబ్దాలుగా తమ కుటుంబ గౌరవం(అమేథీ ఎంపీ స్థానం)ను కాపాడే సత్తాలేదుగానీ కేరళకు వచ్చి ఓట్లడుగుతారు. కేరళీయుల ఓట్లడిగే ఆయన సీపీఐ(ఎం) ఏలుబడిలో కరువన్నూర్ సహకార బ్యాంక్‌లో వెలుగుచూసిన కుంభకోణంపై నోరు మెదపరెందుకు? నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాజకీయ విభాగం సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు కాంగ్రెస్‌కు ఉంది. ఈ రెండింటి మధ్య చీకటి ఒప్పందం కుదిరింది. కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్‌కు పాల్పడి ప్రజాధనాన్ని లూటీ చేశారు. ఈ మోసంపై నేనే ఈడీ దర్యాప్తు నకు ఆదేశించా’’ అని అన్నారు. లెఫ్ట్ ఉంటే అంతా లెఫ్ట్ అయినట్లే ‘‘కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి, అధికార ఎల్డీఎఫ్ కూటములు కేరళలో అభివృద్ధికి ప్రతిబంధకాలుగా తయా రయ్యాయి. త్రిపుర, పశ్చిమబెంగాల్, కేరళ ఈ రాష్ట్రాల్లో లెఫ్ట్ పార్టీ అధికారంలో ఉందీ అంటే అక్కడ అంతా పోయినట్లే(లెఫ్ట్ అయినట్లే). అక్కడ మంచి అనేదే జరగదు. పశ్చిమబెంగాల్, త్రిపురలో ఏం చేశారని, కొత్తగా కేరళకు చేయడానికి?’ అంటూ ధ్వజమెత్తారు. కచ్ఛతీవు ఉదంతాన్ని 4 దశాబ్దాలు దాచారు తమిళనాడులోని తిరునల్వేలిలో జరిగిన సభలోనూ మోదీ ప్రసంగించారు. కచ్ఛ తీవు ను శ్రీలంకకు ఇచ్చేసి కాంగ్రెస్, డీఎంకే ఈ ఉదంతాన్ని 40 ఏళ్లు దాచిపెట్టాయని మోదీ ఆరోపించారు. అక్కడ తమిళ మత్స్య కారులు తరచూ అరెస్ట్ అవుతున్నారని, ఈ పాపం ఆ పార్టీలదేనన్నారు. -
బీజేపీని బలోపేతం చేయమంటే.. నిండా ముంచారు!
కప్పుకునేది కాషాయం కండువా. చేసేది పసుపు రాజకీయం. ఇదీ ఏపీ బిజెపి చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహారశైలి. సంక్షోభంలో కూరుకుపోయిన తెలుగుదేశం పార్టీని బతికించుకోడానికి.. చంద్రబాబుకు మద్దతుగా ఉండేందుకు పురందేశ్వరి పడని పాట్లు లేవు. ఏపీలో బిజెపిని బలోపేతం చేయవమ్మా అని అధ్యక్ష పదవి కట్టబెడితే.. బిజెపిని నిండా ముంచి మరిది చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకోసం ఎందాకైనా వెళ్తానంటున్నారు పురందేశ్వరి. టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు చంద్రబాబు వెన్నుపోటు పొడవాలని డిసైడ్ అయినపుడు పురందేశ్వరి దంపతులే మంచి కత్తి ఒకటి చంద్రబాబుకు కానుకగా ఇచ్చారని అప్పట్లో వైస్రాయ్ కోళ్లు ఆగ్రహంగా కూశాయి. వైస్రాయ్ ఎపిసోడ్లో.. తన తండ్రిని ముఖ్యమంత్రి పీఠం నుండి నిర్దాక్షిణ్యంగా దించేసిన కుట్రలో ఎన్టీయార్ తనయ దగ్గుబాటి పురందేశ్వరి.. ఆమె భర్త వెంకటేశ్వరరావులు భాగస్వాములన్నది బహిరంగ రహస్యం. వెన్నుపోటులో తనకు అండగా ఉంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు డిప్యూటీ సిఎం పదవి ఇస్తానని చంద్రబాబు ఆఫర్ ఇచ్చారని అంటారు. తీరా వెన్నుపోటు పొడిచేసి కత్తికంటిన నెత్తుటిని తుడిచేసి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న తర్వాత దగ్గుబాటి విషయాన్ని పక్కన పెట్టేశారు చంద్రబాబు. ఇవాళో రేపో తనకు ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని దగ్గుబాటి కొద్ది రోజులు వెయిట్ చేశారు. అయితే ఉప ముఖ్యమంత్రి పదవి ఆరో వేలు లాంటిదని దాని వల్ల ప్రయోజనం ఉండదని చంద్రబాబు మనసా వాచా కర్మేణా నమ్మడం వల్ల వెంకటేశ్వరరావుకు డిప్యూటీ సిఎం పదవి రాలేదు. అప్పటికి కానీ తాము మోసపోయామని దగ్గుబాటి దంపతులు గ్రహించలేకపోయారు. తెలిసిన తర్వాత ఉక్రోషంతో టిడిపి నుండి బయటకు వచ్చి చంద్రబాబుపై కారాలూ మిరియాలను మిక్సీలో వేసి రుబ్బారు. కొంతకాలం బిజెపిలో మరి కొంతకాలం కాంగ్రెస్ లో కాలక్షేపం చేసిన వెంకటేశ్వరరావు ఖాళీ సమయంలో ఓ ఆత్మకథ రాసి అందులో చంద్రబాబును నిర్మా వాషింగ్ పౌడర్ తో ఉతికి ఆరేశారు. ఆ కోపం చాలా ఏళ్ల పాటు చంద్రబాబులో ఉండిపోయింది. అందుకే 2014లో టిడిపి-బిజెపిలు పొత్తు పెట్టుకున్నా.. రాజంపేట నుండి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసిన పురందేశ్వరిని దగ్గరుండి మరీ ఓడించారు చంద్రబాబు.ఎన్నికల ఫలితాల రోజున పురందేశ్వరి ఓడారని తెలిసిన తర్వాతనే చంద్రబాబు సంతృప్తిగా నవ్వారని టిడిపి వర్గాలంటాయి. రెండు దశాబ్దాలకు పైగా నారా-దగ్గుబాటి కుటుంబాల మధ్య వైరం అలానే కొనసాగింది. 2019 ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం చెందడం ఆ తర్వాత వరుసగా అన్ని స్థానిక ఎన్నికల్లోనూ టిడిపి అడ్రస్ గల్లంతు కావడం జరిగిపోయాయి. 2024 ఎన్నికల్లోనూ టిడిపి లేచి నిలబడే పరిస్థితి లేదని తేలిపోయింది. ఈ సమయంలోనే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండె సంబంధ సమస్య వచ్చి ఆసుపత్రిలో చేరితే పరామర్శ పేరిట చంద్రబాబు వెళ్లారు. అలా వెళ్లడానికి రామోజీ సలహాయే కారణమంటారు. విడిపోయిన నారా-దగ్గుబాటి కుటుంబాలు మళ్లీ కలవకపోతే వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఎదుర్కోలేమని రామోజీరావే రెండు కుటుంబాలకూ నూరిపోశారని కృష్ణా జిల్లా కోళ్లు మొహమాటంగా కూశాయి. అలా రాజగురువు ఇచ్చిన టిప్ తో ఆసుపత్రిలో దగ్గుబాటి దంపతలు కాళ్లమీద పడిపోయిన చంద్రబాబు వెన్నుపోటు ఘటన అనంతరం తాను చేసిన ద్రోహాన్ని ఒప్పుకుని క్షమించమన్నారట. దాంతో దగ్గుబాటి దంపతులు చంద్రబాబును క్షమించేసి ఇకనుంచి కలిసుందాం రా అన్నారట.ఆ క్రమంలోనే ఎన్టీయార్ నాణెం విడుదల చేసినపుడు పురందేశ్వరే ప్రణాళిక రచించి చంద్రబాబును ఎన్టీయార్ నాణెం విడుదల కార్యక్రమానికి కుటుంబ సభ్యుల ముసుగులో ఆహ్వానించారు. అక్కడ బిజెపి అధ్యక్షుడు నడ్డాతో వన్ టూ వన్ మాట్లాడుకునే వీలూ కల్పించారు. బిజెపితో తిరిగి పొత్తుకు ఆ క్షణానే చంద్రబాబు నడ్డాను మోహించినట్లు నటించారు. ఆ తర్వాత 371 కోట్ల రూపాయలు దోచుకు తిన్న స్కిల్ స్కాంలో చంద్రబాబు నాయుణ్ని కోర్టు ఆదేశాలతో అరెస్ట్ చేసి జైలుకు పంపగానే.. టిడిపి నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులకన్నా కూడా ముందుగా స్పందించింది పురందేశ్వరే. చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అక్రమం అని ఆమె ముందస్తుగా ఖండించేశారు. ఆ తర్వాత చంద్రబాబుకు బెయిల్ రాకపోవడంతో ఆ ప్రయత్నాలకోసం నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్రనేతల అపాయింట్ మెంట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే పురందేశ్వరి ఏపీ బిజెపి నేతలకు కూడా చెప్పకుండా అర్జంట్ గా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి హస్తినలో దిగి అక్కడ తన చెల్లెలి కొడుకు నారా లోకేష్ ను తీసుకుని పార్టీ అగ్రనేత కేంద్రమంత్రి అమిత్ షా నివాసంలో ఆయనతో భేటీ కుదిర్చి తన వంతు సాయం అందించారు. ఇక ఎన్నికలు దగ్గర పడే సమయంలో టిడిపితో పొత్తు విషయంలో బిజెపి జాతీయ నాయకత్వం అనాసక్తిగా ఉండడంతో పురందేశ్వరే జోక్యం చేసుకుని టిడిపితో పొత్తు కుదిరేలా అగ్రనేతల దగ్గర మంత్రాంగం నడిపారని అంటారు. మొత్తం మీద టిడిపి-బిజెపిల మధ్య పొత్తు కుదిర్చారు. ఆ తర్వాత ఏపీ బిజెపిలో చంద్రబాబు అనుకూల నేతలకు టికెట్లు ఇప్పించారు. చంద్రబాబు అవినీతిని అను నిత్యం ఎండగట్టిన సోము వీర్రాజు, జి.వి.ఎల్. నరసింహారావులకు టికెట్ దక్కకుండా పక్కన పెట్టారు పురందేశ్వరి. అలా చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాలకోసం తాను ఏమైనా చేస్తానని చాటుకున్నారు. తాజాగా టిడిపి నేతల అవినీతి విషయంలో చట్ట ప్రకారం నడుచుకుంటూ స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తోన్న ఐపీఎస్ అధికారులపై వేటు వేయాలంటూ ఏకంగా ఈసీకే లేఖ రాసి బరితెగించేశారు పురందేశ్వరి.ఫలానా అధికారులు ఉంటే అన్యాయం జరుగుతుందని ఫిర్యాదు చేయడం వేరు..వారిని తప్పిస్తే ఆ స్థానాల్లో ఎవరిని వేయాలో కూడా పురందేశ్వరే సిఫారసు చేస్తూ జాబితా పంపడం వివాదస్పదం అయ్యింది. ఈ ఎన్నికల్లో కూడా తన తండ్రి స్థాపించిన టిడిపి గెలిచి అధికారంలోకి రాలేకపోతే ఇక పార్టీ మనుగడే ప్రశ్నార్ధకం అవుతుందని పురందేశ్వరి భయపడుతున్నారు. తన తండ్రి పెట్టిన పార్టీని గుంజుకుని..తన తండ్రి ఆశాయలకు తూట్లు పొడిచిన చంద్రబాబు నాయుడి రాజకీయ భవిష్యత్తు అంధకారంలోకి జారుకోకూడదని పాపం పురందేశ్వరి విపరీతంగా కష్టపడుతున్నారు. అయితే ఏవీ వర్కవువ్ కావంటున్నారు రాజకీయ పండితులు. -
Bihar politics: పాత కత్తులు.. కొత్త పొత్తులు
కులాల కుంపట్లు, పొత్తుల కత్తులు, కిచిడీ కూటములు, జంపింగ్ జపాంగ్‌లకు పెట్టింది పేరైన బిహార్‌లో రాజకీయాలు ఎప్పుడూ కాక పుట్టిస్తూనే ఉంటాయి. 40 సీట్లతో లోక్‌సభ నియోజకవర్గాల పరంగా దేశంలో నాలుగో స్థానంలో నిలుస్తున్న ఈ తూర్పు రాష్ట్రానిది జాతీయ రాజకీయాల్లో ఆది నుంచీ కీలక పాత్రే. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ మొదలు జగ్జీవన్‌రాం, నుంచి లాలూ ప్రసాద్, నితీశ్‌కుమార్ దాకా దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఉద్ధండ నేతలకు పుట్టిల్లు బిహార్. అధికారం కోసం ప్రాంతీయ, జాతీయ పార్టీల మధ్య కుమ్ములాటలు, వర్గ పోరు, పవర్ పాలిటిక్స్ ఇక్కడ సర్వసాధారణం. స్టేట్ స్కాన్ రాజకీయంగా చైతన్యవంతమైన బిహార్‌లో లోక్‌సభ ఎన్నికల ముంగిట కొత్త పొత్తులు పొడిచాయి. గత ఎన్నికల్లో బీజేపీ, జేడీ (యూ), లోక్ జనశక్తి పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి ఏకంగా 39 సీట్లను ఒడిసిపట్టింది. బీజేపీ 17 సీట్లలో పోటీ చేసి అన్నీ గెలుచుకుంది. జేడీ(యూ) 17 సీట్లకు 16 చోట్ల, ఎల్జేపీ ఆరింటికి ఆరూ కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ తదితర పార్టీల మహాకూటమి మహా ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ 9 చోట్ల పోటీ చేసి ఒక్క సీటు గెల్చుకోగా ఆర్జేడీ 19 స్థానాల్లో తలపడినా సున్నా చుట్టింది. మిగతా పార్టీలదీ అదే పరిస్థితి. కేంద్రంలో మోదీ 2.0 బలమైన సర్కారు ఏర్పాటులో బిహార్ ఘనవిజయానిది ప్రధాన పాత్ర. ఈసారి పాత మిత్రులతో పూర్వ వైభవానికి కాంగ్రెస్ ప్రయతి్నస్తోంది. బిహార్‌లో 40 స్థానాల్లో ఆరింటిని ఎస్సీలకు కేటాయించారు. నితీశ్ పిల్లిమొగ్గలు... బిహార్ రాజకీయాల్లో వెలుగు వెలిగిన లాలు అవినీతి కేసుల్లో జైలుపాలైన నాటి నుంచీ రాష్ట్రంపై నితీశ్ కుమార్ పట్టుబిగించారు. ఏదో ఒక పార్టీతో పొత్తుతో 15 ఏళ్లుగా సీఎం పీఠాన్ని అంటిపెట్టుకున్నారు. జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, సమాజ్‌వాదీ, జేడీ(ఎస్), కాంగ్రెస్ మహా కూటమిగా పోటీ చేశాయి. ఆర్‌ర్జేడీ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించినా నితీశ్ సీఎం పదవి దక్కించుకున్నారు. రెండేళ్లు తిరిగేసరికి మహాకూటమికి గుడ్‌బై చెప్పి మళ్లీ బీజేపీతో జట్టుకట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో సీట్ల సర్దుబాటు చేసుకుని అత్యధిక ఎంపీ సీట్లను దక్కించుకున్నారు. అదే జోరులో 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ భాగస్వామిగా పోటీ చేసి సీఎం పీఠమెక్కారు. జేడీ(యూ) (43) కంటే బీజేపీ (74)కే ఎక్కువ సీట్లు దక్కినా నితీశ్ మళ్లీ సీఎం పదవి దక్కించుకోవడం విశేషం. రెండేళ్లలోనే ఆయన మళ్లీ ప్లేటు ఫిరాయించారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీని ఢీకొట్టడమే లక్ష్యంగా విపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తామంటూ ఎన్డీఏ కూటమి నుంచి బయటికొచ్చేశారు. మహాకూటమి దన్నుతో మళ్లీ సీఎం అయ్యారు! ఇండియా కూటమి ఏర్పాటు కీలక పాత్ర పోషించారు. తీరా గత జనవరిలో ఎన్డీఏలోకి గెంతి మహాకూటమికి, ఇండియా కూటమికీ కోలుకోలేని షాకిచ్చారు. బీజేపీ దన్నుతో సీఎం పదవిని కాపాడుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నారు. బీజేపీకి కలిసొస్తుందా...? నితీశ్‌తో కలిసి 2019 ఫలితాలను రిపీట్ చేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. కానీ దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న నితీశ్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎన్డీఏ సీట్లకు గండి కొట్టవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కులగణన చేపట్టడాన్ని నితీశ్ సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. అది తమ ఘనతేనని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఆ హామీ ఇస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. బీజేపీ అయోధ్య రామ మందిరంతో హిందుత్వ నినాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదంపై ఆశలు పెట్టుకుంది. ఈసారి బీజేపీ 17, జేడీయూ 16, చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని ఎల్జేపీ 5, జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థాన్ ఆవామ్ మోర్చా, రా్రïÙ్టయ లోక్ సమతా పార్టీ ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి. కులగణన ఎవరికి ప్లస్! బిహార్ రాజకీయాలు చిరకాలంగా కులాల చుట్టూనే తిరుగుతున్నాయి. నితీశ్ చేపట్టిన కులగణన మరోసారి రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపింది. రాష్ట్రంలో 94 లక్షల కుటుంబాలు (34.13%) నెలకు రూ.6,000 సంపాదన కూడా లేక పేదరికంలో మగ్గుతున్నాయని కులగణనలో వెల్లడైంది. రాష్ట్రంలో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచాల్సిందేనని నితీశ్ పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో 19.65 శాతం ఎస్సీలు, 1.68 శాతం ఎస్టీలున్నారు. వారిలో ఏకంగా 42.7 శాతం మంది నిరుపేదలని కులగణనలో తేలింది. 27.13 శాతం ఓబీసీలున్నారు. వీరిలో 14.26 శాతం యాదవులు. దాదాపు 17 శాతం మంది ముస్లింలున్నారు. మహాకూటమి యాదవులు, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ఓట్లపై కాంగ్రెస్ గురిపెట్టింది. జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయం జరగాల ని డిమాండ్ చేస్తోంది. అగ్రవర్ణాలతో పాటు ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలనూ ఆకర్షించేలా బీజేపీ, జేడీయూ పావులు కదుపుతున్నాయి. ప్రధాని మోదీ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. సర్వేల సంగతేంటి...? బిహార్‌లో ఎన్నికల సర్వేల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. నితీశ్ చేరికతో ఎన్డీఏకు 32 నుంచి 35 సీట్లు రావచ్చని కొన్ని సర్వేలు అంచనా వేశాయి. ఇండియా కూటమికి 5–8 సీట్లే వస్తాయని చెప్పాయి. అయితే నితీశ్‌పై ప్రజా వ్యతిరేకత ఇండియా కూటమికి కలిసొస్తుందని ఇండియా కూటమి 15 నుంచి 20 పై చిలుకు దాకా చేజక్కించుకోవచ్చని మరికొన్ని సర్వేల అంచనా. ఇండియా కూటమి పైచేయి సాధిస్తుందా? ఎన్నికల వేళ వెన్నుపోటు పొడిచిన నితీశ్‌కు గుణపాఠం నేర్పాలని కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి పట్టుదలగా ఉంది. ఆయనది పచ్చి అవకాశవాదమంటూ కాంగ్రెస్, ఆర్జేడీ దుమ్మెత్తిపోస్తున్నాయి. రాష్ట్రంలో కులగణన తమ సంకీర్ణ సర్కారు ఘనతేనని ప్రచారం చేస్తున్నాయి. ఇది దేశానికి ఎక్స్‌రే వంటిదని, కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని రాహుల్ గాంధీ పదేపదే చెబుతున్నారు. మోదీ హయాంలో నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల, కార్పొరేట్ దోపిడీ తదితరాలను ప్రచారా్రస్తాలుగా మలచుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా 30 లక్షల ప్రభుత్వోద్యోగాలతో పాటు పలు సంక్షేమ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. 6 న్యాయాలు 25 గ్యారంటీలతో విడుదల చేసిన జాతీయ మ్యానిఫెస్టోను కాంగ్రెస్ ఊరూవాడా ప్రచారం చేస్తోంది. పొత్తులో భాగంగా ఆర్జేడీకి 26, కాంగ్రెస్ 9కి, లెఫ్ట్ పార్టీలకు 5 సీట్లు దక్కాయి. ఆర్జేడీ తమ 26 సీట్లలో మూడింటిని మాజీ మంత్రి ముకేశ్ సాహ్ని సారథ్యంలోని వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)కి కేటాయించింది. అబ్బాయ్–బాబాయ్ పోరు బిహార్‌లో అబ్బాయ్–బాబాయ్ అమీతుమీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎల్జేపీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆయన వారసత్వం కోసం కుమారుడు చిరాగ్, సోదరుడు పశుపతి పరాస్ హోరాహోరీ తలపడ్డారు. చివరికి పార్టీని పరాస్ చేజిక్కించుకున్నారు. చిరాగ్‌కు ఎల్జేపీ (రాం విలాస్), పశుపతికి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ) పేర్లను ఎన్నికల సంఘం కేటాయించింది. పశుపతి పార్టీకి బీజేపీ ఒక్క సీటూ ఇవ్వకపోవడంతో ఆయన కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగారు. సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించారు. చిరాగ్‌కు బీజేపీ ఐదు సీట్లు ఇవ్వగా పట్టుబట్టి పాశ్వాన్ల కంచుకోట అయిన హాజీపూర్‌ను సాధించుకున్నారు. అక్కడ బాబాయ్ పశుపతిపై చిరాగ్ నేరుగా తలపడుతుండటం విశేషం! సర్వేల సంగతేంటి...? బిహార్‌లో ఎన్నికల సర్వేల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. నితీశ్ చేరికతో ఎన్డీఏకు 32 నుంచి 35 సీట్లు రావచ్చని కొన్ని సర్వేలు అంచనా వేశాయి. ఇండియా కూటమికి 5–8 సీట్లే వస్తాయని చెప్పాయి. అయితే నితీశ్‌పై ప్రజా వ్యతిరేకత ఇండియా కూటమికి కలిసొస్తుందని ఇండియా కూటమి 15 నుంచి 20 పై చిలుకు దాకా చేజక్కించుకోవచ్చని మరికొన్ని సర్వేల అంచనా. యూపీఏ హయాంలో భారత్‌ను బలహీన దేశంగా చూసేవారు. చిన్నాచితకా దేశాల నుంచి కూడా ఉగ్రవాదులు మనపై దాడులకు తెగబడేవారు. కాంగ్రెసేమో చేతకానితనంతో వేరే దేశాలకు ఫిర్యాదు చేస్తుండేది. నేటి భారత్ అలాకాదు, అవసరమైతే ఉగ్రవాదుల ఇళ్లలో దూరి మరీ అంతం చేస్తుంది. – బిహార్ ఎన్నికల సభలో ప్రధాని మోదీ మహాకూటమి దెబ్బకు బీజేపీ, ఎన్డీఏ కంగుతిన్నాయి. అందుకే మోదీతో సహా అగ్ర నేతలంతా బిహార్‌లోనే తిరుగుతున్నారు. విపక్షాలపై కత్తిగట్టి ఈడీ, సీబీఐ కూడా ఇక్కడే మరింత ఫోకస్ చేస్తున్నాయి. పేదరికం, ఉపాధి, బిహార్ చిరకాల కోరికైన ప్రత్యేక హోదా గురించి మోదీ మాట్లాడాలి. – ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: ఆ మూడ్ స్వింగ్ ఎటో!
దేశంలో మోదీ మేనియా ఏమాత్రం తగ్గలేదని, ఫలితంగా వరుసగా మూడో ఘనవిజయంతో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని పలు సర్వేలు చెబుతున్నాయి. అయితే కీలక రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, బిహార్, మహారాష్ట్రల్లో మాత్రం ఓటరు నాడి ఎవరికీ అందడం లేదు. దాంతో వాటిని ఈసారి ఎన్నికల ఫలితాలను నిర్దేశించగల స్వింగ్ స్టేట్లుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఆ మూడు రాష్ట్రాలూ కలిపి ఏకంగా నాలుగో వంతు ఎంపీలను లోక్‌సభకు పంపుతున్నాయి! వాటిని నిర్ణాయక రాష్ట్రాలుగా మారుస్తున్న కారకాలేమిటి? అక్కడ ఫలితాలను ఊహించడం ఎందుకింత కష్టసాధ్యంగా మారింది...? అమెరికాలో 7 రాష్ట్రాలను స్వింగ్ స్టేట్స్‌గా పేర్కొంటారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రతిసారీ అవే నిర్ణయిస్తుంటాయి. ఎన్డీఏ 400 సీట్లు దాటాలన్న లక్ష్యాన్ని దాటుతుందో లేదో బెంగాల్, బిహార్, మహారాష్ట్ర ఫలితాలు నిర్ణయించనున్నాయి. బెంగాల్లో టీఎంసీ,బీజేపీ మధ్య పోరు నెలకొంది. బిహార్‌లో రాజకీయ పునరేకీకరణతో సమీకరణాలు మారాయి. మహారాష్ట్రలో రెండు పెద్ద పార్టీలు నిలువునా చీలి రెండో ఎన్డీఏలో, మరో రెండు విపక్ష ఇండియా కూటముల్లో చేరి ఎదురెదురుగా మోహరించాయి. దాంతో 130 ఎంపీ సీట్లున్న ఈ 3 రాష్ట్రాల్లో ఎవరికెన్ని సీట్లు వస్తాయన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. బెంగాల్లో బీజేపీ పాచిక పారేనా...? 2019 లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమబెంగాల్లో బీజేపీ పాగా వేసిన తీరు ఆసక్తికరం. మోదీ మేనియాకు పౌరసత్వ అంశం తదితరాలు తోడవడంతో 42 లోక్‌సభ స్థానాల్లో ఏకంగా 18 సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకోగలిగింది. 2014లో 17 శాతమున్న ఓటు శాతాన్ని 40 శాతానికి పెంచుకోగలిగింది. ఈసారి పరిస్థితి ఎలా ఉండనందన్నది అంచనాలకు అందడం లేదు. కాకపోతే ప్రతి స్థానంలోనూ హోరాహోరీ పోరు ఖాయంగా కన్పిస్తోంది. ప్రధాని మోదీ ఇంకా రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టలేదు. ఆయన ఏయే అంశాలను ప్రచారాస్త్రాలుగా సంధిస్తారన్నది కూడా ఆసక్తికరం. వాటిని బట్టి రాష్ట్రంలో ఓటర్ల మూడ్ మారిపోయే ఆస్కారముంది. అయితే బెంగాల్లో ఈసారి బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెబుతుండటం ఆసక్తికరం. మిగతా విశ్లేషకులు మాత్రం బీజేపీకి ఈసారి ఓట్లశాతం మరింత పెరగవచ్చంటూనే, అది సీట్ల సంఖ్యలో ప్రతిఫలిస్తుందో లేదో చూడాలని చెబుతుండటం విశేషం. పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రావడం తదితరాల నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా ఉన్న ముస్లింల ఓట్లు పూర్తిగా టీఎంసీ వైపు మళ్లినట్టేనని వారంటున్నారు. ఇది మా పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి అతి పెద్ద సానుకూలాంశంగా కన్పిస్తోంది. ‘‘దీనికి తోడు యూపీ వంటి రాష్ట్రాల మాదిరిగా బెంగాల్లో బీజేపీకి పటిష్టమైన సంస్థాగత నిర్మాణం లేదు. పైగా రాష్ట్ర పార్టీలో సువేందు అధికారి, దిలీప్ ఘోష్, సుకాంతో మజుందార్ మధ్య ఆధిపత్య పోరు పుట్టి ముంచేలా కన్పిస్తోంది’’ అని సీనియర్ జర్నలిస్టు జయంత ఘోషా అభిప్రాయపడ్డారు. తృణమూల్ తన 22 స్థానాలను నిలుపుకుంటుందని, బీజేపీకి ఒక సీటు పెరుగుతుందని, కాంగ్రెస్ ఒక్క స్థానానికి పడిపోతుందని ఇండియాటుడే సర్వే పేర్కొంది. రసకందాయంలో బిహార్ 2019లో ఎన్డీఏ క్లీన్‌స్వీప్ చేసిన రాష్ట్రాల్లో బిహార్ ముఖ్యమైనది. 40కి ఏకంగా 39 స్థానాలు అధికార కూటమి వశమయ్యాయి. కానీ ఇక్కడ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం ఎప్పుడూ కత్తిమీద సామే. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నల్లేరుపై నడకేనని అంతా భావించారు. తీరా చూస్తే ఆ అంచనాలన్నీ తప్పి జేడీ(ఎస్), ఆర్జేడీల మహాఘట్బంధన్ ఘనవిజయం సాధించింది. కానీ పల్టూ రామ్‌గా పేరుపడ్డ జేడీ(యూ) సారథి, సీఎం నితీశ్‌కుమార్ 2020 అసెంబ్లీ ఎన్నికల నుంచి వేస్తున్న పిల్లిమొగ్గలతో ఓటర్లలో తీవ్ర అయోమయం నెలకొన్నట్టు కన్పిస్తోందని పటా్నకు చెందిన సీనియర్ జర్నలిస్టు రోహిత్‌సింగ్ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టిన నితీశ్ 2022లో దానికి కటీఫ్ చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమితో స్నేహం చేశారు. తాజాగా గత జనవరిలో మళ్లీ ఎన్డీఏ గూటికి చేరారు. దీన్ని జనం జీరి్ణంచుకోలేకపోతున్నారన్నది రోహిత్ విశ్లేషణ. అయితే కుల సమీకణాల కోణంలో బీజేపీ–జేడీ(యూ) భాగస్వామ్యం బలమైన జోడీగా కన్పిస్తుండటం విశేషం. కుర్మీ సామాజికవర్గానికి చెందిన నితీశ్‌కు రాష్ట్రంలో ఏకంగా 36 శాతమున్న అత్యంత వెనకబడ్డ వర్గాల్లో విశేష ఆదరణ ఉంది. పైగా గతేడాది బిహార్‌లో జరిపించిన కులగణన ఆయనకు మరిన్ని ఓట్లు కురిపించేలా కన్పిస్తోంది. 2005, 2010 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–జేడీ(యూ) జోడీ సూపర్‌హిట్టయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఏకంగా 39 సీట్లు కొల్లగొట్టింది. దీనికి తోడు ఎన్నికల వేళ ఇంటి పోరు ఆర్జేడీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో మోదీ–నితీశ్ జోడీ దూకుడును తేజస్వీ యాదవ్ ఏ మేరకు నిలువరిస్తారన్నది ఆసక్తికరం. ‘మహా’ గందరగోళం... 48 సీట్లున్న మహారాష్ట్ర యూపీ తర్వాత లోక్‌సభకు అత్యధిక ఎంపీలను పంపుతోంది. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీఏ గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. 2019లోనైతే బీజేపీ, శివసేన సంయుక్తంగా ఏకంగా 41 స్థానాలు ఒడిసిపట్టాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో రాజకీయాలతో పాటు ఏకంగా పార్టీలే మారిపోయాయి! తర్వాత ఏక్నాథ్ షిండే సారథ్యంలో శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలో మరో కీలక పార్టీ ఎన్సీపీ నిలువునా చీలిపోయాయి. చీలిక వర్గాలే అసలైన పార్టీలుగా గుర్తింపు పొందాయి. ఎన్డీఏలో చేరి బీజేపీతో జట్టు కట్టి ఎన్నికల బరిలో దిగాయి. దీన్ని ప్రజలు పెద్దగా జీర్ణించుకోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాంతో ఈసారి కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలతో కూడిన విపక్ష ఇండియా కూటమిదే పైచేయి కావచ్చంటున్నారు. సర్వేలు కూడా ఇండియా కూటమి ఏకంగా 26 స్థానాలు గెలుస్తుందంటున్నాయి. అదే నిజమైతే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి 20 సీట్లకు పైగా గండి పడుతుంది! అదే సమయంలో ఎన్నికల వేళ ఎంఎన్ఎస్ నేత రాజ్ ఠాక్రే మద్దతు ఎన్డీఏకు కాస్త కలిసొచ్చేలా కన్పిస్తోంది. మరాఠా రిజర్వేషన్లది కూడా ఈసారి రాష్ట్రంలో కీలక పాత్ర కానుంది. విద్య, ఉద్యోగాల్లో వారికి అదనంగా 10 శాతం కోటా కలి్పస్తూ శివసేన చీఫ్, సీఎం ఏక్నాథ్ షిండే ఇటీవలే అసెంబ్లీలో బిల్లు పెట్టారు. సాంప్రదాయికంగా బీజేపీ ఓటర్లయిన ఇతర వెనకబడ్డ వర్గాలు దీనిపై గుర్రుగా ఉన్నారు. మరాఠా కోటా తమ వాటాకే ఎసరు పెడుతుందన్న భయం వారిలో పెరుగుతోంది. ఇన్ని సమీకరణాల మధ్య మహారాష్ట్రలో ఎవరికెన్ని సీట్లొస్తాయో అంచనా వేయడం కష్టంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిజంగా అంత నమ్మకం ఉందా?
అయోధ్యలో రామమందిరం ప్రారంభం ఎన్నికల సునామీని సృష్టిస్తుందని బీజేపీ భావించింది. అందుకే దేవాలయం ప్రారంభించిన వెంటనే బీజేపీ ఏకంగా 370 సీట్లు కైవసం చేసుకుంటుందనీ, ఎన్డీయే కూటమి సంఖ్య 400 దాటుతుందనీ గట్టిగా ప్రకటించింది. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 400కు పైగా సీట్లు గెలుచుకుంది. అప్పటి నుంచి ఏ పార్టీ కానీ, కూటమి కానీ ఆ రికార్డును అధిగమించలేదు. బీజేపీ వంటి ఆచరణాత్మక పార్టీకి మూడింట రెండు వంతుల మెజారిటీని గెలవడం పిల్లల ఆట కాదని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అందుకే చేజారిపోతోందని భావిస్తున్న అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవడానికి అన్ని ఉపాయాలనూ ఆశ్రయిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీలో భారీ స్థాయిలో విశ్వాస లోపం స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీకి తన గెలుపు పట్ల కచ్చితంగా నమ్మకం ఉంటే, పార్లమెంటు ఎన్నికలకు ముందు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ పార్టీకి చెందిన కల్వకుంట్ల కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లను ఈడీ (ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) లేదా సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అరెస్టు చేసేవా? ప్రతిపక్ష నేతలపై ఈ విధమైన దాడి, అనివార్యంగా మోదీకి మూడోసారి ప్రధాని పదవి చేపట్టడంపై నమ్మకం లేదన్న సందేశాన్ని పంపుతోంది. మోదీ, ఆయన మనుషులు ఈ దఫా ఎన్నికల్లో 370 సీట్లు గెలుస్తామనీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (నేషనల్ డెమో క్రటిక్ అలయన్ ్స) తరపున 400 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించుకుంటామనీ బహిరంగంగా ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ వాస్తవానికి వారు స్వీయ సందేహంతోనూ, భయాందోళనల తోనూ కొట్టుమిట్టాడుతున్నారు. అలా కాకపోతే, బీజేపీని గెలిపించేందుకు మోదీ తన పాలనలో ‘ప్రతిపక్ష ముక్త్’ (ప్రతిపక్షం లేకుండా) ఎన్నికలను నిర్వహించాలని ఎందుకు నిశ్చయించుకుంటారు? మోదీ చాలా చురుకైనవారు. చాలా తెలివైనవారు. పైగా రాజీ పడని, కరడు గట్టిన వాస్తవికవాది. ఊహాజనిత, భ్రమలు కలిగించే ప్రపంచంలో ఆయన జీవించరు. ఓటర్లు గుడ్డిగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయరని ఆయనకు బాగా తెలుసు. నిస్సందేహంగా ఆయన భారతదేశంలో అత్యంత బలమైన, ఆకర్షణీయమైన నాయ కుడు. కానీ బీజేపీని విజయ తీరాలకు తీసుకెళ్లడానికి తన ముఖం, వ్యక్తిత్వం సరిపోవని ఆయనకు బాగా తెలుసు. ప్రభుత్వ పనితీరును బేరీజు వేసుకుని ప్రజలు ఓట్లు వేస్తారని కూడా మోదీకి తెలుసు. నిరుద్యోగం తారాస్థాయికి చేరుకుంది. ఒకవైపు నిరుద్యోగ సంక్షోభం, ఉద్యోగాలు పొందే అదృష్టవంతుల ఆదాయంలో స్తబ్ధత ఉండగా, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నాయి, జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ధనవంతులు మరింత ధనికులుగా, పేదలు మరింత పేదలుగా మారడంతో అసమానత రోజురోజుకూ మరింత ప్రస్ఫుటమవుతోంది. మోదీ, ఆయన సహచరులు వేసుకుంటున్న అంతర్గత అంచనాలలో ఇవన్నీ బీజేపీ అవకాశాలపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి; వారిని గందరగోళానికి గురిచేస్తున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆఖరికి తమ మాజీ ముఖ్యమంత్రులను కూడా రంగంలోకి దింపేంత భయంకరమైన పరిస్థితి నెలకొంది. మధ్యప్రదేశ్‌కు చెందిన శివరాజ్‌సింగ్ చౌహాన్, కర్ణాటకకు చెందిన బసవరాజ్ బొమ్మై దీనికి ప్రధాన ఉదాహరణలు. అంతేగాక, పార్టీ అభ్యర్థుల భవితవ్యం తెలుసుకోవడం కోసం... ఉత్కంఠతతో, విరామం లేకుండా శ్రమిస్తున్న అగ్ర నాయకులు... సీటు తర్వాత సీటు విషయంలో కులపరమైన అంకగణితాన్ని బేరీజు చేసుకుంటున్నారు. 1994–95లో కాంగ్రెస్ పార్టీ సమర్పించిన పన్ను ఖాతాలపై, ఆ పార్టీకి వ్యతిరేకంగా ఆదాయపు పన్ను శాఖ మదింపు చర్యలను తిరిగి ప్రారంభించాల్సినంత తీవ్రమైన అభద్రతాభావంతో బీజేపీ ఇప్పుడు కొట్టుమిట్టాడుతోంది. ఇది ఖననం చేసిన మూడు దశాబ్దాల తర్వాత పోస్ట్‌మార్టం పరీక్ష కోసం శవాలను తవ్వినట్లే అవుతుంది. ఒకవైపు కాంగ్రెస్ అవినీతిపై గురిపెడుతూ, దాన్ని దొంగలు, దొంగల పార్టీ అని మోదీ, ఇతర బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు నేరచరిత్ర ఉన్న నేతలను బీజేపీ ఆలింగనం చేసుకుంటోంది. 20 పోలీసు కేసులు, అడవులు, గనులను దోచుకున్నందుకుగాను తొమ్మిది సీబీఐ కేసులతోపాటు తనపై కేసుల్లో బెయిల్ కోసం జడ్జికి 40 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన గాలి జనార్దన్ రెడ్డిని ఇప్పుడు బీజేపీ తనలో (తిరిగి) చేర్చుకుంది! అధికార పక్షాన్ని వాషింగ్ మెషీన్ గా ప్రతిపక్షం అభివర్ణించడాన్ని ఇటువంటి ఫిరాయింపులు బలపరుస్తాయి. దీని ద్వారా కళంకిత నాయకులు నిష్కళంకంగా శుభ్రంగా బయటపడతారు. ఎనిమిది నెలల క్రితం బీజేపీలో చేరిన ప్రఫుల్ పటేల్‌పై ఉన్న భారీ అవినీతి కేసుపై సీబీఐ గత వారం మూసివేత నివేదికను దాఖలు చేసింది. బీజేపీ సిగలో మరో కలికి తురాయి నవీన్ జిందాల్! ‘కోల్గేట్’ నిందితుడైన హరియాణాకు చెందిన ఈ కాంగ్రెస్ ఎంపీ, తన తల్లి సావిత్రి జిందాల్‌తో కలిసి భారతదేశాన్ని అభివృద్ధి చేయడం కోసం మోదీతో కలిసి పని చేసేందుకు బీజేపీలోకి వెళ్లారు. అవినీతి కేసుల్లో కూరుకుపోయిన ఇతర పార్టీలకు చెందిన రాజకీయ నాయకులను తన రెక్కల కింద పొదువు కోవడానికి బీజేపీని నడిపిస్తున్న కారణం ఏమిటి? 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 400కు పైగా సీట్లు గెలుచుకుంది. అప్పటి నుంచి ఏ పార్టీ కానీ, కూటమి కానీ ఆ రికార్డును ఇప్పటి వరకూ అధిగ మించలేదు. 1984 తర్వాత మూడు దశాబ్దాల పాటు ఏ ఒక్క పార్టీ కూడా 272 సీట్లు కూడా గెలుచుకుని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. కానీ 2014లో కాంగ్రెస్ పార్టీ అసంఖ్యాక వైఫల్యాలను ఉపయోగించుకుని ‘అచ్ఛే దిన్’ (మంచి రోజులు) వాగ్దానం చేయడం ద్వారా బీజేపీకి 282 సీట్లు వచ్చాయి. ఇక 2019లో, పుల్వామాలో కేంద్ర బలగాలపై జరిగిన మారణకాండను ఉపయోగించుకోవడం ద్వారా బీజేపీ తన సంఖ్యను అనూహ్యంగా 303కు పెంచుకుంది. పుల్వామాలో రక్తపాతానికి ముందు, బీజేపీ చాలా తక్కువ సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేశారు. కానీ పుల్వామా ఆ పార్టీకి గేమ్ ఛేంజర్ అయింది. జనవరి 22న అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించిన తర్వాత, అది ఏప్రిల్–మేలో ఎన్నికల సునామీని సృష్టిస్తుందని బీజేపీ భావించింది. అందుకే దేవాలయం ప్రారంభించిన వెంటనే బీజేపీ ఏకంగా 370 సీట్లు కైవసం చేసుకుంటుందనీ, ఎన్డీయే సంఖ్య 400 దాటుతుందనీ, లౌకిక–ఉదారవాద భారత్‌పై హిందుత్వ విజయానికి సంకేతంలా గొంతెత్తి ప్రకటించడం ప్రారంభించింది. కానీ బీజేపీ వంటి ఆచరణాత్మక పార్టీకి ఈసారి మూడింట రెండు వంతుల మెజారిటీని గెలవడం పిల్లల ఆట కాదని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఉత్తర భారతదేశంలో బీజేపీకి ఇప్పటికే ఉన్న దానికంటే ఎక్కువ సీట్లు కైవసం చేసుకునే అవకాశం లేదు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో దాని సంఖ్యను పెంచుకోవడానికి సంస్థాగతమైన శక్తి లేదు. 2019లో కర్ణాటకలోని 28 ఎంపీ స్థానాలకు గానూ బీజేపీ 25 స్థానా లను కైవసం చేసుకుంది. కానీ ఇప్పుడు సిద్దరామయ్య, శివకుమార్‌లు అధికారంలో ఉన్నందున, బీజేపీ తక్కువ సీట్లు గెలుచుకున్నా ఆశ్చర్య పోనవసరం లేదు. ఏక్నాథ్ షిండేకి చెందిన శివసేనతో, అజిత్ పవార్‌కి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు ద్వారా మహా రాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ, ఎన్ డీఎ 2019లో గెల్చుకున్న 48 సీట్లలో 41 స్థానాలకు మళ్లీ చేరుకునే అవకాశం లేదు. అదే విధంగా బిహార్‌లో ఎన్డీఎ 40కి 39 ఎంపీ సీట్లు గెలుచుకుంది. నితీష్ కుమార్ ఎన్ డీఎలోకి తిరిగి వచ్చినప్పటికీ ప్రస్తుత చిత్రం అంత ఆశాజనకంగా లేదు. ఈ అంశాలన్నీ బీజేపీ విశ్వాస సంక్షోభాన్ని, తీవ్రమైన అభద్ర తను, నిర్వీర్యపర్చే సందేహాలను వివరిస్తాయి. అందుకే నిజానిజాలు బయటపడే తరుణంలో బీజేపీ భయాందోళనలకు గురవుతోంది.అందుకే చేజారిపోతోందని భావిస్తున్న అధికారాన్ని ఎలాగైనా నిల బెట్టుకోవడానికి అన్ని ఉపాయాలనూ ఆశ్రయిస్తోంది. ఎస్ఎన్ఎమ్ ఆబ్ది వ్యాసకర్త విదేశాంగ విధానం, దేశీయ రాజకీయాల వ్యాఖ్యాత (‘ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019