breaking news
-
నిజంగానే మైదాపిండి మంచిదికాదా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..!
పరోటాలు దగ్గర నుంచి పిజ్జా, బర్గర్, కేక్స్, గులాబ్ జామున్, జిలేబీ వంటి పలు రకాల స్వీట్లను మైదాతోనే తయారు చేస్తారు. ఆఖరికి సాయంత్రం వేళ్ల టీ తాగుతూ తినే బిస్కెట్లు, సమోసాల్లో కూడా మైదా ఉంటుంది. రోగులకు ఇచ్చే బ్రెడ్లలో కూడా మైదా ఉంటుంది. అంటే మన నిత్య జీవితంలో ఏదో రకంగా తెలియకుండానే మైదాను తీసుకుంటున్నాం. అలాంటిది మరీ మైదా మంచిదికాదని చాలామంది చెబుతున్నారు. ఇది ఎంత వరకు నిజం? వైద్యులు ఏమంటున్నారు ? ఎవరెవరు తినకూడదు అంటే.. మైదాని ఎలా తయారు చేస్తారంటే.. బియ్యంలో మూడు దశలు ఉంటాయి. ఊక, బ్రాన్, బియ్యం. ఊకను తొలగించాక పైపొర (బ్రాన్)తో ఉండే బియ్యాన్ని బ్రౌన్ రైస్ అని పిలుస్తారు. ఈ పైపొరను కూడా తొలిగిస్తే పాలిష్డ్ రైస్ అని అంటారు. అలాగే గోదుమల విషయానికొస్తే పైపొట్టు (ఊక), పైపొర(బ్రాన్)తో కూడిన గోదుమ, పాలిష్డ్ గోదుమ అనే మూడు దశలు ఉంటాయి. ఊకను తొలగించి బ్రాన్‌తో కూడిన ధాన్యాన్ని గోదుమలుగా పిలుస్తారు. గోదుమ నుంచి బ్రాన్ను కూడా తీసేసి బాగా మెత్తగా పిండిలా చేస్తే దాన్నే మైదా అని అంటారు. విదేశాల్లో దీన్నే ఆల్ పర్పస్ ఫ్లోర్ అని పిలుస్తారనిని న్యూట్రీషియన్లు వివరించారు. గోధమ రవ్వకు, మైదాకు తేడా ఏంటంటే.. బ్రాన్ను తొలగించిన గోదుమ నుంచే రవ్వ తయారవుతుంది. కాకపోతే మైదాలా దీన్ని బాగా మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేస్తారు. కాబట్టి, ఈ రెండింటికీ పెద్ద తేడా లేదు. రెండూ పైపొర తీసేసిన గోదుమ నుంచే తయారవుతాయి. అందువల్ల మైదాను ఎక్కువగా తినడం కచ్చితంగా ఆరోగ్యానికి మంచిది కాదు. అలా అని చెప్పి మైదా విషయంలో అతిగా భయపడాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. తెలుపు రంగుకి కారణం.. మైదాకు తెలుపు రంగు రావడం కోసం బ్లీచ్‌ను వాడతారు. బ్లీచ్ చుట్టూ చాలా వివాదాలు ఉన్నాయి. బ్లీచ్ అనేది ఆక్సీకరణ (ఆక్సిడేషన్) ప్రక్రియ. ఈ ప్రక్రియ గురించి మనం స్కూల్లోనే నేర్చుకున్నాం. ఈ ప్రక్రియ ద్వారా గోదుమల నుంచి బ్రౌన్ రంగును తొలగించవచ్చు. బ్లీచ్ ప్రక్రియలో బ్లీచింగ్ ఏజెంట్లుగా క్లోరిన్, బెంజాయిల్ పెరాక్సైడ్ వంటి రసాయనాలను వాడతారు. ఈ రసాయనాలను ఎంత మోతాదులో వాడాలనే అంశంపై కొన్ని పరిమితులు ఉన్నాయి. సరైన పరిమాణంలో ఈ రసాయనాలను వాడాలి. బ్లీచింగ్ ప్రక్రియ అంతా పూర్తిచేసుకొని వినియోగానికి అందుబాటులోకి వచ్చిన మైదాలో ఎలాంటి రసాయనాలు ఉండవని ఆహార నిపుణులు చెబుతున్నారు మైదా వల్ల షుగర్ వస్తుందా.. మైదాను బ్లీచింగ్ చేసినప్పుడు, అలోక్సాన్ అనే రసాయనం కలుస్తుంది. ఈ రసాయనం వల్ల డయాబెటిస్ వస్తుందని చెబుతారు. నిజానికి అలోక్సాన్ విషయానికొస్తే, మైదా బ్లీచింగ్ ప్రక్రియలో అదనంగా దీన్ని కలపరు. ఆక్సీకరణ ప్రక్రియలో భాగంగా బై ప్రోడక్ట్‌గా అలోక్సాన్ ఉత్పత్తి అవుతుంది. మైదాలో చాలా స్వల్ప పరిమాణంలో అలోక్సాన్ ఉంటుంది. పరిశోధనల్లో భాగంగా ఎలుకల్లో ఈ అలోక్సాన్ రసాయనాన్ని వాడి కృత్రిమంగా మధుమేహాన్ని ప్రేరేపిస్తారు. దీని కారణంగా మనకు కూడా షుగర్ వస్తుందేమో అని భయపడతారు. కానీ, అధ్యయనాల్లో వాడే అలోక్సాన్, మైదాలో ఉండే అలోక్సాన్ కంటే 25 వేల రెట్లు శక్తిమంతమైనదని గ్రహించాలి. అందువల్ల ఈ రెండింటిని పోల్చకూడదు. మైదాలో ఏముంటాయంటే.. ‘గోదుమ నుంచి తయారు చేసిన మైదాలో పిండిపదార్థం అధికంగా ఉంటుంది. ఉదాహరణకు, 100 గ్రాముల మైదాలో 351 కేలరీలు ఉంటాయి. 10.3 గ్రాముల ప్రొటీన్, 0.7 గ్రాముల కొవ్వు, 2.76 గ్రాముల ఫైబర్, 74.27 గ్రాముల స్టార్చ్ ఉంటుందని చెబుతున్నారు న్యూటిషియన్లు. (చదవండి: అరవింద్ కేజ్రీవాల్ మామిడి పండ్ల డైట్..షుగర్ పేషెంట్లకు మంచిదేనా..?) -
Rama Navami 2024: శ్రీరాముని కటాక్షం, ఇశ్వర్యం, ఆరోగ్యం కావాలంటే..
Sri Rama Navami 2024 చైత్ర మాసం శుక్ల పక్ష నవమి రోజున శ్రీరామనవమి అత్యంత భక్తి శ్రద్దలతో జరుపు కుంటారు. ఈ సందర్బంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించడంఆనవాయితీ. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాల్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతాయి. బెల్లంతో చేసిన పానకం, వడ పప్పును దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీరాముడిని పూజించి కొన్ని నియమాలు పాటిస్తే సుఖ సంతోషాలు, సిరి సంపదలతో అందరి జీవితాలు విరాజిల్లుతాయని పెద్దలు చెబుతారు. శ్రీరామనవమి రోజు ఇలా చేస్తే.. ఇంట్లో శాంతి, సంతోషం ఉండాలంటే శ్రీ రామ నవమి రోజున రాముని కటాక్షంతో ఐశ్వర్యం పొందాలంటే రాముడిని శంఖం, పసుపు రంగు గవ్వలను పూజించాలి. అమ్మవారికి తామర పూలను, ఎర్రని రంగు గల పువ్వులను సంపర్పించడం ద్వారా కూడా ఆర్ధిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందవచ్చని పండితులు చెబుతున్నారు. గ్రహ దోషాలు తొలగిపోవాలంటే, ఐదు గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టి ఒక పాత్రలో ఉంచి, తులసి మొక్క వద్ద ఉంచడం వలన గ్రహ దోషాలు తొలగిపోయే అవకాశం ఉందట. రామాయణాన్ని పఠించడం, హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల కూడా సంతోషం కలుగుతుందట. సంపద, శ్రేయస్సు వృద్ధి అవుతుంది. నవమి రోజున దుర్గ అమ్మవారిని కూడా పూజిస్తారు. దుర్గా సప్తశతి పారాయణం చేస్తే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని నమ్ముతారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు దుర్గా దేవిని పూజించి ఆగ్నేయ మూలలో నెయ్యి దీపం వెలిగిస్తే వ్యాధుల నుంచి ఉపశమనం కలిగి ఆరోగ్యాన్ని పొందవచ్చని చెబుతారు. రామాలయానికి కుంకుమ జెండాను దానం చేయడంతోపాటు, దేవతలకు పసుపు ఆహారాన్ని సమర్పిస్తారు. శ్రీరాముడికి కుంకుమ కలిపిన పాలతో అభిషేకం చేస్తే ధనలాభం కలుగుతుందని విశ్వాసం. ప్రధానంగా రామమందిరంలో 'శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే.. సహస్తనామతత్తుల్యం శ్రీరామ నామ వరాననే'ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అంతా మంచి జరుగుతుందని రామభక్తుల విశ్వాసం. రామనవమి రోజున దేవుడికి పసుపు బట్టలు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే పేదలకు అన్న దానం, వస్త్రదానం చేస్తారు. ఈ రోజు హనుమంతుని విగ్రహం దగ్గర చందనం తీసుకుని.. సీతమ్మవారి పాదాలకు పూస్తే కోరిన కోరికలు నెరవేరతాయట. -
Beauty Tips: చర్మం మృదువుగా ఉండాలంటే.. ఇలా చేస్తే చాలు!
పెరుగుతున్న కాలుష్యంతో ఆరోగ్యంపై ఎన్నో ప్రభావాలు పడుతున్నాయి. చాలా రకాల వ్యాధులు ఎదురవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు. చర్మం పొడిబారడం, చారలు, నలుపు, మచ్చలుగా మారడం లాంటివి. మరి ఈ సమస్యలనుండి చర్మం మృదువుగా, నిగారింపుగా ఉండాలంటే.. కావాల్సిన టిప్స్ ఏంటో చూద్దాం. ఇలా చేయండి.. పెసరతో మెరుపు మేనికి పెసరపిండి వాడితే చర్మకాంతి ఇనుమడిస్తుంది. పెసలలో ఉండే ప్రోటీన్లు చర్మ మృదుత్వాన్ని కాపాడతాయి. టీ స్పూన్ పెసరపిండిలో పచ్చిపాలు కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్‌లా వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మాన్ని ఈ మాస్క్ మృదువుగా మారుస్తుంది. టీ స్పూన్ పెసరపిండిలో తగినంత పెరుగు కలిపి ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిబారిన చర్మం మృదువుగా అవుతుంది. ఇవి చదవండి: గురక సమస్య అంతింత కాదయా! లైట్ తీసుకుంటే డేంజరే! -
ఈ మల్టీకలర్ ఫేస్‌మాస్క్ ధర వింటే షాకే..!
కరోనా బారీనుంచి ఆ సమయంలో ఎన్నోరకాల ఫేస్‌మాస్క్‌లను వాడారు. వాటి వలన ఫలితాలు, నష్టాలు కూడా అనుభవించారు. అదొక విధమైతే.., ఈ చర్మ సమస్యలు మరో విధము. వయసు పెరిగేకొద్దీ చర్మం ముడతలు బారుతుంది. ముఖంలో గ్లో తగ్గుతుంది. ఈ సమస్యలను డీల్ చేయాలంటే ఈ లైట్ థెరపీ మాస్క్‌ను వాడాల్సిందే.. దీన్ని 15 నుంచి 25 నిమిషాల వరకు ముఖానికి పెట్టుకుని ఉంచితే.. మంచి ఫలితం లభిస్తుంది. ఆప్షన్స్‌లో మల్టీ కలర్స్‌ని మార్చుకోవడంతో వివిధ చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఎటువంటి నొప్పి, శ్రమ, ఇబ్బంది లేకుండా ముఖంలో మెరుపుని సొంతం చేసుకోవచ్చు. ఈ మాస్క్ సాయంతో రెడ్, బ్లూ, ఆరెంజ్, పర్పుల్, వైట్, గ్రీన్, సియాన్ ఇలా మొత్తంగా 7 రంగుల్లో ట్రీట్మెంట్ని అందుకోవచ్చు. రిమోట్ సాయంతో దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది పోర్టబుల్గానూ, కంఫర్టబుల్‌గానూ పని చేస్తుంది. స్త్రీల సౌలభ్యం, సౌకర్యం కోసం రూపొందిన ఈ ఎల్ఈడీ బ్యూటీ మాస్క్.. ఫుడ్–గ్రేడ్ సిలికాన్ మెటీరియల్‌తో తయారైంది. ఇంట్లోనే కాదు ప్రయాణాల్లోనూ సులభంగా ఉపయోగించుకోవచ్చు, ఈ మాస్క్ బిజీ లైఫ్‌స్టయిల్‌కి సరైనది. ఎప్పుడైనా, ఎక్కడైనా.. ఏపని చేసుకుంటూ అయినా దీన్ని చక్కగా వాడుకోవచ్చు. ఈ స్కిన్‌కేర్ టూల్.. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ముడతలు, మచ్చలు వంటి ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. బ్లూ లైట్ చికాకు, అలసటలను దూరం చేస్తుంది. వైట్ లైట్ చర్మానికి పునరుజ్జీవాన్ని అందిస్తుంది. సియాన్ లైట్ స్కిన్ టోన్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇలా ఒక్కో కలర్ ఒక్కో సమస్యను దూరం చేస్తుంది. ఈ పరికరం ఇంట్లో ఉంటే హోమ్ స్పాను ఎంజాయ్ చేయొచ్చు. దీని ధర 169 డాలర్లు. అంటే 14,083 రూపాయలు. ఇవి చదవండి: ఈ భయం.. ఒక ఫోబియా అని మీకు తెలుసా! -
సీతాకోక చిలుక పాలు గురించి విన్నారా? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
ఆవు పాలు, గేదే పాలు, ఒంటె పాలు ఇలా రకరకాల పాల గురించి విన్నారు. వాటిలో అత్యంత ఖరీదైన పాలు ఏవంటే ఒంటె పాలని ఠక్కున చెప్పేస్తారు. కానీ వాటన్నింటికంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాలు ఇంకొకటి ఉన్నాయి. ఔను! అది కూడా ఓ చిన్న జీవి నుంచి వచ్చే పాలవి. ఎవ్వరూ నమ్మరు దాన్నుంచి పాలు వస్తాయా ? అని. కానీ ఓ జపాన్ వ్యక్తి ఆ జీవి నుంచి పాలను తీసి కోట్లు సంపాదిస్తున్నాడు. ఇంతకీ ఏ జీవి అంటే.. అదేనండి సీతాకోక చిలుక. ఏంటీ సీతాకోక చిలుక నుంచా..? అని నోరెళ్లబెట్టకండి. నిజంగానే సీతాకోక చిలుక నుంచి పాలు తీసున్నాడు జపాన్ వ్యక్తి. అసలు సీతాకోక చిలుకకు పాలు ఎలా వస్తాయనే కదూ..! లార్వా దశలో ఓ చిన్న గుడ్డు నుంచి గొంగళి పురుగు బయటకొచ్చి ఏ చెట్టు కాండానికో, ఏ గోడకో బలంగా చుట్టుకుని దాని చుట్టు ఓ దూదిలాంటి రక్షణ వలయాన్ని ఏర్పారుచుకుంటుదంది. అది ప్యూపా దశకు చేరుకోవడానికి నాలుగు వారాలు పడుతుంది. సరిగ్గా అది ప్యూపా దశకు చేరుకుని ఇంకొక్క వారంలో సీతాకొక చిలుకగా రూపాంతరం చెందుతుందనంగా దాని బాడిలో భారీ మొత్తంలో ద్రవాలు ఉంటాయి. ఆ టైంలో దాని కకూన్(గూడు) నుంచి ఈ ప్యూపాను తీసి జెంటిల్‌గా తోక భాగాన్ని ప్రెస్ చేయగానే తెల్లటి పాల వంటి పదార్థం వస్తుంది. ఇది చాలా గాఢతగా ఉంటుంది. ఇది ఒక లీటర్ నీటిలో కలిపి ఉపయోగించాలి. ఈ పాలని మార్కెట్లో అమ్మి కోట్లు సంపాదిస్తున్నాడు జపాన్ వ్యక్తి. ఈ సీతకోక చిలుక పాలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాలల్లో ఒకటిగా నిలిచింది. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే.. ఇది ముఖ్యంగా సంతానలేమితో బాధపడుతున్న మహిళల పాలిట వరంలా ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించిన చాలామంది స్త్రీలు ఈ సమస్య నుంచి బయటపడ్డారట కూడా. ఇది నేచురల్ వయాగ్రాల కూడా పనిచేస్తుందంట ఇందులో శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు ఉన్నాయట. దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు నిపుణులు. > (చదవండి: సీఫుడ్ ఇష్టంగా తినేస్తున్నారా? శాస్త్రవేత్తల స్ట్రాంగ్ వార్నింగ్!)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019