breaking news
-
Singapore PM: మే 15న పదవి నుంచి తప్పుకుంటా: లూంగ్
సింగపూర్: సింగపూర్ ప్రధానిగా దాదాపు రెండు దశాబ్దాలపాటు కొనసాగిన లీ సీయన్ లూంగ్(72) రిటైర్మెంట్ ప్రకటించారు. మే 15వ తేదీన బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు లూంగ్ సోమవారం తెలిపారు. అదే రోజూన ఉప ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్(51) ప్రధానిగా బాధ్యతలు చేపడతారన్నారు. సింగపూర్ మూడో ప్రధానిగా 2004లో లూంగ్ బాధ్యతలు చేపట్టారు. ఏ దేశానికైనా నాయకత్వ మార్పిడి ఎంతో ముఖ్యమైన విషయమని ఆయన ఫేస్బుక్లో పేర్కొన్నారు. సింగపూర్‌కు మరింత ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు వాంగ్ ప్రభుత్వానికి సహకారం అందించాల్సిందిగా ప్రజలను ఆయన కోరారు. -
లారెన్స్‌తో జోడీ?
హీరో లారెన్స్‌కి జోడీగా హీరోయిన్ శ్రుతీహాసన్ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ‘రైడ్, వీర, రాక్షసుడు, ఖిలాడి’ వంటి పలు చిత్రాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు దర్శకుడు రమేష్ వర్మ. ఆయన దర్శకత్వంలో ఘవ లారెన్స్ హీరోగా ఓ ప్రాజెక్ట్ ఓకే అయిన సంగతి తెలిసిందే. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞావవేల్ రాజా తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ నిర్మించనున్నారు.రా ఈ చిత్రానికి ‘శ్రీరామరక్ష’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. కాగా ఈ మూవీలో ఇద్దరు కథానాయికలకు చోటు ఉందట. అందులో ఒక హీరోయిన్గా ఇప్పటికే నయనతార పేరు వినిపించింది.. మరో కథానాయికగా శ్రుతీహాసన్ నటిస్తారనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీలో లారెన్స్‌కి జోడీగా ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ నటించనున్నారంటూ గత ఏడాది వార్తలు వచ్చినా, ఆ తర్వాత ఎలాంటి ప్రకటన లేదు. తాజాగా నయనతార, శ్రుతీహాసన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నెలలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని టాక్. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో హారర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందని భోగట్టా. -
లారెన్స్ సినిమా నుంచి వాకౌట్?
లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో పాటు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోల సరసన నటిస్తుంటారు. దక్షిణాదిన సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న నయన ‘జవాన్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో హిందీ పరిశ్రమలోనూ విజయవంతంగా కెరీర్ ఆరంభించారు. ఇక ప్రస్తుతం ‘ది టెస్ట్’ చిత్రంతో పాటు మరో చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు నయనతార. కాగా, రత్నకుమార్ దర్శకత్వంలో లారెన్స్ హీరోగా రూపొందనున్న చిత్రంలో ఈ బ్యూటీ హీరోయిన్గా ఖరారయ్యారనే వార్త వినిపించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఆమె తప్పుకున్నారని టాక్. డేట్స్ సర్దుబాటు చేయలేక నయన ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. -
ఖలిస్థాన్ ఉగ్రవాది హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్?
న్యూఢిల్లీ: కెనడాలో బుధవారం రాత్రి జరిగిన గ్యాంగ్‌వార్‌లో మరో ఖలిస్థాన్ ఉగ్రవాది సుఖ్దూల్ సింగ్ అలియాస్ సుఖ దునెకె ప్రత్యర్ధులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. ఈ హత్యకు పూర్తి బాధ్యత తమదేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మాదే బాధ్యత.. కెనడాలో జరిగిన ముఠా కాల్పుల్లో ఖలిస్థా ఉగ్రావది సుఖ దునెకె హత్యకు గురయ్యాడు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా ఈ హత్య తామే చేయించామని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గ్యాంగ్స్టర్లు గుర్లాల్ బ్రార్, విక్కీ ముద్దుకేరా హత్యలతో సుఖ దునెకెకు సంబంధముందని వాడు మాదకద్రవ్యాలకు బానిసాయి ఫేక్ వీసా మీద కెనడా పారిపోయాడని వాడు చేసిన తప్పులకు శిక్ష పడిందని మా శత్రువులు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా బ్రతకరని హెచ్చరించారు. లారెన్స్ పాత్రపై అనుమానాలు.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసు ఆరోపణల్లో అహ్మదాబాద్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూస్వాలా హత్య కేసులో కూడా లారెన్స్ బిష్ణోయ్ నిందితుడిగా ఉన్నాడు. సోషల్ మీడియా పోస్టును బట్టి ఈ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ హస్తంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు భారత్ కెనడా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ హత్య జరగడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని అక్కడి వారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అక్కడి వారికి ట్రావెల్ అడ్వైజరీ మార్గదర్శకాలు చేసి వీసా సేవలను నిలిపివేసింది. చిలికి చిలికి.. భారత్ కెనడా మధ్య సంబంధాలు అంతకంతకు బలహీనపడుతున్నాయి. ఖలిస్థాన్ ఉద్యమం పేరిట ఖలిస్థానీ మద్దతుదారులు ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని ర్యాలీగా నిర్వహించి వివాదానికి తెరతీశాయి. ఆనాడు భారత దేశం ఆ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేసినా తేలిగ్గా తీసుకున్న కెనడా తర్వాత జరిగిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత్ ఏజెంట్లు కారణమంటూ చేసిన వ్యాఖ్యలు తగువుకు ఆజ్యం పోశాయి. ఇంతలోనే మరో ఉగ్రవాది హత్య జరగడంతో కెనడా వీసాలను నిలిపివేసింది. BIG ⚡️Lawrence Bishnoi gang claims responsibility for K-terrorist Sukhdool Singh's killing in Canada pic.twitter.com/6ZN1T30pb4 — Megh Updates 🚨™ (@MeghUpdates) September 21, 2023 ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుడి రేసులో దూసుకెళ్తున్న భారతీయుడు -
'చంద్రముఖి 2' ఫస్ట్ లుక్.. తెలిసే ఈ తప్పు చేశారా?
తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో గానీ కొన్ని సినిమాలు తీస్తున్న దర్శకనిర్మాతలు అడ్డంగా బుక్కైపోతున్నారు. ఫ్యాన్స్ తో బూతులు తిట్టించుకుంటున్నారు. మొన్న ప్రభాస్ 'కల్కి' విషయంలో ఇలానే జరగ్గా.. ఇప్పుడు లారెన్స్ 'చంద్రముఖి 2' చిత్రంపైనా అలాంటి విమర్శలే వస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది? (ఇదీ చదవండి: ఛాన్సుల కోసం కాంప్రమైజ్ అవమన్నారు.. ఈ నటి మాత్రం!) సూపర్‌స్టార్ రజినీకాంత్ 'చంద్రముఖి' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 90స్ జనరేషన్ కి ఈయన్ని బాగా పరిచయం చేసింది ఈ సినిమా అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి దాదాపు 18 ఏళ్ల తర్వాత సీక్వెల్ తీస్తున్నారు. లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. చంద్రముఖిగా కంగనా రనౌత్ కనిపించనుంది. ఈ క్రమంలోనే సోమవారం ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా, ప్రశంసలు బదులు ట్రోల్స్ వస్తున్నాయి. ఈ ఫస్ట్ లుక్‌లో లారెన్స్ వెంకటపతి రాజు గెటప్‌లో కనిపించాడు. కాకపోతే తల పెద్దగా, శరీరం చిన్నగా, చేయి సన్నగా ఉండటం వింతగా అనిపించింది. దీన్ని చూసిన నెటిజన్స్.. తెలిసే ఈ తప్పు జరిగిందా? లేదంటే కావాలనే ఇలా చేస్తున్నారు అని మాట్లాడుకుంటున్నారు. మొన్నీ మధ్య ప్రభాస్ 'కల్కి' ఫస్ట్ లుక్ విషయంలో ఇలానే జరగ్గా, వెంటనే దాన్ని మార్చి మరో లుక్ విడుదల చేశారు. 'చంద్రముఖి 2' లుక్ ఏమైనా మార్చి రిలీజ్ చేస్తారా? అలానే వదిలేస్తారా అనేది చూడాలి. వినాయక చవితికి ఈ మూవీని థియేటర్లలో పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. Thanks to Thalaivar Superstar @rajinikanth! Here’s presenting you the first look of #Vettaiyan 👑 I need all your blessings! Releasing this GANESH CHATURTHI in Tamil, Hindi, Telugu, Malayalam & Kannada! 🔥 #Chandramukhi2 🗝 pic.twitter.com/v4qYmkzeDh — Raghava Lawrence (@offl_Lawrence) July 31, 2023 (ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019