breaking news
-
జపాన్‌కు పోటెత్తిన పర్యాటకులు.. ఒక్క నెలలో రికార్డ్!
తూర్పు ఆసియాలోని జపాన్‌కు విదేశీ పర్యాటకులు పోటెత్తారు. గత మార్చి నెలలో 30 లక్షల మందికిపైగా విదేశీయులు జపాన్ను సందర్శించారు. ఒక నెలలో ఇంత మంది పర్యాటకులు రావడం రికార్డు అని ఆ దేశ ప్రభుత్వ డేటా ద్వారా వెల్లడైంది. జపాన్ను గత మార్చి నెలలో మొత్తం 30.8 లక్షల మంది సందర్శించారు. ఏడాది క్రితం ఇదే నెలలో నమోదైన పర్యాటకుల సంఖ్యతో పోలిస్తే 69.5 శాతం పెరుగుదల నమోదైంది. కరోనా మహమ్మారి ప్రపంచ పర్యాటకాన్ని దెబ్బతీసే ముందు 2019 మార్చితో పోల్చినప్పటికీ ఈ ఏడాది మార్చి నెలలో 11.6 శాతం పర్యాటకులు పెరిగారని జపాన్ నేషనల్ టూరిజం ఆర్గనైజేషన్ తెలిపింది. సాధారణంగా పెరుగుతున్న పర్యాటక డిమాండ్‌తోపాటు స్ప్రింగ్ చెర్రీ బ్లూజమ్ సీజన్, ఈస్టర్ విరామం కూడా సందర్శకుల సంఖ్యను పెంచడంలో దోహదపడింది. జపాన్ను సందర్శించిన విదేశీ పర్యాటకులలో ఎక్కువ మంది భారత్, జర్మనీ, తైవాన్, యునైటెడ్ స్టేట్స్ దేశాలకు చెందినవారు కావడం గమనార్హం. కోవిడ్ పరిమితులు ఎత్తేసినప్పటి నుంచి జపాన్ పర్యాటకం అభివృద్ధి చెందుతోంది. సందర్శకుల సంఖ్యను పెంచడానికి ఆ దేశ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. -
స్టార్టప్‌లతో ప్రతి నెలా సమావేశం నిర్వహించండి..
న్యూఢిల్లీ: అంకుర సంస్థలు, ఫిన్‌టెక్ సంస్థల ఆందోళనలను, సమస్యలను పరిష్కరించేందుకు వాటితో నెలవారీ సమావేశాలు నిర్వహించాలని రిజర్వ్ బ్యాంక్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. స్టార్టప్‌లు, ఫిన్‌టెక్ సంస్థలతో జరిగిన సమావేశంలో మంత్రి ఈ మేరకు సూచనలు చేసినట్లు ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. రేజర్‌పే, క్రెడ్, పీక్‌ఫిఫ్టీన్ తదితర 50 సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి వివేక్ జోషి, డీపీఐఐటీ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ తదితరులు, ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా, ఎన్పీసీఐ అధికారులు హాజరయ్యారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)పై ఆర్బీఐ ఆంక్షల కొరడా ఝుళిపించిన తరుణంలో ఫిన్‌టెక్, స్టార్టప్‌లతో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, పీపీబీఎల్ ఉదంతంపరమైన ఆందోళనలేమీ అంకుర సంస్థల వ్యవస్థాపకుల్లో కనిపించలేదని అధికారి తెలిపారు. ఈ భేటీలో స్టార్టప్‌లు సైబర్‌సెక్యూరిటీ సంబంధ అంశాలను ప్రస్తావించినట్లు వివరించారు. మహాకుంభ్‌లో వెయ్యి అంకుర సంస్థలు.. మార్చి 18 నుంచి న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగే స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో 1,000 పైచిలుకు అంకుర సంస్థలు, పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు, ఇన్క్యుబేటర్లు పాల్గొననున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభా గం డీపీఐఐటీ నిర్వహించనుంది. పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చలు, మెంటార్ సెషన్లు, మాస్టర్‌క్లాస్‌లు, కీలకోపన్యాసాలు, యూనికార్న్ రౌండ్‌టేబుల్ సమావేశాలు మొదలైనవి ఉంటాయి. -
నెలసరి లీవ్ అవసరం లేదు
న్యూఢిల్లీ: ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు నెలసరి రోజుకు వేతనంతో కూడిన సెలవుదినంగా కొన్ని దేశాల్లో పాటిస్తున్నారు. భారత్‌లోనూ మహిళా ఉద్యోగులకు నెలసరికి పెయిడ్ లీవ్ ఇవ్వాలన్న డిమాండ్ పెరిగిన నేపథ్యంలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మహిళా మంత్రి స్మృతి ఇరానీ ఒక స్పష్టతనిచ్చారు. జనతాదళ్(యూ) సభ్యుడు మనోజ్ కుమార్ ఝా రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా స్మృతి వివరణ ఇచ్చారు. ‘‘ నెలసరి అనేది మహిళల జీవితంలో ఒక సహజ ప్రక్రియ. అదేం వైకల్యం కాదు. దీనికి ప్రత్యేకంగా వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించాల్సిన అవసరం లేదు. నెలసరిని ప్రత్యేక సెలవు ఇవ్వాల్సిన సందర్భంగా పరిగణించకూడదు. నెలసరిని ఒక ఆటంకంగా కూడా భావించకూడదు. ఒకవేళ ఉద్యోగినులకు ఒక పెయిడ్ లీవ్ ఇస్తే తోటి పురుషులు తమకు ఒక సెలవు లభించలేదే అని భావించి పని ప్రదేశాల్లో వివక్షపూరిత వాతావరణం నెలకొనే ప్రమాదం ఉంది’’ అని ఇరానీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నెలసరి శుభ్రత విధాన ముసాయిదాను కేంద్రం తీసుకొచి్చందని ఆమె గుర్తుచేశారు. 10–19 ఏళ్ల టీనేజర్లలో నెలసరి శుభ్రతపై అవగాహన పెంచేందుకు కేంద్రం ఇప్పటికే ప్రత్యేక పథకాన్ని అమలుచేస్తోందని ఆమె వెల్లడించారు. మరోవైపు, ‘‘నెలసరి రోజుల్లో చాలా మంది ఉద్యోగినులు ఇబ్బందులు పడుతూ అది పని ప్రదేశాల్లో ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. వీరికి నెలసరి సెలవు లేదా సిక్ లీవ్ లేదా నెలకో సంవత్సరానికో సగం వేతనంతో కూడిన సెలవు ఇవ్వొచ్చు’’ అని సిబ్బంది, శిక్షణ వ్యవహారాలు, న్యాయ, సాధికారత వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒక నివేదికలో పేర్కొనడం గమనార్హం. -
టాటా మోటార్స్ సరికొత్త రికార్డు.. ఎప్పుడూ లేనంతగా..
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ 2023 నవంబర్‌లో గరిష్ట విక్రయాలను నమోదు చేసింది. పండుగల సీజన్ నేపథ్యంలో స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్ ఇందుకు కారణమని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. ‘గత నెలలో దేశవ్యాప్తంగా కంపెనీ 53,000 యూనిట్లను విక్రయించింది. ఈ సంఖ్య అంత క్రితం నెలతో పోలిస్తే 8 శాతం, 2022 నవంబర్‌తో పోలిస్తే 30 శాతం అధికం. 2023 నవంబర్ నెలలో నమోదైన విక్రయాలు ఇప్పటి వరకు కంపెనీ చరిత్రలోనే అత్యధికం. ఇక 47 రోజుల పండుగల సీజన్లో 79,374 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022 పండుగల సీజన్‌తో పోలిస్తే ఇది 18 శాతం అధికం. కొత్తగా విడుదలైన నూతన నెక్సన్, హ్యారియర్, సఫారీ మోడళ్లతోపాటు ఐ–సీఎన్జీ శ్రేణి ఈ జోరుకు కారణం’ అని చెప్పారు. డీజిల్ స్థానంలో సీఎన్జీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమతోపాటు టాటా మోటార్స్ సైతం ఉత్తమ ప్రతిభ కనబర్చనుందని శైలేష్ చంద్ర అన్నారు. ‘2023–24లో అన్ని కంపెనీలవి కలిపి 40 లక్షల యూనిట్ల మార్కును దాటవచ్చు. నవంబర్ రిటైల్ విక్రయాల్లో టాటా మోటార్స్ వాటా 15 శాతం దాటింది. ఎస్‌యూవీల్లో నెక్సన్, పంచ్ గత నెలలో టాప్–2లో ఉన్నాయి. ఎస్యూవీ మార్కెట్లో టాటా రెండవ స్థానంలో నిలిచింది. ప్యాసింజర్ వెహికిల్స్ రంగం నెలకు 3.3–3.5 లక్షల యూనిట్లను నమోదు చేస్తుంది. చిన్న హ్యాచ్బ్యాక్స్, సెడాన్స్‌లో డీజిల్ మోడళ్లు కనుమరుగయ్యాయి. డీజిల్ స్థానంలో సీఎన్జీ వచ్చి చేరింది. ఈ విభాగాల్లో సీఎన్జీ ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలిచింది. కాంపాక్ట్ ఎస్‌యూవీకి పైన డీజిల్ మోడళ్లకు బలమైన డిమాండ్ ఉంది. కాబట్టి మార్కెట్‌కు అనుగుణంగా నడుచుకుంటాం’ అని వివరించారు. -
‘మెఫ్తాల్’ ఔషధ రియాక్షన్లతో జాగ్రత్త
న్యూఢిల్లీ: నెలసరి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ సందర్భాల్లో సాధారణంగా వినియోగించే మెఫ్తాల్ ఔషధానికి సంబంధించిన ప్రతికూల ప్రభావా(రియాక్షన్)లను గమనించి, అప్రమత్తమవ్వాలని ఆరోగ్యరంగ వృత్తి నిపుణులు, వ్యాధిగ్రస్తులకు కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30వ తేదీన ఒక అడ్వైజరీని జారీ చేసింది. సాధారణంగా రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్, ఆస్టియో ఆర్ర్థరైటిస్, మహిళల్లో నెలసరి సమయంలో సంభవించే డిస్మెనోరోయియా, నొప్పి, వాపు, జ్వరం, దంతాల నొప్పి వంటి చికిత్సలో మెఫేనమిక్ యాసిడ్ పెయిన్ కిల్లర్‌ను వినియోగిస్తుంటారు. ఈ పెయిన్ కిల్లర్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్(ఐపీసీ) తాజాగా ఔషధ భద్రత హెచ్చరికను జారీ చేసింది. ఫార్మకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా(పీవీపీఐ) వారి డేటాబేస్‌ను ప్రాథమికంగా విశ్లేíÙంచగా కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఈ ఔషధాన్ని వినియోగించిన సందర్భాల్లో ఇసినోఫిలియా, సిస్టెమిక్ సింప్టమ్స్(డ్రెస్) సిండ్రోమ్ వంటి డ్రగ్ రియాక్షన్లు కనిపించాయి. పెయిన్ కిల్లర్‌ను వాడిన సమయంలో ఏమైనా దుష్ప్రభావాలు కనబడితే వెంటనే పీవీపీఐ అధికారిక ఠీఠీఠీ. జీpఛి.జౌఠి.జీn వెబ్సైట్ లేదా హెల్ప్‌లైన్ నంబర్ 1800–180–3024ను సంప్రదించవచ్చు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సుస్మితా సేన్ అందానికి దక్కిన కిరీటానికి 30 ఏళ్లు పూర్తి
Multiple cat checj
Check international block
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019