breaking news
-
బెయిల్ నిరాకరణ.. కోర్టులో కూప్పకూలిన ఆసీస్ మాజీ ఓపెనర్
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ ఓపెనర్ మైఖేల్ స్లేటర్ వివాదంలో చిక్కుకున్నాడు. భార్యపై గృహ హింసకు పాల్పడడం, మహిళల్ని వెంబడించడం, దొంగతనానికి పాల్పడడం వంటి కేసుల్లో భాగంగా స్లేటర్‌ను క్వీన్స్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై ఏకంగా 19 కేసులు నమోదయ్యాయి. 2023 డిసెంబర్ 5 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీ మధ్యలో అతను ఈ నేరాలకు పాల్పడినట్లు కేసులు రిజిష్టర్ అయ్యాయి. అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మైఖేల్ స్లేటర్‌కు క్వీన్స్లాండ్ మేజిస్ట్రేట్ కోర్టు షాకిచ్చింది. అతడి బెయిల్ ధరఖాస్తును కోర్టు తిరస్కరించింది. అతడికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసుపై తదుపరి విచారణను మే 31కు కోర్టు వాయిదా వేసింది. ఈ విషయం తెలిసిన స్లేటర్ కోర్టు ఆవరణలోనే కుప్పకూలిపోయాడు. కరెక్షనల్ సర్వీసెస్ సిబ్బంది అతడిని తన సెల్‌కు తీసుకు వెళ్తుండగా స్లేటర్ ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆస్ట్రేలియన్ మీడియా తమ కథనాల్లో పేర్కొంది. అదేవిధంగా స్లేటర్ ప్రస్తుతం మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా గతంలో పలుమార్లు కోర్టు ఆదేశాలను స్లేటర్ ధిక్కరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడికి బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆస్ట్రేలియా తరపున 74 టెస్టులు, 42 వన్డేలు ఆడిన స్లేటర్ 42.83 సగటుతో 5,312 పరుగులు సాధించాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్లేటర్ ఆ తర్వాత టీవీ కామెంటేటర్‌గా రాణించాడు. ఛానెల్ 9, ఛానల్ 7లలో పనిచేశారు. -
మాజీ క్రికెటర్‌కు కోర్టులో ఊరట.. మెంటల్ హెల్త్ ఆస్పత్రికి తరలింపు!
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకెల్ స్లేటర్‌ను మెంటల్ హెల్త్ ఆసుపత్రికి తరలించారు. మానసిక పరిస్థితి సరిగా లేనందున అతనిపై ఉన్న గృహహింస కేసును కొట్టేస్తున్నట్లు సిడ్నీ లోకల్ కోర్టు తెలిపింది. విషయంలోకి వెళితే.. 52 ఏళ్ల మైకెల్ స్లేటర్‌పై గతేడాది అక్టోబర్‌లో న్యూసౌత్ వేల్స్ పోలీసులు గృహహింస కేసు నమోదు చేశారు. ఇక తన మాజీ భార్యకు ఫోన్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపించడంతో పాటు మానసిక వేధింపులకు గురి చేశాడనే ఆరోపణలు రావడంతో గత డిసెంబర్లో అధికారులు అతనిపై మరిన్ని కేసులు నమోదు చేశారు. అయితే అతని మానసికస్థితి సరిగా లేనందునే ఇలా ప్రవర్తిస్తున్నాడని ఫిబ్రవరిలో అతని తరపు లాయర్ కోర్టుకు తెలిపాడు. తాజాగా మరోసారి మైకెల్ స్లేటర్ కేసు వాదనకు వచ్చింది. కేసును విచారించిన మెజిస్ట్రేట్ రాస్ హడ్సన్ అతని పరిస్థితిపై స్పందించాడు. ''మైకెల్ స్లేటర్ మానసిక పరిస్థితి బాగా లేదని.. ప్రస్తుతం జైలు కంటే రీహాబిలిటేషన్ సెంటర్‌కు పంపించాల్సిన అవసరం ఉంది. మూడు వారాల పాటు మెంటల్ హెల్త్ యూనిట్లో స్లేటర్ చికిత్స తీసుకోనున్నాడు. తక్షణమే అతన్ని మెంటల్ హెల్త్ యూనిట్‌కు తరలించే ఏర్పాట్లు చేయాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. కాగా మైకెల్ స్లేటర్ అంతకముందే దాదాపు వంద రోజులపాటు ఆల్కహాల్, మెంటల్ డిజార్డర్‌తో బాధపడుతూ రీహాబిటేషన్ సెంటర్లో చికిత్స తీసుకున్నట్లు తేలింది. ఇక 1993-2001 కాలంలో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన మైకెల్ స్లేటర్ 74 టెస్టులు, 42 వన్డేలు ఆడాడు. కాగా 74 టెస్టుల్లో 5312 పరుగులు, 42 వన్డేల్లో 987 పరుగులు సాధించాడు. ఆటకు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత మైకెల్ స్లేటర్ కామెంటేటర్ అవతారం ఎత్తాడు. చదవండి: Yuvraj Singh: టీమిండియా టెస్ట్ కెప్టెన్సీకి అతడే సరైనోడు..! IPL 2022: ఫెర్గూసన్‌కు చుక్కలు చూపించాడు.. ఎవరీ శశాంక్ సింగ్? -
Michael Slater: గృహహింస ఆరోపణలు.. మాజీ క్రికెటర్ అరెస్టు
Ex-Cricketer Michael Slater Arrested: గృహహింస ఆరోపణల నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ స్లాటర్ అరెస్టైనట్లు సమాచారం. సిడ్నీలోని మాన్లీలో గల తన నివాసంలో స్లాటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం జరిగిన ఓ ఘటన ఆధారంగా అందిన ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు చేసినట్లు న్యూసౌత్ వేల్స్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు... ‘‘అక్టోబరు 12న... గృహహింస ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈస్టర్న్ సబర్బ్స్ పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తు ఆధారంగా బుధవారం ఉదయం 9 గంటల 20 నిమిషాలకు అతడిని అరెస్టు చేశాం’’అని ప్రకటన విడుదల చేశారు. అయితే, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించిన మైకేల్ స్లాటర్.. టెస్టు బ్యాటింగ్ టాపార్డర్‌లో చోటు దక్కించుకున్నాడు. కెరీర్లో మొత్తంగా 5312 పరుగులు చేసిన స్లాటర్.. 2004లో ఆటకు వీడ్కోలు పలికాడు. బ్రాడ్‌కాస్టర్‌గా, టెలివిజన్ పండిట్‌గా గుర్తింపు సంపాదించాడు. చదవండి: T20 World cup 2021: ధోనికి వయస్సు అయిపోలేదు.. మాకు పోటీ ఇవ్వగలడు: కేఎల్ రాహుల్ -
స్లేటర్‌తో ఘర్షణపై వార్నర్ క్లారిటీ
మాలె: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఆ దేశ మాజీ క్రికెటర్, కామెంటేటర్ మైకేల్ స్లేటర్లో ఇటీవల మాల్దీవ్స్‌లోని ఓ బార్లో కొట్టుకున్నట్లు వచ్చిన వార్త హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం ఈ వార్త కు సంబంధించి ఈ ఇద్దరు ఆస్ట్రేలియన్లు వివరణ ఇచ్చారు. కరోనా విజృంభిస్తున్న కారణంగా భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లడంపై ఆ దేశ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ వాయిదా పడడంతో ఆసీస్ క్రికెటర్లు, సిబ్బంది మాల్దీవ్స్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. వాళ్లు అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు పయనమయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మేము గొడవ పడలేదు.. ఇది ఇలా ఉండగా మాల్దీవ్స్‌లోని ఓ బార్లో వార్నర్, స్లేటర్ గొడవపడినట్లు ద డైలీ టెలిగ్రాఫ్ ఓ స్టోరీ రాసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉన్న తాజ్ కోరల్ రిసార్ట్‌లోనే ఈ ఘటన జరిగినట్లు చెప్పింది. ఈ వార్త పై స్లేటర్, వార్నర్ స్పందించారు చెప్పారు. దీనిపై మొదటగా స్పందించిన స్లేటర్ సీనియర్ జర్నలిస్ట్ ఫిల్ రోత్‌ఫీల్డ్‌కు చేసిన మెసేజ్‌లో.. నేను, వార్నర్ ఎప్పటి నుంచో మంచి స్నేహితులం. మా మధ్య గొడవ జరిగే అవకాశమే లేదు. ఇదంతా పుకారే అని స్పష్టం చేశాడు. ఆ తర్వాత వార్నర్ కూడా తన వివరణగా.. మీకు ఇలాంటి పుకార్లు ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలియడం లేదు. ఇటువంటి వార్తలు రాసే ముందు బలమైన ఆధారాలు ఉంటేనే రాయాలంటూ తెలిపాడు. కాగా గత వారం ఆస్ట్రేలియా ప్రధానిపై తీవ్రంగా మండిపడిన స్లేటర్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. భారత్ నుంచి వచ్చే ఆస్ట్రేలియన్లపై నిషేధం విధించడంపై స్లేటర్ తీవ్రంగా మండిపడ్డాడు. ( చదవండి: కేకేఆర్ జట్టులో మరో ఆటగాడికి కరోనా ) -
'ప్రైవేట్ జెట్‌లో వెళ్లి అక్కడి వీధుల్లో శవాలను చూడండి'
సిడ్నీ: ఆసీస్ మాజీ క్రికెటర్ మైకెల్ స్లేటర్ ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్‌పై మరోసారి విరుచుకుపడ్డాడు. కరోనా విజృంభణతో భారత్ అల్లాడిపోతుంటే.. ఐపీఎల్ రద్దుతో అక్కడే ఉండిపోయిన ఆసీస్ ఆటగాళ్లను వెనక్కి రప్పించే విషయంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ ట్విటర్లో వరుస ట్వీట్లు చేశారు.'మానవ సంక్షోభం వంటి అంశంపై ఒక దేశ ప్రధానికి చెప్పాల్సి రావడం ఆశ్చర్యంగా ఉంది. భారత్‌లో ఉన్న ప్రతీ ఆస్ట్రేలియన్ భయంలో ఉన్నారన్నది నిజం. నువ్వు నీ ప్రైవేట్ జెట్‌లో వెళ్లి అక్కడి వీధుల్లో ఉన్న శవాలను చూడండి. ఈ విషయంలో మీతో డిబేట్ చేసేందుకు ఎప్పుడు రెడీగా ఉంటాను' అంటూ విరుచుకుపడ్డాడు. మరోవైపు కరోనాతో పోరాడుతున్న భారతీయులకు సంఘీభావం తెలుపుతూ మరో ట్వీట్ చేశాడు. ''కరోనాపై మీరు చేస్తున్న పోరాటం మాటల్లో వర్ణించలేనిది. కరోనా బారీన పడిన ప్రతీ భారతీయుడు క్షేమంగా కోలుకోవాలంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. ఐపీఎల్లో కామెంటేటర్‌గా పనిచేసినన్నాళ్లు మీరు చూపిన ప్రేమ అద్భుతంగా కనిపించింది.దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి'' అంటూ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ 14వ సీజన్లో కామెంటేటర్‌గా పనిచేసిన మైకెల్ స్లేటర్ కరోనా విజృంభణ దృశ్యా సొంత దేశానికి పయనమయ్యాడు. అయితే ఆస్ట్రేలియా భారత్ నుంచి వచ్చేవారిపై మే 15 వరకు నిషేధం విధించింది. దీంతో ప్రస్తుతం మాల్దీవ్స్‌లో ఉన్న ఆయన అక్కడి నుంచి ఆసీస్ వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఐపీఎల్‌కు కరోనా సెగ తగిలి రద్దు కావడంతో లీగ్‌లో ఆడుతున్న ఆసీస్ క్రికెటర్లు కూడా డైరెక్ట్‌గా ఆస్ట్రేలియా వెళ్లే అవకాశం లేకపోవడంతో శ్రీలంక మీదుగా మాల్దీవ్స్ చేరుకొని అక్కడినుంచి ఆస్ట్రేలియా చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చదవండి: ఐపీఎల్ 2021: ఆసీస్ క్రికెటర్లకు షాక్ Amazing to smoke out the PM on a matter that is a human crisis. The panic, the fear of every Australian in India is real!! How about you take your private jet and come and witness dead bodies on the street! — Michael Slater (@mj_slats) May 5, 2021 I challenge you to a debate anytime PM. — Michael Slater (@mj_slats) May 5, 2021 Above all my love and prayers to every Indian. You have been nothing but amazing to me every time I've been there. Please stay safe. Xx — Michael Slater (@mj_slats) May 5, 2021
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019