breaking news
-
టీజీ భరత్ జన్మదిన వేడుకకు కోట్లలో ఖర్చు..!
టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ తండ్రి, పారిశ్రామికవేత్త, బీజేపీ నాయకుడు టీజీ వెంకటేష్‌కు సంబంధించిన శ్రీరాయలసీమ ఆల్కాలీస్ పరిశ్రమకు చెందిన బ్యాంకు ఖాతా నుంచి xxxxxx680523 నెంబర్ గల ఖాతాకు మార్చి 8న రూ.1,500 జమ అయ్యింది. టీజీ భరత్ కుటుంబానికి చెందిన గౌరీగోపాల్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు ఖాతా నుంచి xxx0523నెంబర్ గల ఖాతాకు ఏప్రిల్ 6న రూ.5 వేలు జమ అయ్యింది.. ఈ రెండే కాదు.. ఎన్నికల వేళ కర్నూలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ గుట్టుగా డబ్బు పంపిణీ చేస్తూ కుల సంఘాల నాయకులను, ప్రజలను ప్రలోభపెడుతున్నట్ల తెలుస్తోంది. ఓటమి భయంతో డబ్బును ఎరగా చూపి ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. కులాల వారీగా సంఘాల నాయకులను చేరదీసి కొంతమందికి రూ.15 వేల నుంచి రూ.20 వేలు ముట్టజెప్పి మద్దతు కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండుసార్లు ఓటమి చెందాం.. సాయం చేయండి.. టీజీ భరత్ తరపున ఆయన తండ్రి టీజీ వెంకటేష్ నగరంలోని ప్రముఖులను పలు రాజకీయ పార్టీల నాయకులు, కులసంఘాలు, ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులను పిలిపించి రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. మీరు ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు. రెండుసార్లు ఓడిపోయాం.. ఈసారి కూడా ఓడిపోతే రాజకీయంగా భవిష్యత్తు ఉండదు. ఎలాగైనా సాయం చేయండి.. మీకు ఏ విధమైన సాయం కావాలన్నా చేస్తామంటూ ప్రాధేయపడుతున్నట్లు సమాచారం. వార్డుల్లో ఒకస్థాయి నాయకుడిని కూడా వదలకుండా తన కార్యాలయానికి పిలిపించుకుని అంతో ఇంతో ముట్టజెప్పి తన కొడుకును గట్టెక్కించాలని ప్రాధేయపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో టీజీ వెంకటేష్ దగ్గర కనీసం 70 మందికి పైగా ముఖ్యమైన వ్యక్తులు ఎళ్లవేళలా కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉండేవారు. టీజీ భరత్ వ్యవహారశైలి నచ్చక చాలామంది దూరంగా ఉంటున్నారు. అలాంటి వారందరినీ కూడా టీజీ వెంకటేష్ పిలిపించి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ భరత్‌తో కలసి పని చేయడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. బర్త్‌డే గిఫ్ట్ పేరుతో ఓటర్లకు వల 2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన టీజీ కుటుంబానికి రానున్న 2024 ఎన్నికలు అత్యంత కీలకం. ఆ ఎన్నికల్లో పరాభవం చెందితే ‘హ్యాట్రిక్’ ఓటముల దెబ్బకు రాజకీయాల నుంచి టీజీ ఫ్యామిలీ దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఎలాగైనా నియోజకవర్గంలో తనకు బలముంది, ప్రజల మద్దతు ఉందని చూపించేందుకు భరత్ తన బర్త్‌డేను వేదికగా చేసుకున్నారు. బర్త్‌డేకు జనం రారని ముందే ఊహించి తన అనుచరులతో ఇంటింటికీ తిరిగి గిఫ్ట్ కూపన్లు పంపిణీ చేయించారు. ఏస్టీబీసీ కళాశాల మైదానంలో వచ్చి న వారందరికీ విందుతో పాటు రూ.700 విలువ చేసే గిప్ట్‌లు పంపిణీ చేసి ఎన్నికల్లో సహకరించాలని కోరడం అప్పట్లో చర్చనీయాంశమైంది. – కర్నూలు -
ముస్లింలకు అండగా సీఎం జగన్...మళ్లీ అధికారం వైఎస్సార్సీ పీదే
-
చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు: ఇంతియాజ్
-
కర్నూలు: బాల్య వివాహాన్ని ఎదిరించి.. ఇపుడు టాపర్‌గా
బాల్య వివాహం నుంచి తప్పించుకుని మరీ తానేంటో నిరూపించుకుంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అగ్ర స్థానంలో నిలిచింది. అవకాశం కల్పిస్తే ఆడబిడ్డల సత్తా ఏంటో సమాజానికి చాటి చెప్పింది. అంతేకాదు ఐపీఎస్ ఆఫీసర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని భావిస్తుండటం విశేషం. కర్నూలు జిల్లా ఆలూరు కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఎస్.నిర్మల. బైపీసీలో 440కి 421 మార్కులు సాధించింది. ప్రభుత్వం అండగా నిలవడంతో నిర్మల చక్కగా చదువుకుని అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్.. నిర్మలను ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎస్ అధికారి కావాలనే ఆమె కల సామాజిక న్యాయం, బాల్య వివాహాల నిరోధంపై ఆమెకున్న తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు.ఈ బాలికకు గతేడాది బాల్య వివాహం జరిపిస్తుండగా జిల్లా యంత్రాంగం రక్షించి కేజీబీవీలో చేర్పించింది. ఎస్ఎస్సీలో 537 మార్కులు సాధించడం గమనార్హం. నిరుపేదలైన ఆమె తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు, వీరిలో ముగ్గురికి ఇప్పటికే వివాహాలైనాయి. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి నిర్మలకి కూడా చిన్నతనంలోనే వివాహంచేయాలని భావించారు. కానీ చదువుకోవాలన్నపట్టుదలతో పోరాడి బాల్య వివాహంనుంచి తప్పించుకుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలో టాపర్‌గా నిలిచి తానేమిటో నిరూపించుకుంది. Congratulations to Ms. G. Nirmala from Kasturba Gandhi Balika Vidyalaya (KGBV), Kurnool, a residential girls’ school run by the Ministry of Education for the disadvantaged sections in India, for securing the top spot in the 1st Year Intermediate exam of Andhra Pradesh… pic.twitter.com/OVqEX0frQL — Ministry of Education (@EduMinOfIndia) April 13, 2024 -
కర్నూలు: కృష్ణవేణి బ్రెయిన్ డెడ్.. అవయవాల తరలింపునకు గ్రీన్ ఛానల్
కర్నూలు, సాక్షి: తాను మరణించినా.. అవయవదానంతో మరికొందరికి ప్రాణం పోయాలనే ఆలోచన ఈరోజుల్లో కొంతమందికే కలుగుతోంది. అలాగే తమ వాళ్లు మరణించినా.. అంత దుఖంలోనూ అవయవదానానికి ముందుకు వచ్చే వాళ్లకు నిజంగా హ్యాట్సాఫ్. తాజాగా.. కర్నూలులో బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ నుంచి అవయవాల్ని దానం చేసేందుకు ముందుకు వచ్చింది ఆమె కుటుంబం. ప్రొద్దుటూరు చెందిన కృష్ణవేణి(38) కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్‌కి గురైంది. అయితే ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. దీంతో కిడ్నీని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి, అలాగే లివర్, గుండెలను తిరుపతికి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ హెలికాఫ్టర్‌లో గ్రీన్ ఛానెల్ ద్వారా తిరుపతికి అవయవాల్ని తరలించారు. స్విమ్స్‌లో లివర్ మార్పిడి సర్జరీ, అలాగే.. పద్మావతి హృదాయాలంలో హార్ట్ సర్జరీల ద్వారా ఇద్దరు పెషెంట్లకు కృష్ణవేణి అవయవాల్ని అమర్చనున్నారు. ఇదిలా ఉంటే.. శ్రీపద్మావతి హార్ట్ కేర్ సెంటర్లో ఇవాళ జరగబోయేది 14 వ హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ కావడం విశేషం. తమ బిడ్డ అవయవాల ద్వారా మరికొందరికి పునర్జన్మ కలగడం పట్ల కృష్ణవేణి కుటుంబ సభ్యులు కన్నీళ్లతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019