breaking news
-
ప్రేమ... నవ్వు... యుద్ధం
‘లవ్... లాఫ్టర్... వార్...’ అంటూ సూర్య కొత్త చిత్రం అధికారిక ప్రకటన గురువారం వెలువడింది. ‘పిజ్జా, పేటా, జిగర్ తండా, జిగర్ తండా డబుల్ ఎక్స్’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. హీరో సూర్యకి ఇది 44వ చిత్రం. అయితే ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. సినిమా ప్రకటించిన సందర్భంగా ‘లవ్... లాఫ్టర్... వార్...’ (ప్రేమ.. నవ్వు.. యుద్ధం) అని ఉన్న పోస్టర్ని ఎక్స్‌లో షేర్ చేశారు కార్తీక్ సుబ్బరాజు. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తారు. ఈ చిత్రాన్ని సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్, కార్తీక్ సుబ్బరాజు స్టోన్ బెంచ్ క్రియేషన్స్ నిర్మించనున్నాయి. ఇక ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘కంగువ’ చిత్రంలో నటిస్తున్న సూర్య తనకు ‘ఆకాశం నీ హద్దు రా’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన సుధ కొంగర దర్శకత్వంలో ఓ సినిమాకి పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. -
'అందంగా లేని హీరోయిన్ను తీసుకున్నారు'.. దర్శకుడి సమాధానమిదే!
రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జిగర్తాండ డబుల్ ఎక్స్'. నవంబర్ 10న విడుదలైన ఈ మూవీ పది రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సినిమా సూపర్ సక్సెస్ కావడంతో చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓ రిపోర్టర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నిమిషా సజయన్ అంత అందంగా ఏమీ లేదని వ్యాఖ్యానించాడు. తను బాగోలేకపోయినా సరే తనను సినిమాలోకి తీసుకుని ఆమె నుంచి నటన ఎలా రాబట్టుకున్నారని ప్రశ్నించాడు. అలా అనడం చాలా తప్పు ఈ ప్రశ్నకు ఖంగు తిన్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఘాటుగానే స్పందించాడు. 'ఆమె అందంగా లేదని నువ్వెలా చెప్పగలవు? నీకెందుకలా అనిపించింది? ఒకరు అందంగా లేరని అనేయడం, అలా డిసైడ్ చేసేయడం.. చాలా తప్పు' అని కౌంటరిచ్చాడు. దర్శకుడి సమాధానం విని చిత్రయూనిట్ అంతా చప్పట్లు కొట్టింది. ఇక ఈ సినిమాతో పాటు సక్సెస్ మీట్లోనూ భాగమైన మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. ఏమీ మారలేదు 'నేను అక్కడే ఉన్నాను. అందం గురించి అతడు పిచ్చి ప్రశ్న అడిగి వదిలేయలేదు. ఏదైనా వివాదాస్పదం అయ్యే ప్రశ్నలు అడగాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అలాంటి ప్రశ్నలు అడిగేశాక తనకు తాను గర్వంగా ఫీలయ్యాడు. 9 ఏళ్ల క్రితం జిగర్తాండ మొదటి భాగం వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఏమీ మారలేదు' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు ఈ హీరోయిన్‌కు ఏం తక్కువ? అంత బాగా అభినయం చేస్తోంటే ఇలా అవమానించేలా ఎలా మాట్లాడుతారో అని కామెంట్లు చేస్తున్నారు. నటనలో ఘనాపాటి కాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నిమిషా సజయన్ ఈ విజయోత్సవ సభకు హాజరు కాలేదు. ఈమె ఇటీవల వచ్చిన సిద్దార్థ్ చిత్త(చిన్నా) మూవీలోనూ నటతో మెప్పించింది. ఈమె మలయాళ నటి. 2017లో కేరాఫ్ సైరా భాను సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ద గ్రేట్ ఇండియన్ కిచెన్, నాయట్టు, తొండిముతలుమ్ దృక్షాక్షియుమ్.. తదితర హిట్ చిత్రాల్లో నటించింది. జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీలో రాఘవ లారెన్స్ భార్యగా, గిరిజన యువతి మలైయారసి పాత్రలో కనిపించింది. I was there. It was not just about the ridiculous ‘beauty’ question for the reporter. There was a conscious effort from the guy to ask something controversial and he was so proud after asking this. Nothing has changed since the appalling ‘Jigarthanda’ - ‘Figuredhanda’ question 9… https://t.co/ZaVh5lEkK9 — Santhosh Narayanan (@Music_Santhosh) November 18, 2023 చదవండి: అందుకే 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' మూవీ వదులుకున్నా.. భూమికతో గొడవలు.. -
ట్రైలర్ అదిరిపోయింది
‘‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ సినిమా ట్రైలర్ అదిరిపోయింది. కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ ఎలా ఉంటుందో మరోసారి ఈ ట్రైలర్‌తో చూపించాడు. సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందనే గట్టి నమ్మకం ఉంది’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’. కార్తికేయన్ సంతానం నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ నెల 10న విడుదలఅవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్ మాట్లాడుతూ–‘‘లారెన్స్, ఎస్జే సూర్య వంటి ప్రతిభ ఉన్న నటులు ఈ సినిమాలో నటించారు. కార్తీక్ సుబ్బరాజ్ కల్ట్ డైరెక్టర్. నాకోసం తను త్వరలోనే ఓ స్క్రిప్ట్ తయారు చేస్తాడనుకుంటున్నాను’’ అన్నారు. రాఘవ లారెన్స్ మాట్లాడుతూ–‘‘తమిళనాడులో నేను ట్రస్ట్ పెట్టి సేవలు చేస్తున్నాను. ఇకపై తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ ట్రస్ట్ సేవలు అందించబోతున్నాను’’ అన్నారు. ‘‘అందరూ మా సినిమాను చూసి ఎంజాయ్ చే స్తారు’’ అన్నారు ఎస్జే సూర్య. ‘‘మా చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అని కార్తికేయన్ సంతానం అన్నారు. ‘‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ నాకు ఎంతో ప్రత్యేకం. నాలుగున్నరేళ్ల తర్వాత థియేటర్స్‌లోకి విడుదలవుతున్న నా సినిమా ఇది’’ అన్నారు కార్తీక్ సుబ్బరాజ్. ఈ వేడుకలో సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్, డైరెక్టర్ శైలేష్ కొలను, నటుడు నవీన్ చంద్ర మాట్లాడారు. -
RC 15: మరో వివాదంలో డైరెక్టర్ శంకర్..
‘అది నా కథ. నాకు తెలియకుండా కొట్టేశారు’ అంటూ అప్పుడప్పుడూ రచయితలో, దర్శకులో ఆరోపించే విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఓ వివాదం హాట్ టాపిక్ అయింది. ఇది శంకర్ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన వివాదం. రామ్‌చరణ్ (‘ఆర్సీ 15’.. చరణ్‌కి ఇది 15వ సినిమా) హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు ఓ ప్యాన్ ఇండియా మూవీ నిర్మించనున్న విషయం తెలిసిందే. ‘భారతీయుడు 2’ పూర్తి చేశాకే శంకర్ ఈ సినిమా చేయాలని ఆ చిత్రనిర్మాతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయమూ విదితమే. మరోవైపు ‘అపరిచితుడు’ రీమేక్ వివాదం కూడా ఎదుర్కొన్నారు శంకర్. తాజాగా.. రామ్‌చరణ్ సినిమా కోసం తయారు చేసిన కథ తనదేనంటూ చెల్లముత్తు అనే రచయిత దక్షిణ భారత సినీ రచయితల సంఘాన్ని ఆశ్రయించారు. కార్తీక్ సుబ్బరాజ్ దగ్గర దర్శకత్వ శాఖలో చేశారు చెల్లముత్తు. ఇటు రామ్ చరణ్ సినిమా, అటు ‘అపరిచితుడు’ హిందీ రీమేక్ ప్లాన్స్‌తో బిజీగా ఉన్న శంకర్ ‘ఆర్సీ 15’కి కథ తయారు చేసి ఇవ్వమని కార్తీక్ సుబ్బరాజ్‌ని కోరారట. ఆ మేరకు కార్తీక్ ఓ కథ తయారు చేసి ఇచ్చారట. ఆ కథ తనదని చెల్లముత్తు ఆరోపిస్తున్నారు. కార్తీక్, చెల్లముత్తులతో మాట్లాడి, అసలు కథేంటి? కథ ఎవరిది? అనే విషయంలో రచయితల సంఘం త్వరలో తీర్పు వెల్లడిస్తుందని కోలీవుడ్ టాక్. చదవండి : డాక్టర్‌తో డైరెక్టర్ వివాహం.. హాజరైన ప్రముఖులు అల్లు అర్జున్‌తో డ్యాన్స్.. తెగ కష్టపడుతున్న రష్మిక -
‘మహాన్’గా విక్రమ్.. లుక్ అదిరిందిగా
విక్రమ్, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదలైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘మహాన్’అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇక లుక్ విషయానికొస్తే... మరోసారి సరికొత్త అవతారంలో కనిపించి సర్ప్రైజ్ చేశాడు విక్రమ్. పొడవాటి జుత్తు, గడ్డంతో చాలా స్టైలీష్‌గా కనిపించాడు. బుల్లెట్‌పై హుందాగా కూర్చొని నవ్వుతూ దర్శనం ఇచ్చాడు విక్రమ్. (చదవండి: షాకింగ్.. 100 సెలబ్రిటీల నగ్న వీడియోలు లీక్!) ఆయన వెనకాల కొమ్ములు, 16చేతులు గల ఒక ఆకారం కూర్చొని ఉంది. దాని వెనక ఉన్న రహస్యం ఏంటి? అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే సగ భాగం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రంపై త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విక్రమ్ సరసన సిమ్రన్ నటిస్తోంది. ఎస్.ఎస్. లలిత్ కుమరా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంతోశ్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019