breaking news
-
రామోజీ పెన్షన్ల లెక్క తేలుద్దాం
-
Fact check: ఓటమి భయం ప్రస్ఫుటం
సాక్షి, అమరావతి: రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం, టీడీపీ ఓటమి ఖాయమని జాతీయ చానళ్ల సర్వే ఫలితాలు విడుదలవుతున్న కొద్దీ ...ఈనాడు రామోజీరావులో పాత్రికేయ పైశాచికత్వం పెట్రేగి పోతోంది. ‘మేమంతా సిద్ధం’ యాత్రలో సీఎం వైఎస్ జగన్ పట్ల వెల్లువెత్తుతున్న ప్రజాదరణతో రామోజీరావుకు తత్వం మెల్లగా బోధపడుతోంది. జగన్‌కు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం తన తరం కాదన్న అక్కసుతో ఏకంగా పోలీసు వ్యవస్థనే బ్లాక్మెయిల్ చేసేందుకు బరితెగించారు. ఆ కసిలో ఈనాడు పత్రికలో ‘అదే అరాచకత్వం...అదే దౌర్జన్యం’ శీర్షికన గురువారం తాజాగా విష పూరిత కథనాన్ని ప్రచురించారు. రామోజీ రాతలకు అతీతంగా అటు ఈసీ, ఇటు పోలీసు వ్యవస్థ నిబద్ధతతో తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించడం సానుకూల పరిణామం. కుట్ర బెడిసికొట్టినా ఖాకీలపై ఈనాడు కారుకూతలు... చంద్రబాబు, పురందేశ్వరిల భాగస్వామ్యంతో పోలీసు వ్యవస్థను తమకు గులాంగా చేసుకునే కుట్రలో భాగంగా ...రాష్ట్రంలో 20 మందికి పైగా ఐపీఎస్ అధికారులను మార్చేయాలని ఈనాడు లో కథనాలు రాశారు. రామోజీ పాచిక పారలేదు. డీఐజీ, ఐదుగురు ఎస్పీలను మాత్రమే ఎన్నికల కమిషన్ మార్చింది. వారి స్థానాల్లో తాము చెప్పిన వారినే నియమించాలన్నట్టుగా పచ్చ ముఠా పరోక్షంగా ఆదేశాలు జారీ చేసింది. తద్భిన్నంగా నియమావళి ప్రకారం ఎన్నికల కమిషన్ ఒక డీఐజీ, ఐదుగురు ఎస్పీలను నియమించడంతో రామోజీలో అహం దెబ్బతింది. దీంతో ‘వీళ్లా ఎస్పీలు’ అంటూ డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు లక్ష్యంగా దు్రష్పచార కథనాన్ని ఈనాడు ప్రచురించింది. ఈ కథనంతో చిర్రెత్తిన పోలీసు యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. ఏకంగా 19 మంది ఐపీఎస్ అధికారులు టీడీపీ, జనసేన, బీజేపీ, ఈనాడులకు వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఈనాడు తీరుపై మండిపడింది. అంతటితో బుద్ధి రాని రామోజీ కుక్కతోక వంకరన్నట్లు మరోసారి పోలీసు వ్యవస్థపై విధ్వేషం వెళ్లగక్కారు. ఈనాడులో వచి్చన ఆదేశాలనే ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పోలీసులు పాటించాలన్నట్టుగా బ్లాక్‌మెయిలింగ్‌కు దిగజారారు. టీడీపీ దౌర్జన్యాలు, దాడులను మసిపూసి మారేడు కాయ చేస్తూ వైఎస్సార్సీపీపై బురద జల్లేందుకు యతి్నంచారు. వైఎస్సార్సీపీలో ఫలానా నేతలపై ఫలానా సెక్షన్ల కింద కేసులు పెట్టండంటూ పోలీసులకు రామోజీ తన రాతల హుకుం జారీ చేశారు. పోలీసు అధికారుల బెదిరింపునకూ పన్నాగం తాజాగా ఎన్నికల విధుల్లో క్రియాశీలంగా ఉండే డీఎస్పీ, సీఐ, ఎస్సైలను బ్లాక్మెయిల్ చేయడం ద్వారా టీడీపీ అక్రమాలకు అడ్డులేకుండా చేయాలన్న పచ్చ కుట్రలో రామోజీ భాగస్వామిగా మారారు. ఇటీవల పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు దౌ ర్జన్యాలకు పాల్పడ్డ ఉదంతాలను ఈనాడు వక్రీకరిస్తూ తప్పుడు కథనం ప్రచురించింది. మాచర్ల, గన్నవరం, అద్దంకి, ఉరవకొండ, గుడివాడ తదితర నియోజకవర్గాల్లో గత వారం పదిరోజుల్లో టీడీపీ కార్యకర్తలు దౌర్జ న్యాలకు పాల్పడ్డారు. తాజాగా బుధవారం రాత్రి ఒంగోలులో ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్సార్సీపీ అ భ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిని, ఆయన కుటుంబ స భ్యులనే అడ్డుకున్నారు. అసలు ఎన్నికల ప్రచారం చే యడానికి వీల్లేదని గలాభా సృష్టించారు. ఈ ఘటనల పై స్థానిక పోలీసులకు ఫిర్యాదులు అందడంతో వారు కఠిన చర్యలు తీసుకున్నారు. టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడినా.. వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రచా రా న్ని అడ్డుకున్నా పోలీసు యంత్రాంగం చేష్టలుడిగి చూ స్తుండాలన్నట్టుగా ఈనాడు వితండవాదం చేస్తోంది. ఈసీనే శాసిస్తున్న రామోజీ రాతలు... ఏకంగా రాజ్యంగబద్ధ సంస్థ ఈసీకే పరోక్షంగా తన రాతలతో ఆదేశాలు జారీ చేస్తుండటం రామోజీరావు బరితెగింపునకు నిదర్శనం. ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో ఏకంగా ఎస్పీలను మారిస్తే సరిపోతుందా... మొత్తం డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను మార్చేయాలని ఈసీకే రాతల హుకుం జారీ చేశారు. అందర్నీ మారుస్తామన్నారు..ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈసీనే ఈనాడు నిలదీయడాన్ని ప్రజాస్వామ్యవాదులే ఛీత్కరించుకుంటున్నారు. ఈసీ కొత్తగా నియమించిన పల్నాడు ఎస్పీపైనా ఈనాడు విషం కక్కింది. అయినా రామోజీ రాతలకు అతీతంగా ఈసీ తన పని తాను పక్షపాత రహితంగా చేసుకుపోతోంది. -
Fact check: అబద్ధాలు రచించెన్
సాక్షి, అమరావతి: అబద్ధం.. కుళ్లు.. భయం.. వీటికి ప్యాంటూ చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం రామోజీ మాదిరే ఉంటాయేమో! జగన్ పరిపాలనలో అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు ప్రతి నెలా పింఛన్లు అందుకుంటూ ఆనందంగా ఉంటే రామోజీకి కంపరంగా ఉంది. ఈ వర్గాల్లో జగన్‌కు పెరుగుతున్న పరపతిని చూసి తన భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తోంది. అందుకే వాస్తవాలకు మసిపూసి ‘నవరత్నాలు – నయవంచన’ అంటూ మరో అబద్ధపు కథనాన్ని అచ్చేసేశారు. ఈ నిస్సిగ్గు పాత్రికేయాన్ని చూసి అక్షరాలు సిగ్గుతో తలదించుకోవాల్సిందేనేమో...!! పింఛనుదారుల సంఖ్య పెరిగింది జగన్ హయాంలోనే ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. ఇందులో 29.51 లక్షల మంది జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొత్తగా పింఛన్లు అందుకున్నవారే. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో పింఛన్ల సంఖ్య ఏ మాత్రం పెరగలేదు. అప్పట్లో 43.11 లక్షల మంది పింఛనుదారులున్నారని లెక్కలు చెబుతున్నా 39 లక్షల మందికే చెల్లింపులు జరిపేది. నాలుగు నుంచి 5 లక్షల మందికి ఎగ్గొట్టేది. రామోజీ దగ్గర ఈ లెక్కలు లేవో.. లేక కావాలనే విస్మరించారో. ఇంటికో పింఛను విధానం బాబుదే కుటుంబానికి ఒక్కటే పింఛను విధానం జగన్ ప్రభుత్వం అమలు చేసినట్టు ఈనాడు ఓ అబద్ధాన్ని రాసింది. ఈ విధానం ప్రవేశపెట్టిందే చంద్రబాబు ప్రభుత్వం. 2014 సెప్టెంబర్ 18న ఆర్సీ నంబరు 1053 పేరిట జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఐదేళ్ల పాటు దీన్ని అమలు చేసింది. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒకే ఇంటిలో ఇద్దరు దివ్యాంగులున్నా రెండో పింఛను ఇచ్చే విధానాన్ని అమలు చేశారు. మరో వైపు.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల చొప్పున నెలనెలా పింఛన్ అందిస్తున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే కొత్తగా తీసుకొచి్చన ఈ మేలును బహుశా రామోజీ మరిచిపోయి ఉంటారు. కోతల్లేవు పింఛనుదారులలో మరణాల సంఖ్యను ఎక్కువగా చూపి పింఛన్లను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తగ్గించినట్టు ఈనాడు ఇంకో అబద్ధం ప్రచురించింది. సాధారణంగా పింఛనుదారుల్లో 0.5 శాతం మరణాలు నమోదవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇది 0.8 శాతం ఉండొచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2015 మేలో 0.8 శాతం మేర అంటే 36,406 మరణాలు నమోదు కావడంతో ఆ నెలలో పింఛన్లకు కోత పెట్టింది. అదే ఏడాది ఏప్రిల్‌లో 0.6 శాతం మేర అంటే 22,334 మంది పింఛనుదారులు మరణించినట్లు లెక్కలు వేసి వాటిని తొలగించింది. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో వాస్తవ మరణాలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆ మేరకే తొలగింపులు ఉంటున్నాయి. గత ఆరు నెలల గణాంకాలు తీసుకుంటే ఏ నెలలోనూ ఈ సంఖ్య 20 వేలకు మించలేదు. పింఛను విధానంలో మరెన్నో మార్పులు ► గత పాలనలో పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు చాంతాడంత క్యూలో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి. ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.6 లక్షల గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీ పొ ద్దున్నే లబ్ధిదారుల గడప వద్దనే అందిస్తోంది. ► పింఛన్ల మంజూరులో లంచాలు, వివక్ష, జన్మభూమి కమిటీల పెత్తనాన్ని జగన్ కూకటివేళ్లతో పెకలించారు. కుల, మత వర్గ, పార్టీలకు అతీతంగా లంచాలు, వివక్ష, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తున్నారు. అర్హులై ఉండి ఒకవేళ ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం ఇస్తూ ప్రతి ఏటా జూన్, డిసెంబర్లలో అందజేస్తున్నారు. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో లబి్ధదారుల జాబితాలు ప్రదర్శించి, సోషల్ ఆడిట్ ద్వారా పారదర్శకంగా లబి్ధదారులను ఎంపిక చేస్తున్నారు. ► గత ప్రభుత్వంలో దివ్యాంగులకు 5 ఏళ్లలో అందిన లబ్ధి కేవలం రూ.58,500. ఈ ప్రభుత్వంలో లబ్ధి రూ.1,91,000. అంటే రూ.1,32,500 అదనం. ► పెన్షన్లపై నెలవారీ సగటు వ్యయం రూ.400 కోట్ల నుంచి రూ.1968 కోట్లకు పెంపు. ► 2014–19 మధ్య గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్లపై సగటున వ్యయం రూ.400కోట్లు. -
Fact Check: రుచీపచీ లేని రాతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మారాయి. అత్యాధునిక వైద్యం అందుతోంది. గ్రామాలు, వార్డుల చెంతకు వైద్యం చేరింది. డాక్టర్లే ప్రజల గుమ్మం వద్దకు వచ్చి ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. మందులకు కొదవ లేదు. విలేజ్, వార్డు క్లినిక్‌లు ఏర్పడ్డాయి. ఇక ప్రధానాసుపత్రుల్లో సేవలు కార్పొరేట్ స్థాయిని తలపిస్తున్నాయి. గడచిన ఐదేళ్ల సీఎం జగన్ పాలనలో నాడు–నేడు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ బలోపేతం, డైట్ చార్జీల పెంపు ఇలా అనేక సంస్కరణలతో ప్రభుత్వాస్పత్రులు అభివృద్ధి చెందాయి. ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచి్చన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో అభిమానం వెల్లువెత్తుతోంది. ఇది రుచించని ఈనాడు రామోజికి ఆసుపత్రుల్లో అందిస్తున్న రుచికరమైన భోజనం నచ్చలేదు. తన బాబు పాలనలో రుచీపచీలేకుండా వండినా, ఆ ఐదేళ్లలో రోగుల మెనూ ఛార్జీ రూ.40 మించకపోయినా, మూడుపూటలా భోజనం అందించకపోయినా ఈ ‘పచ్చ’రోగికి వెచ్చగా ఉంది. జగన్ పాలనలో మెనూ చార్జి రూ.80కి పెంచి రుచితో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నా రామోజీకి చప్పగానే ఉంది. అందుకే ‘బటన్ల బడాయి.. రోగుల బువ్వకూ బకాయి’ అంటూ రుచీపచీలేని ఓ కథనాన్ని వండేశారు. బాబు పాలనలో ఇదీ గతీ 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఒక్కో రోగికి రూ.40తో భోజనం పెట్టేది. ఇది కూడా 2011లో నిర్దేశించిన ఖర్చు. ఇంత తక్కువ ధరతో ఎలా వీలవుతుందన్న ఆలోచన కూడా అప్పట్లో బాబుకు రాలేదు. ఆ ఐదేళ్లలో ఒక్కసారి కూడా డైట్ చార్జీల పెంపుపై బాబు దృష్టి పెట్టిన పాపాన పోలేదు. రోజులో ఒక పూట మాత్రమే కోడిగుడ్డు అందించేవారు. ఇక అప్పట్లో వైద్య సేవల గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. గుంటూరు జీజీహెచ్‌లో చిన్నారిని ఎలుకలు కొరికి చంపిన దుర్ఘటనే బాబు పాలనలో కునారిల్లిన వైద్య రంగానికి పెద్ద నిదర్శనం. జగన్ పాలనలో ఇదీ పురోగతి 2019లో సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో చేరిన రోగులు త్వరగా కోలుకోవాలంటే నాణ్యమైన వైద్య సేవలతో పాటు, పౌష్టికాహారం అవసరమని గుర్తించారు. ఇందులో భాగంగా రూ.80కు డైట్ చార్జీలను పెంచారు. రోగులకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అందించేందుకు ప్రత్యేకంగా ఒక మెనూ రూపొందించారు. రూ.100 తో గర్భిణులకు నిర్దేశించిన మెనూతో పాటు, అదనంగా చిక్కీలు, రాగి జావ, టీబీ, ఎయిడ్స్, మానసిక రోగులకు హై ప్రొటీన్ డైట్‌ను అందిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా రోగులందరికీ కోడిగుడ్డు ఇస్తున్నారు. మెనూలో మార్పులు ఇలా టీడీపీ ప్రభుత్వంలో రోగికి రోజుకు మూడు పూటలా ఆహారం కోసం రూ.40 బ్రేక్ ఫాస్ట్: బ్రెడ్, పాలు మధ్యాహ్న భోజనం: అన్నం, సాంబారు, వెజ్ కర్రీ, గుడ్డు, అరటిపండు, మజ్జిగ రాత్రి భోజనం: అన్నం, సాంబారు, వెజ్ కర్రీ, మజ్జిగ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రోగికి రోజుకు మూడు పూటలా ఆహారం కోసం రూ.80 ఖర్చు బ్రేక్ ఫాస్ట్: ఉప్మా, కిచిడీ, ఇడ్లీ, పొంగలి, కోడిగుడ్డు, పాలు మధ్యాహ్న భోజనం: అన్నం, సాంబారు, ఆకుకూర పప్పు, అరటిపండు, మజ్జిగ, వెజ్ కర్రీ, గుడ్డు రాత్రి భోజనం: అన్నం, సాంబారు, పప్పు, అరటిపండు, మజ్జిగ, వెజ్ కర్రీ, సంగటి, చపాతీ(డయాబెటీస్ రోగులకు), గుడ్డు -
నిజాలకు పాతర.. 'అబద్ధాల జాతర'
సాక్షి, అమరావతి: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది ఈనాడు రామోజీ పరిస్థితి. కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలను దాచి, అబద్ధాల కథనాలు అచ్చోస్తే ప్రజలు నమ్మేస్తారులే అన్న భ్రమల్లోనే ఆయన ఇంకా ఉన్నారు. ఇదే భ్రమలతో ఏది రాసినా చెల్లుతుందని గుడ్డిగా నమ్ముతూ రోజుకో అంశంపై ఆయన విషం కక్కుతున్నారు. పాఠకులు ఏమనుకుంటారనే ఇంగిత జ్ఞానం, సిగ్గూఎగ్గూ లేకుండా సీఎం జగన్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. అప్పుడెప్పుడో ఈట్ క్రికెట్.. స్లీప్ క్రికెట్.. డ్రింక్ క్రికెట్ అన్న ప్రకటన మాదిరిగా రామోజీ ఏ పనిచేస్తున్నా అందులో భూతద్దం పెట్టి జగన్ వ్యతిరేకతపై రంధ్రాన్వేషణ చేస్తున్నారు. ఇందులో భాగమే ఆయన కనుసన్నల్లో సాగిన తాజా పచ్చపైత్యం ‘బందిపోటు పాలన’ కథనం. డొంకతిరుగుడు రాతలతో ఎప్పటిలాగే సీఎం జగన్ పాలనపై రామోజీ అక్షరం అక్షరంలో తన అక్కసునంతా వెళ్లగక్కారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ అక్కడక్కడ బందిపోటు పాలన కొనసాగుతోందని వ్యాఖ్యానిస్తే దాన్ని వక్రీకరించి రాష్ట్రానికి అంటగడుతూ రామోజీ బందిపోటు ‘గోల’ చేస్తూ పండగ చేసుకున్నారు. నేను సీఎం అయితే ఏ చట్టమైనా చేస్తా, కేసులు పెట్టిస్తా, జైల్లో వేస్తాం, భూములు లాక్కుంటాం అంటే కుదరదని.. అది బందిపోట్లు చేసే పనవుతుందని.. అక్కడక్కడ బందిపోటు పాలకులను చూస్తున్నామని పీవీ రమేష్ వ్యాఖ్యానిస్తే దాన్ని ఈనాడు రామోజీ సీఎం జగన్ పాలనకు ఆపాదిస్తూ పైశాచికానందం పొందారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ముసుగులో.. నిజానికి.. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ అధికారైనా రాజ్యాంగం, చట్టాల మేరకే పాలన సాగిస్తారని.. కానీ, ఏపీలో అందుకు విరుద్ధంగా పాలన సాగుతున్నట్లు పీవీ రమేష్ చెప్పారంటూ ఈనాడు తన వక్రబుద్ధిని, సీఎం జగన్‌పై తన అక్కసును మరోసారి బయటపెట్టుకుంది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ముసుగులో వందిమాగధులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చర్చాగోష్టి పేరుతో సీఎం జగన్ పాలనపై ఈనాడు రామోజీ విమర్శలు చేయించి వాటిని వక్రీకరించీ మరీ అనైతికంగా అచ్చువేశారు. ఏ ప్రభుత్వమైనా దోచుకుంటే అది ప్రజాస్వామ్యం కాదు బందిపోట్ల పాలన అవుతుందని సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించేందుకు ఈనాడు రామోజీ తెగ ఆరాటపడిపోయారు. మరోవైపు.. సంక్షేమం, అభివృద్ధి వేర్వేరు కాదు ఒక్కటే.. రెండూ అవసరమేనని, డబ్బులు పంచడం సులభతరమేనని, అందుకు బటన్ నొక్కితే సరిపోతుందని, అలాగే ఇంటర్నెట్ ఉంటే చాలంటూ పేదలకు నగదు బదిలీ చేయడాన్ని పీవీ రమేష్ అవహేళన చేస్తూ తన పెత్తందారీ ధోరణిని బయటపెట్టుకున్నారు. ఈనాడు రామోజీ కూడా పెత్తందారే కాబట్టి పీవీ రమేష్ మాటలు చాలా రుచికరంగా ఉండటంతో ఆయన మాటలకు అత్యధిక ప్రాముఖ్యతనిచ్చి ప్రముఖంగా అచ్చువేశారు. గురవింద గింజలా పీవీ రమేష్.. ఇక ప్రజలకు అవసరమైన సేవలందించడమే ప్రభుత్వ పాలనంటూ పీవీ రమేష్ చెప్పారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే వైఎస్ జగన్ కూడా ప్రజలకు అవసరమైన సేవలందించేందుకు గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేశారు. గత ప్రభుత్వాల తరహాలో గ్రామీణ, పట్టణ ప్రజలు తమకు అవసరమైన సేవలకు రాజకీయ నేతలు, మండల, జిల్లా కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరంలేకుండా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రజల ముంగిటికే పాలనందిస్తున్న విషయం రిటైర్ట్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్‌కు కనిపించడంలేదా? కనిపించినా ఈనాడు రామోజీ తనకు కావాల్సినట్లు రాసుకున్నారా? అసలు రమేష్ రిటైర్ కాగానే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగంలో చేరిన ఆయన ఇతరులకు నీతులు చెప్పడం అంటే తన కింద నలుపు చూసుకోకపోవడమే అవుతుంది. ఈనాడు రామోజీ వంటి పెత్తందారుకు కావాల్సినట్లు మాట్లాడాలి కాబట్టి పీవీ రమేష్ కూడా ఆ ముసుగు ధరించారు. ఏ గణాంకాలు చూసినా రాష్ట్రం ప్రగతిపథంలో వెళ్తున్నట్లు కనిపించడంలేదని.. రివర్స్ ఇంజన్లో రాంగ్ రూట్లో వెళ్తున్నామనే అనుమానం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గణాంకాలను ఈయన చూడలేకపోతున్నట్లు ఉన్నారు. అందుకే గణాంకాలపై కూడా పెత్తందార్లకు ఏదీ కావాలో అదే ఎంపిక చేసుకుని మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మేనిఫెస్టోలోని 99 శాతం అంశాలను అమలుచేసి పేదవర్గాలకు పైసా లంచం లేకుండా నగదు బదిలీచేస్తే దాన్ని కూడా పీవీ రమేష్ తప్పుపట్టారంటే పేదలు అభివృద్ధి చెందకూడదనే ధోరణిని ఆయన కూడా చాటుకున్నారు. ఇవేవీ అభివృద్ధి కావా రమేష్..? మరోపక్క.. ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ రంగంలో ఏకంగా 17 వైద్య కళాశాలల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడితే ఇది అభివృద్ధిగా రమేష్‌కు కనిపించడంలేదా? ఇదే పీవీ రమేష్ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు నాడు–నేడు పేరుతో ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విషయాన్ని కూడా మరిచిపోయి ఇప్పుడు పెత్తందారుల పంచన చేరి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అలాగే.. ► నాలుగు పోర్టులను, పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇది అభివృద్ధి కాదా పీవీ రమేష్? ► పేదలందరికీ ఇళ్లు పేరుతో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి ఇంటి నిర్మాణాలను చేపట్టారు. ఇది పేదలు అభివృద్ధి చెందడం కాదా? ► గతంలో చంద్రబాబు వ్యవసాయ రుణాలన్నీ మాఫీచేస్తానని చెప్పి రైతులను మోసం చేశారు. ఆ సమయంలో ఇదే పీవీ రమేష్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. రుణమాఫీకి తూట్లుపొడవడంలో రమేష్ పాత్ర కూడా ఉంది. ఆయన దీనిని మర్చిపోతే ఎలా? ► 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల ఆధారంగా జీఎస్డీపీలో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత చంద్రబాబు పాలన కన్నా జీఎస్డీపీ పెరుగుదల ఇప్పుడే ఎక్కువగానే ఉంది. దీనిని ఆయన ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించారా లేక రామోజీ ఇచ్చిన స్క్రిప్ట్‌ను బట్టీపట్టారా? ఏం పీవీ రమేష్? ► ఇక రాష్ట్ర అప్పులు కూడా ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే ఉన్నాయి. జీఎస్డీపీతో సమానంగా అప్పులున్నాయంటూ పీవీ రమేష్ పచ్చమీడియా వల్లిస్తున్న అబద్ధాలనే వల్లించారు. కార్పొరేషన్ల పేరుతో అప్పులుచేయడం తప్పుగా పీవీ రమేష్ అనడమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే. ► ఎందుకంటే.. గత ఎన్నికల ముందు ఇదే పీవీ రమేష్ కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్ధలో పనిచేస్తూ అప్పటి సీఎం చంద్రబాబు కోరిక మేరకు 2019 ఎన్నికలకు ముందు పసువు–కుంకమ పేరుతో డబ్బులు పంచేందుకు సాగునీటి ప్రాజెక్టులను తాకట్టు పెట్టి అప్పు మంజూరు చేసిన విషయం మరిచిపోతే ఎలా? ► కానీ, ఇందుకు భిన్నంగా సంక్షేమం, అభివృద్ధి సమతుల్యతతో సీఎం జగన్ ఐదేళ్ల పాలన సాగింది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సుస్మితా సేన్ అందానికి దక్కిన కిరీటానికి 30 ఏళ్లు పూర్తి
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019