breaking news
-
టీడీపీ అంతమే.. మా పంతం
అనంతపురం క్రైం: ‘టీడీపీ కోసం నా భర్త, బావ ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో ఏళ్లుగా ఆ పార్టీకి సేవ చేస్తున్నాం. అయినా మాకు తీవ్ర అన్యాయం చేశారు. డబ్బున్నోళ్లకు సీట్లు అమ్ముకుని కురుబ కులస్తులకు మొండిచేయి చూపారు. ఆ పార్టీని బొంద పెట్టేదాకా విశ్రమించం. రాష్ట్రంలోని కురుబలంతా టీడీపీ ఓటమే ధ్యేయంగా పనిచేస్తాం’ అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కురుబ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్ బుల్లే శివబాల ధ్వజమెత్తారు. ఆమె మంగళవారం అనంతపురం నగర శివారులోని చెరువుకట్ట శ్మశాన వాటికలో భర్త నాగరాజు సమాధిపై ఉన్న ‘టీడీపీ కార్యకర్త’ అనే నేమ్‌బోర్డును తొలగించారు. ఆ పార్టీని బొంద పెట్టేదాకా విశ్రమించబోమని భర్త సమాధిపై శపథం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. నలభై ఏళ్లుగా టీడీపీనే కుటుంబంగా..కుటుంబమే పారీ్టగా పని చేశామన్నారు. పార్టీ కోసం తన భర్తతో పాటు బావ పావురాల కిష్టాను కోల్పోయామని చెప్పారు. తనకు అనంతపురం అసెంబ్లీ లేదా పార్లమెంటు అభ్యర్థిగా అవకాశం ఇస్తామని లోకేశ్ పాదయాత్రలో హామీ ఇచ్చారన్నారు. అనంతపురం అర్బన్‌తో కనీస పరిచయం లేని దగ్గుపాటికి సీటిచ్చిన చంద్రబాబు.. పార్టీ కోసం కష్టపడిన ప్రభాకరచౌదరికి మొండిచేయి చూపారని మండిపడ్డారు. చంద్రబాబు నా వెంట్రుకతో సమానమన్న గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు అభ్యర్థిగా, కాంట్రాక్టులు చేసుకునే అమిలినేని సురేంద్రబాబుకు కళ్యాణదుర్గం అభ్యర్థిగా అవకాశం కల్పించి.. చాలా ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని ఉన్న తనలాంటి బీసీలకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. బీసీల పార్టీ అని పదేపదే చెప్పే టీడీపీ అధినేత చంద్రబాబు వాస్తవానికి బీసీలను ఏనాడూ పట్టించుకోలేదని శివబాల విమర్శించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముగ్గురు కురుబలకు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించారని చెప్పారు. వైఎస్సార్‌సీపీతోనే బీసీలకు గుర్తింపు దక్కిందని చెప్పారు. -
ఆలయ కార్యదర్శిపై అమానుష దాడి
ఏలూరు టౌన్ : ఏలూరు కండ్రికగూడెం ప్రాంతంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవుని సొమ్మును కాజేశారని ప్రశ్నించిన ఆలయ కార్యదర్శిపై పాత ఆలయ కమిటీ సభ్యుడు, టీడీపీ కార్యకర్త రెడ్డి నాగరాజు అమానుష దాడికి తెగబడ్డాడు. నూతన ఆలయ కార్యదర్శి అచ్యుతకుమారిపై రాడ్డుతో దాడిచేసి, ఆమెను వివస్త్రను చేసేందుకు ప్రయత్నించడంతో బాధితురాలు తీవ్ర గాయాలపాలైంది. ప్రస్తుతం ఆమె ఏలూరు జీజీహెచ్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఏలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని బాధితురాలిని బుధవారం ఆస్పత్రిలో పరామర్శించారు. దాడి వివరాలు తెలుసుకుని వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. బాధితుల కథనం మేరకు.. ఏలూరు 27వ డివిజన్ కండ్రికగూడెం ప్రాంతంలో శ్రీ వేంకటేశ్వరస్వామి గుడికి ఇటీవలే కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. రాజరాజేశ్వరినగర్‌కు చెందిన సావన్ అచ్యుతకుమారి ఆలయ నూతన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆలయానికి సంబంధించి నిధులు భారీఎత్తున గోల్మాల్ అయ్యాయని ఆమె గుర్తించారు. సుమారు రూ.40 లక్షలు పక్కదారి పట్టినట్లు తెలుసుకుని పాత కార్యవర్గ సభ్యులను ఆమె ప్రశ్నించారు. దీంతో పాత, కొత్త కార్యవర్గాల మధ్య వివాదం మొదలైంది. ఇదిలా ఉంటే.. శ్రీవారి కళ్యాణ మహోత్సవాలను ఆచ్యుతకుమారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తుండడంతో పాత కార్యవర్గ సభ్యుడు రెడ్డి నాగరాజు అతని భార్య ఇద్దరూ కలిసి ఆలయ ప్రాంగణంలో పుస్తక వ్యాపారం చేసుకునేందుకు అవకాశమివ్వాలని అచ్యుతకుమారిని కోరారు. ఆలయంలో వ్యాపారం చేయడానికి వీల్లేదని, అవసరమైతే ఉచితంగా పుస్తకాల పంపిణీకి అనుమతి ఉంటుందని ఆమె స్పష్టంచేశారు. ఈ విషయంలో వివాదం చెలరేగడంతో రెడ్డి నాగరాజు అచ్యుతకుమారిపై దాడికి తెగబడ్డాడు. రాడ్డు తీసుకుని ఆమెను తలపైన తీవ్రంగా కొట్టడంతో పాటు ఆమె చీరను లాగేసి వివస్త్రను చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో.. అక్కడున్న వారు అతనిని అడ్డుకున్నారు. తీవ్ర గాయాలతో అచ్యుతకుమారి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెను ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. నిధుల గోల్‌మాల్‌పై నిలదీయడంతో.. రెడ్డి నాగరాజుతో పాటు ఉమామహేశ్వరరావు, ప్రసాద్‌బాబు తదితరుల ఆధ్వర్యంలో ఆలయ నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయని ఆస్పత్రిలో ఆమె చెప్పారు. లక్షలాది రూపాయల నిధులకు లెక్కలు లేకపోవడంతో వారిని నిలదీయగా.. రెడ్డి నాగరాజు సమయం కోసం వేచిచూసి దాడిచేశారన్నారు. -
AP: అయోధ్య రామయ్యకు ‘శ్రీరామకోటి పట్టు వస్త్రం’
ధర్మవరం: అందరి బంధువు అయోధ్య రామయ్యకు ధర్మవరం నేతన్నలు అపూర్వ కానుకను అందజేసి తమ భక్తి ప్రవత్తులను చాటుకోనున్నారు. రామాయణ ప్రధాన ఘట్టాలను ప్రతిబింబిస్తూ 60 గజాల పట్టువస్త్రాన్ని.. రామాయణ మహాకావ్యాన్ని ప్రతిబింబించే చిత్రాలతో పాటు శ్రీరామ నామాలను 16 భాషల్లో డిజైన్ చేసి సమర్పించనున్నారు. ఈనెల 24వ తేదీన ఈ వస్త్రాన్ని అయోధ్యకు పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 4 నెలలు శ్రమించి.. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని నేసేపేటకు చెందిన జూజారు నాగరాజు ప్రముఖ పట్టుచీరల డిజైనర్. అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి చేనేతల తరఫున శ్రీరామునికి ఏదైనా కానుక పంపాలని ఆలోచించి ఈ మహాత్కార్యానికి పూనుకున్నాడు. పల్లా సురేంద్రనాథ్, పల్లా తేజ అనే ఇద్దరు నేత కారి్మకుల సహకారంతో 4 నెలలు శ్రమించి 60 గజాల పట్టువస్త్రాన్ని తయారు చేసి మహాయజ్ఞాన్ని పూర్తి చేశాడు. ఈ పట్టు వ్రస్తానికి ‘శ్రీరామకోటి’ పట్టు వస్త్రంగా నామకరణం చేశాడు. 60 గజాల పొడవు..16 కేజీల బరువు చేనేత మగ్గంపై 6 గజాల పట్టుచీర తయారు చేయడం సర్వ సాధారణం. అయితే శ్రీరామకోటి పట్టు వ్రస్తాన్ని ఎంతో నైపుణ్యంతో 60 గజాల పొడవు, 44 ఇంచుల వెడల్పు 16 కేజీల బరువుతో తయారు చేయడం ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఇందుకోసం రూ.1.50 లక్షలు ఖర్చు చేశారు. వస్త్రం తయారీకి పట్టు, నూలు, లెనిన్, బనానాయార్న్, పాలిష్టర్తో పాటు గోల్డ్, సిల్వర్, కాపర్ జరీలు, వెల్స్పన్ తదితర ముడిపదార్థాలను వాడారు. పూర్తిగా ప్రకృతి సిద్ధమైన రంగులతో ఎటువంటి కెమికల్స్ వాడకుండా వస్త్రం తయారు చేయడం ఈ వస్త్రం ప్రత్యేకత. రామాయణంలో ప్రధాన ఘట్టాలు,168 రకాల చిత్రాలు రామాయణంలోని ప్రధాన ఘట్టాలైన శ్రీరాముని జననం, విద్యాభ్యాసం, పట్టాభిõÙకం, వనవాసం, సీతాపహరణం, రావణసంహారం, హనుమంతుని సంజీవని పర్వత ఘట్టాలను తెలుపుతూ పట్టు వ్రస్తాన్ని తయారు చేశారు. మొత్తం 168 రకాల చిత్రాలను అంచుల్లో రూపొందించారు. 16 భాషల్లో శ్రీరామ నామాలు డిజైన్ పట్టు వస్త్రం మధ్య భాగంలో ఆకుపచ్చ, తెలుపు, ఆనంద, మెరూన్, పింక్, చాక్లేట్, రాయల్బ్లూ, ఆలివ్‌గ్రీన్, వైట్ తదితర రంగుల్లో శ్రీరామ నామాలను తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మళయాళం, ఒరియా, గుజరాతీ, పంజాబీ, బెంగాళీ, ఉర్దూ, ఇంగ్లిష్, అస్సాం, సింహళ (శ్రీలంక) భాషల్లో లిఖించారు. పట్టువస్త్రంపై మొత్తం 32,200 రామనామాలు పొదిగారు. నాలుగు నెలలు శ్రమించాం.. ధర్మవరం నేతన్నల తరఫున శ్రీరామకోటి పట్టు వ్రస్తాన్ని తయారు చేయడం నా పూర్వ జన్మ సుకృతం. పట్టు వ్రస్తాన్ని పంపేందుకు ఆలయ ట్రస్ట్ సభ్యులకు సమాచారం ఇచ్చాం. వారి నుంచి అనుమతి రాగానే పట్టు వ్రస్తాన్ని పంపుతాం. –జూజారు నాగరాజు, డిజైనర్, ధర్మవరం. -
కొడుకును కాపాడుకోవాలనే తపనతో ఇద్దరూ..
సంగారెడ్డి: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు తండ్రీకుమారుడు మృతిచెందిన సంఘటన హత్నూర మండలం తురకల ఖానాపూర్ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని సాధులనగర్కు చెందిన చెక్కల ప్రభు(46) కుమారుడు నాగరాజు (23) ఇద్దరూ కలిసి మంగళవారం సాయంత్రం తుర్కల్ ఖానాపూర్ శివారులోని ఊర చెరువులోకి చేపల వేటకు వెళ్లారు. చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కొడుకు నాగరాజుకు వల చుట్టుకొని మునిగిపోతుండడంతో గమనించిన తండ్రి కొడుకును కాపాడుకోవాలనే తపనతో నీటిలోకి దిగాడు. ఈక్రమంలో ఇద్దరూ మృత్యుఒడిలోకి చేరుకున్నారు. చేపల వేటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి రాకపోవడంతో బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లగా మృతదేహాలు నీటిలో తేలాయి. దీంతో కుటుంబసభ్యుల రోధనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న హత్నూర ఎస్సై సుభాశ్ పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటా: ఎమ్మెల్యే సునీతారెడ్డి బాధిత కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే సునీత అన్నారు. నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మృతదేహాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఆమె వెంట ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రాజేందర్, సర్పంచ్ భాస్కర్‌గౌడ్, నాయకులు ఉన్నారు. ఇవి చదవండి: మరొకరితో కలిసి తమ్ముడిని అన్న దారుణంగా.. -
మరణంలోనూ వీడని బంధం! తల్లడిల్లిన తల్లి హృదయం..
కరీంనగర్: ఆ కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు.. అనూహ్యంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మలివయసులో అండగా ఉంటారనుకున్న ఇద్దరు కుమారు హఠాత్తుగా చనిపోవడంతో ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. ఈ విషాద సంఘటన మంథనిలో విషాదం నింపింది. పుట్టినప్నుంచి ఎంతో ఆప్యాయంగా పెరిగి వారి బంధాలు.. మరణంలోనూ ఒకటిగా కలిసే పోవడంతో స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. ఎస్సై కిరణ్ కథనం ప్రకారం.. మంథని పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన తాటి నాగరాజు(42), ఆయన సోదరుడు నవీన్(35) రామగిరి మండలం బేగంపేటకు శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై పనినిమిత్తం వెళ్తున్నారు. అయితే, లక్కేపూర్ క్రాస్ రోడ్డు సమీపంలోకి వెళ్లగానే ఎదురుగా, అతివేగం వచ్చిన ట్రాక్టర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. నాగరాజును స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన అక్కేపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్‌గా గుర్తించారు. అన్నదమ్ములను ఢీకొట్టిన ట్రాక్టర్ సమీపంలోని ప్లాట్ల వద్ద అదుపుతప్పి పడిపోయినట్లు సమాచారం. ప్లాట్లలో మట్టి పడి ఉంది. ట్రాక్టర్ బోల్తాపడిన ఆనవాళ్లు ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. ట్రాక్టర్‌ను సరిచేసుకొని డ్రైవర్ అక్కడి పారిపోయినట్లు భావిస్తున్నారు. కాగా ప్రమాదంలో మృతి చెందిన నాగరాజుకు భార్య, కూతురు(12) ఉన్నారు. అలాగే నవీన్‌కు భార్య, సంవత్సరం, మూడేళ్ల కుమారులు ఉన్నారు. మృతులిద్దరూ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. తల్లి రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. కదిలించిన హృదయాలు.. మంథని సుభాష్‌నగర్‌కు చెందిన తాటి రాధ– బాపు దంపతులకు నలుగురు కుమారులు. అనారోగ్యంతో బాపు మూడేళ్ల క్రితం మృతి చెందాడు. భర్తను కోల్పోయిన రాధ.. దుఃఖాన్ని కడుపులోనే దాచుకుని తన కుమారులను చూసుకుంటోంది. ఇందులో ఇద్దరు డ్రైవర్లుగా పనిచేస్తుండగా, చిన్న కుమారుడు హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. మరో కుమారుడు అమాయకుడు కావడంతో ఇంటివద్దే ఉంటున్నాడు. కాగా, నాగరాజుకు కుమారుడు లేడు. దీంతో కూతురుతో చితికి నిప్పంటించారు. అలాగే నవీన్ పెద్దకుమారుడు(3)తో చితికి నిప్పు పెట్టించడంతో అక్కడున్నవారుకన్నీటి పర్యంతమయ్యారు. అందరితో కలివిడిగా ఉండే అన్నదమ్ములు ఒకేరోజు ప్రమాదంలో మృతి చెందడం విషాదం నింపింది. ఇవి కూడా చదవండి: ఆన్లైన్ గేమ్స్‌తో జాగ్రత్త! లేదంటే ఇలా జరుగుతుందేమో!?
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019