breaking news
-
తేజస్ మార్క్1ఏ సక్సెస్
సాక్షి బెంగళూరు: అధునిక యుద్ధసామర్థ్యాలను సంతరించుకున్న నూతన తేజస్ మార్క్1ఏ తేలికపాటి యుద్ధవిమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది. గురువారం బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) కేంద్రం నుంచి టేకాఫ్ తీసుకుని 18 నిమిషాలపాటు గాల్లో నిర్దేశిత ‘పథం’లో చక్కర్లు కొట్టింది. దీంతో తన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది. తేజస్ ఎంకే1ఏ సిరీస్‌లో ఎల్ఏ5033 మొట్టమొదటి తేలికపాటి యుద్ధ విమానం. హెచ్‌ఏఎల్‌లోని చీఫ్ టెస్ట్ పైలెట్ గ్రూప్ కెపె్టన్ కెకె వేణుగోపాల్(రిటైర్డ్) ఈ విమానాన్ని నడిపారు. విమాన ప్రయాణం విజయవంతమవడంతో త్వరలోనే ఈ సిరీస్‌తో అధునాతన యుద్ధవిమానాలను తయారుచేసి భారత వాయుసేనకు అప్పగించనున్నారు. ‘‘ అంతర్జాతీయ పరిణామాలు, ఆయుధాల సరఫరా వ్యవస్థపై ఒత్తిడి నెలకొన్న ఈ తరుణంలో వేగంగా అధునాతన డిజైన్‌తో స్వదేశీ 4.5 నూతనతరం యుద్ధవిమానాన్ని తయారుచేయడంలో హెచ్ఏఎల్ సఫలీకృతమైంది. ఈ విజయంలో కీలక భాగస్వాములైన రక్షణ శాఖ, భారత వాయుసేన, రక్షణ పరిశోధనాభివృద్ది సంస్థకు కృతజ్ఞతలు’ అని హెచ్ఏఎల్ చీప్ మేనేజింగ్ డైరెక్టర్ అనంతకృష్ణన్ చెప్పారు. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, ఆయుధాలు, ఆధునిక ఎల్రక్టానిక్ రాడార్, కమ్యూనికేషన్ సిస్టమ్, స్వీయ రక్షణకు జామర్ పాడ్లను దీనిలో అమర్చారు. 2028 ఫిబ్రవరిలోపు 83 తేజస్ మార్క్1ఏలను తయారుచేసి భారత వాయుసేనకు అందించనుంది. భారత వాయుసేనలో ఇప్పటికే తేజస్ ‘ ఫ్లయింగ్ డ్యాగర్’, ‘ ఫ్లయింగ్ బుల్లెట్’ పేరుతో రెండు బృందాలు ఉన్నాయి. -
భారత్‌లో విమానాల సర్వీసింగ్.. హాల్‌తో ఎయిర్‌బస్ జట్టు!
యూరోపియన్ మల్టీనేషనల్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ భారత్‌లో వాణిజ్య విమానాల సర్వీసింగ్లోకి ప్రవేశిస్తోంది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) భాగస్వామ్యంతో దేశంలో ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ , మరమ్మతులు, నవీకరణ (ఎంఆర్ఓ) పరిశ్రమను బలోపేతం చేయడానికి ముందుకొచ్చింది. దేశంలో విస్తరిస్తున్న వాణిజ్య విమానాలు, ముఖ్యంగా విమాన ప్రయాణాన్ని సరళతరం చేసిన A320 రకానికి చెందిన విమానాల కోసం ఎంఆర్ఓ సేవల డిమాండ్ పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా సేవలందించేందుకు ఎయిర్‌బస్ ఈ భాగస్వామ్యం ద్వారా హాల్‌కు మద్దతు ఇస్తుంది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ దేశంలో ఇంటిగ్రేటెడ్ ఎంఆర్ఓ హబ్‌ని స్థాపించి, విమానయాన సంస్థలకు సమర్థవంతమైన సేవలలు అందించాలనే దృక్పథంతో ఉందని, హాల్ నాసిక్ కేంద్రం చేస్తున్న ఈ ప్రయత్నం భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా మిషన్‌కు అనుగుణంగా ఉంటుందని హాల్ సీఈవో (MiG కాంప్లెక్స్) సాకేత్ చతుర్వేది పేర్కొన్నారు. భారతదేశంలో విమానయాన వ్యవస్థ బలోపేతానికి, అందుకు అత్యంత ఆవశ్యకమైన ఎంఆర్ఓ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎయిర్‌బస్ కట్టుబడి ఉందని ఎయిర్‌బస్ ఇండియా అండ్ దక్షిణాసియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రెమి మైలార్డ్ తెలిపారు. ఒప్పందం ప్రకారం, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ ఎయిర్‌బస్ A320 ఫ్యామిలీ టూల్ ప్యాకేజీని, ఎంఆర్ఓని సెటప్ చేయడానికి ప్రత్యేక కన్సల్టింగ్ సేవలను అందిస్తుంది. దీంతోపాటు ఎయిర్‌బస్ సపోర్ట్, టెక్నికల్ డేటాతోపాటు ట్రైనింగ్ సొల్యూషన్స్ అందించే డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన ‘ఎయిర్‌బస్ వరల్డ్’కి యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆమోదించిన మూడు హ్యాంగర్లు, నైపుణ్యం కలిగిన మానవవనరులతో కూడిన పౌర విమాన ఎంఆర్ఓ సదుపాయాలు ఇప్పటికే హిందూస్తాన్ ఏరోనాటిక్స్ నాసిక్ విభాగంలో ఉన్నాయి. -
తప్పిన ప్రమాదం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై దొర్లిన విమానం!
బెంగళూరు: బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఓ విమానం సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా వెనక్కి మళ్లింది. అంతేకాకుండా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా.. రన్‌వేపై అదుపుతప్పి ప్రమాదకరంగా దిగింది. అయితే ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణ హాని జరగలేదు. వివరాల్లోకి వెళితే.. హాల్ ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతున్న ప్రీమియర్ 1ఏ విమానం వీటీ-కేబీఎన్‌లో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విమానం టేకాఫ్ అయిన తర్వాత నోస్ ల్యాండింగ్ గేర్‌ను వెనక్కి తీసుకోలేనందున ఎయిర్‌టర్న్‌బ్యాక్‌లో చిక్కుకుంది. దీంతో విమానాన్ని తక్షణమే వెనక్కి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో రన్‌వేపై నీరు నిలిచింది. ఆ నీటిలోనే విమానం ముందుకుసాగింది. అయితే విమానపు నోస్ ల్యాండింగ్ గేర్ సరిగా లేకపోవడంతో ఒక్కసారిగా ముందుకు దొర్లింది. అయితే అదృష్టవశాత్తు చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటన సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు మాత్రమే ఉన్నారు. ప్రయాణికులెవరూ లేరని డీజీసీఏ తెలిపింది. Bengaluru | A Fly By wire Premier 1A aircraft VT-KBN operating flight on sector 'HAL Airport Bangalore to BIAL' was involved in Airturnback as the nose landing gear couldn't be retracted after take off. The aircraft safely landed with the nose gear in Up position. There were two… pic.twitter.com/53zmaaKKEn — ANI (@ANI) July 11, 2023 చదవండి: ఆ తేనెలో మద్యానికి మించిన మత్తు.. ఎక్కడ దొరుకుతుందంటే.. -
ఏరోస్పేస్లో స్టార్టప్‌లకు ఊతం
సాక్షి, హైదరాబాద్: ఏరోస్పేస్ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో కలిసి టీ–హబ్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య శుక్రవారం పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. రెండేళ్లపాటు అమల్లో ఉండే ఈ ఒప్పందం ద్వారా వైమానిక, రక్షణ రంగాల మార్కెట్లో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టనున్నారు. స్టాటిస్టా సంస్థ నివేదిక ప్రకారం 2021 నుంచి 2027 మధ్య వైమానిక, రక్షణ రంగాల మార్కెట్ వార్షిక వృద్ధిరేటు (సీఏజీఆర్) 13.1శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో టీ–హబ్, హెచ్ఏఎల్ భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఏర్పడింది. పెరుగుతున్న మార్కెట్ డిమాండ్‌ను అందుకునేదిశగా.. స్టార్టప్‌లకు అవసరమైన నైపుణ్యం, వనరులు, మార్కెట్‌తో అనుసంధానం, ఆవిష్కరణల కోసం అవసరమయ్యే సాయాన్ని టీహబ్, హెచ్ఏఎల్ సంయుక్తంగా సమకూరుస్తాయి. స్టార్టప్‌ల ఆవిష్కరణలకు రూపం ఇచ్చేందుకు ఏరోస్పేస్ రంగ నిపుణుల తోడ్పాటు ఇప్పించేందుకు హెచ్ఏఎల్ చర్యలు చేపడుతుంది. స్టార్టప్‌లకు అవసరమయ్యే మార్గదర్శనం, శిక్షణ, విజయం సాధించేందుకు అవసరమైన అన్ని వనరులను టీ–హబ్ సమకూరుస్తుంది. ఏరో స్పేస్ రంగంలో కొత్త అవకాశాలు: టీ–హబ్ సీఈఓ ఎంఎస్ఆర్ ఏరోస్పేస్ రంగంలో స్టార్టప్‌లకు కొత్త అవకాశాలు సృష్టించేందుకు హెచ్ఏఎల్తో తమ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని టీ–హబ్ సీఈఓ ఎం.శ్రీనివాసరావు చెప్పారు. టీ–హబ్ వనరులు, హెచ్ఏఎల్ నైపుణ్యాల కలబోతతో స్టార్టప్‌ల ఆవిష్కరణలు కొత్త పుంతలు తొక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో బలంగా ఉన్న ఆవిష్కరణల వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని స్టార్టప్‌లను సరైన దిశలో నడిపేందుకు టీ–హబ్‌తో తమ భాగస్వామ్యం మంచి ఉదాహరణగా నిలుస్తుందని హెచ్ఏఎల్ (ఇంజనీరింగ్, పరిశోధన అభివృద్ధి) డైరక్టర్ డీకే సునీల్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్భర్ ప్రణాళికలో భాగంగా పన్నులు పోగా మిగిలే హెచ్ఏఎల్ లాభాల్లో 2 శాతాన్ని సాంకేతిక రంగంలో పనిచేస్తున్న స్టార్టప్‌ల కోసం కేటాయిస్తున్నామని తెలిపారు. వివిధ రంగాలకు చెందిన సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్న టీ–హబ్ ఇప్పటికే అనేక విజయాలు సాధించిందని వివరించారు. -
హైదరాబాద్, వైజాగ్‌లలో భారీగా అప్రెంటిస్ ట్రెయినీలు
హైదరాబాద్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియోనిక్స్ డివిజన్.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ట్రెయినీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 150 ► ఖాళీల వివరాలు: టెక్నీషియన్(డిప్లొమా)అప్రెంటిస్ ట్రెయినీలు–80, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు–70. ► టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్ ట్రెయినీలు: సబ్జెక్టులు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీసింగ్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020,2021లో ఉత్తీర్ణులైన వారే అర్హులు. స్టైపెండ్: నెలకు రూ.8000 చెల్లిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు: సబ్జెక్టులు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీసింగ్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020, 2021లో ఉత్తీర్ణులైన వారే అర్హులు. స్టైపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: మెరిట్ మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.01.2022 ► వెబ్సైట్: hal-india.co.in ఈసీఐఎల్, హైదరాబాద్‌లో 150 అప్రెంటిస్‌లు హైదరాబాద్‌లో ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 150 ► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు–145, డిప్లొమా అప్రెంటిస్‌లు–05. ► విభాగాలు:ఈసీఈ,సీఎస్ఈ,మెకానికల్,ఈఈఈ. ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 31.01.2022 నాటికి 25ఏళ్లు మించకుండా ఉండాలి. ► స్టైపెండ్: ఇంజనీరింగ్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.9000, డిప్లొమా అప్రెంటిస్‌లకు నెలకు రూ.8000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 18.01.2022 ► వెబ్సైట్: ecil.co.in హెచ్‌పీసీఎల్, విశాఖ రిఫైనరీలో 100 అప్రెంటిస్‌లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్), విశాఖ రిఫైనరీ.. వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్(ఇంజనీరింగ్) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 100 ► సబ్జెక్టులు/విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, సేఫ్టీ ఇంజనీరింగ్, ఎనర్జీ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్,పెట్రోలియం ఇంజనీరింగ్, ఎనర్జీ ఇంజనీరింగ్ తదితరాలు. ► అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్(బీఈ/బీటెక్) ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 07.01. 2022నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ► స్టైపెండ్: నెలకు రూ.25,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 14.01.2022 ► వెబ్సైట్: mhrdnats.gov.in
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019