breaking news
Ad - Sakshi_Home_Sticky
-
టీ20 వరల్డ్‌కప్‌లో రీఎంట్రీపై విండీస్ వీరుడి స్పందన ఇదే..!
విండీస్ వెటరన్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ టీ20 వరల్డ్‌కప్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తాడని గతకొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై నరైన్ తాజాగా స్పందించాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావడం అసాధ్యమని స్పష్టం చేశాడు. రీఎంట్రీకి డోర్లు మూసుకుపోయాయని అన్నాడు. ఇటీవలికాలంలో తన ప్రదర్శనలు సంతృప్తినిచ్చాయని తెలిపాడు. టీ20 వరల్డ్‌కప్ ఆడాలనే అభిమానుల ప్రతిపాదనను గౌరవిస్తానని అన్నాడు. అయితే అందుకు ఓకే మాత్రం చెప్పలేనని వివరించాడు. వరల్డ్‌కప్ ఆడే విండీస్ జట్టుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని.. విండీస్ వీరులు మరో టైటిల్‌కు అర్హులేనంటూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. నరైన్ టీ20 వరల్డ్‌కప్‌లో ఆడటంపై బహిరంగ ప్రకటన చేయడంతో విండీస్ క్రికెట్ బోర్డు ఓ అంచనాకు వచ్చింది. నరైన్‌ను టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాలని ఒప్పించేందుకు తాను గతకొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని విండీస్ టీ20 జట్టు కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, నరైన్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో బంతితో పాటు బ్యాట్‌తోనూ అదరగొడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నరైన్ మెరపు శతకంతో (56 బంతుల్లో 109) విరుచుకుపడ్డాడు. ఈ సీజన్లో నరైన్ 7 మ్యాచ్‌ల్లో సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 286 పరుగులు చేశాడు. 9 వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ సీజన్లో కేకేఆర్ సాధించిన విజయాల్లో నరైన్ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించాడు. నరైన్ ఈ సీజన్లోనే రెండు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. నరైన్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నప్పటి నుంచి అతని ఫేట్ మారిపోయింది. ఓపెనర్‌గా అతను స్వేచ్ఛగా షాట్లు ఆడుతూ భారీ స్కోర్లు చేస్తున్నాడు. నరైన్‌ను ఓపెనర్‌గా పంపడం కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ ప్రతిపాదన. గతంలోనూ గంభీర్ నరైన్‌ను ఓపెనర్‌గా పంపి సత్ఫలితాలు సాధించాడు. 35 ఏళ్ల నరైన్ 2019లో చివరిసారిగా వెస్టిండీస్‌కు ఆడాడు. అతను 2023లో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. తాజా బ్యాటింగ్ ఫామ్ నేపథ్యంలో నరైన్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ కోసం చాలామంది వెటరన్ క్రికెటర్లు రిటైర్మెంట్ నిర్ణయాలను వెనక్కు తీసుకున్నారు. పాక్ ఆటగాళ్లు ఇమాద్ వసీం, మొహహ్మద్ ఆమిర్ టీ20 వరల్డ్‌కప్ కోసం యూ టర్న్ తీసుకున్నారు. -
IPL 2024 KKR Vs RCB: ఫేవరేట్ కేకేఆర్
-
ఐపీఎల్‌కు 17 ఏళ్లు.. తొలి మ్యాచ్ ఆడిన వాళ్లు ఇప్పుడు ఎంత మంది ఉన్నారు..?
క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు నేటితో 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఇవాళ (ఏప్రిల్ 18) క్యాష్ రిచ్ లీగ్ 17వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఐపీఎల్ మేనేజ్మెంట్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసి గతాన్ని గుర్తు చేసుకుంది. మీ ఫేవరెట్ ఐపీఎల్ జ్ఞాపకాన్ని కూడా షేర్ చేసుకోండని క్యాప్షన్ జోడించింది. దీంతో చాలామంది ఐపీఎల్ అభిమానులు తమ తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. IPL's poster on Completed "17 Years of IPL". - The Biggest Cricket Event...!!!! ⭐ pic.twitter.com/oXgkvRf0dP — CricketMAN2 (@ImTanujSingh) April 18, 2024 ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ఓ ఆసక్తికర ప్రశ్నను సంధించాడు. ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్‌లో ఆడిన వారు ప్రస్తుతం ఎంత మంది ఇప్పటికీ ఆడుతున్నారని అడిగాడు. దీనికి చాలామంది తమకు తెలిసిన సమాధానాలు చెప్పారు. సమాధానం రివీల్ చేయకముందు మీకు తెలిసిన సమాధాన్ని మీరు కూడా షేర్ చేయండి. 17 YEARS OF THE IPL...!!! 💥 The greatest league in the world started on this day in 2008. 🇮🇳 pic.twitter.com/BPApcjBkOL — Mufaddal Vohra (@mufaddal_vohra) April 18, 2024 సమాధానం విషయానికొస్తే.. ఐపీఎల్ తొలి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, కేకేఆర్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ తరఫున ఆడిన వృద్దిమాన్ సాహా, ఇషాంత్ శర్మ ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీకి ఆడిన విరాట్ కోహ్లి ఇప్పుడు కూడా అదే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆడిన ఈ ముగ్గురు మాత్రమే ఐపీఎల్లో ఇంకా కొనసాగుతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే.. ఐపీఎల్ చరిత్రలో విరాట్ ఒక్కడే నాటి నుంచి నేటి వరకు ఒకే జట్టుకు ఆడుతూ ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నాడు. నాటి మ్యాచ్ విషయానికొస్తే.. బ్రెండన్ మెక్కల్లమ్ శివాలెత్తిపోవడంతో (73 బంతుల్లో 158; 10 ఫోర్లు, 13 సిక్సర్లు) కేకేఆర్ 140 పరుగల భారీ తేడాతో ఆర్సీబీపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత ఓవరల్లో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో మెక్కల్లమ్ ఒక్కడే సింహ భాగం స్కోర్ చేశాడు. సౌరవ్ గంగూలీ 10, రికీ పాంటింగ్ 20, డేవిడ్ హస్సీ 12, మొహమ్మద్ హఫీజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఆర్సీబీ బౌలర్లలో జహీర్ ఖాన్, ఆష్లే నోఫ్కే, జాక్ కలిస్ తలో వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఆశోక్ దిండా (3-0-9-2), ఇషాంత్ శర్మ (3-0-7-1), అజిత్ అగార్కర్ (4-0-25-3), సౌరవ్ గంగూలీ (4-0-21-2), లక్ష్మీ రతన్ శుక్లా (1.1-0-12-1) ధాటికి 15.1 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్కరు (ప్రవీణ్ కుమార్ (18 నాటౌట్)) రెండంకెల స్కోర్ చేశారు. ద్రవిడ్ 2, వసీం జాఫర్ 6, విరాట్ కోహ్లి 1, జాక్ కలిస్ 8, కెమరూన్ వైట్ 6, మార్క్ బౌచర్ 7, బాసిల్ థంపి 0, నోఫ్కే 9, జహీర్ ఖాన్ 3, సునీల్ జోషి 3 పరుగులు చేసి ఔటయ్యారు. వికెట్ కీపర్‌గా వృద్దిమాన్ సాహా కలిస్ క్యాచ్ అందుకున్నాడు. -
రోలర్ కోస్టర్: ఆఖరి బంతికి కేకేఆర్‌పై రాజస్తాన్ గెలుపు
-
T20 WC: బతిమిలాడుతున్నా వినడం లేదు.. ఇక వాళ్లదే భారం!
ఐపీఎల్ 2024.. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో చేసిన పరుగులు 276.. పడగొట్టిన వికెట్లు ఏడు(7/165).. కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్ ఆల్‌రౌండర్ సునిల్ నరైన్ నమోదు చేసిన గణాంకాలివి. రాజస్తాన్ రాయల్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో 35 ఏళ్ల ఈ వెస్టిండీస్ ఆటగాడు కుర్రాళ్ల కళ్లు చెదిరే రీతిలో అద్బుతమైన షాట్లతో అలరించాడు. మొత్తంగా 56 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 109 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా ఇరగదీస్తున్నాడు విధ్వంసకర శతకంతో విరుచుకుపడి తన ఆటలో పస తగ్గలేదని మరోసారి నిరూపించాడు. కేకేఆర్‌కు దొరికిన విలువైన ఆస్తి అంటూ నీరాజనాలు అందుకుంటున్నాడు ఈ లెఫ్టాండ్ బ్యాటర్. 𝐍𝐚𝐫𝐢𝐧𝐞, naam toh suna hi hoga 😉 He scores his maiden 💯 in T20s at the iconic Eden Gardens 🏟️#KKRvRR #TATAIPL #IPLonJioCinema #SunilNarine | @KKRiders pic.twitter.com/TKFSFsc3Lp — JioCinema (@JioCinema) April 16, 2024 కేవలం పరుగుల తీయడానికే పరిమితం కాని ఈ రైటార్మ్ స్పిన్నర్.. రెండు వికెట్లు పడగొట్టాడు. అలాగే ఓ క్యాచ్ కూడా అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో పాటు క్యాచ్, వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 12 నెలలుగా ప్రయత్నిస్తూనే ఉన్నా ఇక ఈ వెటరన్ ఆల్‌రౌండర్ ప్రతిభకు వెస్టిండీస్ కెప్టెన్, రాజస్తాన్ రాయల్స్ హిట్టర్ రోవ్‌మన్ పావెల్ కూడా ఫిదా అయ్యాడు. నరైన్‌ను ఎలాగైనా ఒప్పించి ఈసారి వరల్డ్‌కప్‌లో ఆడించే ప్రయత్నం చేస్తామంటున్నాడు. కేకేఆర్‌పై రాజస్తాన్ విజయంలో తన వంతు పాత్ర పోషించిన పావెల్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘గత 12 నెలలుగా నేను నరైన్ చెవిలో జోరీగలా మొత్తుకుంటూనే ఉన్నాను. రిటైర్మెంట్ వెనక్కి తీసుకోమని అడుగుతున్నాను. కానీ అతడు ఏదో దాస్తున్నాడు. ఎవరితోనూ తన మనసులోని భావాలు పంచుకోవడం లేదు. ఈ విషయం గురించి ఇప్పటికే కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్‌లతో చర్చించాను.ప్రపంచకప్ జట్టు ఎంపిక కంటే ముందే వీళ్లు అతడి మనసులో ఏముందో కనిపెట్టగలరనే అనుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. విండీస్‌లో ఈసారి వరల్డ్‌కప్ జూన్ 1 నుంచి వెస్టిండీస్- అమెరికా వేదికగా మొదలుకానున్న టీ20 ప్రపంచకప్-2024లో సునిల్ నరైన్ ఆడించడమే తన లక్ష్యమని రోవ్‌మన్ పావెల్ ఈ సందర్భంగా ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో చెప్పుకొచ్చాడు. ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో పావెల్ 13 బంతుల్లో 26 పరుగులు చేసి నరైన్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడం విశేషం. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో 29 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న నరైన్.. మరో 20 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. 2023లో రిటైర్ అయిన నరైన్ 2012, 2014 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో వెస్టిండీస్ తరఫున బరిలోకి దిగిన సునిల్ నరైన్.. 2019 నుంచి జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో.. 2023లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే ఫ్రాంఛైజీ క్రికెట్లో మాత్రం ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. చదవండి: #T20WorldCup2024: రోహిత్‌తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019