breaking news
Ad - Sakshi_Home_Sticky
-
కోటంరెడ్డికి విజయసాయి రెడ్డి మాస్ కౌంటర్..
-
లోకేష్ పాదయాత్ర ఈవినింగ్ వాక్ లా ఉంది..!
-
పోలీస్‌స్టేషన్‌లో కోటంరెడ్డి రాద్ధాంతం
నెల్లూరు(క్రైమ్): అన్నదమ్ములపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడిని వెంటనే తనతో పంపాలని టీడీపీ నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆదివారం అర్ధరా త్రి నెల్లూరు సంతపేట పోలీస్‌స్టేషన్‌లో రాద్ధాంతం చేశారు. పోలీసుల కథనం మేరకు.. గాంధీ గిరిజన కాలనీకి చెందిన దేవరకొండ వెంకట్, అతడి అన్న సుసేంద్ర, అదే ప్రాంతానికి చెందిన హరికృష్ణ మరికొందరు ప్రభుత్వ ఐటీఐ వద్ద ఆదివారం క్రికెట్ ఆడుతుండగా సుసేంద్ర, హరికృష్ణ మధ్య వివాదం జరిగింది. కొద్దిసేపటికి సద్దుమణగడంతో అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. హరికృష్ణ అదేరోజు సాయంత్రం సుసేంద్రకు ఫోన్ చేసి తిట్టాడు. కొద్దిసేపటి తర్వాత గొడవను సర్దుబాటు చేసుకుందామని సుసేంద్రకు ఫోన్ చేశాడు. దీంతో అతను తన సోదరుడు వెంకట్‌తో కలిసి ఐటీఐ కళాశాల వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడ హరికృష్ణ, అతని బంధువులైన చంద్రమౌళి, స్నేహితుడు నవీన్, రవీంద్ర తదితరులున్నారు. ఉదయం జరిగిన గొడవను మనసులో పెట్టుకుని వారు ఇనుపరాడ్లు, కర్రలతో వెంకట్, సుసేంద్రపై దాడి చేశారు. సుసేంద్ర కేకలు వేస్తూ పరుగులు తీయగా బ్రిడ్జి వద్ద నున్న కిశోర్, సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై సైతం దాడి జరిగింది. ఇంతలో గ్రామస్తులు రావడంతో నిందితులు పరారయ్యారు. గాయపడిన వెంకట్, సుసేంద్రను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌లో చేరి్పంచారు. బాధితులు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు రాత్రి కేసు నమోదు చేశారు. నిందితుల్లో కొందరిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారు టీడీపీకి చెందిన వారు కావడంతో కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి వెంటనే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. టీడీపీ నేత అయిన నవీన్‌ను అక్రమంగా ఇరికించారని, వెంటనే తనతో పంపాలని లేకపోతే స్టేషన్లోనే పడుకుంటానని నానా రాద్ధాంతం చేశారు. స్థానిక పోలీస్ అధికారులతోపాటు నగర డీఎస్పీపై ఒత్తిడి తెచ్చాడు. విచారించి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో కొద్దిసేపు హడావుడి చేసి వెళ్లిపోయారు. -
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అరెస్ట్
-
కోటంరెడ్డి అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్ చేయటంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులను ప్రశ్నించినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో సర్వేల పేరుతో ఓట్లు తొలగిస్తున్న వారిని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. కానీ ఓట్లు తొలగిస్తున్న వారిపై కాకుండా వారిని పట్టించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేశారు. దీంతో పోలీసుల తీరుపై కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను విడుదల చేయాలని పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. అయితే కోటంరెడ్డి పోలీసులను దూషించారంటూ కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను ఐదోనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు కోటంరెడ్డిని వైద్య పరీక్షలకోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కోటంరెడ్డి అరెస్ట్‌పై ఆయన కుటుంబంసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై భైఠాయించారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019