breaking news
-
ఈ తరం తీరే వేరు! నేటి తరంలో ఆనందం తక్కువ.. ఎందుకంటే!
జీవితానికి అర్థం, పరమార్థం జీవించడమే, ఆనందంగా జీవించడమే. మనం ఉద్యోగం సాధించినా, ఇల్లు కట్టించినా, కారు కొన్నా, విదేశీ ప్రయాణం చేసినా, మరే పని చేసినా సరే.. లక్ష్యం ఆనందం. ఆనందాన్ని వెంబడించడమనేది శాశ్వతమైన మానవ ప్రయత్నం. అయితే కాలంతో పాటు దాన్ని సాధించే మార్గాలు మారుతూ ఉంటాయి. సాధారణంగా ప్రతి 15 సంవత్సరాలను ఒక జనరేషన్గా పరిగణిస్తారు. జనరేషన్ జనరేషన్‌కూ ప్రాధాన్యాలు మారుతూ ఉంటాయి. 1965-80 మధ్య పుట్టిన జనరేషన్-ఎక్స్ వారికి ఆర్థిక భద్రత సాధించడం, పిల్లలు సాధించేలా చూడటం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సాధించడమే లక్ష్యంగా ఉండేది. అందులోనే వారు ఆనందాన్ని పొందేవారు. 1981-1996 మధ్య పుట్టిన జనరేషన్-వై వారికి వ్యక్తిగత ఎదుగుదల, మంచి కుటుంబ జీవితం ఆనందాన్నిచ్చేవి. వారితో పోల్చినప్పుడు 1997-2012 మధ్య పుట్టిన జనరేషన్-జీ వారిలో ఆనందం తగ్గిందని, కేవలం మూడింట రెండు వంతుల మంది మాత్రమే సంతోషంగా ఉన్నారని గాలప్ సర్వే కనుగొంది. యుక్త వయసులోకి ప్రవేశించినప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. కారణం తెలుసా? ఈ తరం వారికి ఆర్థిక భద్రత, వ్యక్తిగత ఎదుగుదల కంటే కూడా పని చేయడంలో ప్రయోజనం (sense of purpose) ముఖ్యం. ఆ క్లారిటీ ఉన్నప్పుడు, ఉన్నవారు మాత్రమే సంతోషంగా జీవిస్తున్నారు. నా పనికి ప్రయోజనం ఉందా? ఈ తరం వారికి కార్పొరేట్ నిచ్చెనలు ఎక్కడంపైనే, మెటీరియలిస్టిక్ విజయాలు సాధించడంపైనే దృష్టి ఉంటుందని చాలామంది విమర్శిస్తుంటారు. కానీ అదంతా అబద్ధమని సర్వేలో తేలింది. పాత తరాలకు భిన్నంగా జనరేషన్-జీ వారు తమ పనికి, జీవితానికి ఒక ప్రయోజనం ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఈ తరం వారికి అందుబాటులో ఉన్న ఉద్యోగాలలో ఈ అంతర్గత ప్రేరణ లేదు. ఆఫీసుల్లో ఏ అంశంపైనైనా బహిరంగంగా మాట్లాడే స్వభావం, దాన్ని భరించలేని పాతకాలపు వర్క్ ప్లేస్ లు వారిలో అసంతృప్తిని పెంచుతున్నాయి. అంటే ఈ తరం వారికి భారీగా జీతాలు అందుకోవడం లేదా ప్రమోషన్లు పొందడం కంటే కూడా తాము చేస్తున్న పనివల్ల ఎవరికైనా, ఏదైనా ప్రయోజనం ఉందా? వారి జీవితాలను ప్రభావితం చేయగలుగుతున్నామా? అనేది చాలా ముఖ్యం. అలాంటి ప్రయోజనం ఉన్నప్పుడే పనిలో ఆనందాన్ని పొందుతున్నారు. ఈ మూడూ ఉంటేనే సంతోషం జనరేషన్-జీ ఆనందంలో ప్రయోజనంతోపాటు మరో మూడు అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని గాలప్ అధ్యయనం గుర్తించింది. అవి.. రీఛార్జ్, రిలాక్సేషన్: హైపర్ కనెక్టివిటీ వల్ల ప్రపంచం నిరంతరం మేల్కొనే ఉంటుంది. అందువల్ల చాలామందికి నిద్ర కరువవుతోంది. తగినంత విశ్రాంతి, నిద్ర పొందడం ఆనందానికి మార్గమవుతోంది. బలమైన సామాజిక సంబంధాలు: సోషల్ మీడియా యుగంలో ఒక్కొక్కరికీ వేలల్లో, లక్షల్లో ఆన్లైన్ ఫ్రెండ్స్ ఉంటున్నారు. అయితే కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల ప్రేమ, మద్దతు పొందడం చాలా ముఖ్యం. వారితో సన్నిహిత సంబంధాలే సంతోషానికి మార్గాలవుతాయి. పోలికనుండి తప్పించుకోవడం: సోషల్ మీడియాలో లేదా మరెక్కడైనా నిరంతరం ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఆందోళన పెరుగుతుంది. జనరేషన్-జీలో ఈ కంపేరిజన్ ట్రాప్ చాలా ఎక్కువగా ఉంది. దాని గురించి అవగాహన పెంచుకోవడం, ప్రతీ వ్యక్తి ప్రత్యేకమని గుర్తించి ముందుకు సాగడం ఆనందం జీవనం కోసం అద్భుతమైన వ్యూహం. విద్యాసంస్థలు, కార్యాలయాలు ఈ అంశాలను గుర్తించి జనరేషన్-జీ దీర్ఘకాలిక ఆనందాన్ని సాధించడంలో మద్దతునివ్వాల్సిన అవసరం ఉంది. సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 psy.vishesh@gmail.com -
Mukthar Ansari : ‘‘అన్సారీ మరణంతో మాకు న్యాయం జరిగింది’’
లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ ముఖ్తార్ అన్సారీ మృతితో తమకు న్యాయం జరిగిందని 2005లో అన్సారీ చేతిలో హత్యకు గురైన బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానందరాయ్ కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించారు. కృష్ణానందరాయ్ కుమారుడు పియూష్ రాయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అన్సారీ మృతితో తమ కుటుంబం సంతోషంగా ఉందని చెప్పారు. ‘బాబా గోరక్నాథ్ దయతోనే మాకు న్యాయం జరిగింది. రంజాన్ నెలలోనే అన్సారీకి దేవుడు తగిన శిక్ష విధించాడు. పంజాబ్‌లోని జైళ్లలో ఉండి కూడా అన్సారీ అక్కడి నుంచి నేరాలకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌కు వచ్చిన తర్వాత అతడికి తగిన శాస్తి జరిగింది. ప్రతిపక్షాలకు కేవలం రాజకీయాలు కావాలి. ఒక క్రిమినల్‌కు ఆయా పార్టీల నేతలు మద్దతు పలకడం దారుణం’అని పియూష్ రాయ్ వ్యాఖ్యానించారు. అన్సారీ నేరాల వల్ల గాయపడ్డ కుటుంబాలకు ఇప్పుడు న్యాయం జరిగిందని, తాము సంతోషంగా ఉన్నామని ఎమ్మెల్యే కృష్ణానందరాయ్ భార్య అల్కా రాయ్ అన్నారు. ఇదీ చదవండి.. అన్సారీపై విష ప్రయోగం -
ఆనందమా! నువ్వెక్కడ?
భవిష్యత్తు ఇలాగే ఉంటుందని ఎవరూ చెప్పలేరు. ఇంతకంటే బాగుండాలనే అందరూ అనుకుంటారు. ఆశపడతారు. అయితే అందుకు తగ్గట్టు ఏమి చేస్తున్నారనేదే ప్రశ్న. ఆనందం; పరమానందం; బ్రహ్మానందం- మాటలకు వేదాంత కోణంలో వేరే అర్థాలున్నా – మనం లౌకిక అర్థమే చూద్దాం. ఆనందం వెతుక్కోవడంలోనే మనం తికమక పడుతున్నాం. ఆనందం కానిది ఆనందం అనుకుని పరుగులు తీస్తున్నాం. జీవితం ఎప్పుడూ సరళరేఖ కానేకాదు. ఒకేవేగం, ఒకే పద్ధతిలో వెళ్ళదు. ఎగుడు దిగుళ్లు; లాభనష్టాలు; కష్టసుఖాలు సహజం. అయితే లాభమూ సుఖమూ ఆనందించదగ్గది – నష్టమూ కష్టమూ భరించకూడనిది అవుతుంది. ఇక్కడే వస్తోంది చిక్కంతా. జీవితం సంక్లిష్టం కావాలని ఎవరూ కోరుకోరు. కానీ సంక్లిష్టమయినప్పుడు బయటపడడానికి, ఆ ప్రయత్నంలో ఆనందం వెతుక్కోవడానికి ప్రయత్నించేవారు తక్కువ. ఆనందం దానికదిగా వస్తువు కాదు. మార్కెట్లో దొరకదు. ఆనందం అక్షరాలా మనకు మనమే తయారుచేసుకోవాల్సిన పదార్థం. మనలో మనమే వెతికి పట్టుకోవాల్సిన వస్తువు. మనలోపలే ఉన్నా మనం లేదనుకుని వెతికే ఫీలింగ్. ఒక అనుభూతి. ఒక మానసిక స్థితి. మరి – మనలోపలే ఆనందం టన్నుల కొద్దీ ఉంటే మనకెందుకు కనిపించదు? అనిపించదు? గెలుపు ఆనందం- ఓటమి బాధ. స్థూలంగా ఆనందానికి- బాధకు మన నిర్వచనం ఇది. లక్ష్యం , గమ్యం ఆనందం. చేరేదారి, గమనం బాధ. నొప్పి, అసహ్యం, అసహనం, అసంతృప్తి. గమ్యంతోపాటు గమనాన్ని, చేరే దారిని కూడా ఆనందించాలి, ప్రేమించాలి, అనుభవించాలి. జీవితం చాలాసార్లు సవాళ్లు విసురుతుంది. ఇక మార్గమే లేనట్లుగా చేస్తుంది. బరువుగా మారుతుంది. దిగులుగా చేస్తుంది. నీరసపరుస్తుంది. నిస్పృహ నింపుతుంది. మొండిగా బండగా మారుస్తుంది. కానీ ఇలాంటి సమయాల్లో కూడా ఆనందాలను వెతుక్కోవాలి. అలవికాని ఆశలు, అంచనాలు, ఇతరులతో పోలిక, ఇతరులు ఏమనుకుంటారోనన్న ఆందోళనలు వదిలేస్తే ఎన్నెన్నో ఆనందాలు కళ్ళముందే ప్రత్యక్షమవుతాయి. -పమిడికాల్వ మధుసూదన్ -
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం అదే!
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ మరోసారి తొలి స్థానంలో నిలిచింది. ఏడు సార్లుగా అదే స్థానంలో నిలవడం విశేషం. అంతర్జాతీయ సంతోష దినోత్సవమైన బుధవారం (మార్చి 20)న యూఎన్ ఆధారిత వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ సంస్థ తాజాగా ఈ ర్యాంకులను విడుదల చేసింది. ప్రపంచంలోని 143కి పైగా దేశాల ప్రజల మనోభావాలను తెలుసుకుని దీన్ని రూపొందించారు. సంతోష సూచీల్లో నార్డిక్ దేశాలైన ఫిన్లాండ్(1), డెన్మార్క్(2), ఐస్లాండ్(3) వరుసగా తొలి మూడు ర్యాంకుల్లో నిలిచాయి. ఈ జాబితాలో భారత్ గతేడాదిలానే 126వ స్థానంలో ఉంది. ఇక చైనా (60), నేపాల్ (95), పాకిస్థాన్ (108), మయన్మార్(118) దేశాలు ఈ విషయంలో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 2020లో తాలిబాన్ నియంత్రణలోకి వెళ్లినప్పటి నుంచి మానవతా విపత్తుతో బాధపడుతోంది అఫ్ఘనిస్తాన్. దీంతో ఈ హ్యపీనెస్ ఇండెక్స్ 143 దేశాలలో అఫ్ఘనిస్తాన్ అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇక ఈ నివేదికను ఆత్మ సంతృప్తి, తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, జీవన కాలం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందిస్తారు. దాదాపు దశాబ్దకాలంలో అమెరికా, జర్మనీ మొదటిసారిగా తొలి 20 స్థానాల నుంచి కిందకు దిగజారాయి. అవి వరుసగా 23, 23 స్థానాల్లో నిలిచాయి. అయితే టాప్ 20లో కోస్టారికా(12), కువైట్(13) స్థానాలు దక్కించుకోవడం విశేషం. ఈ ఏడడా టాప్ 10లో పెద్ద దేశమేది లేదని నివేదిక పేర్కొంది. ఇక ఈ జాబితాలో తొలి టాప్ 10లో 1.5 కోట్ల కంటే ఎక్కువ జనాభా కలిగినవి నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా మాత్రమే ఉన్నాయి. ఇక టాప్ 20లో మాత్రం మూడు కోట్ల కంటే అధిక జనాభా ఉన్న కెనడా, యూకేలు ఉన్నాయి. అలాగే ఈ నివేదికలో పెద్ద వారితో పోలిస్తే తక్కువ వయసు వారే ఆనందంగా ఉన్నట్లు వెల్లడయ్యింది. కానీ ఇదంతా ప్రపంచవ్యాప్తంగా ఒకేవిధంగా లేదని పేర్కొంది. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో 30 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిలో సంతోషం గణనీయంగా తగ్గింది. అక్కడి పెద్దలే ఆనందంగా ఉన్నట్లు తేలింది. మధ్య, తూర్పు ఐరోపాలో మాత్రం అన్ని వయసులవారిలో సంతోషం పెరిగినట్లు పేర్కొంది. పశ్చిమ ఐరోపాలో అందరూ ఒకేరకమైన ఆనందాన్ని అనుభవిస్తున్నట్లు తేలింది. సంతోషకర స్థాయిలో అసమానత ఒక్క ఐరోపా మినహా ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని.. ఇది ఆందోళన కలిగించే విషయమని నివేదిక అభిప్రాయపడింది. అగ్రస్థానంలో ఫిన్లాండ్ దేశమే ఎందుకంటే.. మనస్తత్వవేత్త ఫ్రాంక్ మార్టెల్లా ప్రకారం, ఫిన్లాండ్ దేశం సంతోషంగా ఉండటానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఇతర దేశాలు దీనిని అనుసరిస్తే, అవి కూడా జీవితంలో సంతోషంగా ఉండవచ్చు. మొదటిది ఐక్యతా భావం అది ఇక్కడ ఎక్కువ. ఎలాంటి చెడు పరిస్థితులతోనైనా పోరాడే శక్తిని కలిగి ఉంటారు. అలాగే అందరితో సామరస్యంగా జీవించడం వంటివి ఉంటాయి. ప్రధానంగా చుట్టుపక్కల వారి పట్ల శ్రద్ధ వహించాలని ఫిన్లాండ్ దేశ ప్రజలకు చిన్నప్పటి నుంచి నేర్పుతారు. ఇది వారి అభివృద్ధిలో ముఖ్యమైన భాగం. అంతేగాదు ఫిన్లాండ్లో నిర్వహించిన అనేక అధ్యయనాల్లో ప్రతి కుటుంబం తమ పొరుగువారితో సంతోషంగా గడుపుతాయని తేలింది. సమస్యలన్నీ మాట్లాడుకోవడం వల్ల భారం తగ్గుతుంది. ఇక్కడ అందరిలోనూ దయ కూడా ఎక్కువే. రెండవది, ఇక్కడి ప్రభుత్వ సంస్థలు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. మూడవది సమానత్వం. ఇక్కడ ఎక్కువ సంపాదించేవారు, తక్కువ సంపాదించేవారు అనే తేడా ఉండదు. అందువల్ల ఇక్కడ పేదరికం ఉండదు. అవినీతికి తావుండదు. అదీగాక ఫిన్లాండ్ సంపన్న దేశం. జనాభా తక్కువ. డబ్బు కొరత లేని దేశం. ఈ కారణాల రీత్యా ఫిన్లాండ్ అత్యంత సంతోషకరమైన దేశంగా ఏడోసారి తొలి స్థానంలో కొనసాగుతోంది. (చదవండి: అమెరికా ఆపద్బంధువు 911 హడావిడి! ) -
ఆ సుఖం...నిజమైన సుఖం కాదు!
అది ‘కురువుల’ పట్టణం. దాని సమీపంలో యమునా నది. చల్లని నీడనిచ్చే మామిడి చెట్ల వనం. అందులో అగ్ని భరద్వాజుని ఆశ్రమం. ఆ సమయంలో బుద్ధుడు ఆ ఆశ్రమంలో ఉంటున్నాడు. అగ్ని భరద్వాజుడు బుద్ధునికి తగిన ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఒకరోజు బుద్ధుడు ఆ పట్టణంలోకి వెళ్ళి భిక్ష స్వీకరించి వచ్చి, ఈ వనంలో ఒక పెద్ద మామిడి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. సమయం మధ్యాహ్నం దాటింది. అగ్ని భరద్వాజుని దగ్గరకు మాగందియుడు అనే తాపసి వచ్చాడు. పరస్పర కుశల ప్రశ్నల తర్వాత వారిద్దరూ కలిసి మామిడి తోటలో బుద్ధుడున్న చోటుకు వెళ్లారు. అప్పటికీ మాగందియుని విషయం బుద్ధునికి తెలుసు. వారు వచ్చాక కొంత సంభాషణ కామసుఖాల మీద జరిగింది... ‘‘మాగందియా! కామసుఖాలకంటే సుఖాన్నిచ్చే గొప్పసుఖం వేరే ఉంది.’’ అన్నాడు బుద్ధుడు. వారిద్దరూ శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు. ‘‘నేను యువరాజుగా ఉన్నప్పుడు నాకోసం మూడు ప్రత్యేక భవంతులు నిర్మించారు. వేసవిలో, వర్షాకాలంలో, హేమంత కాలాల్లో నివసించడానికి అనువైన భవనాలు అవి. ఆయా కాలాల్లో హాయిని చేకూర్చే భవనాలు. దివ్య సుఖాన్నిచ్చే భవనాలు నేను ఆ నాలుగు నెలూ ఆ భవనాలు దిగి వచ్చేవాడినే కాదు. చివరికి ఈ కామ సుఖాల బేలతనాన్ని తెలుసుకున్నాను. నాలో కామతృష్ణ తొలగిపోయింది. పిపాస నశించింది. రాగం వదిలిపోయింది. అప్పుడు కూడా ఆనందించాను. కామం, తృష్ణ, పిపాసలు ఇవ్వలేని ఆనందాన్ని కూడా పొందాను. ఆనందం, దుఃఖం భవనాల్లో లేవు. మన మనస్సులోనే ఉంటాయి.’’ అని వారివైపు చూశాడు బుద్ధుడు. శ్రద్ధగా వింటూ కనిపించారు. ‘‘మాగందియా! రాగం ద్వేషం, పిపాస ఉన్న మనస్సునే ప్రక్షాళన చేయాలి. కుష్ఠు వ్యాధి శరీరం, వేడి గ్రహించి హాయి పొందినట్లు రాగద్వేషాలతో ఉన్న మనస్సు కూడా వాటిని పొందినప్పుడు హాయి పొందుతుంది. రాజ భవనాల్లో నేను పొందిన హాయి అలాంటిదే! కుష్ఠువ్యాధి తగ్గిన శరీరం వేడికి హాయి పొందదు. దానికి వేడితో పనిలేదు. అలాగే రాగరహిత హృదయానికి భవనాలు సుఖాలు అవసరం లేదు. ఆరోగ్యమైన శరీరానికి మంటల వేడి అవసరం లేనట్లే... ఆరోగ్యమైన మనస్సుకి కోర్కెలు అవసరం లేదు. మాగందియా! ఈ కామభోగలాలసలు గతంలోనూ, భవిష్యత్‌లోనూ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. దుఃఖాన్ని కలిగిస్తూనే ఉంటాయి. ఇంద్రియాల్ని లోబరుచుకుంటూనే ఉంటాయి. వీటికి లోబడి పొందే సుఖం, కుష్ఠువారు వేడివల్ల పొందే సుఖం లాంటిది. ఆ సుఖం సుఖం కాదు. దుఃఖమే!’’ అన్నాడు. ‘‘భగవాన్! చల్లని మీ మాటల ద్వారా ఏది నిజమైన సుఖమో, ఏది సత్యమైన దుఃఖరహిత మార్గమో... తెలుసుకోగలిగాను. నన్ను కూడా ఇకనుంచి మీ అనుయాయిగా స్వీకరించండి’’ అంటూ ప్రణమిల్లాడు మాగందియుడు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: ఏది గొప్పది... స్వర్గమా! కాశీనా!!!
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019