breaking news
-
'ఆ ఒక్క పదం తెచ్చిన తంటా'.. వాళ్లిద్దరిపై మండిపడ్డ హీరోయిన్!
ఇటీవల డార్లింగ్ అనే పదంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేశ్ మధ్య ట్వీట్ వార్ కొనసాగిన సంగతి తెలిసిందే. పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలిస్తే వేధింపులకు కిందకు వస్తుందని నభా పోస్ట్ చేసింది. ప్రియదర్శి సైతం లైట్ తీస్కో డార్లింగ్ అంటూ రిప్లై కూడా ఇచ్చారు. తాజాగా వీరిద్దర మధ్య జరిగిన ఇంటరాక్షన్‌లో మరో హీరోయిన్ ఎంటరైంది. అదేంటో ఓ లుక్కేద్దాం. ప్రియదర్శి, నటి నభానటేశ్ గొడవలోకి నటి రీతూవర్మ ఎంట్రీ ఇచ్చింది. నా కామెంట్స్ సెక్షన్లో మీ పంచాయతీ ఏంటి? అని ఆమె ఇద్దరిని ప్రశ్నించింది. అసలేం జరిగిందంటే.. ఇటీవల కొద్ది రోజుల క్రితం హీరోయిన్ రీతూవర్మ ఓ ఫొటోషూట్‌కు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ పోటోలు చూసిన ప్రియదర్శి స్పందించారు. 'వావ్ రీతూ డార్లింగ్.. ఎంత అందంగా ఉన్నావో. నీ అందానికి ముగ్ధుడనయ్యా. మాటలు రావడం లేదు' అని కామెంట్ చేశారు. అయితే ఇది చూసిన నభా నటేశ్ మళ్లీ స్పందించింది. ఇతను మళ్లీ మొదలుపెట్టాడు.. ఆడవాళ్ల కామెంట్ సెక్షన్‌పై ఉన్నట్టుండి ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కరనీ డార్లింగ్ అని పిలవడమేంటని అసహనం వ్యక్తం చేసింది. నేను ఎవరినైనా డార్లింగ్ అని పిలిస్తే నీకేంటని ప్రియదర్శి బదులిచ్చారు. తాజా సంభాషణపై రీతూవర్మ కూడా రియాక్ట్ కావాల్సి వచ్చింది. నా కామెంట్ సెక్షన్లో మీ ఇద్దరి గొడవ ఏంటని నిలదీసింది. ప్రస్తుతం వీరి గొడవ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి నెటిజన్స్‌కు ఫుల్ ఎంటర్టైనింగ్ ఉన్నప్పటికీ ఇందతా సినిమా ప్రమోషన్స్ కోసమేనని చర్చించుకుంటున్నారు. View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) Ahaa! Do not cross the line! Chuskundham.. https://t.co/8mwOpLC0di — Nabha Natesh (@NabhaNatesh) April 17, 2024 -
ప్రియదర్శికి హీరోయిన్ వార్నింగ్! అంత మాట అనేసిందేంటి!
టాలీవుడ్లో గ్లామర్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నభా నటేశ్. ఆమె ప్రస్తుతం నిఖిల్ సరసన స్వయంభూ చిత్రంలో నటిస్తోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త ఓ కథానాయికగా నటిస్తుండగా.. నభా నటేష్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా నభా నటేశ్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రభాస్ డార్లింగ్ అంటూ చెప్పే డైలాగులతో ఓ వీడియోను పంచుకుంది. ఇది చూసిన ప్రియదర్శి పులికొండ.. వావ్ సూపర్ డార్లింగ్.. కిరాక్ ఉన్నావ్ డార్లింగ్.. అంటూ కామెంట్స్ చేశారు. అయితే ప్రియదర్శి చేసిన కామెంట్స్‌పై నభా నటేశ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మిస్టర్.. ఒకరిని కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త, హద్దులు దాటొద్దు.. అంటూ మండిపడింది. అలాగే పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలిస్తే లైంగిక వేధింపులకు కిందకే వస్తుందని గతంలో కోల్‌కతా హైకోర్టు తీర్పునిచ్చిందంటూ దానికి సంబంధించిన వార్త క్లిప్‌ను నభా నటేశ్ షేర్ చేసింది. ఇది చూసిన ప్రియదర్శి సైతం అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. మీరేమో డార్లింగ్ అని పిలవొచ్చు.. మేము పిలిస్తే ఐపీసీ సెక్షన్ పెడతారా? లైట్ తీస్కో డార్లింగ్ అంటూ పోస్ట్ చేశారు. ఇదంతా కేవలం ఫన్నీ కోసమే చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ వీరిద్దరి మధ్య సంభాషణ మాత్రం నెట్టింట హల్చల్ చేస్తోంది. కాగా.. ప్రియదర్శి ఇటీవల సేవ్ ది టైగర్స్-2 సీజన్‌తో ప్రేక్షకులను అలరించారు. Ohoo! Why this Kolaveri 😉🙃 https://t.co/r7DZYWTCtB — Priyadarshi Pulikonda (@PriyadarshiPN) April 17, 2024 WOW Superrrrrr 🤩 Darlinggggg 😍 Kirrrraakkk Unnav Darling😘🤌🏼 https://t.co/fIYSCaCfYo — Priyadarshi Pulikonda (@PriyadarshiPN) April 17, 2024 -
Nabha Natesh: హీరోయిన్ నభానటేష్ ఉగాది స్పెషల్ లుక్.. (ఫోటోలు)
-
ట్రెండీ లుక్‌లో యషికా ఆనంద్..కూతురితో మంచు లక్ష్మి సెలబ్రేషన్స్!
ట్రెండీ లుక్‌లో యషిక ఆనంద్.. ఉగాది ఫెస్టివల్ మూడ్‌లో అతుల్య రవి... నభా నటేశ్ ట్రైడిషనల్ లుక్ వైరల్... గ్రీన్ డ్రెస్‌లో తేజస్విని గౌడ హోయలు.. కూతురితో మంచు లక్ష్మి ఉగాది సెలబ్రేషన్స్.. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
స్వయంభూలో ఎంట్రీ
‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్వయంభూ’. ఈ చిత్రం షూటింగ్లో జాయిన్ అయ్యారు హీరోయిన్ నభా నటేష్. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త ఓ కథానాయికగా నటిస్తుండగా, నభా నటేష్ కీలకమైన, శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో నభా నటేష్ గురువారం జాయిన్ అయిన విషయాన్ని ప్రకటించి, ఆమె పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘స్వయంభూ’ చిత్రంలో ఓ లెజెండరీ యోధుడిగా నిఖిల్ నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో ట్రైనింగ్ తీసుకున్నారాయన. నభా నటేష్ పాత్ర కూడా చాలా బాగుంటుంది. ఈ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా ఆమె మారిన విధానం అద్భుతం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, సహ నిర్మాతలు: విజయ్ కామిశెట్టి, జీటీ ఆనంద్.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019