breaking news
-
తిరుమల చుట్టూ ఉన్న కొండల్లో అగ్ని ప్రమాదం
తిరుమల: తిరుమల చుట్టూ ఉన్న కొండల్లో అగ్నిప్రమాదం సంభవించింది. శేషచల అటవీ ప్రాంతంలో మంటలు ఎగసిపడ్డాయి. పార్వేట మండపం ప్రాంతంలో మంటలు ఎగసిపడి శ్రీగంధం వనం మంటలు వ్యాపించాయి. ఎండలతో అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. -
విజయవాడలో భారీ అగ్నిప్రమాదం
-
అగ్గి రాజుకుంటోంది
సాక్షి, హైదరాబాద్ : అడవుల్లో ‘అగ్గి’ రాజుకుంటోంది. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండడంతో అడవుల్లో అగ్నిప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటికే 1,500లకు పైగా అగ్నిప్రమాదాలు రిపోర్ట్ కాగా నల్లమల, ములుగు, ఇతర ప్రాంతాల్లోని 6 వేల హెక్లార్లలో అటవీభూమికి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ♦ రాష్ట్రంలోని మూడోవంతు దాకా అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు /ప్రమాదాలు పొంచి ఉన్నాయని, అడవులకు ఆనుకొని ఉన్న గ్రామాల్లో (ఫారెస్ట్ ఫ్రింజ్ ఏరియా) మూడో వంతు అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి అగ్ని ప్రమాదా లకు సంబంధించి పదిహేను ఏళ్లుగా సేకరించిన సమాచారం, డేటా ఆధారంగా చేసిన విశ్లేషణల్లో వివిధ అంశాలు వెల్లడయ్యాయి. ♦ తెలంగాణవ్యాప్తంగా మూడువేలకు పైగా ఫారెస్ట్ బీట్లు ఉన్నాయి. ప్రతీ ఫారెస్ట్ బీట్‌లో ఫైర్బ్లోయర్లు, రేక్స్, పారలు, ఫైర్ బీటర్స్, సిబ్బందికి అగ్నినిరోధక దుస్తులు, బూట్లు, హెల్మెట్లు వంటివి అందుబాటులో ఉండాలి. అయితే ప్రస్తుతం 550 ఫైర్బ్లోయర్లు ఉండగా వాటిలో పదిశాతం వరకు మరమ్మతులు చేయాల్సి ఉందని సమచారం. ♦ వేసవిలో అగ్నిప్రమాదాలు అధికంగా జరిగే అవకాశమున్న రోజులలో (పీక్ సీజన్లో) కేవలం 95 ‘క్విక్ రెస్పాన్స్ టీమ్స్’ క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్నట్టుగా వెల్లడైంది. దీనిని బట్టి అడవుల్లో అగ్నిప్రమాదాల నియంత్రణకు సంబంధించి అధికా రులు పూర్తిస్థాయిలో సన్నద్ధమై లేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ వాదనను అటవీశాఖ అధికారులు ఏకీభవించడం లేదు. ♦ ములుగు, అమ్రాబాద్, ఇతర అటవీ ప్రాంతాల్లో కావాలనే అగ్ని ప్రమాదాలకు పాల్పడుతున్న వారిని గురించి వన్యప్రాణి పరిరక్షణ చట్టం కింద కేసులు పెట్టామని, ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి వాటికి పాల్పడే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మానవ తప్పిదాలతోనే ప్రమాదాలు అత్యధికంగా మానవ తప్పిదాలతోనే ఈ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, అయితే ఇవి చిన్న చిన్నవే కావడంతో ఎక్కువ నష్టం జరగకుండా ఆర్పేస్తున్నామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అటవీశాఖ ‘ఫారెస్ట్ఫైర్స్’ చాలా దగ్గరగా పర్యవేక్షిస్తోందని, ఈ మంటల అదుపునకు వెంటనే చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 21,739 కి.మీ పరిధిలో ఫైర్‌లైన్స్ వేయడంతో పాటు, అడవులకు ఆనుకుని 11వేల కి.మీలలో ‘పెరిఫెరల్ ట్రెంచెస్’ తవ్వి మంటల అదుపునకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అరణ్యభవన్‌లో రాష్ట్రస్థాయిలో ఫైర్ మానిటరింగ్, కంట్రోల్ సెల్ ఏర్పాటు చేసి 24 గంటలు పర్యవేక్షిస్తూ ,ఫైర్ అలర్ట్స్ కోసం టోల్‌ఫ్రీ నంబరు, వాట్సాప్నంబర్లు ఏర్పాటు చేశామన్నారు. అగ్గి ప్రమాదాలకు అవకాశం ఇలా.. ♦ రాష్ట్రంలో మొత్తం 53 అటవీ డివజన్లు ఉండగా, వాటిలో 23 దాకా హై–ఫైర్ ప్రోన్‌గా గుర్తించారు ♦ 1,208 ఫారెస్ట్ రేంజ్‌లకు గాను 45 రేంజ్‌లలో హై–ప్రోన్ రేంజేస్గా ఉన్నాయి ♦ పదివేల ఫారెస్ట్ కంపార్ట్ మెంట్లు (ఒక్కోటి 250 నుంచి 500 హెక్టార్లు కవర్ చేస్తుంది) ఉన్నాయి ♦ వీటిలో 1,120 కంపార్ట్మెంట్ల (హై–ఫైర్ ప్రోన్) దాకా పెద్ద అగ్నిప్రమాదాలకు ఎక్కువ అవకాశాలు ♦ 1,700లదాకా మధ్యంతరంగా (మీడియం–ఫైర్ప్రోన్) అగ్నిప్రమాదాలకు ఎక్కువ అవకాశాలు ♦ 4,260 దాకా అటవీ సమీప గ్రామాల్లో అగ్నిప్రమాదాలకు అవకాశం ♦ వీటిలో 1,250లకుపైగానివాస ప్రాంతాల్లో అత్యధికంగా ప్రమాదాలు జరిగే చాన్స్. -
అప్రమత్తతే అతి ముఖ్యం
సాక్షి, హైదరాబాద్: ఎండాకాలం నేపథ్యంలో అగ్నిప్రమాదాలకు అవకాశాలు పెరిగాయి. అప్రమత్తతతో ఉంటేనే అగ్ని ప్రమాదాలను నియంత్రించడంతోపాటు ప్రమాదాలు జరిగినా తక్కువ నష్టంతో బయటపడొచ్చు. ఇందుకు ప్రజల్లో అవగాహన అతి ముఖ్యమని అగ్నిమాపకశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రమాదాల నియంత్రణలో భాగంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈనెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక సేవల వారోత్సవాలు చేయనున్నట్టు ఫైర్ డీజీ వై.నాగిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. రద్దీ ఎక్కువగా ఉండే బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, నివాససముదాయాలు, మల్టీప్లెక్స్, మాల్స్‌లో వీటిని నిర్వహిస్తారు. ఎండల తీవ్రత పెరగడంతో అగ్నిప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ తెలంగాణ అగ్నిమాపకశాఖ కొన్ని మార్గదర్శకాలు వెల్లడించింది. ఈ విషయాల్లో జాగ్రత్త ► వేసవి తీవ్రత పెరగడంతో ఫ్యాన్లు, ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణాల వాడకం పెరుగుతుంది. దీనివల్ల ఓవర్‌లోడ్‌తో షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. విద్యుత్ వైరింగ్‌లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ► ఇంట్లో మంటల వ్యాప్తికి ప్రధాన అంశాల్లో వంటింట్లో మంటలు అంటుకోవడం కూడా.. అందువల్ల వంటగదిలో మంటలు అంటుకునే వస్తువులు లేకుండా చూసుకోవాలి. వీలైనంత గాలివెలుతురు ఉండేలా చూసుకోవాలి. ► అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యునిటీలు, బహుళ అంతస్థుల భవనాల్లో ఉండే వారు తప్పకుండా ఫైర్ ఆడిటింగ్ నిర్వహించాలి. అగ్నిమాపక నియంత్రణ పరికరాలు, మంటలార్పేందుకు నీటి పైప్‌లైన్ వ్యవస్థ, ఫైర్ అలార్మ్లు పనిచేస్తున్నాయా..ఇలా అన్నింటినీ ఒకసారి సరిచూసుకోవాలి. ► కారు ప్రయాణంలోనూ అగ్ని ప్రమాదాల నుంచి రక్షణకు పోర్టబుల్ ఫైర్ ఎక్ట్సింగ్విషర్ (మంటలు ఆర్పేది) పెట్టుకోవాలి. ► ఇళ్లలో ఎలక్ట్రికల్ వస్తువులు వాడకపోతే వాటిని వెంటనే స్విచ్ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ► కార్యాలయాల్లో ఫైర్ స్ప్రింక్లర్ వ్యవస్థ, ఫైర్ అలార్మ్లు, ఎమర్జెన్సీ లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటి వరకు 2,550 ఫైర్ కాల్స్ రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి మార్చి చివరి వరకు అగ్నిప్రమాదాలకు సంబంధించి అన్ని రకాల ఫిర్యాదులు కలిపి 2,550 ఫైర్ కాల్స్ వచి్చనట్టు అగ్నిమాపకశాఖ అధికారులు వెల్లడించారు. గతేడాదిలో 8151 ఫైర్ కాల్స్ వచి్చనట్టు తెలిపారు. ఇందులో 141 తీవ్రమైన ప్రమాదాలు, 175 మధ్యతరహా అగ్నిప్రమాదాలు ఉన్నట్టు తెలిపారు. -
HYD: రత్నదీప్ సూపర్ మార్కెట్లో అగ్నిప్రమాదం
సాక్షి, రాజేంద్రనగర్: నగరంలోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. సూపర్ మార్కెట్లో మరమ్మత్తులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రత్నదీప్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పరిధిలో గల బండ్లగూడ రత్నదీప్ సెలెక్ట్ సూపర్ మార్కెట్లో ఆదివారం ఉదయం మంటలు చెలరేగాయి. సిబ్బంది సూపర్ మార్కెట్లో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది ఆ మంటలను చూసి పరుగులు తీశారు. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించింది. ఈ క్రమంలో రత్నదీప్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019