breaking news
Ad - Sakshi_Home_Sticky
-
దాల్చిన చెక్కతో ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ నిజంగా తగ్గుతుందా?
సకల రోగాలకు మూలం ఒబెసిటీ. ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువుంటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుకే అధిక బరువును తగ్గించుకునేందుకు చాలామంది నానా కష్టాలు పడుతూ ఉంటారు. జీవనశైలి మార్పులు, ఆహారఅలవాట్లుమార్చుకోవడంతోపాటు, కొన్ని ప్రత్యేక పదార్థాలను కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో బాగా వినిపిస్తున్నది దాల్చిన చెక్క. శరీరంలో కొవ్వును కరిగించడానికి దాల్చిన చెక్క నీరు, కషాయం, టీ బాగా ఎఫెక్టీవ్‌గా పని చేస్తుందని నమ్ముతారు. దాల్చిన చెక్క ఆకలిని నియంత్రిస్తుంది. జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే హార్మోన్ ఇన్సులిన్కుసరిగ్గా పనిచేసేలా చేస్తుంది. కొన్ని అధ్యయనాలు దాల్చినచెక్కను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని కూడా సూచిస్తున్నాయి. దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ముఖ్యంగా దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీంలోని మలినాలను బయటకు పంపుతాయి. దాల్చిన నీరు తాగడం వల్ల శరీరం మెటబాలిజం పెరుగుతుంది. దీంతో వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కగా పని చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం దాల్చిన చెక్క నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గొచ్చు.శరీరంలో చెడు కొలెస్ట్రాల్ త్వరగా కరుతుంది. ఫలితంగా స్థూలకాయం, అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఈ వాటర్ తాగడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. దాల్చిన చెక్కలో అనేక యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు వాపు తగ్గించడం ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. సాధారణ జలుబు, ఫ్లూ, వార్మ్ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ఇన్ఫెక్షన్లను నిర్వహించడంలోసహాయపడుతుంది. గవద జ్వరం వంటి అలర్జీ సమస్యల నివారణలో దాల్చిన చెక్క ఉపయోగ పడుతుంది. పురుషులలో అంగస్తంభన సమస్యతోపాటు, స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యకు పని చేస్తుంది. నోట్: అందరికీ ఈ చిట్కా మనచేస్తుందని చెప్పలేం. కానీ కచ్చితంగా కొన్ని ప్రయోజనాలు న్నాయి. అయితే ఆరోగ్యకరమైన జీవన శైలి, క్రమం తప్పని, వ్యాయామం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయిని మాత్రం మర్చిపోకూడదు. -
గులాబీ రేకులతో స్వీట్ : బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు
గులాబీ పువ్వులు సౌందర్య పోషణ ఉత్పత్తుల్లో కీలక పాత్ర పోషిస్తాయి. గులాబీ రేకులతో తయారు చేసిన గుల్కంద్ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఆయుర్వేదం చెబుతోంది.గుల్కంద్ అనే పదం గుల్ నుండి వచ్చింది. దీని అర్థం పెర్షియన్ భాషలో 'పువ్వు' అరబిక్‌లో 'కంద్' అంటే 'తీపి'. ముఖ్యంగా ఈ వేసవిలో గులాబీ రేకుల జామ్ లేదా గుల్కంద్ వల్ల ఒంటికి చలవ చేస్తుంది. దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఫిట్‌గా ఉంచే అద్భుతమైన టానిక్‌లా పనిచేసే గుల్కంద్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు.. లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు శుభ్రంగా కడిగి ఆరబెట్టిన గులాబీ రేకులు వెడల్పుమూత ఉన్న గాజు సీసా, లేదా జార్ యాలకులు గులాబీ రేకులను బాగా ఎండబెట్టాలి. ఎండిన వాటిని ఒక గాజు సీసాలో వేసి, దానికి కొద్దిగా చక్కెర, యాలకుల పొడి కలుపుకోవాలి. గాజు సీసాను ప్రతిరోజూ దాదాపు ఏడు గంటలపాటు ఎండలో ఉంచాలి. మళ్లీ రాత్రికి చెక్క స్పూన్‌తో లేదా తడిలేని గరిటెతో బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా దాదాపు నెల రోజుల పాటు ఇలా చేయాలి. దీంతో జామ్‌లాగా ఇది తయారవుతుంది. దీన్ని పలు రకాల స్వీట్లలో వాడతారు. అలాగే ఫ్రూడ్ సలాడ్లలో వాడవచ్చు. కాస్త చల్లటి పాలు తీసుకుని అందులో ఒక చెంచా గుల్కంద్ వేసి తాగవచ్చు. అలాగే దీన్ని నేరుగా లేదా తమలపాకులతో కూడా తినవచ్చు. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఈ గులాబీ గుల్కంద్ ఆయుర్వేద ప్రకారం పిత్త దోషాలకు చాలా మంచిది. వేడిని పుట్టిస్తుంది. చల్లగా ఉండేలాగా కూడా పనిచేస్తుంది దద్దుర్లు, నొప్పులు ,నొప్పులు వంటి వేడి-సంబంధిత లక్షణాలను తగ్గిస్తుంది , అరికాళ్ళు అరచేతులలో ఏవైనా మంటలను తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తి కంటి చూపును మెరుగుపరుస్తుంది ఇది కాలక్రమేణా కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. అందుకే దీన్ని తాంబూలంలో కూడా ఎక్కువగా వాడతారు. రక్తహీనతను నివారిస్తుంది, హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారికి ఇది చాలా మంచిది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది కప్పు పాలలో వేసి రాత్రిపూట తాగితే ప్రశాంతమైన నిద్ర పడుతుంది చర్మం త్వరగా ముడతలు పడకుండా నివారిస్తుంది. మొటిమల మచ్చలను కూడా తగ్గిస్తుంది. గుల్కంద్ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల తీవ్రమైన అల్సర్లు, మలబద్ధకం, గుండె మంట సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. వేసవిలో గుల్కంద్ వాడటం వల్ల వడదెబ్బ, ముక్కు కారటం, తలతిరగడం వంటివి నివారించవచ్చు. బహిష్టు సమయంలో అధిక రక్తస్రావానికి గుల్కంద్ మంచిది. ముఖ్యంగా పీసీఓడీతో బాధపడుతున్న వారికి ఇది చాలా మంచిది. థైరాయిడ్‌తో బాధపడేవారు కూడా ఈ జామ్ని చక్కగా తీసుకోవచ్చు -
సింఘారా పిండి గురించి విన్నారా..? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
గోధుమ పిండి, వరి పిండి, జోన్న పిండి ఇలా రకరకాల పిండులు గురించి విని ఉంటాం. కానీ ఇదేంటి సింఘారా పిండి అనుకోకండి. దీన్ని పూజల సమయాల్లో ఉపవాసంగా ఉన్నప్పుడూ ఎక్కువగా వినియోగిస్తారట. ఇది ఒక రకమైన పండు విత్తనం నుంచి తయారు చేసే పిండే సింఘారా. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో సవివరంగా చూద్దామా..! సింఘారా లేదా వాటర్ కాల్ట్రాప్ లేదా వాటర్ చెస్ట్నట్ అనేది ఒక విధమైన పండు. ఇది నీటి అడుగున పెరిగే ఒక విధమైన పండు. చెప్పాలంటే ఇది శీతాకాలపు పండు. అయినప్పటికీ దానితో తయరు చేసే ఉత్పత్తుల్లో ముఖ్యంగా సింఘారా పిండి ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. ఈ సింఘారా పండుని ఎండబెట్టి పిండిని తయారు చేస్తారు. ఈ పిండిన ముఖ్యంగా వ్రతాలు, పూజల సమయాల్లో తప్పనిసరిగా ఆహారంగా తీసుకుంటారు. అంత పవిత్రంగా భావిస్తారు ఈ సింఘారా పిండిని. ఇది అద్భుతమైన రుచిని కలిగి ఉండటమే గాక ఆరోగ్యానికి మంచిది. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే.. శరీరంలో తగినంత నీరు ఉండేలా.. సింఘారా పిండిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.పైగా సోడియం కంటెంట్ తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది శరీరంలో తగినంత నీరు ఉండేలా తోడ్పడుతుంది. ఎనర్జీకి.. సింఘారా పిండిలో మంచి కార్బోహైడ్రేట్, ఐరన్, కాల్షియం, జింక్, ఫాస్పరస్ వంటి పోషకాలకు అద్భుతమైన మూలం. నవరాత్రి ఉపవాస సమయంలో శక్తి స్థాయిలు తగ్గడం సహజం. ఎందుకంటే ఈ రోజుల్లో తీసుకునే ఆహారం మాములుగా సాధారణ రోజుల కంటే విభిన్నంగా ఉంటుంది. ఆ టైంలో సింఘారా పిండితో చేసిన పదార్థాలు తక్షణ శక్తిని అందించి ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ పవర్‌హౌస్ సింఘారా పండ్లలో కొలెస్ట్రాల్ ఉండదు. ఇందులో శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా అనామ్లజనకాలు, ఖనిజాలు ఈ పిండిలో పుష్కలంగా ఉంటాయి. ఈ వాటర్ చెస్ట్నట్ పిండిలో విటమిన్ B6, పొటాషియం (సగం కప్పుకు 350 నుంచి 360 mg), రాగి, రిబోఫ్లావిన్, అయోడిన్, మాంగనీస్ ఉన్నాయి. ఈ అయోడిన్, మాంగనీస్‌లు థైరాయిడ్ సమస్యలను రాకుండా చేస్తుంది. బరువు తగ్గడం సింఘారాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల ఈ పిండితో చేసిన ఆహారం తినడం వల్ల నిండుగా ఉన్న అనుభూతిని ఇస్తుంది. తద్వారా ఇతర అధిక-కొవ్వు ఆహారాలను తినకుండా నిరోధిస్తుంది. ఈ ఫైబర్ ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తుంది. గ్లూటెన్ ఫ్రీ సింఘారా పిండి గ్లూటెన్ ఫ్రీ. ఇందులో గోధుమ, బార్లీ, వోట్స్‌లో ఉండే జిగురు ఉంటుంది. దీని వల్ల ఉదరకుహర వ్యాధులు వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. (చదవండి: 'మోదీ మామిడి': ఈ పండు ప్రత్యేకత ఏంటో తెలుసా..!) -
వేసవిలో మజ్జిగ తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
వేసవి కాలంలో ఎండల ప్రతాపాన్ని తట్టుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మధ్యాహ్నం ఎండలో సాధారణంగా బయటికి రాకుండా ఉండటంమంచిది. అలాగే ఎక్కువ నీళ్లు తాగాలి. వేసవి తాపం నుండి సేదదీరేందుకు చల్లని పానీయాలను తీసుకోవాలి. ఈ విషయంలో మజ్జిగ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. పైగా కాస్త చవగా అందరికీ అందుబాటులో ఉండేది కూడా. వేసవిలో మజ్జిగ తాగడం వల్ల కలిగే లాభాలను ఓ సారి చూద్దాం! ► అద్భుతమైన ఆరోగ్య , సౌందర్య ప్రయోజనాల గని మజ్జిగ. వేసవిలో చల్లచల్లగా మజ్జిగ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. అధిక ఉష్ణంనుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే డీహైడ్రేషన్ బారినపడకుండా ఉంటారు. ► పల్చటి మజ్జిగలో నిమ్మకాయ,కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి, కాస్తంత కొత్తమీర, పుదీనా కలుపుకుని తాగితే మరీ మంచిది. రుచికీ రుచీ తగులుతుంది. వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు. ► మజ్జిగ వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మజ్జిగలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలతో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ► ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి. జీర్ణసమస్యలు పోతాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. సౌందర్య పోషణలో ►చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. వేసవిలో వేధించే చెమట పొక్కుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ►మజ్జిగలో పెద్ద మొత్తంలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ (AHA) చర్మాన్ని మృదువుగా , ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది, చర్మంపై నల్ల మచ్చలు , టాన్డ్ ప్యాచ్‌లకు సహజ పరిష్కారంగా పనిచేస్తుంది. ► కాల్షియం లోపం ఉన్న వారు మజ్జిగను తీసుకోవడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది. ఫలితంగా ఎముకలు, దంతాలు ధృడంగా మారుతాయి. ► కాల్షియం, విటమిన్స్ , ఇతరపోషక విలువల కారణంగా మజ్జిక కొన్ని రకాల జబ్బులను నివారిస్తుంది. -
లోటస్ సీడ్స్ : అస్సలు తక్కువ అంచనా వేయొద్దు!
లోటస్ లేదా తామర అనేది నెలంబో జాతికి చెందిన మొక్క. దీని గింజలను లోటస్ సీడ్స్, తామర గింజలు, మఖానా (ఫాక్స్‌నట్స్) అంటారు. సుమారు 7000 సంవత్సరాలుగా దీన్ని పూజల్లోనే ఔషధంగా కూడా ఉపయోగ పడుతోంది. ఒక విధంగా బాదం, జీడిపప్పు , ఇతర డ్రై ఫ్రూట్స్ కంటే ఏ మాత్రం తక్కువ కాదు. ఎండ బెట్టిన తామర గింజలను మంచి పోషకాహారం, ఔషధంగా వినియోగిస్తున్నారు. ఒకటి తెల్ల, రెండు గోధుమ రంగులో ఉన్న లోటస్ విత్తనాలు భారతదేశం, జపాన్ , చైనాలలో విస్తృతంగా సాగవుతున్నాయి.లోటస్ ఫుడ్‌ను ఆహారంగా చైనా ఆమోదించింది. లోటస్ గింజలు తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలతో నిండి ఉంటాయి. తామర గింజల వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను చూద్దాం ♦ నిద్రలేమి, జ్వరం ,హృదయ సంబంధ వ్యాధులతో సహా వివిధ వ్యాధుల చికిత్సకు సాంప్రదాయకంగా తామర గింజలను ఉపయోగిస్తారు. ♦ లోటస్ గింజలు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటిట్యూమర్ ఎఫెక్ట్‌లతో సహా వివిధ ఔషధ కార్యకలాపాలను కలిగి ఉంటాయి. ♦ విరేచనాలు ,విరేచనాలు వంటి జీర్ణశయాంతర రుగ్మతలకు చికిత్స చేయడానికి సాంప్రదాయ వైద్యంలో తామర గింజలు వాడతారు. ♦ సంతానోత్పత్తి , లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సాంప్రదాయ వైద్యంలో తామర గింజలు వాడతారు. ♦ మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లను మాడ్యులేట్ చేసే యాంటీ-డిప్రెసెంట్ లక్షణాలున్నాయి. ♦ ఆయుర్వేదం ప్రకారం మధుమేహం ఇతర వ్యాధుల నుండి రక్షిస్తుంది. అలాగే ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షించగలదు. ♦ తేలికగా బరువు తగ్గాలనుకునే వారు లోటస్ సీడ్స్‌ను ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలుంటాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ♦ తామర పువ్వు వేర్లలో అనేక ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ♦ విటమిన్ సి, ఐరన్, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ,ఐరన్ ఫైబర్ కూడా అధిక మోతాదులో లభిస్తాయి. ♦ 100 గ్రాముల మఖానాలో, 9.3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ♦ లోటస్ సీడ్స్ లేదా ఫాక్స్ నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. సో ఇది యాంటి ఏజింగ్ ఎలిమెంట్‌గా పనిచేస్తుంది. ♦ తామర గింజల్లో కెంప్ఫెరోల్ అనే సహజ సమ్మేళనం ఆర్థరైటిస్ రుమాటిజం రోగుల్లో వాపులను నివారిస్తుంది. కీళ్లనొప్పులతో బాధపడే రోగులకు ఇది మంచిది. ♦ గ్లూటెన్ రహిత పదార్తాలకు ప్రత్యామ్నాయంగా మఖానాను తినవచ్చు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019