breaking news
-
Lok sabha elections 2024: దుమ్ము రేపుతున్న సోషల్ మీడియా
కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల.. కాదేదీ సోషల్ మీడియా ప్రచారానికనర్హం! జనాలంతా ఆ స్థాయిలో ‘సోషల్’ జీవులుగా మారిపోయారు. అందుకే ఎన్నికల పోరులో పారీ్టలు కూడా సోషల్ మీడియానే ఎక్కువగా నమ్ముకుంటున్నాయి. ప్రజల మూడ్‌తో పాటు క్షేత్రస్థాయిలో ఓటర్ల నాడిని పసిగట్టేందుకు ‘లైక్ చేయండి.. షేర్ చేయండి.. సబ్ర్‌స్కయిబ్ చేసుకోండి’ అంటూ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఎడాపెడా యాడ్లు కుమ్మరిస్తూ డిజిటల్ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. పలు పారీ్టలు లోక్‌సభ ఎన్నికల సీజన్లో సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి..! పదేళ్లుగా దేశాన్నేలుతున్న బీజేపీయే సోషల్ మీడియాలోనూ రాజ్యమేలుతోంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో కొత్త యూజర్లను ఆకట్టుకోవడంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ముందున్నాయి. ప్రస్తుత లోక్‌సభలో మూడో అతి పెద్ద పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్‌కు పెద్దగా సోషల్ ప్రాతినిధ్యం లేకపోవడం విశేషం. నేతల విషయానికొస్తే ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ ప్రత్యర్థులెవరకీ అందనంత ఎత్తులో మూడు లైక్‌లు.. ఆరు షేర్లు అన్నట్టుగా ‘సోషల్’ జర్నీలో దూసుకుపోతున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు పార్టీలు, నేతల సోషల్ మీడియా పేజీలు/ఖాతాల్లో యూజర్ల సంఖ్య పెరుగుదల, డిజిటల్ యాడ్ వ్యయాలు తదితరాలను ‘సోషల్ బ్లేడ్’ అనే ఎనలిటిక్స్ సంస్థ విశ్లేషించింది. అందులో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ‘ఎక్స్’ ఫ్యాక్టర్! సోషల్ సైట్ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో ప్రతి పార్టీ నిలకడగా యూజర్లను పెంచుకుంటూ వస్తోంది. బీజేపీ ఎక్స్ ఖాతాకు గత మూడు నెల్లలో 4 లక్షల పైచిలుకు యూజర్లు జై కొట్టారు. కాంగ్రెస్ 2.37 లక్షల కొత్త ఫాలోవర్లను సాధించింది. ఆప్‌కు 12,000 మంది నయా యూజర్లు దక్కారు. టీఎంసీని కొత్తగా ఫాలో అయిన వారి సంఖ్య 9,800. మైక్రో బ్లాగింగ్‌కు కీలక వేదికగా నిలుస్తున్న ఈ సోషల్ వేదికలో బీజేపీకి ఏకంగా 2.18 కోట్ల ఫాలోవర్లున్నారు! కాంగ్రెస్‌ను 1.04 కోట్లు, ఆప్‌ను 65 లక్షల ఎక్స్ యూజర్లు ఫాలో అవుతున్నారు. టీఎంసీ మాత్రం 6.9 లక్షలతో వెనకబడి ఉంది. యూట్యూబ్‌లో ‘ఆప్’ షో పారీ్టల ప్రసంగాలు, ప్రచార వీడియోలు, మీడియా సమావేశాలకు కీలక వేదికగా నిలుస్తున్న యూట్యూబ్‌లో ఆప్ ‘చీపురు’ తిరగేస్తోంది. కొత్త సబ్్రస్కయిబర్లను పెంచుకోవడంలో ఆప్‌తో పాటు కాంగ్రెస్ కూడా ముందుండగా బీజేపీకి మాత్రం క్రమంగా తగ్గుముఖం పట్టారు. గత మూడు నెలల్లో కేజ్రీవాల్ పార్టీ ఏకంగా 5.9 లక్షల కొత్త యూజర్లను దక్కించుకుంది. లిక్కర్ స్కాం ఆరోపణలతో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడం తెలిసిందే. ఒక్క మార్చిలోనే ఆప్ యూట్యూబ్ చానల్‌ను ఏకంగా 3.6 లక్షల మంది సబ్ర్‌స్కయిబ్ చేసుకున్నారు! బీజేపీ మాత్రం జనవరిలో 3 లక్షలకు పైగా కొత్త యూజర్లు జతయినా ఫిబ్రవరి, మార్చిల్లో భారీగా తగ్గారు. మొత్తమ్మీద 3 నెలల్లో బీజేపీ చానల్‌కు 5.3 లక్షలు, కాంగ్రెస్క 5 లక్షల మంది కొత్త యూజర్లు చేరారు. టీఎంసీ 28,000 మంది యూజర్లను సంపాదించింది. అయితే బీజేపీ వీడియోలను చూస్తున్న వారి సంఖ్య మాత్రం భారీగా పెరిగింది. జనవరి–మార్చి మధ్య ఏకంగా 43.2 కోట్ల వీక్షణలు దక్కాయి. తర్వాతి స్థానంలో ఆప్ (30.78 కోట్లు), కాంగ్రెస్ (16.69 కోట్లు), టీఎంసీ (93 లక్షలు) ఉన్నాయి. 59.9 లక్షల సబ్స్క్రయిబర్లు, 10 వేలకు పైగా వీడియోలతో యూట్యూబ్‌ను ఆప్ ఊడ్చేస్తోంది. బీజేపీ యూట్యూబ్ చానల్ 58.2 లక్షల సబ్ర్‌స్కయిబర్లు, 41 వేల వీడియోలతో ‘టాప్’ లేపుతోంది. కాంగ్రెస్‌కు 44.8 లక్షలు, తృణమూల్‌ను 5.91 లక్షల మంది సబ్‌్రస్కయిబ్ చేసుకున్నారు. ఎదురులేని మోదీ... సోషల్ మీడియా వేదికేదైనా దేశంలోనే గాక ప్రపంచంలోనే తిరుగులేని నాయకునిగా మోదీ దుమ్మురేపుతున్నారు. భారత్‌లో ఏ నాయకుడూ ఆయన దరిదాపుల్లో కూడా లేరు! గత మూడు నెలల్లో మోదీ ‘ఎక్స్’ యూజర్ల సంఖ్య 26 లక్షలు పెరిగి 9.73 కోట్లకు చేరింది. కేజ్రీవాల్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య లక్ష పెరిగి 2.74 కోట్లుగా ఉంది. రాహుల్‌గాం«దీకి కొత్తగా 5 లక్షల మంది జతయ్యారు. ఆయన యూజర్ల సంఖ్య 2.54 కోట్లకు పెరిగింది. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి స్వల్పంగా 52,000 మంది యూజర్లు దక్కారు. ఎక్స్‌లో ఆమెను 74 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇక ఎక్స్‌లో అత్యంత యాక్టివ్‌గా ఉండే రాజకీయవేత్తగా కూడా మోదీ నిలుస్తున్నారు. గత మూడు నెలల్లో మోదీ 1,367 పోస్టులు పబ్లిష్ చేశారు. కేజ్రీవాల్ 270, రాహుల్ 187 పోస్టులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇన్‌స్టాలోనూ మోదీకి ఏకంగా 8.85 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. అందులో గత మూణ్నెల్లలోనే 52 లక్షల మంది మోదీని కొత్తగా ఫాలో కావడం జెన్ జెడ్‌లోనూ ఆయన క్రేజ్‌కు అద్దం పడుతోంది. ఇన్‌స్టాలో రాహుల్‌కు 68 లక్షలు, కేజ్రీవాల్‌కు 22 లక్షలు, మమతాకు కేవలం 3.84 లక్షల ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు! ఇక యూట్యూబ్‌లోనూ మోదీదే హవా! 2.29 కోట్ల మంది సబ్స్క్రయిబర్లు ఆయన సొంతం. రాహుల్ (44.7 లక్షలు), కేజ్రీవాల్ (7.58 లక్షలు) మోదీకి ఆమడ దూరంలో ఉన్నారు. గత మూడు నెలల్లో మోదీ చానల్లో పబ్లిషైన వీడియోలకు అత్యధికంగా 47.7 కోట్ల వ్యూస్ దక్కాయి! ఇది రాహుల్, కేజ్రీవాల్ వీడియోల కంటే రెట్టింపు కావడం విశేషం. ఇన్‌స్టా.. జెన్–జెడ్ ఓటర్ల ‘డెన్’ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్.. స్టోరీస్.. పోస్ట్‌లు.. లైవ్ వీడియోలతో చెలరేగిపోతున్న నవతరం యువత (జెనరేషన్ జెడ్)కు చేరువయ్యేందుకు పారీ్టలూ పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా తొలిసారి ఓటేయనున్న యూత్‌కు అడ్డగా మారిన ఈ సోషల్ వేదికపై మరింతగా ఫోకస్ చేస్తున్నాయి. తాజా డేటా ప్రకారం మెటా ఫ్లాట్‌ఫాంలైన ఫేస్బుక్, ఇన్‌స్టా, వాట్సాప్‌ల్లో బీజేపీ, కాంగ్రెస్ గత నాలుగు నెలల్లో చేసిన యాడ్ వ్యయాల్లో సింహ భాగం ఇన్స్టాపైనే వెచి్చంచడం దీని ప్రాధాన్యానికి నిదర్శనం. గత మూడు నెలల్లో ఈ ప్లాట్‌ఫాంలో కాంగ్రెస్ 13.2 లక్షల మంది ఫాలోవర్లను పెంచుకోగా బీజేపీ (8.5 లక్షలు), ఆప్ (2.3 లక్షల)తో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. టీఎంసీకి 6,000 మంది కొత్త యూజర్లు దక్కారు. మొత్తం ఫాలోవర్ల విషయానికొస్తే, బీజేపీకి 76 లక్షలు, కాంగ్రెస్‌కు 43 లక్షలు, ఆప్‌కు 12 లక్షలు, తృణమూల్‌కు కేవలం 1.1 లక్షల మంది ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జిమ్‌లో వర్కౌట్ : క్రేజీ హీరోయిన్ ఫన్నీ వీడియో వైరల్
ఫ్యామిలీ స్టార్ హీరోయిన్, క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) అందానికి మాత్రమే కాదు ఫిట్‌నెస్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఇంట్రెస్టింగ్ పోస్టులు, జిమ్‌లో హెవీ వర్కౌట్స్ ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాలో ఒక వీడియో షేర్ చేసింది. ట్రైనర్ చూసేటపుడు, కెమెరా సహా ట్రైనర్ మన ముందుకు వచ్చినపుడు అనే క్యాప్షన్‌తో వర్కౌట్ ఫన్నీ చీటింగ్ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ట్రైనర్ కెమెరాను ఆమెవైపు చూపినప్పుడల్లా, వెంటనే వ్యాయామం చేయడం ప్రారంభించడం, ట్రైనర్ చూడని సమయంలో వర్కవుట్స్ ఆపేసి డాన్స్ మూమెంట్స్ చేస్తుంది. మళ్లీ అతడు చూడగానే కష్టపడి వర్కవుట్ చేస్తున్నట్లు నటించడాన్ని ఈ వీడియోలో గమనించవచ్చు. దీంతో నెటిజన్లు కోచ్ ఉన్నపుడు మేము కూడా ఇంతే అంటూ కమెంట్ చేయడం విశేషం. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) కాగా ‘సీతారామం’ చిత్రంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. త తన అద్భుతమైన నటన, అందంతో స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆ తరువాతహీరో నానీతో కలిసి ‘హాయ్ నాన్న’ చిత్రంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే విజయ దేవర కొండ సరసన నటించి మెప్పించింది ఈ బ్యూటీ. -
యోగాసనాలతో మెస్మరైజ్ చేస్తున్న ఈ స్టార్ హీరోయిన్ను చూశారా?
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ యోగాతో అదరగొడుతోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ , యోగా వర్కౌట్స్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది. సండే యోగా అంటూ క్లిష్టమైన కరీనా డైనమిక్ యోగా చక్రాసనం ఫోటోను ఇస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అంతకుముందు ఫిట్నెస్ ట్రైనర్ నమ్రతా పురోహిత్ కరీనా ఆసనాల ఫోటోలు సోషల్‌మీడియాలోపోస్ట్ చేసింది.దీన్ని విరాభద్రసనా II అని కూడా పిలుస్తారంటూ ఆమె ఫోటోను షేర్ చేసింది. దీంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను పెళ్లాడింది. ప్రస్తుతం ఇద్దరు బిడ్డల తల్లి అయిన కరీనా కపూర్ ఖాన్ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా లాక్‌డైన్ సమయంలో నుంచి నిత్యం యోగా సాధన చేస్తూ వర్కౌట్స్ వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తోన్న సంగతి తెలిసిందే View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) -
రీల్స్‌తో వేణు, శ్రీవాణి ‘మ్యూజిక్’ మామూలుగా లేదుగా!
ఆమె పేరుకు తగ్గట్టుగానే సంగీత సరస్వతి. అతను ఆమెకు దొరికిన తిరపతి లడ్డు. ఇపుడు వీరిద్దరూ సెలబ్రిటీ కపుల్‌గా సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇంతకీ వారెవ్వరో ఇప్పటికే అర్థమైపోయిందికదా. అవును వారే. సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు, సూచనలు ఇచ్చే వేణుస్వామి, యాంకర్‌గా మొదలై వీణా నైపుణ్యంతో పాపులరైన ‘వీణా శ్రీవాణి’. సోషల్ మీడియాలో ఎప్పటికపుడు అనేక పోస్ట్‌లు పెడుతూ లక్షలాది ఫాలోయర్లను సొంతం చేసుకుంది శ్రీవాణి. అనేక రకాల పాటలకు ఆమె వాయించే వీణ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలా ఇంట్రస్టింగ్ పోస్ట్‌లు, తన కచేరీలు, వీణ వీడియోలతో అభిమానులతో ఎపుడూ టచ్‌లో ఉంటుంది. తాజాగా వీరిద్దరు కశ్మీర్‌కు సమ్మర్ వెకేషన్‌కు చెక్కేశారు. దీనికి సంబంధించి రీల్స్‌ను కూడా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ ‘కింగ్ కాంగ్’ సినిమాలోఒక సీన్‌ను రీల్ చేశారు. దీంతో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు మంచులో చిల్ అవుతూ కనిపించారు. అలాగే భారతదేశపు మినీ స్విట్జర్లాండ్ శ్రీనగర్‌లో పెహల్గాం వద్ద అందమైన లోయ సమీపంలో రోజా సినిమాలోని పాటకు వరుసగా ఇద్దరూ రీల్ చేసిన వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అంతేనా ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘మిర్చి’ సినిమాలోని ‘ఎలాంటి అమ్మాయి కావాలేంటి’ అనే డైలాగులతో భర్త వేణుస్వామితో రీల్ చేయడం ఇంట్రస్టింగ్‌గా మారింది. ఆ తరువాత టాలీవుడ్ ‘మన్మధుడు’ నాగార్జున సినిమాలోని నాగ్, బ్రహ్మీ ఫన్నీ సీన్ ను రీ క్రీయేట్ చేయడం విశేషంగా నిలిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Veena Srivani (satyavani Parankusham ) (@veenasrivani_official) -
కొడుకు కల సాకారం కోసం...ఒక టీవీ నటి సాహసం, వైరల్ స్టోరీ
అమ్మ ఎపుడైనా అమ్మే. అమ్మకు ప్రత్యామ్నాయం లేదు. మాతృత్వపువిలువ, కన్నపేగు మమకారం తెలుసు. అందుకే కేన్సర్‌తో చనిపోయిన కొడుకుకల సాకారం కోసం పెద్ద సాహసానికి పూనుకుంది. 68 ఏళ్ల వయసులో ఒక టీవీ స్టార్ కొడుకు వీర్యంతో వారసురాలికి జన్మనిచ్చిన ఘటన సంచలనంగా మారింది. సహజంగా పిల్లలకు కనే అవకాశం లేనపుడో, మరేకారణాల రీత్యానో సరోగసీని ఆశ్రయిస్తుంటారు. కానీ కొడుకు కోసం సరోగసీని ఎందుచుకుంది స్పెయిన్ దేశానికి చెందిన టీవీ నటి అనా బ్రెగాన్. ఈమెకు అలెస్ లెక్వియో అనే కొడుకు ఉండేవాడు. అయితే దురదృష్టవశాత్తూ కేన్సర్‌తో 27 ఏళ్లకే కన్నుమూశాడు. అయితే మరణానికి ముందు అలెస్‌కు తండ్రి కావాలన్న కోరిక బలంగా ఉండేది. అందుకే తన స్పెర్మ్‌ను భ్రద (ఫ్రీజ్) పర్చుకున్నాడు. ముందస్తు ప్రమాదాన్ని ఊహించాడో ఏమో, విధి ఫలితమో గానీ కొన్నాళ్లకు కేన్సర్ బారిన పడ్డాడు. తన కల నెరవేరకుండానే చనిపోయాడు. అయితే తండ్రి కావాలన్న ఆశతో అఎస్ లెక్వియో తన వీర్యాన్ని భద్రపర్చిన విషయం ఇంట్లో లభించిన రశీదు ఆధారంగా అనా ఓబ్రెగాన్ తెలుసుకుంది. అంతే తల్లి మనసు తన కొడుకు కలసాకారం కోసం ఆరాటపడింది. దీనికి సంబంధించిన 2023లో వైద్యులను సంప్రదించింది. అన్ని పరీక్షల అనంతరం సరోగసికీ ఓబ్రెగాన్ శరీరం సహకరిస్తుందని వెల్లడించారు. దీంతో ప్రాణాలకు తెగించి మరీ కొడుకు వీర్య కణాలతో గర్భం దాల్చి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపాయికి అనిత అని పేరుపెట్టుకుంది. ఫస్ట్ బర్త్‌డే సందర్భంగా ఈ విషయాలను స్వయంగా అనా ఇన్‌స్టాలో ఫోటోలతో సహా షేర్ చేసింది. “అనితా, నీకు ఏడాది నిండింది. అగాధమైన చీకటిలో మునిగిపోయి, విపరీతమైన బాధతో ఛిద్రమైపోయిన నా హృదయాన్ని కాంతితో నింపేశాయ్... నీ చిరునవ్వు, ముద్దు ముద్దుమాటలు, నీ బుడిబుడి అడుగులు ఇవి చాలు నాకు.. మీ నాన్న నన్ను ఎంత ప్రేమతో చూసాడో అదే ప్రేమతో నన్ను చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఇప్పటివరకూ ఎవరూ నన్ను అలా చూడలేదు. ” అని పోస్ట్ చేసింది. ఇది నెటిజనుల చేత కంటతడిపెట్టిస్తోంది. View this post on Instagram A post shared by Ana_Obregon Oficial (@ana_obregon_oficial)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019