breaking news
-
రజినీకాంత్ కూతురిగా ఛాన్స్ కొట్టేసిన స్టార్ హీరోయిన్
సూపర్‌స్టార్ రజినీకాంత్ చిత్రంలో విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలు శృతిహాసన్ నటించబోతున్నట్లు తాజా సమాచారం. రజినీకాంత్ ప్రస్తుతం జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో 'వేట్టైయాన్' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా దీని తరువాత తన 171వ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేయనున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి 'కళుగు' అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ నెల 22వ తేదీన చిత్ర టైటిల్‌ను, టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఇటీవల దర్శకుడు లోకేష్ కనకరాజ్ చెప్పారు. అలాగే ఈ చిత్రం షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుందన్నారు. కాగా తాజాగా ఇందులో రజినీకాంత్ కూతురిగా శృతిహాసన్ నటించనున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. కోలీవుడ్‌లో సినీ దిగ్గజాలైన కమల్ హాసన్, రజినీకాంత్ కలిసి నటించి 25 ఏళ్లు అవుతోంది. అలాంటిది ఇప్పుడు కమల్ హాసన్ కూతురు రజినీకాంత్ తాజా చిత్రంలో ఆయనకు కూతురుగా నటించనున్నడం విశేషమే. మరో విషయం ఏమిటంటే శృతిహాసన్ తమిళంలో నటించి చాలా కాలం అవుతోంది. లాభం చిత్రం తరువాత ఈమె ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. కాగా సుమారు మూడేళ్ల తరువాత ఈ బ్యూటీకి కోలీవుడ్‌లో నటించే అవకాశం వచ్చిందన్న మాట. అయితే ఇటీవల ఈమె తన తండ్రి కమల్ హాసన్ రాసి, రూపొందించిన ఇనిమేల్ అనే పాట ఆల్బమ్‌లో దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో కలిసి నటించిన విషయం తెలిసిందే. కాగా శృతిహాసన్, రజినీకాంత్ 171 చిత్రంలో నటించే విషయమై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
లోకేష్ కనగరాజ్, లారెన్స్ కాంబినేషన్లో సినిమా ప్రకటన
కోలీవుడ్‌లో వరుస హిట్లు కొడుతూ దూసుకుపోతున్నాడు లోకేష్ కనగరాజ్.. ఆయన నుంచి సినిమా ప్రకటన వచ్చిందంటే చాలు భారీగా అంచనాలు ఉంటాయి. ఈ క్రమంలో ఖైదీ, విక్రమ్, మాస్టర్ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ క్రియేట్ చేసి సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సినిమా ఛాన్స్ దక్కించుకున్నాడు. తాజాగా లోకేష్ కనగరాజ్ కొత్త సినిమాను ప్రకటించాడు. దానికి టైటిల్ కూడా 'బెంజ్' అని ఫిక్స్ చేశాడు. అందులో రాఘవ లారెన్స్ హీరోగా నటుస్తున్నాడు. అయితే ఈ క్రేజీ సినిమాను లోకేష్ డైరెక్ట్ చేయడం లేదు. కేవలం కథను మాత్రమే అందిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రాన్ని బక్యరాజ్ కన్నన్ (రెమో) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఉండదట.. లోకేష్ డైరెక్ట్ చేసిన ఖైదీ సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర ఉండదు అనే విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ నుంచి మరో సినిమా ప్రకటన కూడా తాజాగా వెలువడింది. హంటర్ అనే టైటిల్‌తో ఒక పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కోలీవుడ్‌లో కత్తి సినిమాను డైరెక్ట్ చేసిన వెంకట్ మోహన్ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు. కత్తి సినిమా తెలుగులో ఖైదీ 150 పేరుతో విడుదలైన విషయం తెలిసిందే. హంటర్ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
రజనీకాంత్ కళుగు?
రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌ను ఈ నెల 22న అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ పలు పేర్లు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు ‘కళుగు’ (తెలుగులో ‘గద్ద’ అని అర్థం) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. మరి... ఇదే టైటిల్ ఖరారు అవుతుందా? లేక మరో టైటిల్ ఫిక్స్ అవుతుందా అనేది తెలియాలంటే ఈ నెల 22 వరకు ఆగాల్సిందే. ఈ చిత్రం షూటింగ్ జూన్ చివర్లో లేదా జూలై మొదటి వారంలో ్ర΄ారంభం కానుందని తెలిసింది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. -
రజనీకాంత్ 171వ చిత్ర టైటిల్ ఇదేనా?
నటుడు రజనీకాంత్ చిత్రం అంటేనే ప్రేక్షకుల్లో ఉండే క్రేజే వేరు. ఇటీవల జైలర్ వంటి అదిరిపోయే హిట్ చిత్రానిచ్చిన ఈయన ప్రస్తుతం జైభీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో వేట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులో రజనీకాంత్ రిటైర్డ్ పోలీస్ అధికారిగా పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. కాగా తదుపరి ఈయన తన 171వ చిత్రానికి రెడీ అవుతున్నారు. దీనికి లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం గురించే పలు రకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రజనీకాంత్ గెటప్ చూస్తేనే ఇదేదో డాన్ కథా చిత్రంగా ఉంటుందనిపించేలా ఉంది. వైరెటీగా రజనీకాంత్ చేతులకు వాచీలతో కూడిన భేడీలు వేసిన ఫొటో ఉన్న పోస్టర్‌కు ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. దీంతో ఇది టైమ్ ట్రావెల్ కథాంశంతో రూపొందనుందనే ప్రచారం జరిగింది. అయితే అలాంటి కథ కాదని దర్శకుడు లోకేశ్ కనకరాజ్ స్పష్టం చేశారు. అంతే కాకుండా ఇది మాదకద్రవ్యాలు, కిడ్నాప్‌కు సంబంధించిన కథ కూడా కాదని చెప్పారు. దీంతో ఈ చిత్ర కథపై మరింత ఆసక్తి నెలకొంది. చిత్రం టైటిల్‌ను ఈ నెల 22వ తేదీన వెల్లడించనున్నట్లు, షూటింగ్‌ను జూన్‌లో ప్రారంభించనున్నట్లు దర్శకుడు ఇటీవల ఓ భేటీలో పేర్కొన్నారు. కాగా విక్రమ్ చిత్రంతో నటుడు కమలహాసన్‌కు సంచలన విజయాన్ని అందించిన లోకేశ్‌కనకరాజ్, ఇప్పుడు రజనీకాంత్‌ను చాలా డిఫరెంట్‌గా చూపించడానికి యత్నిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి 'కళుగు' అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో రజనీకాంత్ విలన్‌గా నటించనున్నారనే ప్రచారం మరోపక్క సాగుతోంది. కాగా 'కళుగు' అంటే ఆంగ్లంలో 'ఈగిల్' అని అర్థం. కాగా ఇదే టైటిల్‌తో రజనీకాంత్ 1981లో కథానాయకుడిగా నటించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. -
లోకేష్ కనగరాజ్‌తో లారెన్స్ సినిమా.. నయన్ ఒప్పుకుంటుందా?
తమిళసినిమా: కోలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ దర్శకుడు ఎవరంటే ఠక్కున వచ్చే బదులు లోకేష్ కనకరాజ్ అనే. ఈయన చేసింది ఇప్పటికి అక్షరాలా ఐదు చిత్రాలే. అయితే అన్నీ వసూళ్ల వర్షం కురిపించినవే. మా నగరంతో దర్శకుడిగా పరిచయం అయిన ఒక బ్యాంకు ఉద్యోగి లోకేష్ కనకరాజ్. ఈ చిత్రం విజయం సాధించడంతో ఖైదీ చిత్రాన్ని కార్తీ హీరోగా చేశారు. అదీ సంచలన విజయాన్ని సాధించింది. ఆ తరువాత విజయ్ కథానాయకుడిగా, విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా చేసిన మాస్టర్ చిత్రం వసూళ్లు కొల్లగొట్టింది. ఆ తరువాత కమలహాసన్ హీరోగా విక్రమ్ 2 చిత్రాన్ని చేశారు. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నమోదైంది. ఇటీవల మరోసారి విజయ్ హీరోగా చేసిన లియో చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకున్నా, వసూళ్ల విషయంలో ఏ మాత్రం తగ్గలేదు. ఇలా స్టెప్ బై స్టెప్ స్టార్ హీరోలతో పని చేస్తున్న లోకేష్ కనకరాజ్ ఇప్పుడు రజనీకాంత్ కథానాయకుడిగా ఆయన 171 చిత్రాన్ని చేయడానికి సిద్ధం అయ్యారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా చిత్రంలో భారీ అంచనాలను పెంచేస్తోంది. ఇంతకు ముందెప్పుడూ చూడని రజనీకాంత్‌ను ఈ చిత్రంలో చూస్తారని దర్శకుడు చెబుతున్నారు. చిత్ర టైటిల్‌ను ఏప్రిల్ 22వ తేదీన, షూటింగ్‌ను జూన్ నెలలో మొదలెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇకపోతే లోకేష్ కనకరాజ్ చాలా మంది దర్శకుల తరహాలో జీ స్క్వాడ్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్లో తన శిష్యులు, సన్నిహితులతో చిత్రాలు నిర్మిస్తానని చెప్పారు. ఆ విధంగా ఉరియడి చిత్రం ఫేమ్ విజయకుమార్ హీరోగా అబ్బాస్ ఏ.రఘుమాన్ దర్శకత్వం వహించిన ఫైట్ క్లబ్ చిత్రాన్ని గత ఏడాది చివరిలో విడుదల చేశారు. తాజాగా రత్నకుమార్ దర్శకత్వంలో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రత్నకుమార్ ఇంతకు ముందు మేయాదమాన్, ఆడై, కులు కలు వంటి చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. కాగా తాజా చిత్రంలో నటుడు, నృత్యదర్శకుడు రాఘవ లారెన్స్ హీరోగా నటించనున్నారు. ఇది హార్రర్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఈ తరహా చిత్రాలే లారెన్స్‌ను హీరోగా నిలబెట్టాయన్నది తెలిసిందే. ఇకపోతే ఇందులో ప్రధాన పాత్రలో నటి నయనతారను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ చిత్ర కథను దర్శకుడు లోకేష్ కనకరాజ్ రాయడం విశేషం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే నయనతార నటుడు లారెన్స్ సరసన నటించడానికి ఒకే అంటారా? అన్న చర్చ జరుగుతోంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019