breaking news
-
మోడ్రనే కానీ, నాకు అలా బిడ్డను కనే ధైర్యం లేదు : మసాబా వ్యాఖ్యలు వైరల్
మసాబా గుప్తా ఫ్యాషన్ పరిశ్రమలో పెద్దగా పరిచయం అవసం లేదు. రెడ్ కార్పెట్ ఈవెంట్ల నుండి వివాహాలు , ఫోటోషూట్ల వరకు పాపులర్ డిజైనర్‌గా పాపులర్ అయింది. తన క్రియేటివిటీ అందర్నీ కట్టిపడేసింది. అంతేకాదు తన జీవిత కథ ఆధారంగా రూపొందించిన డాక్యు-సిరీస్ మసాబాతో నటిగా అవతరించింది. ఇటీవల నటుడు సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుంది. తాజాగా తాను తల్లికాబోతున్నానని ఇన్‌స్టా ద్వారా ప్రకటించింది. ‘‘మా జీవితాల్లోకి రెండు బుల్లి బుల్లి అడుగులు రాబోతున్నాయి.. మమ్మల్ని ఆశీర్వ దించండి, అలాగే మీ ప్రేమను, కొద్ది బనానా చిప్స్‌ను(plain salted ONLY)’’ అంటూ తాను తల్లికాబోతున్న విషయాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసింది. అంటే తనకు బనానా చిప్ప్ తినాలనిపిస్తోందని చెప్పకనే చెప్పింది. కొన్ని ఎమోజీలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా గతంలో మసాబా వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. చెప్పినట్టే చేసిందంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta) సింగిల్ పేరెంటింగ్ అనే కాన్సెప్ట్ మోడ్రన్‌గా ఉన్నా, పెళ్లి కాకుండానే బిడ్డను కనడం నార్మల్‌గా మారినా, , తాను అలా చేయకూడదనుకుంటున్నానని ఆమె వెల్లడించింది. ‘ఆధునిక మహిళగా పెళ్లి చేసుకుని బిడ్డనుకనే ధైర్యం ఉందా? అంటే .అస్సలు లేదు. ఎందుకంటే అంత ఒత్తిడిని తీసుకోవాలని లేదు. అలాంటి వాతావరణంలో బిడ్డను ఉంచాలని తాను భావించడం లేదని గతంలో ఒక ఇంటర్వ్యలో పేర్కొంది. పెళ్లి కాకుండా పుట్టిన తనకి చాలా మోడ్రన్ అనే ట్యాగ్ వేశారు. ఆధునికంగా ఉండటం చాలా అద్భుతమే కానీ తాము చాలా అవమానాల్ని ఎదుర్కొన్నామని గుర్తు చేసుకుంది. కాగా బాలీవుడ్ నటి, నీనా గుప్తా , వెస్ట్ ఇండియన్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ప్రేమ కథ అందరికి సుపరిచితమే.ఈ జంటకు ప్రేమ ఫలితమే మసాబా గుప్తా. అయితే పెళ్లికాకుండానే నీనా బిడ్డను కనడం అప్పట్లో పెద్ద సంచలనం. నీనా, రిచర్డ్స్‌ని పెళ్లి చేసుకోలేదు. కానీ ఒంటరిగానే తన కుమార్తె మసాబాను పెంచి పెద్ద చేసి ప్రయోజకురాల్ని చేసింది. -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రముఖ నటి కూతురు..!
ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురిగా మసాబా గుప్తా అందరికీ సుపరిచితమే. ప్యాషన్ డిజైనర్ కెరీర్ ప్రారంభించిన ఆమె నటిగాను గుర్తింపు తెచ్చుకుంది. 2023లో రెండోసారి వివాహాబంధంలోకి అడుగుపెట్టిన మసాబా.. తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. మీ అందరీ ఆశీర్వాదాలు కావాలంటూ ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ తారలు కరీనా కపూర్, షెహనాజ్ గిల్, కుషా కపిల, తాహిరా కశ్యప్, సారా టెండూల్కర్, బిపాసా బసు, పరిణీతి చోప్రా, అనన్య పాండే, కృతి సనన్ అభినందనలు తెలిపారు. కాగా.. మాసాబా గుప్తా, సత్యదీప్లు కొన్నేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ తర్వాత 2023లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకలో వారి సన్నిహితులు, ఆమె తండ్రి మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్, కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. కాగా.. గతంలో టాలీవుడ్ నిర్మాత మధు మంతెనను వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయారు. సత్యదీప్ సైతం గతంలోనే అదితి రావు హైదరీని వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. ఇటీవలే ఆదితిరావు హైదరీ- సిద్ధార్థ్ ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta) -
'తప్పుడు మనుషులతో డేటింగ్ చేశా.. కూతురికి పెళ్లి చేయడం నా తప్పే'
పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు.. కానీ ఇప్పుడు పెళ్లిళ్లు ఎక్కువకాలం నిలకడగా ఉండట్లేదు. కొంతకాలానికే విడాకులు ఇచ్చేసుకుంటున్నారు. కొందరైతే పెళ్లి చేసుకోవడం, మళ్లీ విడాకులు ఇచ్చుకోవడం దేనికని.. సహజీవనానికి జై కొడుతున్నారు. ఈ రెండు రకాల పరిస్థితులు బాలీవుడ్ నటి నీనా గుప్తాకు ఎదురయ్యాయి. నీనా గుప్తా.. భార్యాబిడ్డలున్న క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ప్రేమించింది. వీరి ప్రేమకు గుర్తుగా 1989లో మసాబా పుట్టింది. వీరి బంధం పెళ్లి దాకా వెళ్లకుండానే బ్రేకప్ అయింది. సింగిల్ పేరెంట్‌గా మసాబాను పెంచి పెద్ద చేసింది నీనా. ఆ తర్వాత 2008లో వివేక్ మెహ్రాను పెళ్లాడింది. సలహాలివ్వడానికి నేను కరెక్ట్ కాదు మసాబా 2015లో నిర్మాత మధు మంతెనను పెళ్లాడగా 2019లో విడాకులు తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి 27న నటుడు సత్యదీప్ మిశ్రాను రెండో పెళ్లి చేసుకుంది మసాబా. ఇతడికి కూడా ఇది రెండో పెళ్లే.. సత్యదీప్ గతంలో హీరోయిన్ అదితి రావును పెళ్లాడి, తర్వాత ఆమెకు విడాకులిచ్చేశాడు. అయితే మసాబా మొదటి పెళ్లి ఆమె తల్లి బలవంతం మీదే జరిగిందట. ఈ విషయాన్ని తాజాగా నీనా గుప్తా వెల్లడించింది. 'రిలేషన్షిప్ గురించి సలహాలివ్వడానికి నేను సరైన వ్యక్తిని కాదు. ఎందుకంటే నేను ఎప్పుడూ తప్పుడు మనుషులతోనే డేటింగ్ చేశాను. కాబట్టి నేను మంచి సలహాలివ్వలేను. అయితే మసాబా విషయంలో మాత్రం ఓ పొరపాటు చేశాను. పెళ్లి చేసి తప్పు చేశా తను మొదట పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. కాబోయే భర్తతో సహజీవనం చేయాలనుకుంది. అందుకు నేను ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకున్నాకే తనతో కలిసి ఉండాలని చెప్పాను. అదే నేను చేసిన తప్పు. పెళ్లయిన కొంతకాలానికి వారు విడాకులు తీసుకున్నారు. అప్పుడు నేను కుంగిపోయాను, జీర్ణించుకోలేకపోయాను. వాళ్ల జంటను చూసి మేము ముచ్చటపడేవాళ్లం. ఇప్పటికీ నా మాజీ అల్లుడి మీద నాకు అభిమానం ఉంది. విడాకుల వార్త చెప్పగానే నోట మాట రాలేదు. కానీ అది వారి జీవితం.. కాబట్టి నేను ఏమీ చేయలేకపోయాను' అని చెప్పుకొచ్చింది నీనా గుప్తా. చదవండి: రైతు బిడ్డ సహా ఏడుగురు నామినేషన్స్‌లో.. ఆ ఒక్కరు మాత్రం సేఫ్! -
మోడర్న్ డ్రెసెస్ కంటే.. చీరకట్టు అంటేనే ఇష్టం: హీరోయిన్
‘నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్నా’ అనే క్రేజీ డైలాగ్‌తో అంతే క్రేజ్ సంపాదించుకున్న ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి. అంతటి అందానికి మ్యాచ్ అయ్యే స్టయిల్‌ను క్రియేట్ చేస్తున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే.. ఆర్ట్ బై సియా.. ఇదొక ఆన్లైన్ జ్యూలరీ స్టోర్. ప్రముఖ డిజైనర్స్ అందించే అందమైన ఆభరణాలన్నీ ఇక్కడ లభిస్తాయి. కొత్తతరం డిజైనర్స్‌కి ప్రాముఖ్యతనివ్వడంతో, డిజైన్స్ అన్నింటిలోనూ న్యూ స్టయిల్ ప్రతిబింబిస్తోంది. అదే దీనికి యాడెడ్ వాల్యూ. పేరుకు దేశీ బ్రాండ్ అయినా ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. మొదట ఆన్లైన్లోనే కొనే వీలుండేది. ఈ మధ్యనే హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో స్టోర్ ఓపెన్ చేశారు. మసాబా గుప్తా ఇప్పుడున్న టాప్ మోస్ట్ డిజైనర్స్‌లో మసాబా గుప్తానే ఫస్ట్. 2009లో ‘హౌస్ ఆఫ్ మసాబా’ పేరుతో బ్రాండ్‌ను ప్రారంభించింది. నాణ్యత, సృజన బ్రాండ్ వాల్యూగా సాగిపోతున్న ఆమె డిజైన్స్ అంతర్జాతీయ ఖ్యాతి గడించాయి. ప్రపంచ వ్యాప్త సెలబ్రిటీస్ ఆమె బ్రాండ్‌కు అభిమానులుగా మారారు. మసాబా ఎవరి కూతురో తెలుసు కదా.. ప్రముఖ నటి నీనా గుప్తా, క్రికెట్ లెజెండ్ వివ్ రిచర్డ్స్‌ల తనయ. పేరెంట్స్ పేరు ప్రఖ్యాతులను తన కెరీర్‌కి పునాదిగా మలచుకోకుండా కేవలం తన క్రియెటివిటీనే పెట్టుబడిగా పెట్టి కీర్తినార్జించిన ఇండిపెండెంట్ డిజైనర్.. అంట్రపెన్యూర్ ఆమె! బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: మసాబా గుప్తా ధర: రూ. 18,000 జ్యూలరీ బ్రాండ్: ఆర్ట్ బై సియా ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. మోడర్న్ డ్రెసెస్ కంటే, ట్రెడిషనల్ వేర్ అంటేనే ఎక్కువ ఇష్టం. అందులోనూ చీరకట్టు అంటే మరీనూ! – లావణ్య త్రిపాఠి -దీపిక కొండి -
అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే..
హీరోయిన్ అదితి రావ్ హైదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుందామె. ప్రస్తుతం ఆమె అవకాశాలు లేకపోవడంతో వెండితెరపై ఆమె సందడి కరువైంది. అయినప్పటికీ ఆమె హీరో సిద్ధార్థ్‌తో డేటింగ్ రూమర్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తోంది. అంతేకాదు ఇటీవల యంగ్ హీరో శర్వానంద్ నిశ్చితార్థంతో సిద్ధార్థ్-అదితిలు జంటగా కనిపించారు. దీంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే అప్పటికే అదితికి పెళ్లై విడాకులు అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రాను గతంలో ఆమె వివాహం చేసుకుంది. అయితే ఆ బంధం మున్నాళ్ల ముచ్చటే అయ్యింది. 2009లో వీరి వివాహం జరగ్గా.. 2013లో వీరిద్దరూ విడిపోయారు. అయితే ఇటీవల ఆమె మాజీ భర్త సత్యదీప్ మిశ్రా బాలీవుడ్ నటి, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు సత్యదీప్ మిశ్రా. ఈ సందర్భంగా తన మాజీ భార్య అదితిని ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చదవండి: నటుడిగా బ్రహ్మానందం ఎన్ని వందల కోట్లు సంపాదించాడో తెలుసా? ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘అదితితో నా రిలేషన్ కారణంగా ప్రేమపై నాకు విరక్తి కలిగింది. మరోసారి ప్రేమ, పెళ్లి అంటేనే భయం వేసింది. బ్రేకప్ అనుభవం ఎదురైన వాళ్లు మళ్లీ రిలేషన్, ప్రేమ అంటే భయపడతారు. కానీ ధైర్యంగా ముందడుగు వేస్తేనే మనం కోల్పోయినవి పొందగలం’ అని మిశ్రా చెప్పుకొచ్చాడు. ఇక అనంతరం మసాబాతో ప్రేమ, రెండో పెళ్లిపై స్పందిస్తూ.. ‘మా పెళ్లి చాలా సింపుల్‌గా జరగాలని అనుకున్నాం. అందుకే కొద్ది మంది సన్నిహితులు, బంధువుల మధ్య రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. తర్వాత ఇండస్ట్రీ వాళ్ల కోసం చిన్న పార్టీ ఏర్పాటు చేశాం. ఎందుకంటే మా బంధాన్ని మేం రహస్యంగా ఉంచాలనుకోలేదు. ఎందుకంటే సీక్రెట్స్ అనేవి రిలేషన్స్‌ని ప్రభావితం చేస్తాయని నేను నమ్ముతాను. బంధాన్ని సొంతం చేసుకోవాలి.. ఒపెన్‌గా ఉండాలి’ అని పేర్కొంది. ఇక ఆయన సమాధానం విన్న కొందరు నెటిజన్లు ఇది పరోక్షంగా అదితిగా కౌంటర్ ఇచ్చాడా? అని అభిప్రాయ పడుతున్నారు. కాగా ప్రస్తుతం అదితి సిద్ధార్థ్‌తో సీక్రెట్ డేటింగ్లో ఉంది. ఇప్పటి వరకు తమ రిలేషన్‌ని అదితి కానీ, సిద్ధార్థ్ కానీ బయట పెట్టలేదు. ఇదిలా ఉంటే మసాబాకు కూడా ఇది రెండో వివాహమనే విషయం తెలిసిందే. చదవండి: యువత పాశ్చాత్య పోకడలపై కళాతపస్వీ విశ్వనాథ్ ఏమన్నారంటే.. View this post on Instagram A post shared by Masaba (@masabagupta) View this post on Instagram A post shared by Masaba (@masabagupta) View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019