breaking news
-
మేం 10 సీట్లు గెలిస్తే పాలిటిక్స్‌లో మార్పులు: కేటీఆర్
అలంపూర్: కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని సంకల్పిస్తే, దురదృష్టవశాత్తు 39 సీట్లలోనే గెలిచామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 14 సీట్లలో వెయ్యి, రెండు, నాలుగు వేల తేడాతో ఓడిపోయామని, ఆ 14 సీట్లు గెలిచి ఉంటే మన దే ప్రభుత్వం ఉండేదని చెప్పారు. లేదా వాటిలో ఆరు సీట్లు గెలిచినా ప్రధాన పాత్ర పోషించేవారమన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 నుంచి 10 సీట్లు గెలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయని చెప్పారు. బీఆర్ఎస్కు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో, అలంపూర్ చౌరస్తాలో జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడారు. ‘సీక్వెల్ సినిమాల తరహాలో పార్లమెంట్ ఎన్నికల కోసం సీఎం రేవంత్‌రెడ్డి సీక్వెల్ మోసంతో రెడీగా ఉన్నారు. రేవంత్‌రెడ్డి మోసం పార్టు–1లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. మీలో ఎవరైనా రుణాలు తీసుకోని వారు ఉంటే పరుగు పరుగునపోయి లోన్లు తీసుకోండి.. అని చెప్పిన ఆయన మే 9 వస్తున్నా రుణమాఫీ చేయలేదు. మోసం పార్ట్–2లో పార్లమెంట్ ఎన్నికల కోసం ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానని చెబుతున్నారు’ అని కేటీఆర్ అన్నారు. అంతకుముందు కేటీఆర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అవన్నీ ఇచ్చి మాట్లాడు.. ‘మొగోడివైతే ఒక్క సీటు గెలవమని మన పార్టీ గురించి మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి భాషలోనే అడుగుతున్నా... నీవు మొగోనివైతే రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు. మొగోడివైతే కోటీ 67 లక్షల ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇవ్వు. కేసీఆర్ ఒకరికే ఇస్తున్నాడు నేను ముసలవ్వకి ముసలాయనికి ఇద్దరికీ రూ.4వేలు ఇస్తానని చెప్పావు కదా.. మొగోడివైతే 46 లక్షల మందికి ఆసరా పింఛన్ ఇచ్చి మాట్లాడు’ అని కేటీఆర్ అన్నారు. మొన్న మహబూబ్‌నగర్‌కు వచ్చి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నానని ఒక సీఎం మాట్లాడని మాటలు రేవంత్ మాట్లాడారని కేటీఆర్ దుయ్యబట్టారు. ‘సూర్యాపేటలో రష్ ఉన్న బస్సులో ఓ వ్యక్తి దొంగతనానికి ప్రయత్నిస్తుండగా.. ప్రయాణికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు జేబులు వెతికితే కత్తెర దొరికిందని అడిగితే.. సీఎం రేవంత్‌రెడ్డి కూడా కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు ఆయను పట్టుకోండి సార్ అని చెప్పారు’ అని చమత్కరించారు. బీజేపీ వాళ్లకు చెప్పుకోవడానికేమీ లేదు.. బీజేపీ వాళ్లు అక్కడక్కడ ఎగురుతున్నారని, పదేళ్లలో రాష్ట్రానికి మోదీ చేసిందేమి లేదని కేటీఆర్ అన్నారు. బీజేపీ వాళ్లు చెప్పుకోవడానికి ఏవీలేదని, అందుకే జైశ్రీరాం అంటున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. శ్రీరాముడు బీజేపీకి ఒక్కడే దేవుడు కాదని.. ఆయన అందరి వాడన్నారు. దేవుళ్ల పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లను నమ్మి మోసపోవద్దు: కేటీఆర్ రాజేంద్రనగర్ (హైదరాబాద్): బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని కేటీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం రాజేంద్రనగర్‌లో చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకొని ముందుకొస్తోందని... కాంగ్రెస్ దొంగ హమీలతో ప్రజలను మోసం చేసేందుకు మరోసారి వచ్చిందన్నారు. రెండు పార్టీలను చిత్తుగా ఓడించాలని ప్రజలను కోరారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించాలని గట్టిగా నమ్మే వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు. అందుకే చేవెళ్ల పార్లమెంటులో మొదటిసారిగా బడుగు, బలహీన వర్గానికి చెందిన వ్యక్తికి కేసీఆర్ టికెట్ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాందీ, మాజీ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, ఆనంద్ పాల్గొన్నారు. రేవంత్ నిజం చెప్పారు సాక్షి, వరంగల్: ‘అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలిచ్చి గద్దెనెక్కిండు రేవంత్... అయితే తప్పు రేవంత్‌రెడ్డిది కాదు... ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా, నిజాయితీగా చెప్పిండు ఎన్నికలకు ముందు టీవీ చర్చా వేదికల్లో. ప్రజలు మోసగాళ్లనే నమ్ముతారు... ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు... అందుకే మేం మోసం చేస్తాం అని చెప్పారు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వరంగల్, హనుమకొండలో మంగళవారం జరిగిన వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. తప్పు ఎవరిదన్నా ఉందంటే మనదే తప్ప ఇంకెవరిదీ కాదన్నారు. -
కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు మళ్లీ మొదలవుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఆయన కలిశారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిలతో కలిసి ఆయన సీఎంను కలిశారు. ప్రకాశ్‌గౌడ్ కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని, శనివారం తన అనుచరులతో కలిసి ఆయన అధికారికంగా పార్టీ లో చేరతారని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు బీజేపీ నేత, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డితో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి వచి్చన ఆయనకు రేవంత్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీప బంధువు ఎడ్ల రాహుల్‌రావు కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుల సమక్షంలో ఆయనకు రేవంత్‌రెడ్డి పార్టీ కండువా కప్పారు. ఎన్నికల క్లైమాక్స్‌లో..: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మంది తనకు టచ్‌లోకి వచ్చారంటూ మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన మరుసటిరోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చే రేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ పార్లమెంటు ఎన్నికల ఫలితాలను బట్టి పార్టీలోకి చే ర్చుకోవాలనే భావనతో సీఎం రేవంత్ ఉన్నారని, కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బీఆర్ఎస్లోకి వెళ్తారనే కోణంలో కేసీఆర్ మాట్లాడిన నేపథ్యంలోనే.. ఆపరేషన్ ఆకర్ష్‌కు ఆయన పదును పెట్టారని గాం«దీభవన్ వర్గాలు చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో జీ హెచ్‌ఎంసీకి చెందిన మరో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు కూడా టచ్‌లో ఉన్నారని, లోక్‌సభ ఎన్నికలకు ముందే వారు పార్టీలోకి చేరతారని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. ఓ మాజీ మంత్రి కూడా ఈ జాబితాలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్కు వైరా మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై వైరా: ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రా ములు నాయక్ శుక్రవారం బీఆర్ఎస్కు రాజీనామా చే శారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ పంపించారు. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయ న ఆనాటి బీఆర్ఎస్ అభ్యర్థి మదన్‌లాల్‌పై విజయం సాధించారు. అనంతరం బీఆర్ఎస్లో చేరగా, గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆయనకు కాకుండా మళ్లీ మదన్‌లాల్‌కే టికెట్ కేటాయించింది. మదన్‌లాల్ ఓడిపోయినా.. వైరా ఇన్చార్జిగా ఆయననే ని యమించడంతో పార్టీలో తనకు సరైన గౌరవం లభించడం లేదని రాములు నాయ క్ సన్నిహితుల వద్ద వాపోయారు. ఈ నేపథ్యంలో ఎంపీలు వద్దిరాజు, నామా తదితరులు రాములు నాయక్ ఇంటికి వెళ్లి తగిన గుర్తింపు లభించేలా చూస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఆయన బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కాగా కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పినట్లు తెలిసింది. -
‘కపటనీతికి మారుపేరు కాంగ్రెస్!’.. కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కపటనీతికి మారుపేరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. కానీ తమ 120 రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేయడం ప్రారంభించిందని మండిపడ్డారు. ‘ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు రూ. 4,000 నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక.. అసలు అటువంటి హామీ ఏమివ్వలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట మార్చారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని వార్తాపత్రికల మొదటి పేజీలో తమ జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటనలు ఇచ్చింది. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన 30 వేల ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలను ఇచ్చి ఆ ఉద్యోగాలను నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటోంది కాంగ్రెస్. అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ తాము ఇచ్చిన హామీపై నిస్సిగ్గుగా యూ టర్న్ తీసుకుంటూ.. కాంగ్రెస్ ప్రభుత్వం టెట్ పరీక్ష ఫీజును రూ. 400 నుండి రూ. 2000లకు (2 పేపర్లకు) పెంచింది. బల్మూరి వెంకట్ వంటి కాంగ్రెస్ నాయకులను ఎన్నో కోర్టు కేసులు వేసి.. అనేక పోటీ పరీక్షలు రద్దవ్వడానికి కారణమయ్యారు. నిరుద్యోగుల ఉసురు పోసుకుని, ప్రతిఫలంగా వెంకట్ ఎమ్మెల్సీ పదవిని అందుకున్నాడు. కానీ.. ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులను మాత్రం దిక్కుతోచని స్థితిలో వదిలేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. తమని నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది’ అని ‘ఎక్స్’వేదికగా మండిపడ్డారు. కపటనీతికి మారుపేరు కాంగ్రెస్! అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ తమ 120 రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేయడం ప్రారంభించింది. 👉 ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్… — KTR (@KTRBRS) April 19, 2024 -
జై శ్రీరామ్ అనడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదు
వెంగళరావునగర్ (హైదరాబాద్): బీజేపీ నేతలు మాట్లాడితే జై శ్రీరామ్ అనడం తప్ప వారి వల్ల దేశానికి గాని, ప్రజలకు గాని ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదని, ఆ పార్టీ చేసిన పనులు కూడా ఏమీ లేవని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు విమర్శించారు. శ్రీరాముడు దేవుడ ని, ఆయనను అందరూ పూజించాలని చెప్పారు. ఆ యనతో ఎవరికీ ఎలాంటి పంచాయితీ లేదన్నారు. కుల, మతాలను గౌరవించలేని పార్టీలను రానున్న ఎన్నికల్లో తొక్కేయాలని వ్యాఖ్యానించారు. దేశంలోని నాయకులంతా ఉంటే మోదీ జేబుల్లో లేదా జైల్లో ఉండాలన్న చందంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒకవైపు కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ బీజేపీని విమర్శిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఆ పార్టీని వెనకేసుకొస్తూ స్టేట్మెంట్లు ఇస్తున్నాడని, ఇదెక్కడి విడ్డూరమని ప్రశ్నించారు. గురువారం రాత్రి యూసుఫ్‌గూడలోని మహమూద్ ఫంక్షన్ హాల్లో జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ బూత్ కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రానికి విధేయుడిగా సీఎం రేవంత్ తంతే గారెల బుట్టలో పడ్డట్టుగా రేవంత్‌రెడ్డికి సీఎం పదవి దక్కిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి, ఒక్కటి కూడా సరిగ్గా చేయడం లేదని అన్నారు. ఏం చేయాలో తెలియక, హామీలను నెరవేర్చే సత్తా లేక ఫోన్ ట్యాపింగ్‌లంటూ ప్రజలకు పిచ్చి కథలు చెబుతున్నాడని విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ విధేయుడిగా పనిచేస్తున్నారని చెప్పారు. దేశంలో బీజేపీని ఓడించే శక్తి కాంగ్రెస్‌కు లేదని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పద్మారావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. దానం నాగేందర్ ఎమ్మెల్యే సీటు త్వరలో ఊడుతుందని చెప్పారు. -
బీఆర్ఎస్ పునాదులు లేకుండా చేస్తాం
నల్లగొండ: ‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ పునాదులు లేకుండా చేస్తాం. కాంగ్రెస్ కార్యకర్తలు పదేళ్ల పాటు కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. మీరు మా ప్రభుత్వాన్ని కూలగొడతామంటే చూస్తూ ఊరుకోరు’అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది.. రేవంత్ బీజేపీలోకి పోతాడు అని కేటీఆర్ అంటే.. రాజకీయాలు తెలియని బచ్చాగాడులే అనుకున్నాం. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నీవు.. ప్రజాస్వామ్య బద్ధంగా పూర్తి మెజారీ్టతో ఏర్పడిన ప్రభుత్వం సంవత్సరంలో పడిపోతుందని ఏ విధంగా అన్నావు’అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రశ్నించారు. ‘మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఏం కుట్రలు చేస్తున్నావు. మేము గేట్లు తెరిస్తే 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక మిగిలేది కుటుంబంలోని మీ బంధువులైన ఎమ్మెల్యేలే’అని మంత్రి అన్నారు. ‘నీ కూతురు లిక్కర్ కేసులో తీహార్ జైలులో ఉంది. ఇంకా బుద్ధి రాలేదా’అని మండిపడ్డారు. అవినీతి కేసుల్లో తండ్రీ కొడుకులు జైలుకు పోక తప్పదన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడి, భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు విన్న నీచులని విమర్శించారు. కేసీఆర్‌ది దొంగ దీక్ష.. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం సమయంలో డీ విటమిన్ టాబ్లెట్ వేసుకుని దొంగ దీక్ష చేసి.. చావు నోట్లో తలకాయ పెట్టానని ప్రజలను మోసం చేశారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. ‘నువ్వొక పాస్‌పోర్టు దొంగవు.. డబ్బులు దోచుకున్నవు. నీలాంటోడే సీఎం అయినప్పుడు. రైతు కుటుంబం నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డి జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, ఎంఎల్సీగా, ఎంపీగా పనిచేశారు. ఆయన సీఎం కాకూడదా’? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ సీట్లలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ సర్కార్‌ను కూల్చడంలో కేసీఆర్ పాత్ర ‘కేసీఆర్ మమ్మల్ని వెంటాడతా అంటుండు. ఆయన ముసలోడు. మాకు ఏ కట్టే అవసరం లేదు. మేముబలంగా ఉన్నాం. మేమే వెంటాడి వేటాడతాం’అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడంలో కేసీఆర్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. జూన్ 5 నుంచి పాలన స్పీడ్ చేస్తామని, ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. రూ.2 లక్షల రుణమాఫీని కూడా అమలు చేస్తామని చెప్పారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019