breaking news
-
ఉద్యోగులను తొలగించిన లిప్‌స్టిక్ కంపెనీ
పర్సనల్ కేర్, కాస్మొటిక్ ఉత్పత్తులను తయారు చేసి విక్రయించే గుడ్ గ్లామ్ గ్రూప్ దాదాపు 150 మంది లేదా 15 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది చివర్లో ఐపీవోకి వెళ్తున్న నేపథ్యంలో ఈ యూనికార్న్ కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు తన మానవ వనరులను పునర్నిర్మించడంతో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గత 12-15 నెలల్లో వివిధ విభాగాలలో ఉద్యోగుల తొలగింపులు చేపట్టినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలో లాభదాయకమైన కంపెనీగా ఉండాలనే దృఢమైన లక్ష్యానికి ఈ వ్యూహాత్మక చొరవ దోహదపడుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా గుడ్ గ్లామ్ గ్రూప్ ఇటీవల పోప్గ్జో, ప్లిగ్సో, బేబీ చక్ర, మామ్స్కో, స్కూప్ఊప్, ట్వీక్ ఇండియా కంపెనీలను కొనుగోలు చేసింది. గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా మనన్ జైన్, గ్రూప్ చీఫ్ పీపుల్ ఆఫీసర్, ఫౌండర్ ఇనిషియేటివ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కార్తీక్ రావు, బ్రాండ్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా అంకితా భరద్వాజ్‌ని నియమించింది. ఇటీవలే గ్రూప్ కొత్త గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కమల్ లత్ నియామకాన్ని కూడా ప్రకటించింది. -
పెదాలకు అందంగా లిప్ప్లంపర్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే చాలు
ఈ రోజుల్లో అందాన్ని కాస్మెటిక్స్తోనే కాదు.. ఇలాంటి స్మార్ట్ డివైస్లతోనూ సొంతం చేసుకోవచ్చు. ‘మొహానికి క్రీములు, పౌడర్లు రాసుకున్నా.. రాసుకోకపోయినా పెదవులకు మాత్రం లిప్‌స్టిక్ ఉండాల్సిందే’ అని అభిప్రాయపడుతుంటారు సౌందర్యప్రియులు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. హ్యాండ్‌బ్యాగ్‌లో లిప్‌స్టిక్‌తో పాటు లిప్ ప్లంపర్ కూడా మెయిన్టైన్ చేసేవాళ్లు పెరుగుతున్నారు. ఇది సైలెంట్‌గా పనిచేస్తుంది. దాంతో ఎక్కడైనా, ఏ సమయంలోనైనా చక్కగా ఉపయోగించుకోవచ్చు. దీనికి నెలకోసారి చార్జింగ్ పెడితే సరిపోతుంది. డివైస్‌కి ఒకవైపు.. టైమ్ కంట్రోల్, పవర్ బటన్, బ్యాటరీ ఇండికేషన్ వంటి ఆప్షన్స్‌తో డిస్ప్లే ఉంటుంది. ఈ డివైస్‌తో పాటు ఓవెల్ షేప్, రౌండ్ షేప్ అనే రెండు రీప్లేస్ హెడ్స్ కూడా లభిస్తాయి. అభిరుచిని బట్టి వాటిని మెషిన్‌కి అమర్చుకుని.. ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ ప్లంపర్ వాడటంతో పెదవులు మృదువుగా.. అందమైన షేప్‌లోకి మారతాయి. దీన్ని బాత్రూమ్లోనైనా, ఆఫీస్‌లోనైనా, ప్రయాణాల్లోనైనా.. ఎక్కడైనా తేలికగా వాడుకోవచ్చు. ధర సుమారుగా 44 డాలర్లు. అంటే 3,611 రూపాయలన్న మాట. దీన్ని ఆన్ చేసిన తర్వాత ప్లస్ లేదా మైనస్ బటన్ల సహాయంతో పెదవులకు రౌండ్ లేదా ఓవెల్ ఎఫెక్ట్‌ను తెచ్చుకోవచ్చు. అనంతరం పెదవులకు లిప్ బామ్ రాస్తే సరిపోతుంది. మెరుస్తూ.. ప్రత్యేకంగా కనిపిస్తాయి. దాంతో ముఖం మరింత అందంగా మారుతుంది. -
రోజూ లిప్‌స్టిక్ వాడుతున్నారా? ఇందులోని కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ వల్ల..
అమ్మాయిలు అందంగా కనిపించేందుకు రకరకాల వస్తువులు వాడుతుంటారు. ముఖ్యంగా కాస్మొటిక్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు.వాటికోసం వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. బ్యూటీ ఉత్పత్తులపై రోజూ కొన్ని కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంటుంది. అందులో ఒకటి లిప్‌స్టిక్. ఈరోజుల్లో లిప్‌స్టిక్ వాడకం ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కొంతమంది అమ్మాయిలు అయితే లిప్‌స్టిక్ లేనిదే కాలు కూడా బయట పెట్టరు. లిప్‌స్టిక్ లేకుండా అసలు మేకప్ పూర్తి అవదు. ముఖాన్ని మరింత కాంతివంతంగా, అందంగా కనిపించేందుకు లిప్‌స్టిక్ వాడుతుంటారు. కొందరైతే డ్రెస్ కలర్‌కి తగ్గట్లు రకరకాల లిప్‌స్టిక్స్‌ను వాడుతుంటారు. అయితే అందాన్ని పెంచే లిప్స్టిక్స్ రోజూ వాడితే ప్రమాదం పొంచిఉన్నట్లే..అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ♦లిప్‌స్టిక్ వేసుకున్న తర్వాత మనం ఏదైనా తిన్నా, తాగినా ఎంతోకొంత మన నోట్లోకి వెళుతుంది. లిప్‌స్టిక్‌లలో శరీరానికి హాని కలిగించే అనేక రకాల ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి. ♦ లిప్‌స్టిక్‌లో ఉండే అల్యూమినియం,క్రోమియం,కాడ్మియం వంటి హానికారమైన పదార్థాలు అనేక విధాలుగా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ♦ ముఖ్యంగా లిప్‌స్టిక్‌లోని అల్యూమినియం పొట్టలోకి చేరితే అల్సర్‌కు దారి తీస్తుంది.లిప్‌స్టిక్‌లోని సీసం సామర్థ్యం, జ్ఞాపకశక్తి స్థాయిని తగ్గిస్తుంది. ♦ అరుదైన సందర్భాల్లో, లిప్‌స్టిక్ వల్ల కళ్ల కింద దురద, ఉక్కిరిబిక్కిరి చేయడం, శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ♦ లిప్‌స్టిక్స్‌లో వాడే సీసం వల్ల హైపర్‌టెన్షన్, గుండె సమస్యలు వస్తాయి. ♦ బిస్మత్ ఆక్సిక్లోరైడ్‌ను లిప్‌స్టిక్‌లో ప్రిజర్వేటివ్‌గా కూడా ఉపయోగిస్తారు. దీని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల అలర్జీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ♦ కొన్ని చవక లిప్‌స్టిక్‌లను వాడితే చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ లిప్స్టిక్స్ వాడాలనుకునేవారు ఖరీధైన, హెర్బల్ ఉత్పత్తులను వాడితే మంచిది. లిప్స్టిక్స్ వాడేముందు ఇలా చేయండి.. ► కొందరు తెలిసో తెలియకనో డైరెక్ట్‌గా లిప్స్‌కు లిప్‌స్టిక్‌ను వేసేసుకుంటారు. అలా అస్సలు చేయొద్దు. ముందుగా లిప్‌బామ్ రాసుకొని దానిపైన లిప్‌స్టిక్ వాడాలి. ► లిప్‌బామ్ అందుబాటులో లేకపోతే పెట్రోలియం జెల్లీ, కొబ్బరి నూనె లాంటివి కూడా వాడొచ్చు. ► లిప్స్టిక్స్ ప్రతిరోజూ వాడటం వల్ల పెదాలు నల్లగా మారిపోతుంటాయి. అందువల్ల పాలతో రబ్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి. ► పడుకునేముందు కశ్చితంగా లిప్‌స్టిక్‌ను తొలగించిన తర్వాతే నిద్రపోవాలి. లేదంటే లిప్‌స్టిక్స్‌లోని కెమికల్స్ పెదాలను డ్యామేజ్ చేస్తాయి. ► పెదాలు హైడ్రేటెడ్‌గా ఉంచడానికి నీళ్లు ఎక్కువగా తాగాలి. లేదా పొడిబారే అవకాశం ఎక్కువగా ఉంటుంది -
సరికొత్త కలెక్షన్‌తో మీ పెదాలకు మరింత అందం
-
పాపం.. అప్పుల ఊబిలో రెవలాన్!
కింగ్ నాగార్జున సినీ కెరీర్లోనే కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన చిత్రం 'మన్మథుడు'. ఈ సినిమాలో డైలాగ్‌లు, సీన్లు ప్రేక్షకులకు ఇప్పటికీ గిలిగింతలు పెడతాయి. ఇదే సినిమాలో ఓ లిప్‌స్టిక్ యాడ్ గుర్తుందా? "ఆడ పిల్ల పెదాలు ముడుచుకొని ఉన్నాయంటే బాధగా ఉన్నట్లు అర్ధం. అదే పెదాలు విచ్చుకొని ఉన్నాయంటే ఆనందంగా ఉన్నాయని అర్ధం. ఆ పెదాలు మునుపంటి కింద నలుగుతున్నాయంటే కోపంగా ఉన్నట్లు అర్ధం. కానీ ఒకమ్మాయి పెదాలు అందంగా ఉన్నాయంటే మాత్రం వాటిమీద రెవలాన్ లిప్‌స్టిక్ ఉందని అర్ధం' అంటూ వచ్చే రెవలాన్ లిప్టిక్ యాడ్ సీన్ ఆ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఆ రెవలాన్ కంపెనీ.. ఇప్పుడు రుణ భారాన్ని మోయలేక కోర్ట్‌ను ఆశ్రయించింది. రెవలాన్ హెడ్‌క్వార్టర్స్ న్యూయార్క్‌లో ఉంది. సుమారు 150 దేశాల్లో వీటి ఉత్పత్తులు అమ్ముడుపోయేవి. అయితే.. తొమ్మిది దశాబ్దాల చరిత్ర ఉన్న రెవలాన్ బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సప్లై చైన్ సమస్యలు, పెరిగిపోతున్న అప్పుల కారణంగా న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఛాప్టర్-11 దివాలా రక్షణ కోసం దాఖలు చేసింది. ఇందులో భాగంగా దాని ప్రస్తుత రుణదాతల నుండి 575 మిలియన్ డాలర్ల ఫైనాన్సింగ్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. పోటీ పెరిగింది రెవలాన్, అల్మే నుండి ఎలిజబెత్ ఆర్డెన్ వరకు బ్రాండ్లు బ్యూటీ మార్కెట్లో రారాజులుగా కొనసాగుతున్నాయి. కానీ గత కొన్నేళ్లుగా మారుతున్న అందం, అభిరుచులు, పుట్టుకొస్తున్న బ్యూటీ ప్రొడక్ట్ కంపెనీలతో పోటీ పడలేక పోతున్నాయి. రెవలాన్ లాంటి సంస్థలు కుదేలవుతున్నాయి.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019