breaking news
-
కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా
ఢిల్లీ: లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి(ఏప్రిల్ 24) వాయిదా పడింది. బుధవారం తిరిగి వాదనలు కొనసాగనున్నాయి. మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గంటన్నర సేపు వాదనలు వినిపించింది. ఈడీ వాదనలు: కవితను అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పలేదు మేము కోర్టు ధిక్కరణకు పాల్పడలేదు అరెస్టు చేయబోమని మేము కోర్టుకు అండర్‌టేకింగ్ ఇవ్వలేదు కేవలం పది రోజుల వరకు సమన్స్ ఇవ్వబోమని చెప్పాం ఈ అంశంపై కవిత తాను వేసిన పిటిషన్ ఉపసంహరించుకుంది , అరెస్టు ప్రక్రియ అంతా చట్టబద్దంగా జరిగింది సెక్షన్ 19 ప్రకారం మాకు అరెస్టు చేసే అధికారం ఉంది ఈ స్కామ్‌లో సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చింది కవిత ఆదేశాల మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ 25 కోట్ల రూపాయలు ఇచ్చారు దీనిపై వారు వాంగ్మూలం ఇచ్చారు పాలసీని సౌత్ గ్రూప్‌నకు అనుకూలంగా మార్చారు ఇండో స్పిరిట్ కంపెనీ ద్వారా లంచాల సొమ్ము కవిత తిరిగి రాబట్టుకున్నారు ఈడీ జాతీయ దర్యాప్తు సంస్థ, దీనికి దేశమంతా పరిధి ఉంది ట్రాన్సిట్ రిమాండ్‌లో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు అరెస్టు చేసిన 24 గంటల్లో కవితను కోర్టులో హాజరుపరిచాం పీఎంఎల్ఎ ప్రత్యేక చట్టం కనుక ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు ఈ చట్టం కింద మహిళలకు ప్రత్యేక హక్కులు ఏమీ లేవు అరుణ్ పిళ్లై కవితకు బినామీ ఇండో స్పిరిట్ లో 33.5 అరుణ్ పిళ్లై పేరు మీద కవిత తీసుకున్నారు ఈ వ్యవహారంలో కవిత, కేజ్రీవాల్ మధ్య రాజకీయ అవగాహన ఉంది డీల్ లో భాగంగా 100 కోట్లు ఇచ్చినట్లు దినేష్ అరోరా దర్యాప్తులో అంగీకరించారు బుచ్చి బాబు వాట్సాప్ చాట్‌లో కూడా ఈ విషయం బయటపడింది ఆర్థిక నేరాల కుట్ర గుట్టుగా జరుగుతుంది ఈ కేసుల్లో నేరుగా నగదు వ్యవహారాల ఆధారం దొరికే అవకాశం ఉండదు వివిధరకాల వ్యక్తుల స్టేట్మెంట్స్, ఇతర సాక్షాల ఆధారంగా అక్రమ సొమ్ము ను గుర్తించవచ్చు గతంలో పై కోర్టులు తీర్పు ఇచ్చాయి ఈ కేసు ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు దశలోనే ఉంది కవిత ఈ కేసులో పూర్తి స్థాయిలో సంబంధం ఉందని అనే దానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి -
లిక్కర్ కేసు: కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. కేజ్రీవాల్‌ను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరుపరిచారు. తిరిగి మే 7న కేజ్రీవాల్‌ను తమ ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. కేజ్రీవాల్‌ను లిక్కర్ కేసులో మార్చ్ 21న ఢిల్లీలోని అధికారిక నివాసం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. కాగా, తనకు ప్రైవేట్ వైద్యులతో ప్రత్యేక చికిత్స కావాలని కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు ఇప్పటికే కొట్టివేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు -
‘సీఎం కేజ్రీవాల్‌ను జైల్లో చంపేందుకు కుట్ర’.. వ్యాఖ్యలపై బీజేపీ స్పందన
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను జైలులో హతమార్చేందుకు కుట్ర పన్నారన్న ఆమ్ ఆద్మీ నేతల ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆప్ వ్యాఖ్యలు పచ్చి అబద్ధమని కొట్టిపారేసింది. ఇలాంటి సంచలన ప్రకటనలు చేయడం మానుకోవాలని బీజేపీ హితువు పలికింది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి షాజియా ఇల్మీ మాట్లాడారు. సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంగా ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. మా కంటే జైలు నిర్వాహణ అధికారులు తమ రోగులను (ఖైదీలు) జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రభుత్వం, జైలు నిర్వహణ అధికారులు కేజ్రీవాల్ (క్షీణిస్తున్న) ఆరోగ్య పరిస్థితులకు ఎందుకు బాధ్యత వహించాలని కోరుకుంటారు. ఆయన ప్రాణాలను ప్రమాదంలో పడేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తారు? ఎవరైనా అలాంటి పనులు ఎందుకు చేస్తారా? అని ప్రశ్నించారు. జైల్లో కేజ్రీవాల్‌కి ఇన్సులిన్ ఇవ్వలేదన్న అతిషి ఆరోపణను తోసిపుచ్చారు. భారతదేశంలో ఏ జైలు ఇలా చేయదు. మనది చాలా బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్యం అని స్పష్టం చేశారు. ఆప్ నేతలు వ్యాఖ్యలు కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా జైల్లో కుట్ర జరుగుతోందని, జైలులో ఆయనకు ఏదైనా జరగవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అదే పార్టీకి చెందిన ఢిల్లీ క్యాబినెట్ మంత్రి అతిషి సైతం జైల్లో ఉన్న కేజ్రీవాల్‌కు ఇంటి భోజనం, మధుమేహానికి ఇన్సులిన్ ఇచ్చేలా నిరాకరించడం ద్వారా కేజ్రీవాల్‌ను చంపడానికి కుట్ర జరుగుతుందని ఆరోపించగా.. ఆమె చేసిన వ్యాఖ్యల్ని జైలు అధికారులు ఖండించారు. -
షారుఖ్ స్టైల్లో సీఎం కేజ్రీవాల్ డైలాగ్.. సెటైర్లు వేస్తున్న బీజేపీ నేతలు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ సందేశం పంపారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ స్టైల్లో ‘మై నేమ్ ఈజ్ అరవింద్ కేజ్రీవాల్.. ఐయామ్ నాట్ టెర్రరిస్ట్’ అంటూ పంపిన ఆ మెజేస్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాకు వెల్లడించారు. అయితే జైలు నుంచి కేజ్రీవాల్ పంపిన సందేశంపై బీజేపీ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కేజ్రీవాల్ ఆరోపణలు, ఆయన పంపిన మెసేజ్‌పై ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను తాము టెర్రరిస్టుగా పిలవడం లేదని అన్నారు. అతన్ని టెర్రరిస్టు అని ఎవరు పిలుస్తున్నారో? కేజ్రీవాల్, అతని సహచరులు అతన్ని ఉగ్రవాది అని ఎందుకు పిలుస్తున్నారో మాకు తెలియదు. మేము అతనిని అవినీతిపరుడనే అంటున్నాం. ఆయన ఢిల్లీకి శత్రువు అని వ్యాఖ్యానించారు. VIDEO | Here's what BJP leader Manoj Tiwari (@ManojTiwariMP) said reacting to Delhi CM Arvind Kejriwal sending a message to people that he's not a terrorist. "Nobody is calling him a terrorist. We're calling him corrupt. He has made senior citizens cry for pension, poor cry for… pic.twitter.com/fztGHhjCds — Press Trust of India (@PTI_News) April 16, 2024 ఈ సందర్భంగా కేజ్రీవాల్‌పై మనోజ్ తివారీ సెటైర్లు వేశారు. అతను వృద్ధుల పెన్షన్ కోసం పాటుపడ్డారు. పేదల కోసం పనిచేశారు. రేషన్ కార్డుల కోసం, స్వచ్ఛమైన నీరు, గాలి అందించేందుకు ప్రజల కోసం కృషి చేశారని ఎద్దేశా చేశారు. దోపిడీకి పాల్పడే ముందు జైలులో సౌకర్యాల గురించి ఆప్ అధినేత ఆలోచించి ఉంటారని తివారీ అన్నారు. జైలు మాన్యువల్ అందరికీ ఒకేలా ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుంటోంది అని ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మీడియాతో మాట్లాడారు. देश के बेटे अरविंद केजरीवाल का जेल से देश की जनता को संदेश - मेरा नाम अरविंद केजरीवाल है और मैं आतंकवादी नहीं हूं। -@SanjayAzadSln pic.twitter.com/9VpPOpnLXa — AAP (@AamAadmiParty) April 16, 2024 -
ప్రచారం చేస్తా.. బెయిల్ ఇవ్వండి: మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కోర్టు శుక్రవారం(ఏప్రిల్ 12) విచారించింది. ఈ నెల 20లోపు సిసోడియా బెయిల్ పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐలకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికలు సమీపించింనదున ఆమ్ఆద్మీపార్టీ తరపున ప్రచారం కోసం తనకు మధ్యంత బెయిల్ ఇవ్వాలని కోర్టును సిసోడియా కోరారు. ఈ నెల 20వ తేదీన కోర్టు సిసోడియా మధ్యంతర బెయిల్‌పై విచారణ జరిపే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది. అనంతరం ఈడీ కూడా సిసోడియాను ఇదే కేసులో అరెస్టు చేయడం గమనార్హం. అరెస్టు అనంతరం ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి సిసోడియా రాజీనామా చేశారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల అరెస్టయిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితుల అరెస్టు.. స్పందించిన ‘దీదీ’
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019