breaking news
Ad - Sakshi_Home_Sticky
-
బెంగళూరులో దుమ్మురేగొట్టిన ఆరెంజ్ ఆర్మీ ‘ఓ రేంజ్’ బ్యాటింగ్ (ఫొటోలు)
-
IPL 2024, DC VS KKR: ఢిల్లీని చిత్తు చేసిన కేకేఆర్
ఢిల్లీని చిత్తు చేసిన కేకేఆర్ ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 3) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల చేసింది. ఢిల్లీ బౌలర్లలో నోర్జే 3, ఇషాంత్ శర్మ 2, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. 17.2 ఓవర్లలో 166 పరుగులకే చాపచుట్టేసింది. రిషబ్ పంత్ (55), ట్రిస్టన్ స్టబ్స్ (54) ఓటమి ఖరారైన దశలో బ్యాట్‌ను ఝులిపించారు. వీరిద్దరు మినహా ఢిల్లీ ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. వార్నర్ (18), పృథ్వీ షా (10) రెండంకెంల స్కోర్లు చేయగా.. మార్ష్, పోరెల్, అక్షర్ డకౌట్లయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌల్ చేసి చెరి 3 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ 2, రసెల్, నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పంత్ ఔట్ మెరుపు అర్దశతకం బాదిన అనంతరం పంత్ (55) ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చితక్కొడుతున్న పంత్.. 23 బంతుల్లో ఫిఫ్టి వెంకటేశ్ అయ్యర్ వేసిన 12వ ఓవర్లో పంత్ చెలరేగిపోయాడు. నాలుగు ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28 పరుగులు పిండుకున్నాడు. పంత్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీని కేవలం 23 బంతుల్లోనే పూర్తి చేశాడు. 12 ఓవర్లలో ఢిల్లీ స్కోర్ 125/4గా ఉంది. పోరాడుతున్న పంత్, స్టబ్స్ 273 పరుగల లక్ష్య ఛేదనలో 33 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఢిల్లీని రిషబ్ పంత్ (11 బంతుల్లో 23; 3 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (16 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 9 ఓవర్ల అనంతరం ఢిల్లీ స్కోర్ 83/4గా ఉంది. పేకమేడలా కూలుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలుతుంది. 33 పరుగులకే ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన అనంతరం వార్నర్ (18) ఔటయ్యాడు. 5 ఓవర్లలో ఢిల్లీ స్కోర్ 40/4గా ఉంది. రిషబ్ పంత్ (6), ట్రిస్టన్ స్టబ్స్ (1) క్రీజ్‌లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 27 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. వైభవ్ అరోరా బౌలింగ్‌లో సునీల్ నరైన్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ పోరెల్ (0) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 26 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్‌లో రమన్‌దీప్‌కు క్యాచ్ ఇచ్చి మిచెల్ స్టార్క్ (0) ఔటయ్యాడు.డేవిడ్ వార్నర్‌కు (11) జతగా అభిషేక్ పోరెల్ (0) క్రీజ్‌లోకి వచ్చాడు. 273 పరుగుల లక్ష్యం.. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ 273 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 21 పరుగుల వద్ద వైభవ్ అరోరా బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి పృథ్వీ షా (10) ఔటయ్యాడు. వార్నర్‌తో (10), మిచెల్ మార్ష్ జత కలిశాడు. వీరంగం సృష్టించిన కేకేఆర్ బ్యాటర్లు.. ఐపీఎల్ చరిత్రలో రెండో భారీ స్కోర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు శివాలెత్తిపోయారు. టాపార్డర్ బ్యాటర్లు పోటాపోటీపడి విధ్వంసం సృష్టించారు.తద్వారా ఐపీఎల్ చరిత్రలో రెండో భారీ స్కోర్ నమోదైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ చేసిన 277 స్కోర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌గా ఉంది. మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. రఘువంశీ ఔట్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేసి అనంతరం రఘువంశీ ఔటయ్యాడు. నోర్జే బౌలింగ్‌లో ఇషాంత్ శర్మ క్యాచ్ పట్టాడు. 14 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 181/3గా ఉంది. రసెల్ (9), శ్రేయస్ (1) క్రీజ్‌లో ఉన్నారు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రఘువంశీ కేకేఆర్ యువ ఆటగాడు రఘువంశీ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 13 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 171/3గా ఉంది. రఘువంశీకి జతగా రసెల్ (5) క్రీజ్‌లో ఉన్నాడు. చితకబాది ఔటైన నరైన్.. కేకేఆర్ స్కోర్ 164/2 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేసిన సునీల్ నరైన్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ మూడో బంతికి మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం కేకేఆర్ స్కోర్ 164/2గా ఉంది. రఘువంశీకి (49) జతగా రసెల్ క్రీజ్‌లోకి వచ్చాడు. 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 135 పరుగులు చేసిన కేకేఆర్ సునీల్ నరైన్ (32 బంతుల్లో 74; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) , రఘువంశీ (16 బంతుల్లో 33; 4 ఫోర్లు, సిక్స్) ధాటికి కేకేఆర్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన నరైన్ కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్ శివాలెత్తిపోయాడు. కేవలం 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఫలితంగా కేకేఆర్ 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్ 4.3వ ఓవర్: 60 పరుగుల వద్ద కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. నోర్జే బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి సాల్ట్ (18) ఔటయ్యాడు. విధ్వంసం సృష్టిస్తున్న సునీల్ నరైన్ కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేశాడు. ఇషాంత్ వేసిన మూడో ఓవర్లో నరైన్ మూడు సిక్సర్లు, రెండు బౌండరీలు బాదాడు. ఫలితంగా ఆ ఓవర్లో ఏకంగా 26 పరుగులు వచ్చాయి. 4 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 58/0గా ఉంది. నరైన్‌తో పాటు ఫిలిప్ సాల్ట్ (16) క్రీజ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా విశాఖలోని వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో ఇవాళ (ఏప్రిల్ 3) ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుత సీజన్లో కేకేఆర్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఢిల్లీ ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి ఏడో స్థానంలో నిలిచింది. తుది జట్లు.. కోల్‌కతా నైట్‌రైడర్స్: ఫిలిప్ సాల్ట్(వికెట్‌కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్/వికెట్‌కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, రసిఖ్ దార్ సలామ్, అన్రిచ్ నోర్ట్జే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ -
నంద్యాల సభ: సీఎం జగన్ ప్రసంగంలో హైలైట్స్
-
IPL 2024: సన్‌రైజర్స్ చేతిలో చిత్తైన ముంబై ఇండియన్స్
IPL 2024 SRH VS MI Match Highlights And Updates: బ్యాటర్ల ఊచకోత.. ముంబైను చిత్తు చేసిన సన్‌రైజర్స్ ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మార్చి 27) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు వీరంగం సృష్టించారు. ఫలితంగా ఆరెంజ్ ఆర్మీ 31 పరుగుల తేడాతో ముంబైను చిత్తు చేయడంతో పాటు లీగ్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోర్ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ట్రవిస్ హెడ్ (24 బంతుల్లో 62; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (23 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (34 బంతుల్లో 80 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు అర్దశతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఛేదనలో ముంబై 12 ఓవర్ల వరకు సన్‌రైజర్స్ ధీటుగా బదులిచ్చింది. అయితే ఆ తర్వాత స్కోర్ నెమ్మదించడంతో ముంబై ఓటమి ఖరారైంది. ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 34; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రోహిత్ శర్మ (12 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు), నమన్ ధిర్ (14 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (34 బంతుల్లో 64; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (22 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (20 బంతుల్లో 24; ఫోర్, సిక్స్), రొమారియో షెపర్డ్ (6 బంతుల్లో 12 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సన్‌రైజర్స్ శిబిరంలో కలకలం సృష్టించారు. ముంబై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి లక్ష్యానికి 32 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. ముంబై గెలుపుకు 30 బంతుల్లో 93 పరుగులు అవసరం ఈ మ్యాచ్‌లో ముంబై గెలవాలంటే 30 బంతుల్లో 93 పరుగులు చేయాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా (20), టిమ్ డేవిడ్ క్రీజ్‌లో ఉన్నారు. 15 ఓవర్ తొలి బంతికే కమిన్స్ తిలక్ వర్మ (64) ఔట్ చేశాడు. 15 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 185/గా ఉంది. రఫ్ఫాడిస్తున్న తిలక్.. 10 ఓవర్లలో ముంబై స్కోర్ 141/2 తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. షాబాజ్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో తిలక్ 3 సిక్సర్లు బాది 22 పరుగులు పిండుకున్నాడు. తిలక్ 24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10.2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 146/2గా ఉంది. తిలక్‌తో (52) పాటు నమన్ ధిర్ (26) క్రీజ్‌లో ఉన్నాడు. 7.3 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసిన ముంబై ఇండియన్స్ భారీ లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్‌కు ధీటుగా ముంబై ఇండియన్స్ బదులిస్తుంది. ముంబై 7.3 ఓవర్లలనే 100 పరుగుల మార్కును తాకింది. ఇషాన్ కిషన్ (34), రోహిత్ శర్మ (26) ఉతికి ఆరేసి ఔట్ కాగా.. నమన్ ధిర్ (16), తిలక్ వర్మ (19) క్రీజ్‌లో ఉన్నారు. 8 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 102/గా ఉంది. టార్గెట్ 278.. ధీటుగా బదులిస్తున్న ముంబై 278 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ధీటుగా బదులిస్తుంది. ఆ జట్టు 5 ఓవర్ల అనంతరం 2 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (34), రోహిత్ శర్మ (26) ఉతికి ఆరేసి ఔట్ కాగా.. నమన్ ధిర్ (2), తిలక్ వర్మ (1) క్రీజ్‌లో ఉన్నారు. సన్‌రైజర్స్ బ్యాటర్ల వీరంగం.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదు ముంబై ఇండియన్స్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు వీరంగం సృష్టించడంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టీమ్ స్కోర్ నమోదైంది. ఈ మ్యాచ్‌లో ముగ్గురు ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు సుడిగాలి అర్దశతకాలు బాదారు. ట్రవిస్ హెడ్ 24 బంతుల్లో 62, అభిషేక్ శర్మ 23 బంతుల్లో 63, హెన్రిచ్ క్లాసెన్ 34 బంతుల్లో 80 పరుగులు (నాటౌట్) చేశారు. మార్క్రమ్ సైతం తానేమీ తక్కువ కాదని 28 బంతుల్లో 42 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన క్లాసెన్ హెన్రిచ్ క్లాసెన్ కేవలం 23 బంతుల్లో బౌండరీ, 5 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 18 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 243/3గా ఉంది. క్లాసెన్‌తో పాటు మార్క్రమ్ (40) క్రీజ్‌లో ఉన్నాడు. 14.4 ఓవర్లలోనే 200 పరుగులు పూర్తి చేసిన సన్‌రైజర్స్ సన్‌రైజర్స్ కేవలం 14.4 ఓవర్లలోనే 200 పరుగుల మార్కును తాకింది. మార్క్రమ్ (31), క్లాసెన్ (26) క్రీజ్‌లో ఉన్నారు. 12 ఓవర్లలోనే 173 పరుగులు చేసిన సన్‌రైజర్స్ 11వ ఓవర్ ఆఖరి బంతికి అభిషేక్ శర్మ (23 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) ఔటయ్యాడు. పియూశ్ చావ్లా బౌలింగ్‌లో నమన్ ధిర్కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ ఔటయ్యాడు. 12 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 173/3గా ఉంది. మార్క్రమ్ (21), క్లాసెన్ (8) క్రీజ్‌లో ఉన్నారు. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అభిషేక్ అభిషేక్ శర్మ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. సన్‌రైజర్స్ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అభిషేక్ (54), మార్క్రమ్ (13) క్రీజ్‌లో ఉన్నారు. హాఫ్ సెంచరీ అనంతరం ఔటైన హెడ్.. పెను విధ్వంసం సృష్టించిన అనంతరం హెడ్ (24 బంతుల్లో 62; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) కొయెట్జీ బౌలింగ్‌లో హార్దిక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 117/2గా ఉంది. అభిషేక్ (32), మార్క్రమ్ (4) క్రీజ్‌లో ఉన్నాడు. పవర్ ప్లేలో (81/1) సన్‌రైజర్స్‌కు ఇదే అత్యధిక స్కోర్. 7 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసిన సన్‌రైజర్స్ సన్‌రైజర్స్ ఆటగాళ్లు శివాలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ట్రవిస్ హెడ్ (22 బంతుల్లో 62 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. హెడ్ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో అభిషేక్ శర్మ సైతం చెలరేగిపోయాడు. పియూశ్ చావ్లా వేసిన ఆ ఓవర్లో అభిషేక్ మూడు సిక్సర్లు బాదాడు. తొలి బంతికే వికెట్ తీసిన హార్దిక్ 4.1 ఓవర్: హార్దిక్ పాండ్యా తన స్పెల్ తొలి బంతికే వికెట్ తీశాడు. టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి మయాంక్ అగర్వాల్ (11) ఔటయ్యాడు. వీరంగం సృష్టిస్తున్న ట్రవిస్ హెడ్ సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ వీరంగం సృష్టిస్తున్నాడు. కేవలం 10 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. యువ పేసర్ మపాకా వేసిన మూడో ఓవర్లోనే హెడ్ శివాలెత్తిపోయాడు. ఈ ఓవర్లో హెడ్ వరుసగా రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది 22 పరుగులు పిండుకున్నాడు. 4 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. హెడ్ (32),మయాంక్ అగర్వాల్ (11) క్రీజ్‌లో ఉన్నారు. ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (మార్చి 27) సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. హైదరాబాద్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30య గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హార్దిక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్లో ఇరు జట్లు తమతమ తొలి మ్యాచ్‌ల్లో ఓటమిపాలై బోణీ గెలుపు కోసం ఎదురు చూస్తున్నాయి. సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో ఓటమిపాలు కాగా.. ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయంపాలైంది. తొలి మ్యాచ్‌లో దెబ్బతిన్న ఇరు జట్లు బలాబలాల విషయంలో సమతూకంగా ఉండటంతో నేటి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ మాజీ సారధి రోహిత్ శర్మకు ఆ జట్టు తరఫున 200వ మ్యాచ్ కావడం విశేషం. సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రవిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, షమ్స్ ములానీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, క్వేన మపాకా ముంబై ఇండియన్స్ సబ్స్: డెవాల్డ్ బ్రెవిస్, రొమారియో షెపర్డ్, మొహమ్మద్ నబీ, విష్ణు వినోద్, నేహాల్ వధేరా సన్‌రైజర్స్ హైదరాబాద్ సబ్‌లు: నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్, ఉపేంద్ర యాదవ్ -
RR VS LSG Updates: బోణీ కొట్టిన రాజస్తాన్.. లక్నోపై ఘన విజయం
IPL 2024 RR VS LSG Jaipur Live Updates And Highlights బోణీ కొట్టిన రాజస్తాన్.. లక్నోపై ఘన విజయం ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ బోణీ కొట్టింది. జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో రాజస్తాన్ ఘన విజయం సాధించింది. 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు మాత్రమే చేసింది. లక్నో బ్యాటర్లలో పూరన్ (64) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(58) పరుగులతో పర్వాలేదన్పించాడు. రాజస్తాన్ బౌలర్లలో బౌల్ట్ రెండు వికెట్లు పడగొట్టగా.. బర్గర్, అశ్విన్, చాహల్, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు. కేఎల్ రాహుల్ ఫిప్టీ.. 14 ఓవర్లకు లక్నో స్కోర్: 129/4 14 ఓవర్లు ముగిసే సరికి లక్నో 4 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(53), పూరన్(35) పరుగులతో ఉన్నారు. లక్నో విజయానికి 36 బంతుల్లో 65 పరుగులు కావాలి. మూడో వికెట్ డౌన్.. హుడా ఔట్ దీపక్ హుడా రూపంలో లక్నో మూడో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన హుడా.. చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి నికోలస్ పూరన్ వచ్చాడు. 6 ఓవర్లకు లక్నో స్కోర్ 47/2 6 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. క్రీజులో దీపక్ హుడా(18), కేఎల్ రాహల్(15) ఉన్నారు. రెండో వికెట్ డౌన్ 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పడిక్కల్ రూపంలో లక్నో రెండో వికెట్ కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ పడిక్కల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 3 ఓవర్లకు లక్నో స్కోర్ 12/2 తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. డికాక్ ఔట్ 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన క్వింటన్ డికాక్.. బౌల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి పడిక్కల్ వచ్చాడు. సంజూ శాంసన్ విధ్వంసం.. రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ లక్నోతో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. సంజూ శాంసన్ (52 బంతుల్లో 82 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో బట్లర్ (11), హెట్‌మైర్ (5) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. రియాన్ పరాగ్ (43), యశస్వి జైస్వాల్ (24), ద్రువ్ జురెల్ (20 నాటౌట్) వేగంగా పరుగులు సాధించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 2, మొహిసిన్ ఖాన్, రవి భిఫ్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ 150 పరుగుల వద్ద (16.3 ఓవర్) రాజస్థాన్ రాయల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి హెట్‌మైర్ (5) ఔటయ్యాడు.శాంసన్‌కు (62) జతగా ద్రువ్ జురెల్ క్రీజ్‌లోకి వచ్చాడు. మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. దూకుడుగా ఆడుతున్న రియాన్ పరాగ్ ఔట్ 14.5వ ఓవర్లో 142 పరుగుల వద్ద రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న రియాన్ పరాగ్ (29 బంతుల్లో 43; ఫోర్, 3 సిక్సర్లు) నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సంజూ శాంసన్ (59) క్రీజ్‌లో ఉన్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శాంసన్ సంజూ శాంసన్ తన కెరీర్లో 21వ ఐపీఎల్ ఫిఫ్టిని పూర్తి చేసుకున్నాడు. సంజూ 33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ మార్కును చేరుకున్నాడు. 14 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 128/2గా ఉంది. సంజూ (58), రియాన్ పరాగ్ (32) క్రీజ్‌లో ఉన్నారు. వరుస సిక్సర్లతో విరుచుకుపడిన సంజూ శాంసన్ 9.0 ఓవర్: యశ్ ఠాకూర్ వేసిన 9వ ఓవర్లో సంజూ శాంసన్ శివాలెత్తిపోయాడు. ఆఖరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. అంకుమందు ఇదే ఓవర్లో రియన్ పరాగ్ కూడా ఓ సిక్సర్ బాదాడు. మొత్తంగా ఈ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. 9 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 84/2. సంజూ (33), పరాగ్ (15) క్రీజ్‌లో ఉన్నారు. 8 ఓవర్ల తర్వాత 63/2 8.0 ఓవర్: స్ట్రాటజిక్ టైమ్ ఔట్ సమయానికి రాజస్థాన్ స్కోర్ 63/2గా ఉంది. సంజూ శాంసన్ (21), రియాన్ పరాగ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. డేంజర్ యశస్వి ఔట్ 5.6 ఓవర్: మొహిసిన్ ఖాన్ వేసిన ఐదో ఓవర్లో బౌండరీ, సిక్సర్ బాది జోష్ మీదుండిన యశస్వి జైస్వాల్ (12 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్).. అదే ఓవర్ చివరి బంతికి మరో భారీ షాట్‌కు ప్రయత్నించి కృనాల్ చేతికి క్యాచ్ ఇచ్చి వికెట్ పారేసుకున్నాడు. 5 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 49/2. సంజూ శాంసన్ (13), రియాన్ పరాగ్ క్రీజ్‌లో ఉన్నారు. WHAT A CATCH BY CAPTAIN RAHUL 🔥🤯 pic.twitter.com/FU2Utxvp2z — Johns. (@CricCrazyJohns) March 24, 2024 అద్బుతమైన క్యాచ్ పట్టిన రాహుల్.. బట్లర్ ఔట్ 1.6 ఓవర్: నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో జోస్ బట్లర్ (11) ఔటయ్యాడు. 2 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 13/1. యశస్వి (1), సంజూ శాంసన్ క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా ఇవాళ (మార్చి 24) రాజస్థాన్ రాయల్స్.. లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లు.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్/వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మేయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్‌కీపర్), దేవదత్ పడిక్కల్, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహిసిన్ ఖాన్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019