breaking news
-
లగ్జరీ బంగ్లాను విక్రయించిన ఇషా అంబానీ? ఎవరు కొన్నారు?
రిలయన్స్ అధినేత ముఖేష్, నీతా అంబానీ ముద్దుల తనయ, వ్యాపారవేత్త ఇషా అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రిలయన్స్ రీటైల్ వ్యాపారాన్ని విజయ వంతంగా నడిపిస్తూ తండ్రికి తగ్గ తనయగా వ్యాపారంలో రాణిస్తోంది. తాజాగా ఇషా, భర్త ఆనంద్ పిరమల్ ఇంటికి సంబంధించి ఒక ముఖ్య సమాచారం వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని ఇషా ఖరీదైన ఇంటిని ప్రముఖ హాలీవుడ్ జంట కొనుగోలు చేసిందట. ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ, ఈ డీల్ మాత్రం హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇషా-ఆనంద్ పిరమల్ లాస్ ఎంజేల్స్లోని విలాసవంతమైన భవనాన్ని విక్రయించినట్టు తెలుస్తోంది. దీన్ని అమెరికన్ టాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ బెన్ అఫ్లెక్ జంట కొనుగోలు చేసిందట. 38వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఇంటిని 'క్వీన్ ఆఫ్ డ్యాన్స్' జెలో,బెన్ దంపతులు సొంతం చేసుకున్నట్టు తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇందులో 12 బెడ్రూమ్లు, 24 బాత్రూమ్లు ఉన్నాయి. ప్రత్యేక జిమ్‌లు, స్పాలు, సెలూన్లు, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ లాంటి స్పెషల్ వసతులు కూడా లగ్జరీ హౌస్‌లో కొలువు దీరాయి. దాదాపు 61 మిలియన్ డాలర్ల (రూ. 508కోట్లు) ఇంటిని కొనుగోలు చేశారని కూడా ఇన్‌స్టా ఫ్యాన్ పేజీ నివేదించింది. కాగా ఇషాకు ఈ ఇంటితో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైందే అని చెప్పవచ్చు. ఇషా గర్భంతో ఉన్నపుడు తల్లి నీతాతో కలిసి ఆ ఇంట్లోనే గడిపింది. ఇద్దరు పిల్లలకు ఈ ఇంట్లోనే జన్మనిచ్చింది. అయితే ఈ ఇల్లు విక్రయించడానికి గల కారణాలు ఏంటి అనేదానిపై స్పష్టత లేదు. -
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ వేడుక.. ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
సినీరంగంలో అందించే ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. అమెరికా లాస్ ఎంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో మార్చి 10న 96వ ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన అకాడమీ అవార్డ్స్ వేడుకలను హాస్యనటుడు జిమ్మీ కిమ్మెల్ నాల్గవ సారి హోస్ట్ చేయనున్నారు. ఆదివారం రాత్రి జరగనున్న ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని భారతీయులకు లైవ్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించారు. తాజాగా ఈ ఈవెంట్‌ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. భారతీయ కాలమానం ప్రకారం మార్చి 11న సోమవారం ఉదయం నాలుగు గంటలకు ఆస్కార్ వేడుకను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆస్కార్‌కు నామినేట్ అయిన చిత్రాలతో వీడియోను షేర్ చేసింది. ఈ ఏడాది అవార్డులకు కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, ఓపెన్‌హైమర్, బార్బీ, మాస్ట్రో, పూర్ థింగ్స్, అమెరికన్ ఫిక్షన్ వంటి లాంటి పోటీ పడుతున్నాయి. ఇండియా నుంచి పోటీలో ‘టు కిల్ ఏ టైగర్’ ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్‌కు ‘టు కిల్ ఏ టైగర్’ చిత్రం నామినేట్ అయింది. భారత్‌లోని ఓ గ్రామంలో చిత్రీకరణ జరుపుకున్న ‘టు కిల్ ఏ టైగర్’ ఆస్కార్ బరిలో నిలిచింది. నిషా పహుజ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా.. గతేడాది ఇండియాకు రెండు ఆస్కార్ అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన ఆస్కార్ వేడుకల్లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్‌కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కింది. అలాగే ది ఎలిఫెంట్ విష్పరర్స్ అనే డాక్యుమెంటరీ సిరీస్ సైతం ప్రతిష్ఠాత్మక అవార్డ్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. -
జోగానీ బ్రదర్స్ కేసు : బిజినెస్ టైకూన్‌కి వేల కోట్ల షాక్!
భారతదేశానికి చెందిన ఐదుగురు సోదరుల మధ్య రెండు దశాబ్దాలుగా సాగిన జటిలమైన కుటుంబ స్థిరాస్తి వివాదంలో లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టులో నలుగురు తోబుట్టువులకు తీర్పునిచ్చింది. బిజినెస్ టైకూన్ హరేష్ జోగాని తన నలుగురు సోదరులకు దాదాపు 20వేల కోట్ల రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అమెరికా చరిత్రలో ఇప్పటివరకు కోర్టు ప్రకటించిన ఇదే అతిపెద్దనష్టపరిహారం అని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. జోగాని వర్సెస్ జోగానిగా పాపులర్ అయిన 21 ఏళ్ల నాటి కేసును విచారించిన కోర్టు తాజా తీర్పు వెలువరించింది. హరేష్ జోగానీపై, అతని సోదరులు శశికాంత్, రాజేష్, చేతన్ , శైలేష్ జోగానీఆస్తి పంపకాల విషయమై సుదీర్ఘ భాగస్వామ్యాన్ని ఉల్లంఘించాడనే ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఐదు నెలల విచారణ త తాజా 7 బిలియన్ డాలర్ల విలువైన తీర్పునిచ్చింది. సోదరులకు హరీష్ 2.5 బిలియన్ల డాలర్ల (రూ. 20 వేల కోట్ల) నష్టపరిహారం చెల్లించాలని, వందల కోట్ల డాలర్ల విలువైన దాదాపు 17,000 అపార్ట్మెంట్లతో కూడిన దక్షిణ కాలిఫోర్నియా రియల్ ఎస్టేట్ ఆస్తిని వాటాల ప్రకారం విభజించాలని ఆదేశించింది. భారతదేశంలోని గుజరాత్‌కు చెందిన జోగాని కుటుంబం, ఐరోపా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం ఉత్తర అమెరికాలో ప్రపంచ వజ్రాల వ్యాపారంతో రాణించింది. అలాగే శశికాంత్ లేదా "శశి" జోగాని 1969లో 22 ఏళ్ల వయస్సులో కాలిఫోర్నియాకు వెళ్లాడు. అక్కడ సొంతంగా రత్నాల వ్యాపారంలో సోలో సంస్థను ప్రారంభించి సక్సెస్ అయ్యాడు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చి బాగా విస్తరించాడు కూడా. అయితే 1990ల ప్రారంభంలో మాంద్యం కారణంగా వీరు ఆస్తులు నష్టపోయారు. దీంతో పాటు 1994 నార్త్‌రిడ్జ్ భూకంపం సందర్భంగా శశికి చెందిన భవనం ఒక దానిలో 16 మంది చనిపోవడంతో ఇది మరింత ముదిరింది. ఈ క్రమంలో శశికాంత్ తన సోదరులను బోర్డు లోకి తీసుకువచ్చి, వారిని తన సంస్థ భాగస్వాములుగా చేసుకున్నాడు. రియల్ ఎస్టేట్హోల్డింగ్ ద్వారా దాదాపు 17,000 అపార్ట్మెంట్ యూనిట్లను నిర్మించారు. దీని తర్వాతే వివాదం మొదలైంది. హరేష్ మేనేజ్మెంట్ నుండి తనను బలవంతంగా తొలగించి, తమకు రావాల్సిన దానిని అడ్డు కున్నాడని 2003లో శశి జోగాని ఫిర్యాదు చేశాడు. అయితే రాతపూర్వక భాగస్వామ్యం ఏదీ లేదని హరేష్ జోగాని వాదించాడు. విచారణ తర్వాత హరేష్ మౌఖిక ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు జ్యూరీ గుర్తించింది. 170కి పైగా అపార్ట్మెంట్ భవనాలున్న పోర్ట్‌ఫోలియోకు హరేష్ జోగాని ఏకైక యజమాని కాదని, ఇందులో శశికాంత్(72) కు 50 శాతం , హరేష్ 24 శాతం, రాజేష్ 10 శాతం, శైలేష్ 9.5 శాతం, చేతన్ 6.5 శాతం వాటాలు ఉన్నట్టు జ్యూరీ నిర్ధారించింది. ఇంకా చర్చలు జరుపుతున్నందున,ప్రతివాది హరేష్ జోగాని తరపు న్యాయవాది రిక్ రిచ్మండ్ వ్యాఖ్యానించడానికి నిరాకరించినట్టు సమాచారం. -
Megastar Chiranjeevi: ఇంతకంటే అవార్డ్ ఏముంటుంది?: మెగాస్టార్ ఎమోషనల్ స్పీచ్!
-
Grammy Awards 2024: భారత్‌కు ‘గ్రామీ’ సంబరం
ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారు. 2024 సంవత్సరానికి గాను ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ఏంజెలిస్ నగరంలో ఆదివారం రాత్రి ఈ పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వగణేశ్ వినాయక్‌రామ్‌ను గ్రామీ అవార్డులు వరించాయి. జాకీర్ హుస్సేన్‌కు మొత్తం మూడు, రాకేశ్ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం. న్యూఢిల్లీ: ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారు. ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ఏంజెలెస్లో ఆదివారం పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహాదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వగణేశ్ వినాయక్‌రామ్‌ను గ్రామీలు వరించాయి. జాకీర్ హుస్సేన్కుమొత్తం మూడు, రాకేశ్ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం. ‘శక్తి’ అనే సంగీత బృందం 2023 జూన్‌లో విడుదల చేసిన ‘దిస్ మూమెంట్’ అనే ఆల్బమ్‌కు గాను శంకర్ మహాదేవన్, గణేశ్ రాజగోపాలన్, సెల్వగణేశ్ వినాయక్రామ్, జాకీర్ హుస్సేన్‌కు ఒక్కొక్కటి చొప్పున గ్రామీలు లభించాయి. ‘దిస్ మూమెంట్’ ఆల్బమ్‌కు గాను శక్తి బృందం ‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్’ కేటగిరీలో గ్రామీని గెలుచుకుంది. జాకీర్ హుస్సేన్‌కు దీంతోపాటు మరో రెండు గ్రామీలు దక్కాయి. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఫెర్ఫార్మెన్స్(పాష్తో), బెస్ట్ కాంటెపరరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్(యాజ్ వీ స్పీక్) కేటగిరీ కింద రెండు గ్రామీలు ఆయన వశమయ్యాయి. పాష్తో, యాజ్ వీ స్పీక్ ఆల్బమ్‌లకు గాను చౌరాసియాకు రెండు గ్రామీలు లభించాయి. గ్రామీ విజేతలను ప్రధాని మోదీ ప్రశంసించారు. టేలర్ స్విఫ్ట్‌కు ‘ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఈ ఏడాది 80కి పైగా కేటగిరీల్లో గ్రామీ పురస్కారాలు ప్రదానం చేశారు. ‘మిడ్నైట్స్’ ఆల్బమ్కుఅమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్‌కు ‘ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్’ లభించింది. ఈ కేటగిరీ కింద గ్రామీ అవార్డు అందుకోవడం ఆమెకిది నాలుగోసారి! మిలీ సైరస్కు రికార్డు ఆఫ్ ద ఇయర్ (ఫ్లవర్స్), బిల్లీ ఐలి‹Ùకు సాంగ్ ఆఫ్ ద ఇయర్ (వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్?) గ్రామీలు దక్కాయి. ‘బెస్ట్ న్యూ ఆర్టిస్టు’ విభాగంలో విక్టోరియా మాంట్ గ్రామీని సొంతం చేసుకున్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019