breaking news
-
‘మేం గెలిస్తే ప్రత్యేక రాష్ట్రం’
లక్నో: తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా మార్చేందుకు తమ పార్టీ గట్టి చర్యలు తీసుకుంటుందని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి ప్రకటించారు. ముజఫర్‌నగర్ లోక్‌సభ స్థానం బీఎస్పీ అభ్యర్థి దారా సింగ్ ప్రజాపతికి మద్దతుగా మాయావతి ప్రచారం నిర్వహించారు. ఇక్కడ జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాయావతి మాట్లాడుతూ బీజేపీకి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. "పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం కావాలని మీరు కోరుకుంటున్నారు. ఇందుకోసం కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం" అని మాయావతి చెప్పారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగి ఓటింగ్ యంత్రాలను తారుమారు చేయకుంటే ఈసారి బీజేపీ అధికారంలోకి రాదని బీఎస్పీ చీఫ్ అన్నారు. ముజఫర్‌నగర్‌లో బీజేపీ నుంచి సంజీవ్ కుమార్ బల్యాన్, సమాజ్ వాదీ పార్టీ నుంచి హరేంద్ర సింగ్ మాలిక్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ తన ర్యాలీకి ముందు, మాయావతి సహరాన్పూర్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో కూడా ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్, పిలిభిత్‌లలో మొత్తం ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న మొదటి దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
ముఖ్తార్ అన్సారీ మృతిపై విచారణ జరిపించాలి: మాయావతి
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత 'ముఖ్తార్ అన్సారీ' గుండెపోటుతో గురువారం (మార్చి 28) సాయంత్రం మృతి చెందారు. గుండెపోటుతో ఆయన తుది శ్వాస విచినట్లు అధికారులు చెబుతుంటే.. తన తండ్రికి స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారంటూ ముఖ్తార్ కుమారుడు 'ఉమర్' ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై కోర్టును సంప్రదిస్తానని చెప్పారు. ఈ విషయం మీద బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి స్పందించారు. ముఖ్తార్ అన్సారీ మృతిపైన విచారణ జరిపించాలని మాయావతి డిమాండ్ చేశారు. ఈ కేసులో నిజానిజాలు ప్రజల ముందుకు రావాల్సి ఉందన్నారు. అన్సారీ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని భీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ కూడా డిమాండ్ చేశారు. मुख़्तार अंसारी की जेल में हुई मौत को लेकर उनके परिवार द्वारा जो लगातार आशंकायें व गंभीर आरोप लगाए गए हैं उनकी उच्च-स्तरीय जाँच जरूरी, ताकि उनकी मौत के सही तथ्य सामने आ सकें। ऐसे में उनके परिवार का दुःखी होना स्वाभाविक। कुदरत उन्हें इस दुःख को सहन करने की शक्ति दे। — Mayawati (@Mayawati) March 29, 2024 మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ అకాల మరణం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ.. ఎక్స్ (ట్విటర్) వేదికగా చంద్రశేఖర్ ఆజాద్ ట్వీట్ చేశారు. అన్సారీ మౌ సదర్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అతను 2005 నుంచి ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లో జైలులో ఉన్నాడు. అతనిపై 60కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సెప్టెంబరు 2022 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని వివిధ న్యాయస్థానాలు అతనికి ఎనిమిది కేసుల్లో శిక్ష విధించాయి. पूर्व विधायक मुख्तार अंसारी जी का असामायिक निधन बेहद दुखद, मैं विनम्र श्रद्धांजलि अर्पित करता हूं। मेरी संवेदनाएं उनके परिजनों और समर्थकों के प्रति हैं, प्रकृति उन्हें यह असीम दुख सहने की शक्ति प्रदान करें। पूर्व में ही उन्होंने अपनी हत्या की आशंका व्यक्त की थी, मैं माननीय उच्च… — Chandra Shekhar Aazad (@BhimArmyChief) March 28, 2024 -
UP: సింగిల్‌గా పోటీ.. ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు గాను తొలివిడతలో 16 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పొత్తు పుకార్లను కొట్టిపారేస్తూ బీఎస్పీ అధినేత్రి మాయావతి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాము స్వతంత్రంగానే పోటీ చేయాలని నిర్ణయించారు. బీఎస్పీ తొలి విడత జాబితాలో ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నౌర్, నగీనా, మురాదాబాద్, రాంపూర్, సంభాల్, అమ్రోహా, మీరట్, బాగ్పట్ స్థానాలతో సహా 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ రాష్ట్రంలో మొత్తం 80 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. సహరాన్పూర్ నుంచి మాజిద్ అలీ, కైరానా నుంచి శ్రీపాల్ సింగ్, ముజఫర్‌నగర్ నుంచి దారా సింగ్ ప్రజాపతి, బిజ్నోర్ నుంచి విజయేంద్ర సింగ్, నాగినా (ఎస్సీ స్థానం) నుంచి సురేంద్ర పాల్ సింగ్, మొరాదాబాద్ నుంచి మహ్మద్ ఇర్ఫాన్ సైఫీలను బరిలోకి దించింది. ఇక రాంపూర్ నుంచి జిషాన్ ఖాన్, సంభాల్ నుంచి షౌలత్ అలీ, అమ్రోహా నుంచి మొజాహిద్ హుస్సేన్, మీరట్ నుంచి దేవవ్రత్ త్యాగి, బాగ్పత్ నుంచి ప్రవీణ్ బన్సాల్‌లకు బీఎస్పీ టికెట్ ఇచ్చింది. గౌతమ్ బుద్ధ నగర్ నుంచి రాజేంద్ర సింగ్ సోలంకి, బులంద్‌షహర్ (ఎస్సీ స్థానం) నుంచి గిరీష్ చంద్ర జాతవ్, అయోన్లా నుంచి అబిద్ అలీ, పిలిభిత్ నుంచి అనిస్ అహ్మద్ ఖాన్ అలియాస్ ఫూల్ బాబు, షాజహాన్‌పూర్ (ఎస్సీ) నుంచి దోదరం వర్మ బరిలోకి దిగనున్నారు. -
అవన్నీ అసత్యాలే.. తేల్చి చెప్పేసిన మాయావతి
BSP Mayawati : రానున్న లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనుంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత్రి మాయావతి తేల్చి చెప్పేశారు. తమ పార్టీ పొత్తుతో వెళ్తుందని వస్తున్న వదంతులన్నీ అబద్ధమని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో ఈ మేరకు మాయావతి పోస్ట్ చేశారు. ‘రానున్న లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలలో బీఎస్పీ తన సొంత బలంతో పోటీ చేస్తుంది. ఇందుకోసం పార్టీ పూర్తి సన్నద్ధత, బలంతో ఉంది. ఇటువంటి పరిస్థితిలో పొత్తులు, మూడవ ఫ్రంట్ ఏర్పాటు గురించి వస్తున్నవి తప్పుడు వార్తలు. ఇలాంటి వార్తలతో మీడియా తన విశ్వసనీయతను కోల్పోకూడదు. ప్రజలు కూడా జాగ్రత్తగా గమనించాలి’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రణాళికల గురించి మాయావతి పేర్కొంటూ.. “ముఖ్యంగా యూపీలో బీఎస్పీ ఒంటరిగా ఎన్నికలలో పోటీ చేస్తుండటంతో ఇతర పక్షాలు అసహనానికి గురవుతున్నాయి. అందుకే రోజూ రకరకాల పుకార్లు పుట్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే బహుజన వర్గాల ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనే బీఎస్పీ నిర్ణయం దృఢమైనది" అన్నారు. -
లోక్‌సభ ఎన్నికల వేళ.. బీఎస్పీకి షాక్
లక్నో: బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) ఎంపీ రితేష్ పాండే బీఎస్పీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మామావతి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసినట్లు ఎంపీ రితేష్ పాండే.. ఆదివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌నగర్ నుంచి లోక్‌సభ బీఎస్పీ ఎంపీగా ప్రాతినిధ్యం వస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన బీఎస్పీ రాజీనామా చేయటంతో బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. बहुजन समाज पार्टी की प्राथमिक सदस्यता से त्यागपत्र pic.twitter.com/yUzVIBaDQ9 — Ritesh Pandey (@mpriteshpandey) February 25, 2024 ఉత్తరప్రదేశ్ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించిన బీఎస్పీ పార్టీ నేతలు,కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ‘చాలా కాలంగా నాకు పార్టీలో ఎటువంటి గుర్తింపు లభించటం లేదు. పార్టీ సమావేశాల్లో కూడా నాకు సీనియర్ నేతలు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదు. అయనా.. నా నియోజకర్గం ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతూ ఉన్నా. ఇక పార్టీని నా సేవలు అవసరం లేదని భావిస్తున్నా. అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా’ అని ఎంపీ రితేష్ పాండే తెలిపారు. మరోవైపు ఎంపీ రితేష్ పాండే బీజేపీ చేరుతారని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. 10 రోజుల క్రితం ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిసిన పాండే.. ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో మోదీని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. దీంతో ఆయన బీజేపీలో చేరుతారని చర్చ జరుగుతోంది. బీజేపీలో చేరిన రితేష్ పాండే బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్సీ)కి రాజీనామా చేసిన అంబేద్కర్ నగర్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ రితేష్ పాండే ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ సమక్షంలో బీజేపీలో చేరారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019