breaking news
-
దేశంలో నెం.1 ఐటీ కంపెనీ.. 19 ఏళ్లలో తొలిసారి ఇలా..
దేశంలో నంబర్ వన్ ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఉద్యోగుల సంఖ్య తొలిసారి తగ్గింది. టీసీఎస్‌లో హెడ్‌కౌంట్ తగ్గడం కంపెనీ 2004లో లిస్ట్ అయినప్పటి నుంచి 19 ఏళ్లలో ఇదే మొదటిసారి అని కంపెనీ వెల్లడిందింది. హెడ్‌కౌంట్ అనేది ఒక నిర్దిష్ట వ్యవధిలో కంపెనీలో లేదా నిర్దిష్ట విభాగంలో పని చేసే సిబ్బంది సంఖ్యను సూచిస్తుంది. 202-24 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య 13,249 తగ్గి మొత్తం సిబ్బంది సంఖ్య 6,01,546కి తగ్గిపోయిందని టీసీఎస్ ప్రకటించింది. ఇక కొత్త ఉద్యోగుల నికర చేరిక మొత్తం సంవత్సరానికి కేవలం 22,600 మాత్రమే. 2022 ఆర్థిక సంవత్సరం డేటాను పరిశీలిస్తే ఆ ఏడాది కంపెనీ 1.03 లక్షల మంది ఉద్యోగులు పెరిగారు. క్యూ 4లో కంపెనీ హెడ్‌కౌంట్ 1,759 తగ్గింది. టీసీఎస్‌లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 5,680 తక్కువ. అలాగే రెండవ త్రైమాసికంలో కంపెనీలో మొత్తంంగా 6,333 మంది ఉద్యోగులు తగ్గారు. అయితే 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ 523 మందిని అధికంగా నియమించుకుంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 24 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో టీసీఎస్ లాభం 9 శాతం పెరిగి రూ. 12,434 కోట్లకు చేరుకుంది. మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలానికి దాని ఆదాయం కూడా 3.5 శాతం పెరిగి రూ. 61,237 కోట్లకు చేరుకుంది. కంపెనీ లాభం అంచనాలను అధిగమించినప్పటికీ, దాని ఆదాయం మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. మరోవైపు టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ 2024 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అట్రీషన్ (రిటైరవడం, తొలగించడం లేదా మానేయడం ద్వారా కంపెనీని వీడటం) రేటులో 12.5 శాతం క్షీణతను నివేదించారు. రానున్న రోజుల్లో ఈ రేటు మరింత తగ్గుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. -
టీసీఎస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి..
దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు జీతాలు పెంచింది. 4.5 నుంచి 7 శాతం శ్రేణిలో వార్షిక ఇంక్రిమెంట్లను ప్రకటించింది. టాప్ పెర్ఫార్మర్లకు రెండంకెల పెంపుదల ఉంటుందని చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. ఈ వేతనాల పెంపు ఏప్రిల్ 1 నుంచి అమలు కానుందని చెప్పారు. "క్యాంపస్ నియామకాలు, పెరిగిన కస్టమర్ విజిట్ల ఫలితంగా అట్రిషన్ 12.5 శాతానికి తగ్గింది. ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి రావడం మా డెలివరీ సెంటర్లలో గొప్ప చైతన్యాన్ని కలిగించింది. మా సహచరుల ఉత్సాహాన్ని పెంచింది" అని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ కొంత మంది పర్ఫార్మర్లకు 12-15 శాతం వరకు జీతాలను పెంచి ప్రమోషన్స్ సైకిల్‌ను ప్రారంభించింది. ఈ పెంపుదల 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. ఫలితాలను ప్రకటించిన తర్వాత లక్కాడ్ మీడియాతో మాట్లాడుతూ, 2023-24లో కంపెనీ చాలా మంది ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేసిందని, అయితే, ఇంకా కొంతమందిని చేర్చుకోవాల్సి ఉందని అన్నారు. ఈ మిగిలిన ఫ్రెషర్లను ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో చేర్చుకుంటామని ఆయన తెలిపారు. కాగా 2024 ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్లను చేర్చుకోవాలని యోచిస్తున్నట్లు గతంలో టీసీఎస్ తెలిపింది. అయితే, బడ్జెట్ పరిమితుల కారణంగా ఫ్రెషర్లు, ఇతర నియామకాల ఆన్‌బోర్డింగ్‌ను ఆలస్యం చేస్తోంది. -
వందలాది ఉద్యోగులు ఇంటికి.. ఐటీ కంపెనీ నిర్ణయం
EXL Layoffs: ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో లేఆఫ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న టెక్ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే న్యూయార్క్ కేంద్రంగా ఉన్న ఎక్సెల్ సర్వీస్ (Exl Service) అనే ఐటీ సంస్థ ఏఐ డిమాండ్ పేరుతో వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐకి పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా న్యూయార్క్ ఆధారిత ఐటీ సంస్థ ఎక్సెల్ సర్వీస్ తన కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరిస్తోంది. ఇందులో భాగంగా 800 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. వీరు కంపెనీ మొత్తం ఉద్యోగులలో 2 శాతం కంటే తక్కువే అని తెలుస్తోంది. కంపెనీ తాజా నిర్ణయం కారణంగా భారత్, అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. వీరిలో 400 మందిని పూర్తిగా ఇంటికి పంపిస్తుండగా మిగిలిన 400 మందికి కంపెనీలోని ఇతర విభాగాల్లో అవకాశం ఇవ్వనుంది. ఉద్యోగాల కోత ప్రాథమికంగా యునైటెడ్ స్టేట్స్, భారత్‌లో డేటా అనలిటిక్స్, డిజిటల్ ఆపరేషన్స్‌లో పనిచేస్తున్న జూనియర్ స్థాయి ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని వెల్లడైంది. ఎక్సెల్ సర్వీస్ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 55 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. గతంలో కంపెనీ సీఈవోగా ఉన్న రోహిత్ కపూర్ ప్రస్తుతం బోర్డు చైర్మన్‌గా పదోన్నతి పొందారు. అలాగే వికాస్ భల్లా, వివేక్ జెట్లీ అనే ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు డేటా, ఏఐ ఆధారిత సొల్యూషన్స్‌తో కూడిన విస్తృత బాధ్యతలను స్వీకరిస్తున్నారు. కాగా ప్రస్తుతం తొలగిస్తున్న వారి స్థానంలో ఏఐ, డేటాలో అత్యంత పరిజ్ఞానం, నైపుణ్యం ఉన్నవారిని నియమించుకోనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ తమ క్లయింట్స్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను నియమించుకోవాల్సి ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. -
ఆశగా ఎదురుచూస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్
నాస్డాక్-లిస్టెడ్ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ ఉద్యోగులకు చేదు వార్త ఇది. ఏప్రిల్‌లో జరగాల్సిన జీతాల పెంపు వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ ఏడాది ఆగస్టు 1 నుండి "అర్హత" ఉన్న ఉద్యోగులకు జీతాల పెంపును అందజేస్తుందని ‘మనీకంట్రోల్’ నివేదించింది. జీతాల పెంపు గత సంవత్సరంతో పోలిస్తే సుమారు నాలుగు నెలల ఆలస్యం కానుంది. స్థూల ఆర్థిక సమస్యల కారణంగా కంపెనీ బలహీనమైన డిమాండ్ వాతావరణాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో జీతాల పెంపు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఈ అంశం ఇతర ఐటీ కంపెనీలను కూడా ప్రభావితం చేయనుంది. జీతాల పెంపు ఆలస్యాన్ని కంపెనీ సైతం ధ్రువీకరించినట్లు మనీకంట్రోల్ పేర్కొంది. “వార్షిక మెరిట్ పెంపుదల, బోనస్‌ల ద్వారా మా ఉద్యోగుల కృషి, అంకితభావాన్ని గుర్తించడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఈ నిబద్ధతలో భాగంగా, అర్హతగల అసోసియేట్లకు మెరిట్ పెంపుదల ఈ సంవత్సరం ఆగస్టు 1న అందిస్తాం. ముఖ్యంగా మూడు సంవత్సరాలలో మా చాలా మంది ఉద్యోగులకు నాలుగు మెరిట్ హైక్స్ దక్కాయి” అని కంపెనీ పేర్కొంది. తాజా చర్యతో మెజారిటీ కాగ్నిజెంట్ ఉద్యోగులు మూడు సంవత్సరాలలో నాలుగు పెంపులను అక్టోబర్ 2021, అక్టోబర్ 2022, ఏప్రిల్ 2023, ఆగస్టు 2024 పొందుతున్నట్లవుతుంది. కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా 3.47 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. వీరిలో దాదాపు 2.54 లక్షల మంది భారత్‌లోనే ఉన్నారు. -
వర్క్ ఫ్రమ్ ఆఫీస్.. మరో ఎత్తు వేసిన ఇన్ఫోసిస్!
దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పించడానికి మరో ఎత్తు వేసినట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్-ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ENG-IoT) ప్రాజెక్ట్‌లలో పనిచేసే ఉద్యోగులకు 'ఇన్-పర్సన్ కొల్లాబ్ వీక్స్'ని అమలు చేస్తోంది. తాము సమీక్షించిన ఇన్ఫోసిస్ ఉద్యోగుల ఈమెయిల్స్ ఉటంకిస్తూ ఎకనామిక్స్ టైమ్స్ ఈమేరకు పేర్కొంది. వీటి ప్రకారం.. తమకు కేటాయించిన వారాల్లో ఉద్యోగులు వారి సంబంధిత క్యాంపస్‌లలో హాజరు కావాలి. ఆఫీస్ నుంచి పనిచేయాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతి త్రైమాసికంలో ఉద్యోగులకు నిర్దిష్ట వారాలను నిర్దేశిస్తుంది. గత ఏడాది నవంబర్‌లో ప్రవేశపెట్టిన హైబ్రిడ్ వర్క్ పాలసీ ప్రకారం, ఇన్ఫోసిస్ ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు లేదా త్రైమాసికానికి 30 రోజులు ఆఫీస్ నుంచి పని చేయాలి. ఈ హైబ్రిడ్ వర్క్ అప్రోచ్ ద్వారా టీమ్ వర్క్, ఉత్పాదకతను పెంపొందించడం ఇన్ఫోసిస్ లక్ష్యం. బేస్ లొకేషన్లకు దూరంగా ఉన్న ఉద్యోగులు ఈ వారాల్లో డెవలప్మెంట్ సెంటర్లకు తిరిగి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని కంపెనీ కోరింది. కొల్లాబ్ వీక్స్‌లో పాల్గొనే ఉద్యోగుల ఖచ్చితమైన సంఖ్య ఇంకా నిర్ణయించలేదని, ప్రతి త్రైమాసికానికి కనీసం ఆరు వారాలు ఆఫీస్ నుంచి పని చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ విధానాన్ని ఈ త్రైమాసికం నుంచి అమలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ నిర్దేశిత వారాలలో ఆఫీస్ నుంచి పనిచేసే ఉద్యోగులకు వారికి అనువైన రోజులను ఎంచుకోవడంలో సౌలభ్యాన్ని కంపెనీ అందిస్తోంది. 10 రోజుల వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నిబంధనపై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, క్యాంపస్ హాజరును పెంచాలని ఇన్ఫోసిస్ చూస్తోంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019