breaking news
-
వందేళ్లనాటి కాను(టు)క ఇది : ఇలా ఎపుడైనా ట్రై చేశారా?
ఇంట్లో పసిపాప వస్తోంది అంటే చాలు అమ్మమ్మ, నానమ్మల హడావిడి మొదలవుతుంది. పొత్తిళ్లలో బిడ్డకు కావాల్సిన మెత్తటి బట్టలు సేకరించడం, పాపాయికి సౌకర్యంగా ఉండేలా పాత చీరలతో చేసిన బొంతలు తయారీ మొదలు, కాటుక, ఆముదం లాంటివి సిద్ధం చేసుకునేందుకు రడీ అయిపోయేవారు. సహజంగాఇంట్లోనే కాటుకునే తయారుచేసుకునే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పత్తి దారంతో కొద్దిగా వామ్ము గింజలు వేసి వత్తి తయారు చేసిన దాన్ని ఆవ నూనెలో ముంచి మట్టి ప్రమిదలో దీపం వెలిగించింది. దానిపై వెడల్పాటి మూతను పెట్టింది. వత్తి మొత్తం కాలి ఆ మసి అంతా పళ్లానికి అంటుకుంది. ఈ మసిని తీసి కాజల్( కాటుక)గా తయారు చేసింది. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఆముదం, నూలు బట్ట సహాయంతో తమ నాన్నమ్మ, అమ్మమ్మ ఇలానే చేసేది అంటూ నెటిజన్లు గుర్తు చేసు కున్నారు. ఇందులో కెమికల్స్ ఉండవు. పైగా చిన్నపిల్లలకు కంటికి శీతలం కూడా అని వ్యాఖ్యానించారు.సహజమైన పదార్థాలతో ఇంట్లో తయారు చేసుకున్న కాటుక అయితే అందమైన అమ్మాయి కళ్ళు మరింత విశాలంగా బ్రైట్‌గా, బ్యూటీఫుల్‌గా మెరిసి పోతాయి. కళ్ళకి కాటుక పెట్టుకోవడం వల్ల కంటిలోని ఎర్రటి చారలు తొలగిపోతాయి. పైగా కాటుక పెట్టుకోవడం వల్ల దుమ్ము, ధూళి కణాలు కళ్ళలో పడకుండా ఉంటుంది. Did you know this 100 years old technique of Kajal making? Ingredients: Cotton, Ajwain, Mustard Oil and Ghee… pic.twitter.com/K6rF6yRcal — Aparajite | ಅಪರಾಜಿತೆ (@amshilparaghu) April 15, 2024 నోట్: చాలావరకు డాక్టర్లు శిశువులకు కాటుక పెట్టవద్దని చెబుతారు. ఎందుకంటే రసాయనాలతో తయారు చేసిన కాటుకల వల్ల కంటి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుందనేది గమనించ గలరు. -
ఇంట్లోనే హార్లిక్స్ ఇలా చేద్దామా!
బయట మార్కెట్లో దొరికే హార్లిక్స్ కొనాలంటే అందరి వల్ల కాకపోవచ్చు. ఎంత కొందామన్నా.. కనీసం వందల్లో.. ఉంటుంది దాని ధర. మరోవైపు పిల్లలుకు ఇలాంటి ఇవ్వలేకపోతున్నానే అనే బాధ కూడా ఉంటుంది. అలాంటి వారు చక్కగా కాస్త శ్రద్ధ పెట్టి ఇంట్లోనే హార్లిక్స్ చేసుకోండి ఇలా. అదీగాక మార్కెట్లో ఉండే హార్లిక్స్ రుచి కోసం ఏవేవో కలుపుతారనే పలు ఆరోపణలు ఉన్నాయి. అందులో కాస్త షుగర్, కోకో వంటి క్వాండెటీ ఎక్కువని రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. దాని బదులు ఇంట్లోనే హానికరం కానీ విధంగా మంచి హోం మేడ్ హార్లిక్స్ చేసుకోండి. అందుకు ఏం కావాలంటే.. హార్లిక్స్ తయారీకి ప్రధానంగా కావలసింది గోధుమలు. ముందుగా నాణ్యమైన గోధుమలను ఒకరోజు రాత్రి మొత్తం నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం కాటన్ వస్త్రంలో బాగా వడకట్టాలి. ఆ గోధుమలను చక్కగా ఆరబెట్టాలి. అనంతరం వాటిని దోరగా వేయించాలి. ఆ తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటిలో గుప్పెడు వేరుశనగలు, బాదం గింజలు జోడించాలి. అంటే వీటిని వేరువేరు పాత్రల్లో పోసుకొని దోరగా వేయించాలి. ఆ తర్వాత విడివిడిగా మిక్సీ పట్టాలి. ఇలా ఈ మూడింటి మిశ్రమాలను చక్కగా జల్లెడతో జల్లించుకోవాలి. జల్లించిన తర్వాత.. అందులో మెత్తటి చక్కెర పొడిని కలపాలి.. ఇలా అన్నింటిని కలిపిన పొడిని ఒక శుభ్రమైన గాజు గ్లాసులో పోసుకోవాలి. ప్రతిరోజు ఉదయం పాలల్లో ఒక స్పూన్ వేసుకుని తాగితే ఎంత హాయిగా అనిపిస్తుంది. ఇంట్లోనే మన చేత్తో తయారు చేసిన హార్లిక్స్ పిల్లలకు ఇస్తే ఆ ఫీలే వేరేలెవెల్. దీనివల్ల కృత్రిమ పదార్థాలు, కోకో పౌడర్ కలపని హార్లిక్స్ రుచిని మనం ఆస్వాదించవచ్చు. పైగా మన ఇంట్లో తయారు చేసుకున్నామనే సంతృప్తి ఉంటుంది. పోషకాహార నిపుణులు కూడా ఇలా ఇంట్లో చేసుకోవడమే మంచిదని చెబతున్నారు. మన ఆరోగ్యం కోసం ఈ మాత్రం కష్టపడలేమా? చెప్పండి!. (చదవండి: 90 శాతం మంది నీళ్లను తప్పుగానే తాగుతారు! అసలైన పద్ధతి ఇదే..!) -
Nidhi: బామ్మ మాట.... బిజినెస్ బాట
పెద్దల మాట పెరుగన్నం మూట అని ఊరికే అనలేదు. పెద్దల మాట నెలకు లక్షలాది రూపాయల ఆదాయాన్ని ఆర్జించే పెద్ద వ్యాపార సూత్రంగా మారింది. ముంబైకి చెందిన రజని, నిధి ‘గ్రాండ్మా సీక్రెట్’ పేరుతో సరదాగా ప్రారంభించిన హోమ్ మేడ్ హెయిల్ ఆయిల్ బిజినెస్ సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఉద్యోగంలో వచ్చే జీతం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఆదాయాన్ని చేకూర్చుతోంది. దీనిని బట్టి ఏదైనా పాతకాలం నాటి కబుర్లు చెప్పినా, పాతపద్ధతులు పాటించినా, అంతా పాత చింతకాయ పచ్చడిలే అని తేలిగ్గా తీసేసే వారు ఇకపై ఆచితూచి మాట్లాడాలేమో! ఎందుకంటే అప్పటి పాత ఫార్ములానే కదా... ఇప్పుడు సక్సెస్ సూత్రంగా మారిపోయింది. నిధి టుటేజాకి ఆదివారం సెలవును అమ్మమ్మ ఇంటిలో సరదాగా గడపటం అలవాటు. నిధి అమ్మమ్మ రకరకాల ఔషధ మూలికలను మేళవించి ఒక విధమైన తలనూనెను తయారు చేసేది. అలా ఆమె సొంతంగా తయారు చేసిన ఆయిల్‌తో నిధి తలకు మర్దనా చేసి కాసేపటి తర్వాత తలస్నానం చేయించేది. అమ్మమ్మ చేతి నూనె మహాత్మ్యం వల్ల నిధికి తోటి విద్యార్థినులందరూ కుళ్లుకునేంత నల్లటి ఒత్తైన కేశనిధి ఉండేది. చదువు తర్వాత అమ్మమ్మ ఊరికి వెళ్లడం బాగా తగ్గిపోయింది. ఇంతలో దేశాన్నంతటినీ కుదిపేస్తున్న కోవిడ్ మహమ్మారి గురుగ్రామ్‌ను కూడా వదల్లేదు. అక్కడే ఉన్న నిధిని కూడా అసలు వదల్లేదు. ఫలితంగా నిధి జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడటం మొదలు పెట్టింది. క్రమంగా ఆమెను ఇతరులెవరూ పోల్చుకోలేనట్లు తయారైంది. అది చూసిన నిధి తల్లికి చాలా బాధ వేసింది. తన అమ్మ నుంచి ఆ నూనె తయారీ ఫార్ములాను తెలుసుకుని, తన అత్తగారు ఈ విషయంలో ఏమైనా సాయం చేయగలరా అని అడిగింది. కోడలు చెప్పిన ఫార్మూలాను ప్రయత్నించింది అత్తగారైన రజని. ఎట్టకేలకు తయారైన ఆ ఆయిల్‌ను నిధి తలకు రాసి మర్దనా చెయ్యడం మొదలు పెట్టారు ఆ అత్తాకోడళ్లు. ఆశ్చర్యం! కొద్దిరోజుల్లోనే ఆ నూనె మంచి ఫలితాన్నిచ్చింది. పోయిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రావడం మొదలైంది. ఆమె ఉంటున్న అపార్ట్మెంట్లోని ఇతర ఫ్లాట్ల వాళ్లు అది గమనించి, ఎలా సాధ్యమైంది ఇదంతా అని అడిగి విషయాన్ని తెలుసుకున్నారు. తమకు కూడా అలాంటి ఆయిల్ తయారు చేసి ఇమ్మని అడగడమే కాదు, అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని చేతిలో పెట్టడం మొదలు పెట్టారు. ఇదేదో బాగుంది అనిపించింది నిధికి. దాంతో తన నానమ్మ రజని సాయంతో, అమ్మ సహకారంతో ఆయిల్ తయారీ ఆరంభించింది. వీరి ఆయిల్ గురించి ఆ నోటా ఈ నోటా కాదు... కొన్ని డజన్ల వాట్సాప్ గ్రూపులలో పడి మొదట్లో కొద్ది లీటర్లకే పరిమితం అయిన ఆయిల్ తయారీ పెద్దఎత్తున తయారు చేయాలన్న నిర్ణయం తీసుకునేలా చేసింది. దాంతో గత సంవత్సరం మార్చిలో నిధి, రజిని దువా కలిసి ‘నిధిస్ గ్రాండ్ మా సీక్రెట్’ పేరుతో ఒక సరికొత్త ఆయిల్ బ్రాండ్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఫలితంగా అందరి జుట్టు పెరగడం మాట ఎలా ఉన్నా, వీరి ఆదాయం మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఇప్పుడు నిధి, రజిని తయారు చేస్తున్న ఈ ఆయిల్ 67,000 ఇళ్లకు చేరింది. నెలకు లక్ష బాటిళ్ల తయారీతో నెలకు సుమారు యాభై లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జించి పెడుతోంది. అమ్మమ్మ ఫార్మూలా ప్రకారం ఇప్పుడు నిధి, ఆమెతో పాటు ఆమె నానమ్మగారు... స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో 13 రకాల వనమూలికల కలగలుపుతో పెద్ద ఇనుప మూకుడులో కొన్ని గంటలపాటు మరగబెడుతూ, కలుపుతూ తయారు చేసిన ఈ హోమ్ మేడ్ ఆయిల్ ఇప్పుడు పెద్దపెద్ద యంత్రాలతో లక్షల బాటిళ్ల తయారీ లక్ష్యాన్ని చేరుకుంది. పాత కాలం నాటి ఫార్ములాను తేలికగా చూసే వాళ్లు ఇకనైనా ఇలాంటి విద్యను అందిపుచ్చుకుంటే ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడటం సాధ్యం అవుతుందేమో! -
ఒక్క చార్జింగ్‌తో గంటకు 40 కి.మీ: హొంమేడ్ ఎలక్ట్రిక్ సైకిల్ మేకింగ్ వీడియో
సాక్షి,హైదరాబాద్: మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఆధునిక టెక్నాలజీ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ముఖ్యంగా కార్బన ఉద్గారాలను తగ్గించే లక్క్ష్యంతోపాటు, ఇంధన భారాని తగ్గించుకునేందుకు ఎలక్ట్రిక్ వాహనాలకు రానురాను ఆదరణ పెరుగుతోంది. ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ వేవ్ టూవీలర్, త్రీవీలర్ సెగ్మెంట్‌కు మాత్రమే పరిమితం కాలేదు. సైకిళ్లు ఎలక్ట్రిక్ మోడ్‌లో వచ్చేస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు హై రేంజ్లోఉండటంతో, కార్లు , బైక్స్‌తో సహా అన్ని రకాల ఆటోమొబైల్స్ కోసం ఇటువంటి కన్వర్షన్ కిట్లను చూశాం. దీంతో ప్యాసింజర్ కార్ సెగ్మెంట్, టూవీలర్ సెగ్మెంట్లో ఈ-వాహనాల భారాన్నిమోయలేని వారు కన్వర్షన్ కిట్వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ట్రెండ్ లో భాగంగానే స్వయంగా ఇంట్లోనే తయారు చేసుకునే ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్ విశేషంగా నిలుస్తోంది. ఇంట్లో తయారు చేసిన ఎలక్ట్రిక్ సైకిల్ ప్రముఖ యూట్యూబర్ ఇలాంటి వీడియోనొకదాన్ని అప్లోడ్ చేశారు. కన్వర్షన్ కిట్ సహాయంతో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ వీడియోను పబ్లిష్ చేశాడు. ఎలక్ట్రిక్ మోటారు, 36 V 7.5 Ah లిథియం-అయాన్ బ్యాటరీ, కంట్రోలర్, పెడల్ అసిస్ట్, కొత్త థొరెటల్, బ్రేక్ లివర్లు ఇలా ప్రతి భాగం ఎలా మరియు ఎక్కడ అమర్చాడో యూట్యూబర్ వివరించాడు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ పూర్తి ఛార్జింగ్‌తో గంటకు 40 కిమీ వేగంతో దూసుకుపోవచ్చట. మరి ఈ ఇంట్రస్టింగ్ వీడియోను మీరు కూడా ఒకసారి చూసేయండి. అయితే దీనికి నిపుణుల పరిశీలన అవసరమని గుర్తించండి. కేవలం సమాచారం కోసమే ఈ వీడియోను అందిన్నామని గమనించగలరు. -
రసాయనాలు వాడకుండా ఇంట్లోనే షాంపు తయారు చేసుకోవచ్చు.. అదెలాగంటే..
కాలుష్యం, జీవనశైలిలో మార్పులు, సరిగా పట్టించుకోకపోవడం, రసాయన షాంపుల వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతిని నిర్జీవంగా మారుతుంది. ఫలితంగా విపరీతంగా జుట్టు రాలడం, త్వరగా రంగు మారడంతోపాటు, వెంట్రుకలు చిట్లిపోతుంటాయి. ఈ సమస్యలన్నింటిని అధిగమించేందుకు ఇంట్లోనే ఎంచక్కా ఎటువంటి రసాయనాలు వాడకుండా షాంపు తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.. ► ఉసిరి పొడి, కుంకుడు కాయలు, శీకాకాయ, మెంతులను వందగ్రాముల చొప్పున తీసుకోవాలి. వీటన్నింటిని బాగా ఎండబెట్టాలి. ► తడిలేకుండా ఎండిన తరువాత అన్నింటిని ఒక గిన్నెలో వేసి కొన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ► ఉదయం దీనిలో ఒక గ్లాసు నీళ్లు పోసి సన్నని మంటమీద ఉడికించాలి. ► అరగంట తరువాత చల్లారనిచ్చి వడగట్టి సీసాలో నిల్వచేసుకోవాలి. తలస్నానం చేయాలనుకున్నప్పుడల్లా ఈ నీటిని షాంపుగా వాడుకోవాలి. ► ఈ షాంపు తలలో అధికంగా ఉన్న ఆయిల్, దుమ్ము దూళిని వదిలించి కుదుళ్లకు పోషణ అందిస్తుంది. ► ఈ షాంపుని క్రమం తప్పకుండా వాడితే జుట్టురాలడం తగ్గి, కొత్త జుట్టువస్తుంది. చదవండి: నిద్ర లేకపోతే ఎంత డేంజరో తెలుసా? మీకు తెలియని షాకింగ్ విషయాలు ►ఐదారు ఉల్లిపాయ తొక్కలు, వందగ్రాముల మెంతులు, యాభై గ్రాముల అలోవెరా జెల్, యాభై గ్రాముల టీ పొడి, విటమిన్ ఈ క్యాప్య్సూల్ ఒకటి, బేబి షాంపు యాభై గ్రాములు తీసుకోవాలి. ► ఉల్లిపాయ తొక్కలు, మెంతులు, టీ పొడిని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి మరిగించాలి. అన్ని మరిగి, నీళ్లు రంగు మారాక స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ► చల్లారాక ఈ నీటిని సీసాలో వేసి విటమిన్ ఈ క్యాప్సూయల్, అలోవెరా జెల్, బేబి షాంపు వేసి బాగా షేక్ చేయాలి. ►పదిగంటలపాటు కదల్చకుండా పక్కన పెట్టేయాలి. తరువాత దీనిని షాంపులా వాడుకోవచ్చు. ► ఈ షాంపు జుట్టుకు పోషణ అందించడంతోపాటు, చుండ్రును దరిచేరనివ్వద్దు. ► ఉల్లిపాయ తొక్కలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జుట్టు రాలడాన్ని తగ్గించి, మందంగా పెరిగేలా చేస్తాయి. చదవండి: రంగుల కేళీ హోలీ రోజున ఈ స్వీట్ రుచి చూడాల్సిందే..
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019