breaking news
-
కొత్త మార్క్‌కు బంగారం.. నిన్ననే కొన్నవారు సేఫ్!
Gold Rate today: పసిడి కొనుగోలుదారులకు ఇది చేదువార్త. బంగారం ధరలు ఈరోజు (ఏప్రిల్ 19) మళ్లీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా, ఆగకుండా పెరుగుతున్న పసిడి ధరలు రెండు రోజులు బ్రేక్ ఇచ్చి ఈరోజు మళ్లీ పెరిగి కొత్త మార్క్‌ను చేరాయి. హైదరాబాద్ నగరంతోసహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.540 పెరిగి రూ.74,340 లకు ఎగిసింది. ఇతర నగరాల్లో బంగారం ధరలు ♦ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి రూ.68,900 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.600 చొప్పున ఎగిసి రూ.75,160 లను తాకింది. ♦ బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,150 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.540 ఎగిసి రూ.74,340 వద్దకు చేరింది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,300 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.540 పెరిగి రూ.74,490 లకు ఎగిసింది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,150 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.540 ఎగిసి రూ.74,340 వద్దకు చేరింది. -
హమ్మయ్య.. మళ్లీ పెరగక ముందే కొనేయండి!
Gold Rate today: పసిడి ప్రియులకు శుభవార్త ఇది. బంగారం ధరలు ఈరోజు (ఏప్రిల్ 18) తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా, ఆగకుండా పెరుగుతున్న పసిడి ధరలు క్రితం రోజున పెరుగుదలకు బ్రేక్ ఇచ్చి స్థిరంగా కొనసాగగా ఈరోజు గణనీయంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. హైదరాబాద్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,650 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.330 చొప్పున తగ్గి రూ.73,800 వద్దకు దిగొచ్చింది. ఇతర నగరాల్లో.. ♦ చెన్నైలో ఈరోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.350 తగ్గి రూ.68,350 లకు దిగొచ్చింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.390 చొప్పున క్షీణించి రూ.74,560 లకు తగ్గింది. ♦ బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి ప్రస్తుతం రూ.67,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.73,800 వద్దకు చేరింది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,800 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.330 తగ్గి రూ.73,950 వద్ద ఉంది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.67,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 ఎగిసి రూ.73,800 వద్దకు చేరింది. -
ఈ రోజు బంగారం ధరలు - ఇలా ఉన్నాయి
2024 ప్రారంభంలో వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. ఫిబ్రవరి, మార్చిలో భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం గ్రామ్ బంగారం ధర రూ. 7000 దగ్గరకు చేరుకునే దిశగా పరుగులు పెడుతోంది. ఈ రోజు (మార్చి 28) దేశంలో బంగారం ధరలు ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా.. గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.61850 (22 క్యారెట్స్), రూ.67460 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ. 350, రూ. 380 వరకు పెరిగింది. చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధరలు 350 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 380 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ. 61850 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 67460 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 61850 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 67460 రూపాయలకు చేరింది. నిన్న రూ. 200 నుంచి రూ. 220 వరకు పెరిగిన బంగారం ధరలు ఈ రోజు రూ. 350, రూ. 380 వరకు పెరిగాయి. వెండి ధరలు బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. గత రెండు రోజులుగా తగ్గిన ధరలు ఈ రోజు మళ్ళీ పెరిగాయి. దీంతో వెండి ధర ఈ రోజు (మార్చి 28) రూ. 77500 (కేజీ) వద్ద ఉంది. రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
పరుగులు పెడుతున్న పసిడి, పడిలేస్తున్న వెండి - నేటి ధరలు ఇవే..
కొన్ని రోజులు క్రితం వరుసగా తగ్గిన బంగారం ధరలు.. ఇప్పుడు క్రమంగా పెరుగుతున్నాయి. ఏడు రోజులుగా అస్సలు తగ్గని పసిడి ధరలు ఎనిమిదో రోజు స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఎలా ఉన్నాయనే విషయాలు ఇక్కడ చూసేద్దాం.. హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు 10 గ్రాముల బంగారం ధరలు రూ. 68300 (22 క్యారెట్స్), రూ.63600 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 150, రూ. 160 ఎక్కువ అని తెలుస్తోంది. చెన్నైలో నిన్న రూ.300 నుంచి రూ.330 పెరిగిన బంగారం ధరలు ఈ రోజు కేవలం రూ.100 మాత్రమే పెరిగింది. దీంతో చెన్నైలో నేడు బంగారం ధరలు వరుసగా రూ. 58900 (22 క్యారెట్స్), రూ. 64250 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. ఢిల్లీలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ. 150 పెరిగి 58450 రూపాయలకు.. 24 క్యారెట్ల ధర రూ. 160 పెరిగి 63750 రూపాయలకు చేరింది. వెండి ధరలు బంగారం ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.. వెండి మాత్రమే పడి, లేస్తూ ఉంది. దీంతో నిన్న రూ. 200 తగ్గిన వెండి, ఈ రోజు రూ. 200 పెరిగింది. -
ఐదు రోజుల తరువాత పెరిగిన పసిడి - నేటి కొత్త ధరలు ఇలా..
ఐదు రోజుల నుంచి అస్సలు పెరగని పసిడి ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయి, చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో (హైదరాబాద్, విజయవాడ) ఈ రోజు తులం బంగారం ధరలు వరుసగా రూ. 57800 (22 క్యారెట్స్), రూ. 63050 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. నేటి ధరలు రూ.100 పెరిగినట్లు తెలుస్తోంది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి. చెన్నైలో కూడా ఈ రోజు తులం బంగారం ధరలు నిన్నటి కంటే రూ. 100 పెరిగింది. దీంతో ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ. 58400 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 63710గా ఉంది. ఇదీ చదవండి: భారతీయుల దగ్గర ఎంత బంగారం ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు! ఢిల్లీలో కూడా ఈ రోజు పసిడి ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. నేడు తులం బంగారం ధరలు వరుసగా రూ. 57950 (22 క్యారెట్స్), రూ. 63200 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. వెండి ధరలు బంగారం ధరలు మాత్రమే కాకుండా.. ఈ రోజు వెండి ధరలు రూ. 500 పెరిగినట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ రోజు వెండి ధరలు నిన్నటి కంటే రూ. 500 ఎక్కువని స్పష్టమవుతోంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ముంబై ప్రాంతాల్లో కూడా ఈ రోజు వెండి ధరలు పెరిగాయి.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019