breaking news
-
ఇజ్రాయెల్‌పై దాడుల ఎఫెక్ట్.. ఇరాన్ భారీ షాకిచ్చిన అమెరికా!
వాషింగ్టన్: తమ కాన్సులేట్ కార్యాలయంపై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్ర రాజ్యం అమెరికా.. ఇరాన్‌కు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇరాన్‌కు సంబంధించిన మిస్సైల్, డ్రోన్ ప్రోగ్రామ్‌పై త్వరలోనే నూతన ఆంక్షలు విధించబోతున్నట్టు అమెరికా పేర్కొంది. కాగా, ఇజ్రాయెల్‌పై దాడులకు ప్రతీకారంగా ఆ దేశంపై ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఇరాన్ మిసైల్, డ్రోన్ ప్రోగ్రామ్‌పై త్వరలోనే నూతన ఆంక్షలు విధించబోతున్నట్టు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే, ఇరాన్‌తో పాటు దాని మిత్రదేశాలు, భాగస్వామ గ్రూపులు కూడా ఈ ఆంక్షల పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఇరాన్, దాని క్షిపణి, డ్రోన్ ప్రోగ్రామ్‌తో పాటు ఆ దేశ రివల్యూషనరీ గార్డ్స్, ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ లక్ష్యంగా నూతన ఆంక్షలు విధించబోతున్నామన్నారు. మరోవైపు.. యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ కూడా ఇరాన్‌పై ఆంక్షలు విధించేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. తమ మిత్రదేశాలు, భాగస్వాములు కూడా ఇరాన్‌పై ఆంక్షలు విధిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. కాగా ఇరాన్‌పై ఆర్థిక పరమైన ఆంక్షలు విధించేందుకు అమెరికా అధికారులు పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌పై దాడుల అనంతరం ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ప్రపంచ శాంతి కోసం ఇరాన్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగించే ఉద్దేశ్యమేమీ లేదు. ఇజ్రాయెల్ కవ్విస్తే మాత్రం కచ్చితం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడమని హెచ్చరించింది. దీంతో, ఇరాన్ ప్రకటనపై ఇజ్రాయెల్ ఘాటుగా స్పందించింది. తాజాగా ఇజ్రాయెల్ మంత్రి బెన్నీ గాంట్జ్ మాట్లాడుతూ.. ఇరాన్‌పై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము. దీని కోసం తగిన సమయం, పద్దతిని ఎంచుకుంటామని సంచలన కామెంట్స్ చేశారు. -
ఇరాన్‌కు ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్‌కు బైడెన్ వార్నింగ్!
టెల్ అవీవ్: ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్‌పైకి వందల సంఖ్యలో మిస్సైల్స్, డ్రోన్స్ దూసుకెళ్లాయి. ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్’ పేరుతో విడతల వారీగా డ్రోన్లను ప్రయోగించింది. తర్వాత సైనిక స్థావరాలే లక్ష్యంగా క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. కానీ, ఇజ్రాయెల్ రక్షణ కవచం ముందు ఇరాన్ పాచిక పారలేదు. దీంతో, ఇరాన్ దాడులు దాదాపు ఫెయిల్ అయ్యాయి. ఇక, దాడుల అనంతరం ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ప్రపంచ శాంతి కోసం ఇరాన్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగించే ఉద్దేశ్యమేమీ లేదు. ఇజ్రాయెల్ కవ్విస్తే మాత్రం కచ్చితం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడమని హెచ్చరించింది. దీంతో, ఇరాన్ ప్రకటనపై ఇజ్రాయెల్ ఘాటుగా స్పందించింది. తాజాగా ఇజ్రాయెల్ మంత్రి బెన్నీ గాంట్జ్ మాట్లాడుతూ.. ఇరాన్‌పై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము. దీని కోసం తగిన సమయం, పద్దతిని ఎంచుకుంటామని సంచలన కామెంట్స్ చేశారు. 3 super power ( USA +UK +France ) helped Isreal to repel 300 drones and missiles attack by Iran. By doing so they sided with the Israeli act of bombing Embassy bldg of Iran in Syria !! Does it means no Embassy is safe in any country and it can be bombed just like that ? 🤔 pic.twitter.com/U5YUaSm7Fh — S K Mehta (@kooky_skm) April 15, 2024 ఇదిలా ఉండగా.. ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనను విరమించుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సూచించారు. ఈ క్రమంలో ఇరాన్‌పై ఇజ్రాయెల్ నేరుగా దాడులు చేస్తే అమెరికా సహకరించబోదని బైడెన్ స్పష్టం చేసినట్టు సమాచారం. ఇజ్రాయెల్ ప్రతిదాడికి పాల్పడితే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయని అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది. మరోవైపు.. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్‌కు పెద్దగా నష్టమేమీ సంభవించలేదు. ఇరాన్ ప్రయోగించిన వాటిలో 99శాతం డ్రోన్లు, క్షిపణులను అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ల సాయంతో ఆ దేశం సమర్థంగా నేలకూల్చింది. తాజా పరిణామంతో ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ ఎదురుదాడులకు దిగితే ప్రాంతీయంగా పరిస్థితులు చేయిదాటేపోయే ముప్పు మాత్రం ఉంది. More and more videos coming out of Iran revealing that a lot of drones and missiles malfunctioned and fell down on Iranian towns and villages. The Islamic regime is a risk to the lives of all decent Iranians who don’t want the Mullahs to rule their lives pic.twitter.com/sU6BREHfyA — Visegrád 24 (@visegrad24) April 14, 2024 ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ఇలా.. పేట్రియాట్: చాలా కాలం నుంచి ఇజ్రాయెల్ ఈ క్షిపణి రక్షణ వ్యవస్థను వినియోగిస్తోంది. 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధంలో వీటి పేరు ప్రముఖంగా వినిపించింది. ఇరాక్ ప్రయోగించిన స్కడ్ క్షిపణులను ఇవి విజయవంతంగా అడ్డుకున్నాయి. ఇప్పుడు వీటిని విమానాలను, డ్రోన్లు కూల్చడానికి ఇజ్రాయెల్ వినియోగిస్తోంది. ది యారో: దీన్ని అమెరికా రూపొందించింది. ఇది గగనతల రక్షణ వ్యవస్థ. బాలిస్టిక్ సహా ఏ తరహా దీర్ఘ శ్రేణి క్షిపణులనైనా అడ్డుకోగలదు. భూవాతావరణం వెలుపలా పనిచేసే సామర్థ్యం దీనికి ఉంది. హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో యెమెన్ నుంచి హూతీ వేర్పాటువాదులు ప్రయోగించిన క్షిపణులను ఈ యారో వ్యవస్థతోనే ఇజ్రాయెల్ అడ్డుకుంటోంది. డేవిడ్ స్లింగ్: ఇది కూడా అమెరికా తయారుచేసిందే. మధ్య శ్రేణి క్షిపణులను అడ్డుకోవడానికి ఉపయోగపడుతుంది. లెబనాన్ నుంచి హెజ్బొల్లా ప్రయోగించే మిసైళ్లను అడ్డుకోవడానికి ఈ వ్యవస్థనే ఇజ్రాయెల్ ఎక్కువగా వినియోగిస్తోంది. ఐరన్ బీమ్: ఇజ్రాయెల్ కొత్తగా దీన్ని అభివృద్ధి చేసింది. లేజర్ సాంకేతికతతో పనిచేస్తుంది. మిగతా గగన రక్షణ వ్యవస్థలతో పోలిస్తే దీనికి తక్కువ ధర ఉంటుంది. ఇరాన్ శనివారం చేసిన దాడిలోనూ ఈ లేజర్ వ్యవస్థను వాడినట్లు తెలుస్తోంది. ఐరన్ డోమ్: అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ తయారుచేసిన వ్యవస్థ. తక్కువ దూరం నుంచి ప్రయోగించే రాకెట్లను ఇది అడ్డుకుంటుంది. లెబనాన్ హెజ్బొల్లా, గాజా నుంచి హమాస్ ప్రయోగించే రాకెట్లను గత కొన్ని సంవత్సరాలుగా ఐరన్ డోమ్ వ్యవస్థ అడ్డుకుంటోంది. ఏ దేశమైనా రాకెట్లను ప్రయోగించగానే ఆటోమెటిక్‌గా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. క్షిపణులను అడ్డుకుంటుంది. Who are you supporting in this war? RT for Iran 🇮🇷 LIKE for Israel 🇮🇱 Israel-Iran might spark World War III USA, NATO, UK, ISRAEL Vs IRAN, RUSSIA, CHINA, NORTH KOREA#WorldWar3 #IranAttack #Israel #IranAttackIsrael #WWIII#IsraelUnderAttack pic.twitter.com/j9oStfqh2n — 𝓶𝓮𝓜𝓮𝓻𝓪𝓳 (@_meMeraj) April 15, 2024 -
వణుకు పుట్టిస్తున్న ఇరాన్ ప్రకటన.. ఇజ్రాయెల్, అమెరికా ప్లానేంటి?
టెల్ అవీవ్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ప్రపంచ దేశాలు మరో మారణహోమం చూడాల్సిందేనా? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై దాడులు చేసేందుకు ఇరాన్ ఉరకలేస్తోంది. ఏ క్షణంలోనైనా ఇరాన్ దాడులు చేసే అవకాశముందని అమెరికా నిఘా వర్గాలు సైతం హెచ్చరించడం తీవ్ర కలకలం సృష్టించింది. యుద్ధ ప్రకటన కారణంగా ప్రపంచ దేశాల్లో ఆందోళన నెలకొంది. రానున్న 24 నుంచి 48 గంటల్లోపు దాదాపు 100కు పైగా డ్రోన్లు, 150కు పైగా క్షిపణులతో ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్‌పై విరుచుకుపడేందుకు ఇరాన్ సిద్ధమైందన్నట్టు అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా తాము ఇరాన్ చేయబోయే ఎలాంటి దాడినైనా ఎదుర్కొవడానికి రెడీ అయినట్టు ప్రకటించింది. మరోవైపు.. ఇరాన్ దాడులు చేస్తుందన్న కారణంగా ఇజ్రాయెల్‌కు అమెరికా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇరాన్‌ను ఎదుర్కొవడానికి ఇజ్రాయెల్, అమెరికా సన్నద్ధమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇరాన్ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం స్పందించారు. బైడెన్ మాట్లాడుతూ..‘మేము అనుకున్న సమయం కంటే ముందే ఇరాన్ దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మేము ఇజ్రాయెల్ రక్షణకు సిద్ధంగా ఉన్నాము. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇస్తోంది. ఇజ్రాయెల్‌ను రక్షించడంలో మా వంతు పాత్ర పోషిస్తాము. ఈ యుద్ధంలో ఇరాన్ విజయం సాధించబోదు’ అని అన్నారు. మరోవైపు, టెల్ అవీవ్ చేరుకున్న అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ మైకెల్ ఎరిక్ కొరిల్లా ఇజ్రాయెల్ యుద్ధ సన్నద్ధతను సమీక్షించారు. ఆ దేశ రక్షణ మంత్రి యోయావ్ గాలాంట్‌తో కలిసి హెట్జోర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. "ఇజ్రాయెల్, అమెరికాలను ఓడించగలమని మా శత్రువులు భావిస్తున్నారు. కానీ జరిగేది అందుకు వ్యతిరేకం. వారు మమ్మల్ని మరింత దగ్గరకు చేరుస్తున్నారు. మా బంధాన్ని బలోపేతం చేస్తున్నారని" తెలిపారు. The City of ballistic missiles in #IRAN . 🔻 pic.twitter.com/pIMgDjOaV3 — 🇵🇸ليلى (@Lailafatimeh) April 13, 2024 చెతులెత్తేసిన అరబ్ దేశాలు.. ఇజ్రాయెల్‌కు అండగా ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తే తాము సహకరించబోమని కొన్ని అరబ్ దేశాలు పేర్కొంటున్నాయి. ఖతార్, కువైట్ ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఇరాన్‌పై దాడికి తమ దేశ గగనతలాన్ని గానీ.. స్థావరాలను గానీ.. అమెరికా వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వబోమని స్పష్టంచేశాయి. సౌదీ అరేబియా సహా మిగతా అరబ్ దేశాలూ అదే బాట పట్టే అవకాశం ఉంది. దీంతో, ఇరాన్‌పై అమెరికా దాడులు ఎలా చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్ ఒకటోతేదీన ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇద్దరు సైనిక జనరళ్లు సహా ఏడుగురు అధికారుల మరణమే ఈ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. యుద్ధవాతావరణం నెలకొనడంతో ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్‌కు వెళ్లొద్దని తమ పౌరులకు అమెరికా, ఫ్రాన్స్ దేశాలు హెచ్చరికలు జారీచేశాయి. ఉద్రిక్తతను మరింత పెంచొద్దని ఇరాన్‌కు నచ్చజెప్పాలని టర్కీ, చైనా, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఫోన్లో కోరారు. #Iran is Ready. All #Iranian nation is ready. It's a matter of time now. When and where? Stay tuned. pic.twitter.com/IiMR9jqwIy — Nasir Gulzar (@nasirgulzar020) April 13, 2024 ఇజ్రాయెల్, ఇరాన్‌లకు వెళ్లకండి: భారత సర్కార్ ఆదేశం తాము చెప్పే వరకూ ఇజ్రాయెల్, ఇరాన్‌లకు ప్రయాణాల పెట్టుకోవద్దని పౌరులకు భారత విదేశాంగ శాఖ సూచించింది. ఈ మేరకు శుక్రవారం అడ్వైజరీని విడుదలచేసింది. ఇప్పటికే ఆ దేశాల్లో ఉంటే భారతీయ ఎంబసీల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. నిర్మాణరంగంలో కార్మికులుగా భారత్ నుంచి ఇకపై ఎవరినీ ఇజ్రాయెల్‌కు పంపబోమని భారత్ స్పష్టం చేసింది. -
ఎవరు గెలిస్తే ఇండియాకు మేలు?
భారతదేశ వ్యూహాత్మక అవసరాలు తీరేందుకు జో బైడెన్ అమెరికా అధ్యక్ష స్థానంలో ఉండటం అవసరం. అయితే డెమోక్రాట్లకు బీజేపీ అంటే అసలు పడటం లేదు. ట్రంప్‌కు బీజేపీ రాజకీయాలంటే పట్టింపేమీ లేదు కానీ.. ఎప్పుడెలా స్పందిస్తారో తెలియదు! అయితే, ట్రంప్ అధికారంలో ఉండగా ఇతర దేశాల కంటే చాలా తక్కువ నష్టం భారత్‌కు జరిగిన విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. చైనాతో ట్రంప్ తెగదెంపులు చేసుకోవడం వల్లనే ట్రంప్ ప్రభుత్వం పుల్వామా, గల్వాన్ ఘటనల్లో భారత్‌కు మద్దతుగా నిలిచింది. అయితే రెండోసారి అధికారం చేపడితే ట్రంప్ వ్యవహారశైలి ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించలేము. అలాంటి నేపథ్యంలో భారతీయ దౌత్యం అవసరం మరింత ఎక్కువవుతుంది. అమెరికా రాజకీయాలు... భారత్‌లో వాటి ప్రభావం అన్న అంశాన్ని తీసుకుంటే నాలుగు అంశాలు పరస్పర విరుద్ధంగా కనిపిస్తాయి. మొదటగా చెప్పు కోవాల్సింది చైనాను నియంత్రించే విషయంలో బైడెన్ ఇండో పసఫిక్ ప్రాంతంలో తీసుకున్న చర్యలు. ఈ చర్యలన్నీ బాధ్యతాయుతమైనవే కాదు, ఒక పద్ధతి ప్రకారం చేసినవి కూడా. కాకపోతే ఉక్రెయిన్, గాజా యుద్ధాల కారణంగా చైనాపై శ్రద్ధ కొంత తగ్గిందనడం కూడా సత్య దూరమేమీ కాదు. బైడెన్ నేతృత్వంలో క్వాడ్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. జపాన్ తన మిలిటరీ ఆధునికీకరణ చేపట్టింది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా భద్రతాంశాలపై త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చు కున్నాయి. అలాగే జపాన్, ఫిలిప్పీన్్స, అమెరికా మధ్య కూడా ఒక ఒప్పందం కుదిరింది . ఫిలిప్పీన్్సలో అమెరికా ఉనికి మరింత పెరిగింది. ‘ఆకస్’(ఆస్ట్రేలియా, యూకే, యూఎస్) ప్రకటన జరిగింది. దక్షిణ పసిఫిక్ ద్వీపాల ప్రాముఖ్యతనూ అమెరికా గుర్తించడం గమ నార్హం. ఆసియాన్ నేతలకు వైట్‌హౌస్ ఆతిథ్యమిచ్చింది. తైవాన్‌లో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగింది. వియత్నాంతో అమెరికాబంధం మరింత దృఢపడింది. అలాగే చైనాపై అమెరికా కఠినమైనటెక్ నిషేధాలు కూడా విధించింది. ఇదే సమయంలో ఘర్షణ మరింత ముదరకుండా వ్యూహాత్మకంగా ఒకవైపు చైనాతో చర్చలు కొనసా గిస్తూనే మరోవైపు ఆ దేశంతో తన పోటీతత్వానికి మరింత పదును పెట్టింది. అమెరికా ఆలోచనల్లో భారత్ కనీసం నాలుగు విధాలుగా ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తుంది. ప్రపంచస్థాయి చర్చల్లో భారత్ కీలక మైన భాగస్వామి అని బైడెన్ ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. ఈ కారణంగానే భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సమావేశాలకు పూర్తి స్థాయిలో అమెరికా మద్దతిచ్చింది. ఐఎంఈసీ, ఐ2యూ2, క్వాడ్, ఐపీఈఎఫ్, మినరల్ సెక్యురిటీ పార్ట్నర్షిప్, ఆర్టిమిస్ అకార్డ్స్ వంటి వేర్వేరు వ్యవస్థల్లో భారత్‌ను కీలకంగా మార్చింది. ఇంధనం నుంచి ఆహార భద్రత, వాతావరణ మార్పులు మొదలుకొని కోవిడ్ వంటి మహమ్మారుల నిర్వహణ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన వంటి అన్ని ప్రపంచస్థాయి సమస్యల పరిష్కారంలో భారత్ భూమిక తప్పదన్న విషయం కూడా అమెరికా గుర్తించింది. భారత్ సామర్థ్యాన్ని పెంచడం ప్రపంచ సమస్యల పరిష్కార బాధ్యతను పంచుకోవడం అవుతుందని అమెరికా భావిస్తోంది. దీనివల్ల అటు చైనాను నియంత్రించడం, దక్షిణాసియా ప్రాంతంలో భద్రతను కాపాడటం కూడా సాధ్యమన్నది అమెరికా అంచనా. అలాగే సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి తగిన వ్యవస్థలను ఏర్పాటు చేయడం, కలిసికట్టుగా తయారీ చేపట్టడం, రక్షణ రంగంలో సహకారం, అమెరికాలోని పెద్ద పెద్ద కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెడుతూండటం భారత్‌పై పెరుగుతున్న అమెరికా విశ్వాసానికి నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. భారత్ భౌగోళిక స్వరూపం, ఇరుగు పొరుగు, చరిత్ర వంటి అనేక అంశాల ఆధారంగా బైడెన్ యంత్రాంగం ఈ దేశం తన ప్రయోజనాలు సాధించుకునేందుకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తోంది. కొన్నిసార్లు విభేదించినా భూ దక్షిణార్ధగోళం మొత్తమ్మీద భారత్ పరపతి చైనా కంటేఎంతో మెరుగని అమెరికా భావిస్తోంది. ఇక రెండో విషయానికి వద్దాం. డెమోక్రాట్లు ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీతో అంత సౌకర్యంగా ఏమీ లేరు. ఇందుకు మూడు కారణాలు కనిపిస్తాయి. ప్రజాస్వామ్యం విషయంలో పార్టీ ధోరణి మారిపోవడం ఇందులో ఇకటి. యూఎస్ కాంగ్రెస్‌లోని ఐదుగురు దేశీ ప్రతినిధులు డెమోక్రాట్లే కావడం గమనార్హం. ఆధిపత్య ధోరణులకు దూరంగా ఉండాలన్న కాంక్ష, మైనారిటీలకు గుర్తింపు ఉండాలన్న భావనలు వీరిని డెమోక్రాట్ పార్టీ వైపు మళ్లించాయి. జాతి ఆధారిత నేషనలిజమ్పై కూడా వీరికి నమ్మకం లేదు. బీజేపీ ఇప్పుడు ఈ విలువలన్నింటికీ దూరమన్న అంచనా డెమోక్రాట్లలో బలపడుతోంది. రెండో కారణం అమెరికన్ ముస్లింల ప్రభావం. డెమోక్రాట్లలో భార తీయ అమెరికన్ ముస్లింల ప్రభావం కూడా క్రమేపీ ఎక్కువ అవుతోంది. బైడెన్ గాజా విషయంలో ఇప్పటికే వీరి నుంచి కొంత వ్యతిరే కత ఎదుర్కొంటున్నారు. మిషిగన్ వంటి స్వింగ్స్టేట్లో దీని ప్రభా వమూ కనిపించింది. మూడో కారణం... డెమోక్రాట్లు ట్రంప్ రాజకీ యాలను వ్యతిరేకిస్తారు. ట్రంప్ ప్రజాస్వామ్యానికి ఎలా వ్యతిరేకం అన్న విషయంపై ఈ రాజకీయాలు మొత్తం ఆధారపడి ఉంటాయి. ఫలితంగా వీరు మానవహక్కుల వంటి విషయాలకు అనుకూలంగా ఉండాల్సి ఉంటుంది. పౌరసత్వ (సవరణ) చట్టం విషయంలో ఇటీవలి కాలంలో భారత్, అమెరికా మాటా మాటా అనుకున్న విషయం ఒకసారి గుర్తు చేసుకుందాం. అయితే ఈ విషయాలన్నింటినీ తప్పుకొని మరీ పని చేసేందుకు బైడెన్యంత్రాంగం ఒక మార్గాన్ని గుర్తించింది. అంశా లను బహిరంగంగా కాకుండా, ప్రైవేట్‌గా ప్రస్తావించడం. అడపాద డపా ఎవరైనా అడిగితే నర్మగర్భంగా బహిరంగ వ్యాఖ్యలు చేయడం. అమెరికాలో భారత్‌పై ఆందోళన చెందుతున్న బీజేపీయేతర పార్టీలకు సంఘీభావ సంకేతం పంపేందుకు ఇలా చేస్తుందన్నమాట. ఉన్నతా ధికారులు, నేతలకు మాత్రం విషయం సుస్పష్టం. మూడో అంశం... డోనాల్డ్ ట్రంప్ హ్రస్వదృష్టి. ఇందులో మైనారి టీలు, మతపరమైన అంశాలు, ఎన్నికల వ్యవస్థ చేతనావస్థ వంటి వాటికి చోటు లేదు. బహుశా క్రైస్తవుల హక్కుల గురించి ట్రంప్ కొంత ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సువార్తికులకు ఈయన కొంచెం తలొగ్గుతూంటారు.అధ్యక్ష ఎన్నికల్లో కొంచెం ముందున్న ట్రంప్ భారత్ ప్రయోజనా లకు అనుకూలంగా ఉంటాడని అనుకోలేము. అయితే, ట్రంప్ అధికా రంలో ఉండగా ఇతర దేశాల కంటే చాలా తక్కువ నష్టం భారత్‌కు జరిగిన విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. చైనాతో ట్రంప్ తెగదెంపులు చేసుకోవడం వల్లనే ట్రంప్ ప్రభుత్వం పుల్వామా, గల్వాన్ ఘటనల్లో భారత్‌కు మద్దతుగా నిలిచింది. అయితే రెండోసారి అధి కారం చేపడితే ట్రంప్ వ్యవహారశైలి ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించలేము. అమెరికాలో రాజకీయపరమైన అస్థిరత, విభజన ఉండటం ఉక్రెయిన్, యూరప్ దేశాల నిరుత్సాహానికి తద్వారా అమెరికా ప్రత్య ర్థులకు బలాన్ని ఇస్తుంది. అందుకే అమెరికా ప్రత్యర్థులు... డెమో క్రాట్లు అంటే ఇష్టం లేని కొందరు అమెరికా స్నేహితులు కూడా ట్రంప్ విజయాన్ని కోరుకుంటున్నారు. ఒక ఉదాహరణ తీసుకుందాం. బీజింగ్ ఇప్పటికే అమెరికా వ్యవ హారాన్ని తిరిగి మొదలుపెట్టింది. ట్రంప్‌కు సాయపడేలా ఎన్నికల్లో తప్పుడు ప్రచారాన్ని కూడా మొదలుపెట్టిందన్న వార్తలూ ఉన్నాయి. తన ప్రయోజనాలు కాపాడేలా చేస్తే వాణిజ్య పునరుద్ధరణ సాధ్యమే అని చైనా ట్రంప్‌కు సంకేతాలిచ్చినా ఆశ్చర్యం లేదు. టిక్టోక్ విష యంలో ట్రంప్ తన మునుపటి వైఖరిని మార్చుకున్న విషయంఇక్కడ చెప్పుకోవాలి. అమెరికన్ రాజ్యాంగంపై పోరు చేస్తామన్నట్రంప్ వ్యాఖ్య, వ్యాపార వాణిజ్య వ్యవహారాల్లో దుందుడుకుతనం, ఆసియా, యూరప్‌లలోని కొన్ని మిత్రదేశాలతోనూ దురుసుగా వ్యవహరించడం వంటివి చూస్తే ట్రంప్ మరోసారి అధికారంలోకి వస్తే ప్రపంచం మరోసారి గందరగోళంలో పడుతుందనేది మాత్రం వాస్తవం. అలాంటి నేపథ్యంలో భారతీయ దౌత్యం అవసరం మరింత ఎక్కువవుతుంది. ఈ విషయంలో భారత్ ఎంతో కొంత ఆందోళనచెందాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. - వ్యాసకర్త జర్నలిస్ట్ మరియు కాలమిస్ట్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)ప్రశాంత్ ఝా -
ఇజ్రాయెల్‌కు టెన్షన్.. ఇరాన్ సంచలన ప్రకటన!
జెరూసలెం: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందనే వార్తలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈ మేరకు అమెరికా కూడా ఇజ్రాయెల్‌ను హెచ్చరిండంతో ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అలర్ట్ అయ్యారు. కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుత పరిస్థితిల్లో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తప్పదేమోనన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌ను శిక్షించే సమయం ఆసన్నమైందంటూ గురువారం ఇరాన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ ఐఆర్ఎన్ఏ పేర్కొంది. దాడి ఎలా చేయాలన్న విషయంలోనే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. దీంతో, ఇజ్రాయెల్‌పై ఏ క్షణంలోనైనా ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇరాన్ దాడులు గురించి అమెరికా కూడా హెచ్చరించింది. అయితే, ఏప్రిల్ ఒకటో తేదీన సిరియాలోని కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ వాయుసేన దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన టాప్ మిలటరీ జనరల్‌తో పాటు ఆరుగురు అధికారులు మరణించారు. దీంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం, ఇరాన్ సుప్రీం అధినేత అయతుల్లా అలీ ఖొమేనీ సహా సైనిక జనరళ్లు కూడా ఇజ్రాయెల్‌ను శిక్షిస్తామని బహిరంగ ప్రకటనలిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సమయం కోసం ఇరాన్ వేచిచూస్తున్నట్టు సమాచారం. అయితే, ఇజ్రాయల్‌పై నేరుగా ఇరాన్ దాడి చేయకపోవచ్చని, లెబనాన్ లేదా సిరియా నుంచి తన మద్దతుదారులైన హెజ్బొల్లా, ఇతర మిలిటెంట్ సంస్థలతో దాడులు చేయించొచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, ఈ యుద్ధ భయంతో టెహ్రాన్‌కు ఈ నెల 13 వరకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్టు జర్మనీ ఎయిర్‌లైన్స్ లుఫ్తాన్సా ప్రకటించింది. ఇజ్రాయెల్, లెబనాన్, పాలస్తీనియన్ వంటి పశ్చిమాసియా ప్రాంతాలకు ప్రయాణించవద్దంటూ రష్యా విదేశాంగ శాఖ తన పౌరులకు సూచించింది. బైడెన్ కీలక ప్రకటన.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేసే అవకాశమున్న నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఇజ్రాయెల్‌కు తాము పూర్తిస్థాయిలో అండగా నిలుస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు. ఆ దేశ రక్షణకు, భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌తో యుద్ధంలో అమెరికా భాగస్వామ్యమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019