breaking news
-
బ్రిల్లార్ క్లినిక్ మొదటి వార్షికోత్సవంలో మెరిసిన సినీ తారలు (ఫొటోలు)
-
Lakshmi Manchu: ముంబైలో మంచు లక్ష్మి ఇల్లు.. ఎంత గ్రాండ్‌గా ఉందో! (ఫోటోలు)
-
ఆడపడుచు అంటే నీలా ఉండాలి.. మంచు లక్ష్మిపై ప్రశంసలు!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌కు ఈ ఏడాది భలే కలిసొచ్చింది. ఉస్తాద్ గేమ్ షోతో స్క్రీన్‌పై మళ్లీ మెరిశాడు. వాట్ ద ఫిష్ అనే సినిమా కూడా ప్రకటించాడు. అతడి భార్య మౌనిక బొమ్మల బిజినెస్ ప్రారంభించింది. వినూత్నంగా పిల్లలు గీసే డ్రాయింగ్స్ ఆధారంగా బొమ్మలు తయారు చేసివ్వడమే ఈ బిజినెస్ వెరైటీ. గతేడాది ప్రెగ్నెన్సీ ప్రకటించిన మౌనిక రెండు రోజుల క్రితమే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సంతోషంలో మంచు లక్ష్మి పాపకు M.M. పులి అని ముద్దు పేరు పెట్టినట్లు చెప్పింది. అయితే డెలివరీ సమయంలో మంచు లక్ష్మి ఆస్పత్రిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మౌనికకు ధైర్యం చెప్తూ తనకు తోడుగా ఉంది. మరోసారి మేనత్త అవుతున్నందుకు సంతోషంలో తేలియాడుతోంది. డెలివరీ అనంతరం మనోజ్, మౌనిక, లక్ష్మి, వైద్యులు అంతా కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నీలా ఉండాలి.. ఇది చూసిన జనాలు మంచు లక్ష్మిని పొగిడేస్తున్నారు. 'పెళ్లి నీ ఇంట్లో నీ చేతుల మీదుగా జరిపించావు.. ఇప్పుడు డెలివరీ సమయంలో తనకు అండగా ఉండి అన్నీ దగ్గరుండి చూసుకున్నావు.. ఆడపడుచు అంటే నీలా ఉండాలి' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా మనోజ్- మౌనికలది రెండో పెళ్లి అన్న సంగతి తెలిసిందే! మౌనికకు ఇదివరకే ధైరవ్ అనే కుమారుడున్నాడు. పెళ్లి తర్వాత మౌనికతో పాటు ధైరవ్ బాధ్యత కూడా తనే తీసుకున్నాడు మనోజ్. చదవండి: హీరోయిన్ చెల్లితో భర్త ఎఫైర్.. ఒక్క దెబ్బతో పక్షవాతం.. చివరికి..! -
పాపతో ఇంటికి చేరుకున్న మంచు మనోజ్, మౌనిక.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్, మౌనిక దంపతులు ఏప్రిల్ 13న పండంటి పాపకి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దేవుడి దీవెనలతో చిన్ని దేవత వచ్చిందని మంచు ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పింది. ఇక నుంచి ఆ పాపను ప్రేమతో ఎమ్.ఎమ్.పులి అని పిలుస్తామని కూడా ఆమె తెలిపింది. తాజాగా మంచు మనోజ్, మౌనిక దంపతులు తమ పాపను తీసుకుని ఫిలిం నగర్లో ఉన్న తన ఇంటికి చేరుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మౌనిక పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారు. తమ గారాల ముద్దు బిడ్డను తొలిసారి ఇంట్లోకి తీసుకునిపోతున్న సందర్భంలో హారతి ఇచ్చి పూలతో స్వాగతం పలికారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో పాపకు పెద్ద సోదరుడిగా ఉన్న ధైరవ్ చాలా సంతోషంగా ఉన్నాడు. View this post on Instagram A post shared by Dhanesh Babu ( Work ) (@endless_celebrity) -
ఇలా అవుతుందని ఊహించలేదు: చార్మీ, మంచు లక్ష్మి ఎమోషనల్
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ భార్య, యోగా ట్రైనర్ రూహీ మరణవార్త అందరినీ కలిచివేస్తోంది. ఎంతోమంది తారలకు యోగా టీచర్‌గా పని చేసిన రూహి అనారోగ్యంతో గురువారం నాడు ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆమె మరణం పట్ల పలువురు సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేశారు. చార్మీ, మంచు లక్ష్మి.. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనలయ్యారు. ఈ వార్త అబద్ధమైతే బాగుండు 'ప్రియమైన రూహి.. నీ కోసం ఇలాంటి పోస్ట్ వేస్తానని ఎన్నడూ అనుకోలేదు. ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నాను. మాటలు రావడం లేదు. నువ్వు ఇక లేవన్న వార్త అబద్ధమైతే బాగుండనిపిస్తోంది. మనం చివరిసారి కూడా ఎంతో సరదాగా మాట్లాడుకున్నాం. 18 ఏళ్ల అందమైన స్నేహబంధం మనది. నిన్ను మిస్ అవుతానని చెప్పడం చిన్నమాటే అవుతుంది. నీ కుటుంబానికి ఆ దేవుడు మరింత శక్తినివ్వాలి' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది చార్మీ. డ్యాన్స్, నవ్వులు.. అవన్నీ.. మంచు లక్ష్మి.. రూహితో తన చివరి చాట్‌ను స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'రూహి నుంచి నాకు అందిన చివరి మెసేజ్ ఇదే! ప్రతివారం తనను జిమ్‌లో కలుస్తూ ఉండేదాన్ని. తన ముఖంలో ఎప్పుడూ ఒక నిష్కల్మషమైన నవ్వు కనిపిస్తూ ఉండేది. ఎంతో ఎనర్జీగా కనిపించేది. మేమిద్దరం ఒళ్లంతా చెమటలు పట్టేవరకు డ్యాన్స్ చేసేవాళ్లం.. దవడలు నొప్పిపుట్టేంతవరకు నవ్వుతూనే ఉండేవాళ్లం. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని నువ్వు మరోసారి నిరూపించావు. ఇంత త్వరగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయినందుకు ఎంతో బాధగా ఉంది. మేము అదృష్టవంతులం సెంథిల్, తన ఇద్దరు పిల్లల గురించి ఆలోచిస్తుంటేనే మనసు కలుక్కుమంటోంది. కానీ నువ్వు జీవితానికి సరిపడా ప్రేమను పంచి వెళ్లిపోయావు. నీతో కలిసి ప్రయాణం చేసిన మేమంతా ఎంతో అదృష్టవంతులం. ఎప్పుడూ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ సర్ప్రైజ్ చేసేదానివి.. ఇప్పుడు స్వర్గంలో ఉన్న ఏంజెల్స్‌కు యోగాసనాలు నేర్పిస్తున్నావని ఆశిస్తున్నాను. నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను. ఇకపై నన్ను చూడటానికి రాలేవు. ఇలాంటి పోస్ట్ వేస్తానని కలలో కూడా ఊహించలేదు. నీ పేరు మీద ఈరోజు ప్రతిక్షణం సెలబ్రేట్ చేసుకుంటా.. ఇట్లు నీ స్నేహితురాలు లక్ష్మి' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ఆర్ఆర్ఆర్ సినిమాటోగ్రాఫర్ భార్య మృతి
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019