breaking news
-
ముఖేష్ అంబానీ: ఏ వర్కౌట్స్ లేకుండానే 15 కిలోలు తగ్గాడట, ఎలా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ఈ రోజు 67వ ఏట అడుగుపెట్టాడు. బిజినెస్ మాగ్నెట్, ఆసియాకుబేరుడు ముఖేష్ అంబానీ, ధీరూభాయ్ అంబానీ, కోకిలా బెన్ దంపతులకు 1957 ఏప్రిల్ 19న యెమెన్‌లో పుట్టాడు. వ్యాపార కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, కెమికల్ ఇంజనీరింగ్ చదివిన అంబానీ తన సామర్థ్యం, కృషితో రిలయన్స్‌ను ప్రపంచంలోనే ప్రముఖ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించాడు. భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా, ప్రపంచంలోని టాప్ బిలియనీర్ల జాబితాలో 11వ స్థానంలో నిలవడం విశేషం. రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య బాధ్యతలను తన వారసులు, ఇషా అంబానీ పిరమల్, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలకు పంచి ఇచ్చినప్పటికీ 67 ఏళ్ల వయసులో కూడా వ్యాపార దక్షతలో చురుగ్గా ఉంటాడు. అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో కీలకమైన వ్యాపార నిర్ణయాలతోపాటు ఇటు కుటుంబ బాధ్యతలను కూడా దిగ్విజయంగా నిర్వరిస్తున్నాడు. అంతేకాదు తన ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను కాపాడుకోవడంలో కూడా దిట్ట. ఆయన పాటించే ఆహారం నియమాల గురించి ఎవరికీ పెద్దగా తెలియనప్పటికీ, ఎలాంటి వర్కవుట్ లేకుండానే ముఖేష్ అంబానీ 15 కిలోలు తగ్గారట. ఈ సందర్బంగా ఆయన డైట్ , జీవన శైలి ఏంటి అనేది చర్చలో నిలిచింది. (యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!) కఠినమైన ఆహార నియమాలతోనే ముఖేష్ అంబానీ ఈ అద్భుత ఫలితాన్ని సాధించారని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ప్రపంచంలోని ఇతర సక్సెస్ఫుల్ వ్యక్తుల మాదిరిగానే ముఖేష్ అంబానీ యోగా, ధ్యానంతో రోజు ప్రారంభిస్తాడు. ఉదయం 5:30 గంటలకు మేల్కొంటాడు. యోగా, ధ్యానం సూర్య నమస్కారాలు, వాకింగ్ కోసం బయటికి కూడా వెళ్తాడు. ఎంత బిజీషెడ్యూల్ ఉన్నా ఈ ఉదయపు దినచర్యను మాత్రం ఎప్పుడూ దాటవేయడు. (మోడ్రనే కానీ, నాకు అలా బిడ్డను కనే ధైర్యం లేదు : మసాబా వ్యాఖ్యలు వైరల్) బ్రేక్‌ఫాస్ట్, లంచ్ డిన్నర్ ఇలా.. అంబానీ స్ట్రిక్ట్ వెజిటేరియన్ డైట్‌ని ఫాలో అవుతారు. ఆల్కహాల్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటాడు. ఇక రోజులోని అంబానీ తొలి భోజనం విషయానికి వస్తే అల్పాహారంలో తాజా పండ్లు, జ్యూస్, ఇడ్లీ-సాంబార్ తీసుకుంటాడు. లంచ్, డిన్నర్ కూడా సాంప్రదాయ భారతీయ ఆహారాలతో చాలా సింపుల్‌గా కానిచ్చేస్తారట. గుజరాతీ తరహాలో దాల్, సబ్జీ, అన్నం, సూప్‌లు , సలాడ్లను ఇష్టపడతాడు. అది కూడా ఇంట్లో వండిన భోజనం మాత్రమే. కాగా ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్, వ్యవస్థాపకురాలిగా ఐపీఎల్ జట్టుకు ఓనర్‌గా ఉన్నారు. నీతా, అంబానీ దంపతులు ఇప్పటికేపెద్ద కుమారుడు ఆకాష్ అంబానీకి, కుమార్తె ఇషా అంబానీకి వివాహాలు జరపించారు. నలుగురు మనవలు కూడా ఉన్నారు. ఇక చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి ఈ ఏడాది జూన్‌లో జరగనుంది. -
61 ఏళ్ల వయసులో 38 ఏళ్ల కుర్రాడిలా..ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
మనుషులు ఎంత ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించినా వయసును దాచడం సాద్యం కాదు. వయసు రీత్యా వచ్చే మార్పులను కూడా ఆపలేం. కానీ ఇక్కడొక వ్యక్తి తాతా వయసులో ముప్పై ఏళ్ల కుర్రాడిలా అదిరిపోయే ఫిట్నెస్తో కనిపిస్తున్నాడు. దీంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఇంతకీ అతడి ఆరోగ్య రహస్యం వింటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ రోజుల్లో ఇలా ఫాలో అయ్యేవాళ్లు ఉన్నారా..? అనుకుంటారు. వివరాల్లోకివెళ్తే..యూఎస్‌లోని మిచిగాన్కు చెందిన 61 ఏళ్ల డేవ్ పాస్కో 38 ఏళ్ల కుర్రాడి మాదిరిగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆరోగ్య, దీర్ఘాయువు కోసం కఠిన జీవన శైలిని అనుసరించేవాడు దేవ్ . తనని తాను బయోహ్యాకర్గా అభివర్ణించుకుంటాడు. ఆహారం, వ్యాయామం పట్ల కనబర్చిన శ్రద్దే జీవసంబందమైన వయస్సును 38 ఏళ్లకు మార్చిందని దేవ్ చెబుతున్నారు. అంతేగాదు తన రోజువారి దినచర్య గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తాను సూర్యోదయానికి ముందే లేచి ఆరుబయట గడపటం, వ్యాయమాలు చేయడం వంటివి చేస్తానని తెలిపారు. అలాగే నిర్థిష్ట ఆహార నియమాలను పాటిస్తానని, ప్రతిరోజూ దాదాపు 158 సప్లిమెంట్లను తీసుకుంటానని అన్నారు. తన లక్ష్యం కేవలం తన వయసు తక్కువగా చూపించేలా ఉండటం, సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటమేనని తెలిపారు. అంతేగాదు తనకు 90 లేదా 110 ఏళ్లు వచ్చినా.. పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా జీవించాలన్నదే తన లక్ష్యం అని చెబుతున్నారు దేవ్. ఎన్నీ అర్జెంట్ పనులు, అవాంతరాలు వచ్చినా.. తన రోజువారి దినచర్య పూర్తి అయ్యిన తర్వాతే ఏదైనా చేస్తానని తేల్చి చెప్పారు. తన విలువై సమయాన్ని ఇతరులతో గడిపేందుకు ఇవ్వనని, ఒంటిరిగానే ఉంటానని అంటున్నారు. అయితే ఇలా ఒంటరిగా ఉన్నప్పుడూ తనతో తాను కనెక్ట్ అయ్యేలా చేసుకుంటాడట దేవ్. మిగతా సమయం అంతా వ్యాయామాలు, ఆవిరి సెషన్లతో గడిచిపోతుందట. అలాగే అతడు చాలా అరుదుగా భోజనం చేస్తాడట. అంతేగాదు సేంద్రియ గడ్డి తినే గొడ్డు మాంసం, ఫ్రీ రేంజ్ చికెన్ లేదా చేపలు డిన్నర్లో తీసుకుంటాడట. ముఖ్యంగా ఎక్కువ కూరగాయలు, వెల్లుల్లి, తప్పకుండా ఉండేలా చూసుకుంటాడట. అయితే ఇక్కడ దేవ్ బరువు పెరగకపోవడానికి కారణం.. కార్బోహైడ్రేట్లను పరిమితం చేయడమేనని చెబుతున్నాడు. ఇక్కడ దేవ్ బయోహ్యాకింగ్ పద్ధతుల్లో సక్రమైన జీవనశైలితో వృద్ధాప్య ఛాయలు కనపడకుండా చేసి కుర్రాడిలా ఫిట్నెస్గా మారాడు. ఇటీవలకాలంలో ఈ బయోహ్యాకింగ్ ఉద్యమం ఒక ట్రెండ్‌గా మారింది. అంటే ఆరోగ్యంగా ఉండేలా వృద్ధాప్యాన్ని తగ్గించేందుకు వివిద పద్ధతుల్లో ప్రయోగాలు చేస్తున్నారు. నిపుణులు మాత్రం దీనికి శాస్త్రీయ ధృవీకరణ లేదని, పైగా ఇది అందరికీ అనుకూలంగా ఉంటుందని చెప్పలేమని హెచ్చరిస్తున్నారు. (చదవండి: ఆ మూడు సమయాల్లో అస్సలు బ్రష్ చేయకూడదట..!) -
‘శ్రీ రాముడి’ కోసం రణ్‌బీర్ దిమ్మదిరిగే వర్కవుట్..వైరల్ వీడియో
చాక్లెట్ బాయ్‌గా బాలీవుడ్లో అడుగుపెట్టి.. నటుడుగా తానేంటో నిరూపించుకున్నాడు హీరో రణ్‌బీర్ కపూర్. ‘యానిమల్ మూవీతో టాలెండెట్ హీరోగా తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు. తాజాగా రానున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణం’ కోసం రణ్‌బీర్ కపూర్ తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. శ్రీరాముడి పాత్ర కోసం జిమ్‌లో తెగ కష్టపడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది. రణ్‌బీర్ పెర్సనల్ ట్రైనర్ నామ్ వర్కౌట్ వీడియోను షేర్ చేశాడు. స్విమ్మింగ్ రన్నింగ్, బైక్ రైడింగ్.. జిమ్ బాల్, కెటిల్‌బెల్స్, జిమ్ రోప్‌లతో వర్క్అవుట్లు ఈ వీడియోలో చూడొచ్చు. ప్రశాంతంగా గ్రామీణ ప్రాంతంలో ట్రెక్కింగ్, బైక్ రైడింగ్, బరువులు ఎత్తడం లాంటి కీలకమైన ఎక్సర్సైజ్లు చేస్తుండటం గమనార్హం. రణ్‌బీర్ సతీమణి, హీరోయిన్ అలియా భట్, కూతురు రాహా కూడా ఉందంటూ ఫ్యాన్స్ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Training With Nam (@trainingwithnam) ఏ ప్రాతకోసమైనా పాత్రకు తగ్గట్టు ఒదిగిపోయేలా తీవ్ర కసరత్తులు చేయడం రణబీర్‌కు అలవాటు. అలా ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులకు మరింత దగ్గర య్యాడు. తాజా ఆయన వర్కవుట్స్ చూసి ఆయనఅంకితభావం అలాంటిది అంటూ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంతో రానున్న 'రామాయణం' మూవీలో రణబీర్ కపూర్ రాముడిగా అలరించ నున్నాడు. గత ఏడాది రికార్డు కలెక్షన్స్ రాబట్టిన యానిమల్ మూవీ కోసం కూడా రణ్‌బీర్ భారీగా కండలు పెండిన సంగతి తెలిసిందే. -
సిక్సర్ల బ్యాటర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
ప్రముఖ స్టార్ క్రికెటర్ రోహిత్ గురునాథ్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలోకి బ్యాట్‌తో దిగడంతోనే ప్రత్యర్థులను మట్టికరిపించేలా సిక్స్‌ర్లతో చెలరేగిపోతాడు. విధ్వంసకర బ్యాట్సమెన్గా ఈ హిట్‌మ్యాన్‌కి పేరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి తానెంటో ప్రూవ్ చేసుకున్నాడు. అంతేగాదు రోహిత్ టీమిండియా జట్టు కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో ఆడి తొలి సిరీస్‌ల్లోనే ప్రత్యర్థి జట్టును క్లీన్ స్వీప్ చేసిన కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అలాంటి విధ్వంసకర బ్యాట్సమెన్ రోహిత్ ఫిట్నెస్ రహస్యం ఏంటో తెలుసుకుందామా..! క్రీడాకారులు మంచి ఆటతీరుని కనబర్చాలంటే ఫిట్‌గా ఉండాల్సిందే. మంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తేనే మంచి ఆట తీరుని కనబర్చగలరు. మరి ఈ దిగ్గజ ఆటగాడు రోహిత్ ఫిట్నెస్ సీక్రెట్, ఫాలో అయ్యే డైట్ ఏంటో సవివరంగా చూద్దామా..! డైట్.. రోహిత్ పోషకాహారంతో కూడిన ఆరోగ్యకరమైన డైట్‌ని ఫాలో అవ్వుతాడు. తన డైట్లో తప్పనిసరిగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. అల్పాహరంలో రోహిత్ తప్పనిసరిగా గుడ్లు, ఓట్స్, పండ్లను తింటాడు. సమతుల్య ఆహారానికే ప్రాధాన్యత ఇస్తాడు. మధ్యాహ్నాం లంచ్‌లో తప్పనిసరిగా బ్రౌన్ రైస్, చికెన్, కూరగాయాలు తీసుకుంటాడు. రాత్రిపూట తప్పనిసరిగా కాల్చిన చేపలు, సలాడ్, ఉడికించిన కూరగాయాలు తీసుకుంటాడు వర్కౌట్లు.. ఫిట్‌గా ఉండేలా శరీరంలో చెడు కొలస్ట్రాల్ చేరకుండా జాగ్రత్త పడతాడు. అలాగే ఇన్సులిన్ స్థాయిలు సమంగా ఉండేలా డైలీ శరీరానికి కావాల్సిన వర్కౌట్లు చేస్తుంటాడు. ఎక్కువ సమయం తన ట్రైనర్‌తో కలిసి వ్యాయామ శాలలో గడుపుతాడు. కోర్ వర్కౌట్లపై దృష్టిపెడతాడు. ఇది కండరాల స్థాయిని మెరుగుపరుస్తుంది. బరువుని అదుపులో ఉంచుతుంది. నిజానికి రోహిత్ కెరియర్ ప్రారంభంలో ఫిట్‌నెస్‌లో అంత ప్రావీణ్యం పొందలేదు. రానురాను ఆటను మెరుగుపరచుకునే క్రమంలో తన ఫిట్‌నెస్‌పై దృష్టిసారించడం ప్రారంభించినట్లు ఓ ఇంటర్యూలో వెల్లడించారు. ఇక రోహిత్ శాకాహార కుటుంబంలో జన్మించినప్పటికీ ఫిట్నెస్గా ఉండి మెరుగ్గా ఆడేందుకు నాన్‌వెజ్ తీసుకోక తప్పలేదు. (చదవండి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫాలో అయ్యే డైట్ ఇదే!) -
నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఓ మంచి గృహిణిగా, వ్యాపారవేత్తగా తనదైన ముద్ర వేశారు. కేవలం ముఖేశ్ అంబానీ భార్య అనే ఐడెంటిటీ కంటే తనను తానుగా గుర్తించే ప్రాముఖ్యతను సొంతం చేసుకున్నారు. రిలయన్స్ బోర్డు మెంబర్‌గా, ఐపీఎల్లో ముంబై ప్రాంచైజ్ ఓనర్‌గా మంచి విజయాలను అందుకున్నారు. ఆ సక్సెస్ ఆమెను ఫోర్బ్స్ మ్యాగజైన్లో చోటు దక్కించుకునేలా చేశాయి కూడా. ఇటీవల చిన్న కొడుకు నీతా అంబానీ-రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో హడావిడి అంత ఆమెదే. ఏ డ్రెస్‌లు వేసుకోవాలి..? ఈవెంట్ ఎలా చేయాలి..? వంటివన్నీ తన అమ్మే దగ్గరుండి మరీ చూసుకున్నారని స్వయంగా అనంత్ అంబానీనే చెప్పారు కూడా. 54 ఏళ్ల నీతా అంబానీ తన కోడళ్లకు, కూతురుకి ఏ మాత్రం తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. చూడటానికి ఓ హిరోయిన్ మాదిరిగా మంచి ఫిజిక్ మెయింటెయిన్ చేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే ఆమె అందం, ఫిట్నెస్ ముందు సినీ సెలబ్రెటీలు కూడా సరిపోరని చెప్పొచ్చు. ఇంతలా చలాకీగా ఫిట్నెస్గా ఉండటానికి ఆమె ఎలాంటి డైట్ ఫాలో అవుతారు?. ఆమె ఫిట్నెస్ రహస్యం తదితరాలు గురించి చూద్దామా!. నీతా అంబానీ మొదట్లో 90 కిలోల బరువు ఉండేవారు. తన చిన్న కొడుకు అనంత్ అంబానీ ఆస్మా, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యల కారణంగా విపరీతమైన బరవు పెరిగిపోయాడు. దీని కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కున్నాడు కూడా. తన కొడుకు బరువు తగ్గేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విజయవంతం కాకపోవడంతో ఆమెనే స్వయంగా తగ్గి కొడుకుకి స్ఫూర్తినిచ్చారు. పైగా నీతా కొడుకు తగ్గేందుకు ఉపక్రమించేలా చేశారు. అలా అనంత్ కూడా ఆ టైంలో బరువు తగ్గడం జరిగింది కూడా. అదీగాక నీతా మంచి శాస్త్రీయ నృత్యకారిణి కావడంతో ఆమె రోజువారీ దినచర్యలో భాగంగా నృత్యం చేస్తుంటారు. ఇదే ఆమెను మంచి ఫిట్నెస్గా ఉండేందుకు ఉపకరించిందని చెప్పొచ్చు. అలాగే ఈ డ్యాన్స్ కదిలికలు, శరీరానికి ఓ మంచి వ్యాయామంలా ఉండి బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే నీతా క్రమం తప్పకుండా బీట్ రూట్ జ్యూస్ తగ్గుతారు. పోషకాలు అధికంగా ఉండే ఈ జ్యూస్‌లో అద్భుతమైన డిటాక్స్‌లు ఉంటాయి. అవి అనారోగ్యం బారిన పడకుండా ఉండేలా చేసి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. దీంతోపాటు మానసిక ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా యోగా చేస్తుంది. ఇది నిధానంగా బరువు తగ్గడంలో తోడ్పాడుతుంది. ఎలాంటి సైడ్ ఎఫ్క్ట్లు తలెత్తకుండా ఉండేలా చేసి బరువుని అదుపులో ఉంచుతుంది. పైగా మంచి మానసికొల్లాసం కలిగించి మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా వ్యాపారాలు నిర్వహించే సమయంలో ఎదురయ్యే ఒత్తిడి, చికాకులు, టెన్షలు వంటి వాటిని తట్టుకునేలా చేస్తుంది. ఇదే ఆమె ఫిటనెస్ రహస్యం. అందువల్లే నీతా ఇంత అందంగా ఆరోగ్యంగా మంచి ఫిట్నెస్తో ఉన్నారని చెప్పొచ్చు. ఈ ఆరోగ్యకరమైన జీవనశైలి కారణంగానే ఆమె శక్తిమంతమైన బిజినెస్ విమెన్‌గా వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారని కూడా అనొచ్చు. (చదవండి: ట్రెండీ షార్ట్ బాబ్ హెయిర్ స్టయిల్..ఎక్కడి నుంచి వచ్చిందంటే..)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Invalidation article updation 2
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019