breaking news
-
ప్రెగ్నెన్నీ సమయంలో పిల్లి మాంసం తినడంతో..పాపం ఆ బిడ్డ..!
మన పెద్దవాళ్లు ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకునే ఆహారాలు బిడ్డపై ఎఫెక్ట్ చూపిస్తాయని పదేపదే చెప్పేవారు. అది ఎంతవరకు నిజమో గానీ!.. ఇక్కడొక మహిళ ఎదుర్కొంటున్న పరిస్థితిని చూస్తే అది నిజమేనేమో..! అని అనుకుంటారు. ఆమె తన పరిస్థితిని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఏం జరిగిందంటే..ఫిలిప్పీన్స్‌కు చెందిన అల్మా అనే మహిళకు రెండేళ్ల కొడుడు జారెన్ గమోంగన్ ఉన్నాడు. అతడు ముఖం, శరీరాన్ని కప్పి ఉంచేలా పెద్ద వెంట్రుకలతో జన్మించాడు. దీన్ని అరుదైన 'వేర్వోల్ఫ్ సిండ్రోమ్'గా పిలుస్తారు. ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 నుంచి 100 వరకు ఉన్నాయి. అయితే జారెన్ కడుపులో ఉండగా తల్లి అల్మా అడవి పిల్లులు తినాలనే కోరిక ఎక్కువగా ఉండేదట. అదీగాక అక్కడ అపయావో ప్రాంతంలో పిల్లితో చేసే వంటకం బాగా ప్రసిద్ధి. దీంతో ఒక రోజు నల్లపిల్లిని తెచ్చుకుని వండుకుని తింది. అప్పుడు ఆమెకు ఏమి అనిపించలేదు. ఎప్పుడైతే తన కొడుకు ఇలా మెడ, వీపు, చేతులు, ముఖంపై ఓ ఎలుగుబంటి మాదిరిగా జుట్టుతో ఉండటంతో పశ్చాత్తాపం చెందడం మొదలు పెట్టింది అల్మా. తాను గర్భవతిగా ఉండగా ఆ నల్లపిల్లిని తినడం కారణంగా తన కొడుకు ఇలా పుట్టాడని, ఆ పిల్లి శాపం తనకు తగిలిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తోటి స్థానికులు, గ్రామస్తులు కూవా అల్మాతో అడవి పిల్లి తినడం వల్లే ఇలా జరిగిందని అనడంతో దాన్నేనమ్మడం మొదలు పెట్టింది. ఐతే అందుకు సరైన ఆధారాలు మాత్రం లేవు. ఇక్కడ ఆమె జారెన్ కంటే ముందు ఓ కుమార్తె ఉంది. ఆమెకు ఈ పరిస్థితి లేదు. కొడుకు అరుదైన పరిస్థితిని చూసి అల్మా తాను చేసిన పనికి నిందించుకుంటూ విలపిస్తోంది. వైద్యులను ఆశ్రయించినా అల్మాకు నిరాశ ఎదురయ్యింది. ఎందుకంటే వైద్యులు అల్మా కొడుకు జారెన్‌కు అనేక వైద్య పరీక్షలు చేసి అతడు హైపర్ట్రికోసిస్ అనే అరుదైన వైద్య పరిస్థితితో బాధపడుతున్నట్లు తెలిపారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ డెర్మటాలజీ ప్రకారం..ఈ హైపర్ట్రికోసిస్ అనేది సాధారణంగా మానవుడికి ఉండే జుట్టు కంటే అధికంగా ఏ భాగంలోనైనా పెరగొచ్చు. ఇది అరుదైన వ్యాధి అని, దీనికి చికిత్స లేదని తేల్చి చెప్పారు. అయితే జారెన్ ఇలాంటి అరుదైన పరిస్థితితో పుట్టినప్పటికీ మంచి యాక్టివ్‌గా అందరిలానా ఉండటం విశేషం. ఐతే ఒక్కోసారి వేడి వాతావరణంలో ఈ దట్టమైన వెంట్రుకల కారణంగా దురద పుడుతుందని చెబుతున్నాడని అల్మా వాపోయింది. తాను చాలా సార్లు జుట్టుని కత్తిరించడానికి ప్రయత్నించానని, అయితే అది పొడవుగా మందంగా ఉండటంతో కత్తిరించిన కొద్ది దట్టంగా పెరుగుతున్నట్లు చెప్పుకొచ్చింది అల్మా. అయితే లేజర్ హెయిర్ రిమూవల్ వంటి చికిత్సలు అధిక జుట్టు పెరుగుదలను తగ్గించగలవని వైద్యులు సూచించారు. దీంతో అల్మా, ఆమె భర్త తన కుమారుడి హెయిర్ రిమూవల్ సెషన్లకు నిధులు సమకూర్చే పనిలో నిమగ్నమయ్యారు. ఏదీ ఏమైనా ప్రెగ్నెన్సీ సమయంలో శిశువుకి హానికరం అనిపించేవి తీసుకోకుండా ఉంటేనే మంచిది. దేనిల్ల కొన్ని రకాల రుగ్మతలు వస్తాయన్నిది సరిగా వైద్యులు సైతం నిర్థారించలేరు, చెప్పలేరు అనేది గుర్తించుకోండి. (చదవండి: సింఘారా పిండి గురించి విన్నారా..? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
Priyanka Singh: బటర్‌ఫ్లై మామ్
ఇల్లంటే ఎలా ఉండాలి? ఇంటిముందు గుమ్మానికి ఆకుపచ్చ తోరణం ఉండాలి. గుమ్మానికి ఇరువైపులా పచ్చటి మొక్కలుండాలి. ఆ మొక్కలకు రంగురంగుల పువ్వులుండాలి. ఇంట్లోకి అడుగుపెడుతుంటే పరిమళాలు స్వాగతం పలుకుతుండాలి. ఇవన్నీ ముంబయి నగరంలో, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్‌లో సాధ్యమయ్యే పనేనా? సాధ్యం కాదని ఊరుకుంటే ప్రియాంక సింగ్ బటర్‌ఫ్లై మామ్ అయ్యేదే కాదు. ఆమె ఇల్లు వేలాది సీతాకోక చిలుకలకు పుట్టిల్లయ్యేదీ కాదు. ప్రియాంక సింగ్‌ది ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పట్టణం. గంగానది తీరాన, వందల ఏళ్ల నాటి మహావృక్షాల నీడన పెరిగిన బాల్యం ఆమెది. చదువు, ఉద్యోగం, పెళ్లి... ఆమె గమ్యాన్ని నిర్దేశించాయి. ముంబయిలో అడుగు పెట్టింది. ఆమె ఫ్లాట్ ఆ భవనంలో పదమూడవ ఫ్లోర్లో ఉంది. తాను గడిపిన అందమైన బాల్యం తన పిల్లలకు ఉండదని దిగులు పడిందామె. మహావృక్షాల నీడన కాకున్నా, కనీసం అడుగు ఎత్తు మొక్కల మధ్య పెరిగినా చాలనుకుంది. బాల్కనీలో రకరకాల మొక్కలు పెంచింది. మొక్కలను సేంద్రియ పద్ధతిలో పెంచాలనుకోవడమే ఆమెకు తెలియకుండా ఆమె చేసిన ఓ మంచిపని. మొక్కలకు చీడపీడలకు రసాయన క్రిమిసంహారక మందులు వాడకుండా సేంద్రియాలతో పెంచింది. ఒకరోజు ఒక లార్వా ఆమె మొక్కల ఆకుల కింద కనిపించింది. రోజుల్లోనే అది ప్యూ΄ా దశకు చేరడం, ఆ తర్వాత రంగురంగుల సీతాకోక చిలుక రెక్కలు విచ్చుకుని ఎగరడం అన్ని దశలూ చూస్తుండగానే జరిగి΄ోయాయి. అప్పటి నుంచి ఆమె సీతాకోక చిలుకల పరిణామక్రమాన్ని చదవడం మొదలు పెట్టింది. ఆ తర్వాత రసాయన క్రిమిసంహారిణులను ఇంట్లోకి తీసుకురావడమే మానేసింది. ఇప్పుడామె బాల్కనీలో నిమ్మజాతి చెట్లు, అక్షింతల చెట్టు, కరివే΄ాకు, వెస్ట్ ఇండియన్ జాస్మిన్... వంటి మొక్కలున్నాయి. వాటి మీద మోనార్క్ బటర్‌ఫ్లై, కామన్ జాయ్, లైమ్ స్వాలోటెయిల్ వంటి అరుదైన జాతుల సీతాకోక చిలుకలు కనిపిస్తున్నాయి. అలా వచ్చి వెళ్లి΄ోకుండా ఆ చెట్ల ఆకుల మీదనే గుడ్లు పెడుతున్నాయి. సంతతిని వృద్ధి చేస్తున్నాయి. ఆమె ఇంట్లో సీతాకోక చిలుకలకు అనువైన వాతావరణం ఉంది. ఆ వాతావరణాన్ని పరిరక్షిస్తోందామె. అందుకే ప్రియాంక సింగ్‌ను బటర్ ఫ్లై మామ్ అంటున్నారు ఆమె స్నేహితులు. తాను జీవవైవిధ్యత కోసం అంకితమవుతానని వారణాసి నుంచి ముంబయికి పయనమైనప్పుడు కలలో కూడా ఊహించలేదు... అంటుంది ప్రియాంక సింగ్. ఆమెకు సీతాకోక చిలుకలను చూస్తూ తేడాలను గుర్తించడంతో΄ాటు ప్రతి సీతాకోక చిలుకనూ ఫొటో తీయడం అలవాటైంది. ఇప్పటివరకు ఆమె మినీ గార్డెన్లో ఐదు వేలకు పైగా సీతాకోక చిలుకలు కొలువుదీరాయి. రెక్కలొచ్చిన తర్వాత ఎగిరి వెళ్లి΄ోయాయి. -
అమ్మకు బహుమతిగా చందమామపై స్థలం!
గోదావరిఖని (రామగుండం): తల్లిపై ప్రేమతో వినూత్న కానుక ఇవ్వాలని ఆ కుమార్తె భావించింది. ఇందుకోసం ఏకంగా చందమామపైనే ఎకరం భూమిని కొనుగోలు చేసి తల్లికి బహుమతిగా అందించింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రాంచందర్, వకుళాదేవి దంపతుల పెద్ద కుమార్తె సాయి విజ్ఞత. ఆమె అమెరికాలోని ఐయోవాలో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. మదర్స్ డే సందర్భంగా లూనార్ రిజిస్ట్రీ వెబ్సైట్లో ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని ఎకరం భూమిని కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. రూ.35 లక్షలు చెల్లించి తన తల్లి వకుళాదేవి పేరిట దానిని రిజిస్టర్ చేయించానని వివరించారు. ఈ మేరకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కూడా వచ్చేశాయన్నారు. -
1600 లీటర్ల చనుబాలు దానం.. గిన్నీస్ రికార్డ్ కెక్కిన మాతృమూర్తి..
తల్లి పాల గొప్పతనం అందరికీ తెలుసు. శిశువుకు ప్రాణాధారం అయిన అలాంటి తల్లిపాలు ఇవ్వడంలో గిన్నీస్ రికార్డ్ సాధించింది అమెరికాకు చెందిన ఎసిలబెత్ అండర్సన్. ఏకంగా 1600 లీటర్ల పాలను ఇచ్చి ఎందరో శిశువుల ఆకలి తీర్చింది. తనకు ఉన్న లోపాన్నే ఆయుధంగా చేసుకుని ప్రపంచ రికార్డ్ సాధించింది. అమెరికాలోని ఒరెగాన్కు చెందిన ఎలిసాబెత్ అండర్సన్ సియెర్రాకు ఇద్దరు సంతానం. ఆమెకు హైపర్ లాక్టేషన్ సిండ్రోమ్ కారణంగా పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవి. ఈ క్రమంలో తన భర్త ఉండే ప్యూర్టెరికో ద్వీపానికి వెళ్లినప్పుడు తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకు ఎలిసబెత్ పాలను ఇచ్చారు. ఆ తర్వాత ఆ సహాయాన్ని కొనసాగించారు. ఇలా చాలా మంది శిశువులకు పాలను ఇచ్చారు. 2015 నుంచి 2018 మధ్యలో 1600 లీటర్ల చనుబాలను పాల బ్యాంకులకు అందించారు. దీంతో ప్రపంచంలోనే ఈ స్థాయిలో పాలను దానం చేసిన జాబితాలో గిన్నీస్ రికార్డ్ సాధించారు. గిన్నీస్ రికార్డ్ సాధించడం గౌరవంగా ఉందని ఎలిసబెత్ సియెర్రా తెలిపారు. తన లోపంతోనూ ఎందరో చిన్నారులకు ఆకలి తీరిందని అన్నారు. ప్రోలాక్టిన్ అత్యధికంగా ఉత్పత్తి కావడంతో ఎలిసబెత్‌కు పాలు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయని డాక్టర్లు తెలిపారు. దీని కారణంగానే ఆమె పాలను దానం చేయగలుగుతున్నారని వెల్లడించారు. ఇదీ చదవండి: మళ్ళీ నోరుజారిన అమెరికా ఉపాధ్యక్షురాలు.. స్క్రిప్టు యధాతధంగా చదివి.. -
ఇంట్లోనే పది రోజులు ఒంటరిగా 16 నెలల చిన్నారి..పాపం! చివరికి..
కర్కశమో లేక కసాయితనమో గానీ కొందరూ తల్లుల చేసే కృత్యాలు అత్యంత ఘోరంగా ఉంటాయి. ముఖ్యంగా కొందరూ తల్లల ప్రవర్తన అర్థంకాని రీతిలో ఉంటుంది. అది ఒక మానసిక రుగ్మత మరైదైన గానీ..వారి నైజానికి అభం శుభం తెలియని చిన్నారుల బలవుతున్నారు. అచ్చం అలానే యూఎస్‌లోని ఓ తల్లి క్షమించరాని ఘాతుకానికి పాల్పడింది. యూఎస్‌లోని 31 ఏళ్ల క్రిస్టెల్ కాండెలారియో 16 నెలల పసికందుని ఇంట్లోనే పది రోజులుగా 16 నెలల చిన్నారి జైలిన్ని ఒంటరిగా వదిలేసింది. అది కూడా సెలవులపై బయటకు వెళ్లడం కోసం.. ఆ చిన్నారి బాగోగులను గాలికి వదిలేసి.. డెట్రాయిట్లో గడిపొచ్చింది. చివరికి ఆ మహా తల్లి హాయిగా తిరిగి వచ్చి ఇంటికి వచ్చి చూడగా ఆ చిన్నారి అపస్మారక స్థితిలో పడి ఉంది. డీ హైడ్రెషన్కి గురయ్యి ఉంది. ఆ తర్వాత తాపీగా సాయం కోసం హెల్ప్‌లైన్‌కి కాల్ చేసింది. దీంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు ఆ చిన్నారిని నిశితంగా గమనించారు. ఆ చిన్నారి ఒంటిపై ఒక్క గాయం కూడా లేదని గుర్తించారు. ఐతే ఆ చిన్నారి ఉన్న పరుపు మూత్రం, మలంతో కలుషితమై ఉన్నట్లు గమనించారు. ఆ తర్వాత పోలీసుల విచారణలో కాండెలారియో ఇలా చిన్నారిని ఒంటరిగా వదిలేయడం మొదటిసారి కాదని తేలింది. కాండెలారియో ఇంటి చుట్టుపక్కల వాళ్లు ఆమె ఇలా చాలాసార్లు చేసిందని, అలాగే ఇలా చేయొద్దని చెప్పామని వారు చెబుతున్నారు. చిన్నారి జైలిన్ చనిపోవడానికి తల్లి నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: ఎవ్వరూ మాట్లాడని కేరళ కథ! యావత్ సమాజం సేవ చేసేలా..!)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019