breaking news
-
కోట్లు సంపాదించే మృణాల్.. మరీ అంత చీప్ డ్రెస్సులు ధరిస్తుందా?
-
జిమ్‌లో వర్కౌట్ : క్రేజీ హీరోయిన్ ఫన్నీ వీడియో వైరల్
ఫ్యామిలీ స్టార్ హీరోయిన్, క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) అందానికి మాత్రమే కాదు ఫిట్‌నెస్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఇంట్రెస్టింగ్ పోస్టులు, జిమ్‌లో హెవీ వర్కౌట్స్ ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాలో ఒక వీడియో షేర్ చేసింది. ట్రైనర్ చూసేటపుడు, కెమెరా సహా ట్రైనర్ మన ముందుకు వచ్చినపుడు అనే క్యాప్షన్‌తో వర్కౌట్ ఫన్నీ చీటింగ్ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ట్రైనర్ కెమెరాను ఆమెవైపు చూపినప్పుడల్లా, వెంటనే వ్యాయామం చేయడం ప్రారంభించడం, ట్రైనర్ చూడని సమయంలో వర్కవుట్స్ ఆపేసి డాన్స్ మూమెంట్స్ చేస్తుంది. మళ్లీ అతడు చూడగానే కష్టపడి వర్కవుట్ చేస్తున్నట్లు నటించడాన్ని ఈ వీడియోలో గమనించవచ్చు. దీంతో నెటిజన్లు కోచ్ ఉన్నపుడు మేము కూడా ఇంతే అంటూ కమెంట్ చేయడం విశేషం. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) కాగా ‘సీతారామం’ చిత్రంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. త తన అద్భుతమైన నటన, అందంతో స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆ తరువాతహీరో నానీతో కలిసి ‘హాయ్ నాన్న’ చిత్రంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే విజయ దేవర కొండ సరసన నటించి మెప్పించింది ఈ బ్యూటీ. -
ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' పూర్తిగా సైలెంట్ అయిపోయింది. అద్భుతమైన వీకెండ్, సెలవుల్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ప్రస్తుతం అక్కడక్కడ థియేటర్లలో ఉన్న ఈ చిత్రానికి పెద్దగా జనాలు వెళ్లట్లేదు. ఈ క్రమంలోనే ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. (ఇదీ చదవండి: ఓటీటీలో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!) 'అర్జున్ రెడ్డి', 'గీతగోవిందం' లాంటి మూవీస్ దెబ్బకు విజయ్ దేవరకొండ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. పాన్ ఇండియా ఫేమ్ అయిత్ వచ్చింది కానీ సరైన హిట్ ఒక్కటి పడటం లేదు. తాజాగా 'ఫ్యామిలీ స్టార్' కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఫెయిలైంది. బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా చతికలపడిపోయింది. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్.. 45 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయాలనుకుంది. కానీ ఇప్పుడు థియేటర్ రిజల్ట్ తేడా కొట్టేయడంతో ప్లాన్ మారినట్లు తెలుస్తోంది. మే 3 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి తీసుకొచ్చేయాలని అనుకుంటోందట. కుదిరితే ఇంకా ముందే కూడా వచ్చేయొచ్చు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఆ సినిమా వల్ల భారీగానే నష్టపోయాం: చిరంజీవి) -
గుండె బద్దలైంది.. బయటపడటానికి చాలా టైమ్ పట్టింది: మృణాల్
తెలుగులో ఒకటి రెండు సినిమాలతోనే స్టార్స్ అయిన హీరోయిన్లు తక్కువ మంది ఉంటారు. అందులో మృణాల్ ఠాకుర్ ఒకరు. సీతారామం, హాయ్ నాన్న చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టింది. కానీ 'ఫ్యామిలీ స్టార్'తో ఈమెకు ఫస్ట్ దెబ్బ పడింది. అయితే ఈమెని ఇప్పటికీ 'సీతారామం' బ్యూటీ అనే పిలుస్తారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మృణాల్.. ఆ చిత్ర అనుభవాలని పేర్కొంది. (ఇదీ చదవండి: సాయిపల్లవికి రికార్డ్ రెమ్యునరేషన్.. 'రామాయణ' కోసం అన్ని కోట్లా?) 'నా ఫ్రెండ్, మార్గదర్శి అంతా నటుడు దుల్కర్ సల్మానే. 'సీతారామం' షూటింగ్ టైంలో ఆయన సహకారం అస్సలు మరిచిపోను. చాలా కష్టమైన విషయం ఏమిటంటే ఓ చిత్రాన్ని పూర్తి చేసి వెళ్తున్నప్పుడు గుండె బద్దలైనట్లు అనిపిస్తుంది. పాత్రను ఇష్టపడి చేస్తే ఆ పాత్రలా పూర్తిగా మారిపోతా. అలా నటించిందే 'సీతారామం'లోని సీతామహాలక్ష్మి పాత్ర. ఈ పాత్ర నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టింది' తెలుగులో ఇప్పటివరకు చేసిన మూడు సినిమాల్లోనూ ఒకే తరహాలో డబ్బింటి అమ్మాయి తరహా పాత్రలు చేసిన మృణాల్.. హిందీలో మాత్రం గ్లామరస్ రోల్స్ చేసింది. తెలుగులోనూ ఈమెకు అలాంటి పాత్రలు ఎవరైనా ఆఫర్ చేస్తే, మృణాల్ చేయడానికి రెడీగా ఉంది. కానీ దర్శకనిర్మాతలు మాత్రం ఇంకా ఈమెని 'సీతారామం' బ్యూటీగానే చూస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో కొత్త ప్రాజెక్టులేం ఒప్పుకోలేదు. తమిళంలోకి త్వరలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. (ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2'.. స్ట్రీమింగ్ అందులోనే) -
సీతామహాలక్ష్మిని మరచిపోని మృణాల్ ఠాకూర్
తమిళసినిమా: బెంగాలీ భామ మృణాళ్ ఠాకూర్ ఇప్పుడు దక్షిణాదిలో క్రేజీ కథానాయకిగా వెలిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ బ్యూటీ దక్షిణాదిలో నటించిన తొలి చిత్రం సీతారామం. తెలుగులో రూపొందిన ఈ చిత్రంలో ఈ అమ్మడు దుల్కర్ సల్మాన్‌తో జత కట్టారు. చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈమె పేరు బాగా పాపులర్ అయ్యింది. నాని సరసన నటించిన హాయ్ నాన్నా చిత్రం కూడా సక్సెస్ అయ్యింది. దీంతో మృణాళ్ ఠాకూర్‌కు పట్ట పగ్గాలు లేకుండా పోయాయనే చెప్పాలి. అలాంటి సమయంలో తమిళంలో ఏఆర్.రెహ్మాన్ దర్శకత్వంలో శివకార్తీకేయన్‌కు జంటగా నటించే అవకాశాన్ని తిరస్కరించారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా విజయ్‌దేవరకొండతో రొమాన్స్ చేసిన ఫ్యామిలీస్టార్ చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. ఇది ఈ అమ్మడి క్రేజ్‌కు కాస్త బ్రేక్ వేసినట్లే అవుతుంది. దక్షిణాదిలో నటించిన తొలి చిత్ర జ్ఞాపకాలను ఈ అమ్మడు ఇంకా మరువలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక బేటీ లో తనకు మిత్రుడు, మార్గదర్శి అంతా నటుడు దుల్కర్ సల్మాన్ అని పేర్కొన్నారు. సీతారామం చిత్రం షూటింగ్ సమయంలో ఆయన సహకారం మరువలేనిదని అన్నారు. ఇక చాలా కష్టమైన విషయం ఏమిటంటే ఒక చిత్రాన్ని పూర్తి చేసి వెళుతున్నప్పుడు హృదయం పగిలినట్లు అనిపిస్తుందన్నారు. తాను ఒక చిత్రంలోని పాత్రను ఇష్టపడి నటిస్తే ఆ పాత్రగా మారిపోతానని అన్నారు. అలా నటించిన పాత్రే సీతారామం చిత్రంలోని సీతామహాలక్ష్మి పాత్ర అని పేర్కొన్నారు. ఈ పాత్ర నుంచి బయట పడటానికి చాలా సమయం పట్టిందని నటి మృణాళ్ ఠాకూర్ అన్నారు. కాగా అందాలారబోతకు ఏమాత్రం వెనుకాడని ఈ అమ్మడు త్వరలోనే కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019