breaking news
-
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
జర్మనీకి చెందిన స్కైట్రాక్స్ ఏటా ఇచ్చే ‘బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ దక్షిణాసియా 2024’ అవార్డు ఈ ఏడాదికిగాను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను వరించింది. బుధవారం జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన ప్యాసింజర్ టర్మినల్ ఎక్స్పో-2024లో ఈమేరకు ప్రకటన వెలువడినట్లు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(ఆర్జీఐఏ) సీఈవో ప్రదీప్ పణికర్ తెలిపారు. విమానాశ్రయంలో పనిచేసే ఉద్యోగుల పనితీరు, స్నేహ పూర్వకంగా ఉండే విధానం, సమర్థత, సిబ్బంది చురుకుగా వ్యవహరించడం, సమాచార కౌంటర్లు, ఇమ్మిగ్రేషన్, భద్రతా అధికారులు, సెక్యూరిటీ స్టాఫ్, షాప్స్, ఫుడ్ అండ్ బేవరేజస్ అవుట్లెట్లలో స్టాఫ్ పనితీరు మెరుగ్గావుండటం వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుకు ఎంపికచేస్తారు. ఇదీ చదవండి: యువ ఓటర్లకు అదిరిపోయే ఆఫర్.. భారీ రాయితీ ప్రకటించిన సంస్థ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌కు గతేడాది స్కైట్రాక్స్ ఫోర్స్టార్ రేటింగ్‌ను ఇచ్చింది. ఈఏడాది ఏకంగా ప్రముఖ అవార్డుకు ఎంపిక చేయడంపట్ల ఎయిర్పోర్ట్ వర్గాలు హర్షం వ్యక్తంచేశాయి. గత నెలలో హైదరాబాద్ విమానాశ్రయం న్యూదిల్లీలో యాక్రెక్స్(ACREX) హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ స్థాయి అవార్డును గెలుచుకుంది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు జాతీయ పురస్కారం
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జాతీయ పురస్కారం దక్కించుకుంది. ఈ మేరకు ఎయిర్పోర్ట్ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల దిల్లీలో నిర్వహించిన కాలుష్య రహిత వాణిజ్య భవన విభాగ పోటీల్లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు యాక్రెక్స్ హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ పురస్కారం దక్కింది. దీన్ని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీహెచ్ఐఏఎల్) ప్రతినిధులు అందుకున్నారు. ఇదీ చదవండి: మెరైన్ రోబో తయారుచేసిన ఐఐటీ పరిశోధకులు.. ఉపయోగాలివే.. 2030 నాటికి కర్బన ఉద్గారాల రహిత విమానాశ్రయంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జీహెచ్ఐఏఎల్ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటి వరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయిదుసార్లు నేషనల్ ఎనర్జీ లీడర్, తొమ్మిది సార్లు ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియెన్సీ యూనిట్, ఆరు సార్లు ఏసీఐ గ్రీన్ ఎయిర్పోర్ట్ పురస్కారాలు వరించాయని తెలిపారు. -
హైదరాబాద్ ఎయిర్పోర్ట్.. టైమ్ అంటే టైమే..!
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల టైమింగ్ బావుందని నివేదిక వెల్లడైంది. నిర్వహణ, పనితీరు, సమయపాలన (ఆన్‌టైమ్ పర్ఫార్మెన్స్-ఓటీపీ)లో అంతర్జాతీయంగా హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 2023లో ఆన్‌టైమ్ పర్ఫార్మెన్స్ను సమీక్షించిన విమానయాన అనలిటిక్స్ సంస్థ సిరియమ్ రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. టాప్-10 విమానాశ్రయాల్లో మన దేశంలోని కోల్‌కతా విమానాశ్రయం కూడా స్థానం దక్కించుకుంది. టాప్ 1లో అమెరికాకు చెందిన మిన్నేపొలిస్-సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇది ఓటీపీ అధికంగా 84.44% ఉంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 84.42% ఓటీపీతో రెండో స్థానం సాధించింది. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 84.08% ఓటీపీతో మూడో స్థానంలో నిలిచింది. పెద్ద విమానాశ్రయాల్లోనూ ఈ రెండు స్థానం సాధించాయి. మధ్య స్థాయి విమానాశ్రయాల విభాగంలో కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం 83.91 శాతం ఓటీపీతో అంతర్జాతీయంగా తొమ్మితో స్థానం దక్కించుకుంది. ఇదీ చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో మన బ్యాగ్ మనమే చెక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే.. సంస్థల వారీగా.. అంతర్జాతీయంగా దేశంలోని పెద్ద విమానయాన సంస్థ ఇండిగో 82.12% ఓటీపీతో ఎనిమిదో ర్యాంకు సాధించింది. ఆసియా పసిఫిక్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికాకు చెందిన సఫైర్ 92.36% ఓటీపీతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆసియా పసిఫిక్ విభాగంలో జపాన్‌కు చెందిన ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్ 82.75% ఓటీపీతో అగ్ర స్థానం దక్కించుకుంది. జపాన్ ఎయిర్‌లైన్స్ (82.58% ఓటీపీ), థాయ్ ఎయిరేషియా (82.52% ఓటీపీ) రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. విమానం నిర్దేషించిన సమయానికి 15 నిమిషాలు ముందే వస్తే ఆన్‌టైమ్ షెడ్యూల్ అని సిరియమ్ నివేదిక తెలిపింది. -
ఎయిర్‌పోర్ట్‌లో మన బ్యాగ్ మనమే చెక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాదాపు అన్ని సంస్థలు సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనువుగా తమనుతాము నిత్యం అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాయి. నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టడంలో ఎల్లప్పుడూ ముందుండే హైదరాబాద్‌లోని జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ముందడుగు వేసింది. తనిఖీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా సెల్ఫ్ చెక్ కియోస్క్, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులు టర్మినల్లోకి ప్రవేశించడానికి ముందే తనిఖీలు చేయడం, బ్యాగేజీ చెక్ ఇన్, బోర్డింగ్ పాస్‌ల జారీ వరకు అన్ని సదుపాయాలను ఒకేచోట అందిస్తున్నట్టు జీఎమ్మార్ ఎయిర్పోర్ట్ ఈడీ ఎస్జీకే కిశోర్ అన్నారు. విమానాశ్రయంలో ఆధునిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయకుండా సెల్ఫ్ చెక్ కియాస్క్, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. దీంతో టర్మినల్ వద్ద రద్దీ తగ్గడంతోపాటు ప్రయాణికులు మరింత సులభంగా రాకపోకలు సాగించవచ్చని తెలిపారు. ఇదీ చదవండి: వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్ ధర.. ఎంతంటే.. కొత్తగా ఏర్పాటు చేసిన కియాస్క్‌ల వద్ద ప్రయాణికులు వారి బ్యాగ్‌లను వారే చెక్ చేసుకోవచ్చు. అక్కడే బోర్డింగ్ పాస్, బ్యాగ్ ట్యాగ్‌లను తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సేవలు విమానం ప్రారంభమయ్యే గంట ముందు వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. -
Vizag Green Field Airport: వైజాగ్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు రూ.4వేల కోట్లు
వైజాగ్‌లో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం జీఎంఆర్ సంస్థ రూ.4,000 కోట్ల రుణాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ (ఐఐఎఫ్‌సీఎల్) నేతృత్వంలోని కన్సార్టియం ఈ నిర్మాణ సమూహానికి నిధులు సమకూరుస్తుంది. ఐఐఎఫ్‌సీఎల్ 14 ఏళ్లకు 10 శాతం వడ్డీ చొప్పున ఈ రుణాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఎయిర్పోర్ట్ నిర్మాణ సమయంలో, కార్యకలాపాలు మొదలైన ఏడాది వరకు రుణం చెల్లింపుపై మారటోరియం అవసరం అవుతుందని ఐఐఎఫ్‌సీఎల్ తెలిపింది. ఆర్ఈసీ, పీఎఫ్సీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకింగ్ కన్సార్టియంలో భాగమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. భవిష్యత్తులో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధికి నిధులు సమకూర్చడానికి సంస్థ ఆసక్తిగా ఉన్నట్లు ఐఐఎఫ్‌సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పీఆర్ జైశంకర్ తెలిపారు. వైజాగ్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని 2200 ఏకరాల్లో భోగాపురంలో నిర్మిస్తున్నారు. దీన్ని ప్రధానంగా సాయుధ దళాల అవసరాలను తీర్చడానికి ప్రస్తుత విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తున్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019