breaking news
-
Kitchen Tips: ఈ చిన్న చిన్న పదార్థాలతో ఇబ్బందా? అయితే ఇలా చేయండి!
కిచెన్‌లో.. వంటచేసేటప్పుడు చిన్న చిన్న వస్తువులతో విసిగిపొతూంటాం. కొన్నిరకాల తిను బండారాలను కాపాడలేక, మరికొన్ని వస్తువులను ఎక్కువకాలం నిల్వచేయలేక ఇబ్బంది పడుతూంటాం. అలాగే కొన్ని పదార్థాలనుంచి వెలువడే చెడు వాసనతో కూడా తలనొప్పిగా భావస్తాం. మరి వీటినుంచి బయటపడాలంటే ఈ కిచెన్టిప్స్ ఓసారి ట్రై చేయండి.. కుల్చానుకాల్చేటప్పుడు.. పాన్ మీద కుల్చాను వేసి చుట్టుపక్కల కొద్దిగా నీళ్లు చల్లి మూతపెట్టాలి. ఒక వైపు కాలాక మరో వైపు తిప్పి చుట్టుపక్కల కొద్దిగా నీళ్లు చల్లి మూతపెడితే కుల్చా చక్కగా కాలుతుంది. చివరగా నూనె లేదా నెయ్యి చల్లుకుని సర్వ్ చేసుకుంటే కుల్చా చక్కగా కాలి రుచిగా వస్తుంది. ఉల్లిపాయ తరిగాక.. ఉల్లిపాయను ముక్కలుగా తరిగాక చేతులు ఉల్లివాసన వస్తుంటాయి. ఇలాంటప్పుడు బంగాళ దుంప ముక్కతో చేతులను ఐదు నిమిషాలు రుద్ది, తరువాత నీటితో కడిగితే ఉల్లివాసన వదులుతుంది. ఇవి చదవండి: సమ్మర్ సీజన్ కదా అని.. తొందరపడి పచ్చళ్లు పెట్టేస్తున్నారా! -
పండగొస్తోంది...మిక్సర్ గ్రైండర్ క్లీనింగ్ టిప్స్ : కొత్తగా మెరుస్తుంది
పూర్వకాలంలాగా రోళ్లు, కలం, తిరగళ్లు ఇపుడు పెద్దగా వాడటం లేదు. అవి ఎలా ఉంటాయో, ఎలా పనిచేస్తాయో కూడా ఈ తరం చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇపుడంతా మిక్సీలు, గ్రైండర్లు మయమే. అటు ఉగాది పండుగ సమీపిస్తోంది. ఉగాది నుంచి వరుసగా పండుగలు షురూ అవుతాయి. చుట్టాలు, పక్కాలు.. కొత్త అల్లుళ్లు.. హితులు..స్నేహితులు ..ఈ సందడి మామూలుగా ఉండదు. ఇలాంటి సమయంలో మన వంట ఇంటిలో అన్నీ సవ్యంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా మిక్సీ గ్రైండర్. మిక్సర్ గ్రైండర్ లేకుండా వంటను ఊహించుకోవాలంటేనే కష్టం. ఒక్కోసారి జార్స్ సరిగ్గా పనిచేయక ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సరిగ్గా పని ఉన్నపుడో, చుట్టాలొచ్చినపుడో పని చేయనని మొరాయిస్తుంటాయి. అయితే దీనికి కారణాలు చాలా ఉన్నాయి. సాధారణంగా పచ్చళ్లు, రకరకాల పొడులు, పొడులు, అల్లం వెల్లుల్లి, ఇతర పేస్ట్‌లు చేసేందుకు మిక్సీ గ్రైండర్ వాడతాం. వాడిన తరువాత ఎప్పటికపుడు చక్కగా క్లీన్ చేసుకోవాలి. గాస్కట్ (జార్ మూత చుట్టూ ఉండే రబ్బరు) బ్లేడ్లు కూడా తీసి శుభ్రం చేసుకోవాలి. లేదంటే మిక్సీజార్తో పని ఎంత సులువో, అది మొరాయిస్తే అంత కష్టం. ఎప్పటికప్పుడు క్లీన్‌గా నీట్‌గా ఉంచుకుంటేనే, ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా ఎక్కువరోజులు మన్నుతాయి. మిక్సీని, జార్స్‌ని ఎలా క్లీన్ చేయాలి? వంటసోడా: మురికి పట్టి, మొరాయించిన మిక్సీ జార్ సరిగ్గా పనిచేయాలంటే.. బేకింగ్ సోడా కూడా హెల్ప్ చేస్తుంది. బేకింగ్ పౌడర్‌లో కొద్దిగా వేడి నీరు పోసి పేస్టులా చేయండి. దీంతో జార్స్‌ని అప్లై చేసి, కొద్దిగా జార్లో వేసిన రెండు సార్లు తిప్పాలి. ఈ తర్వాత శుభ్రమైన నీటితో క్లీన్ చేయండి. వెనిగర్: వెనిగర్, నీళ్లు కలిపి జార్స్‌లో వేసి కాసేపు అలానే ఉండనివ్వండి. ఒక్కసారి మిక్సీ వేయండి. తరువాత నీటితో క్లీన్ చేస్తే బ్లేడ్లు, జార్ మొత్తం శుభ్రంగా తయారవుతుంది. పిండి , జార్లో పేరుకుపోయిన వ్యర్థాలను సమర్థవంతంగా శుభ్రపరుస్తుంది. నిమ్మ తొక్కలు: నిమ్మ తొక్కలతో కూడా జార్స్‌ని చక్కగా క్లీన్ చేయొచ్చు. నిమ్మతొక్కలు, కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ కొద్దిగా నీరు వేసి మిక్సీని ఆన్ చేయండి. ఒకటి రెండు నిమిషాలు తిప్పండి. అలాగే మిక్సీని మొత్తాన్నికూడా జాగ్రత్తగా మెత్తని క్లాత్‌తోగానీ, స్పాంజితో గానీ క్లీన్ చేసుకుంటే.. చక్కగా కొత్తదానిలా మెరిపోతుంది. నోట్ : మిక్సీని క్లీన్ చేసేటపుడు బ్లేడుల కారణంగా మన చేతి వేళ్లు తెగకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా మిక్సీ మోటర్లోకి అస్సలు వాటర్ పోకూడదు. ఒక్క చుక్క నీరు పోయినా మోటర్ పాడయ్యే అవకాశం ఉంది. -
సమ్మర్ స్పెషల్ : మ్యాంగో పులిహోర అదరిపోయేలా!
వేసవికాలం వచ్చిందంటే చాలు మామిడికాయలు నోరూరిస్తాయి. వగరు.. పులుపు కలయికతో లేత మామిడి తొక్కు పచ్చడి, చిన్న ముక్కల పచ్చడి, మామిడి కాయ పప్పు ఇలా ఒకటేమిటి రకరకాల వంటకాలు ఘుమ ఘుమ లాడి పోవాల్సిందే. అసలు మామిడికాయతో ఏమి చేసినా ఆ రుచే వేరు కదా. మరి సమ్మర్ స్పెషల్‌గా మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దామా! మామిడికాయ పులిహోర చేసిపెడితే. పిల్లలు,పెద్దా అంతా ఇష్టంగా తింటారు. ఇది చదువుతుంటేనే మీకూ నోరు ఊరుతోంది కదా. మరింకెందుకు ఆలస్యం ఎలా చేయాలో, కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. కావల్సి పదార్థాలు: తోలు తీసేసి సన్నగా తురిమిన పచ్చిమామిడికాయ తురుము వేయించి పెట్టుకున్న పల్లీలు, లేదా వేరుశెనగలు నేతిలో వేయించుకున్న జీడిపప్పు ఉప్పు రుచికి సరిపడా కొద్దిగా కరివేపాకు ఎండు మిర్చి, పచ్చి మిర్చి తురిమిన అల్లం ఇంగువ పసుపు ముందుగా మందపాటి పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు వేయాలి. ఆవాలు చిటపలాడే వరకూ వేయించుకోవాలి. ఎండు మిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవి వేగుతుండగా, మధ్యకు చీల్చి పెట్టుకన్న పచ్చిముక్కలు, అల్లం తురుము, కరివేపాకు, అల్లం వేయాలి. పసుపు ,ఇంగువ వేసి ఇంకొంచెం సేపు వేగించు కోవాలి. పోపు కమ్మటి వాసన వస్తూ ఉంటుంది కదా. అపుడు ముందుగానే తరిమి పెట్టుకున్న మామిడికాయ తురుము వేసి 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి. ఇక చివరగా రోస్ట్ చేసి పెట్టుకొన్నవేరుశెనగలు, జీడిపప్పు వేయాలి. ముందుగా వండి పెట్టుకొన్న అన్నం పోపులో వేసి, అందులోనే ఉప్పుకూడా వేసి అన్నం చితికి పోకుండా బాగా కలపాలి. పులుపు, ఉప్పు సరిచూసుకుంటే..నోరూరించే మామిడికాయ పులిహోర రెడీ. బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ, సాయంత్రం పూటగానీ, లంచ్‌లోగానీ దీన్ని తీసుకోవచ్చు. -
కిచెన్ టిప్స్: మనకిష్టమైన పదార్థాలను ఇలా కాపాడుకుందాం..!
'సాధారణంగా మనం కిచెన్‌లో ఉన్న కొన్ని వస్తువులు పాడవకుండా కాపాడడంకోసం నానా తంటాలు పడుతూంటాం. వాటిలో మనకిష్టమైన పదార్థాలంటే.. ఇంకెంతో జాగ్రత్తలను పాటిస్తాం. ఏం చేయాలో తెలియక, చిన్న చిన్న ఉపాయాలు తోచక విసుగు చెందుతుంటాం. ఇకపై అలా జరగకుండా ఈ కొన్ని ట్రిక్స్ మీకోసమే..' ఇలా చేయండి.. తోడు వేయడానికి తగిన మజ్జిగ లేక పెరుగు అందుబాటులో లేకపోతే పాలను గోరువెచ్చగా చేసి అందులో రెండు పచ్చిమిర్చి వేసి మూత పెట్టి.. ఆరేడు గంటలపాటు కదపకుండా పక్కన పెడితే పెరుగు గట్టిగా తోడుకుంటుంది. నిమ్మరసం చేసేటప్పుడు రసంతో పాటు నిమ్మ చెక్కలను కూడా అందులోనే వేసి కాసేపు ఉంచడం వల్ల.. మంచి ఫ్లేవర్, రుచితో పాటు పోషకాలు కూడా ఎక్కువగా అందుతాయి. సాధారణంగా అల్లం పేస్ట్‌ను ఎప్పటికప్పుడు తాజాగా చేయడంతో పాటు కొంత స్టోర్ చేసి కూడా పెట్టుకుంటూ ఉంటాం. ఇది పాడవకుండా ఉండేందుకు అందులో చెంచా ఆవాల నూనె వేయాలి. ఇలా చేయడం వల్ల అల్లం పేస్ట్ పాడవకుండా ఉంటుంది. ఇవి చదవండి: 'నా ఎదుగుదల మూలాలు మా ఊరిలోనే..' రైతుబడి మాస్టారు! -
ఇంటిప్స్: మురికిని ఇకపై సులభంగా వదిలించండి..
'ప్రతీరోజూ ఇంట్లో ఉన్న వంటింటిని కాపాడడం.. వంటింట్లో ఉన్న వస్తువులను కాపాడడం.. ఆ వస్తువులలో ఆరోగ్యానికి సంబంధించిన వాటిని ఎక్కువ రోజులు మన్నికగా ఉండేట్లు చూసుకోవడం ఎంతో కష్టం. ఇకపై అలాంటి తిప్పలకు చెక్ పెట్టేవిధంగా ఈ ఇంటిప్స్ వాడారో.. కాస్త వీటి టెన్షన్ నుంచి రిలీఫ్ అవొచ్చు. ఇక అవేంటో చూద్దాం..' ఇలా చేయండి.. వాటర్ బాటిల్లో సగం వరకు నీళ్లుపోయాలి. మిగతా సగంలో నిమ్మకాయ ముక్కలు, ఉప్పు, ఐస్ ముక్కలను వేసి బాగా షేక్ చేయాలి. ఇలా పది నిమిషాలు చేసిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ విధానంలో బాటిల్ కడగడం వల్ల బాటిల్లో సూక్ష్మజీవులు పూర్తిగా పోతాయి. టీస్పూను వంటసోడా, రెండు టీస్పూన్ల వెనిగర్‌ను బాటిల్లో వేసి మూతపెట్టాలి. ఇరవై నిమిషాల తరువాత బాటిల్‌ను బాగా షేక్ చేసి కడగాలి. ఇలా కడిగిన బాటిల్‌ను మూతతీసి పూర్తిగా ఆరిన తరువాత వాడుకోవాలి. వంటసోడా, వెనిగర్‌ను సమపాళ్లల్లో తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా మాడిన గిన్నె, ఫ్రైపాన్పై రాసి ఇరవై నిమిషాలు నానబెట్టాలి. తరువాత డిష్వాషర్తో రుద్ది కడిగితే మురికి మొత్తం తొలగి పోతుంది. గోరువెచ్చని పాలల్లో రెండు టీస్పూన్ల పెరుగు వేసి కలపాలి. పాలల్లో ఈ మిశ్రమం వేసి, వడలను వేసి ఐదారు గంటలు నానపెడితే పెరుగు చక్కగా తోడుకుంటుంది. ఇప్పుడు ఈ వడలకు తాలింపు వేసి తింటే పెరుగు వడలు చాలా రుచిగా ఉంటాయి. పెరుగు లేనప్పుడు ఇలా చేస్తే పెరుగు పులవకుండా పెరుగు వడలు రుచిగా వస్తాయి. వేడినీళ్లలో బేకింగ్ సోడా, కొద్దిగా నిమ్మరసం వేసి కలపాలి. ఈ నీటిలో టూత్ బ్రష్‌ను మునిగేలా వేస్టి ఇరవై నిమిషాలు నానబెట్టాలి. తరువాత సాధారణ నీటితో కడిగితే బ్రష్‌లో ఉన్న మురికి, బ్యాక్టీరియా పోతుంది. పదిరోజులకొకసారి బ్రష్‌లను ఇలా శుభ్రం చేసుకుంటే, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. రెండు టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిని కలపాలి. ఈ మిశ్రమంలో ముంచిన టిక్కాను, తరువాత గుడ్లసొనలో ముంచి డీప్‌ఫ్రై చేస్తే టిక్కా క్రిస్పీగా మరింత రుచిగా వస్తుంది. ఇవి చదవండి: బ్యూటిప్స్: ఇలా చేయండి.. ఈ ఒక్కటీ చాలు!
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019