breaking news
-
Telangana: రేపటి నుంచి బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు..
సాక్షి, హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో గురువారం కీలక ఘట్టం ప్రారంభం కానుంది. నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలకు నోటిషికేషన్ ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఈ విడతలో ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల ఘట్టం రేపు ఉదయం ప్రారంభమవుతుంది. రాష్ట్ర బీజేపీ నేతల నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు హాజరుకానున్నారు. బీజేపీ అభ్యర్థుల నామినేషన్ తేదీల వివరాలు 18న మెదక్, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థుల నామినేషన్ మెదక్ రఘునందన్ రావు నామినేషన్‌కు హజరు కానున్న గోవా సీఎం ప్రమోద్ సావంత్ మల్కాజ్ గిరి ఈటెల రాజేందర్ నామినేషన్‌కు హాజరు కానున్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మహబూబ్ నగర్ డికే అరుణ నామినేషన్‌కు పీయూష్ గోయల్ 19న సికింద్రాబాద్, ఖమ్మం బీజేపీ అభ్యర్ధుల నామినేషన్లు కిషన్ రెడ్డి, వినోద్ రావుల నామినేషన్‌కు హాజరు కానున్న కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ నెల 22న జహీరాబాద్, చేవెళ్ల, నల్గొండ, మహబూబ్ బాద్ బీజేపీ నేతల నామినేషన్లు జహీరాబాద్ బీబీ పాటిల్ నామినేషన్‌కు దేవేంద్ర ఫడ్నవీస్ చేవెళ్ల కొండ విశ్వేశ్వర్ రెడ్డి, నల్గొండ సైది రెడ్డి నామినేషన్‌కు పియుష్ గోయల్ మహబూబాబాద్ సీతారాం నాయక్ నామినేషన్‌కు కిరణ్ రిజిజు 23న భువనగిరి, 24 న పెద్దపల్లి, అదిలాబాద్ ,హైదారాబాద్, వరంగల్ అభ్యర్ధుల నామినేషన్లు పెద్దపల్లి అభ్యర్థి నామినేషన్‌కు అశ్విని వైష్ణవ్ అదిలాబాద్ అభ్యర్థి నగేష్ నామినేషన్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి హైదారాబాద్ మాధవి లత నామినేషన్‌కు అనురాగ్ సింగ్ ఠాకూర్, వరంగల్ అరూర్ రమేష్ నామినేషన్‌కు అశ్వినీ వైష్ణవ్ 25న కరీంనగర్, నిజామాబాద్, నాగర్ కర్నూల్ అభ్యర్థుల నామినేషన్ కరీంనగర్ బండి సంజయ్, నాగర్ కర్నూల్ భరత్ నామినేషన్‌కు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డిలు. నిజామాబాద్ అరవింద్ నామినేషన్‌కు అశ్విని వైష్ణవ్‌లు హాజరుకానున్నారు. -
ఖబడ్దార్ రేవంత్.. నోరు, ఒళ్లు దగ్గరపెట్టుకో: ఈటల వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి, మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్. రేవంత్ రెడ్డి ఖబడ్దార్.. నోరు, ఓళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడలంటూ హెచ్చరించారు. ఫోన్ ట్యాంపింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. వ్యాపారస్తులను బ్లాక్ మెయిల్ చేస్తున్న వసూళ్ల చిట్టా రికార్డ్ అవుందని అన్నారు. నడమంత్రపు సిరిలాగా ముఖ్యమంత్రి పదవి వచ్చిన రేవంత్ రెడ్డి.. రెండు నాల్కలధోరణితో మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమకు పెద్దన్న అని.. ఆయన ఆశీర్వాదం ఉంటేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ఇటీవల రేవంత్ మాట్లాడిన ఈటల చెప్పుకొచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న కొంపల్లి, అల్వాల్ ఫ్లై ఓవర్ కోసం 175 ఎకరాల రక్షణ రంగ భూమిని మోదీ కేటాయించారని చెప్పిన సీఎం .. మళ్లీ అదే నోటితో ప్రధానిని తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ కూడా అలానే మాట్లాడారని, ఆయనకు పట్టిన గతే రేవంత్ రెడ్డికి కూడా పడుతుందంటూ హెచ్చరించారు. నోరు, ఒళ్లు దగ్గర పెట్టుకోని జాగ్రత్తగా మాట్లాడాలని రేవంత్ రెడ్డికి ఈటల రాజేందర్ హితవు పలికారు. అధికారం ఉందని ఏది పడితే అది మాట్లాడితే సహించడానికి ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారని విమర్శించిన రేవంత్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు తెలుస్తోందన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ఖబడ్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. చదవండి: ఇక నా రాజకీయం చూపిస్తా: సీఎం రేవంత్ పిల్లి కళ్లు మూసుకొని పాలుతాగినట్టు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీకి ఫండ్స్ పంపించడానికి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులను ఎంత వేదిస్తున్నది, ఎంత బ్లాక్ మెయిల్ చేస్తున్నది రికార్డ్ అవుతుందన్నారు. "ఒక్క రాష్ట్రంలో ఉండి నేనే అన్నీ అనుకుంటున్నావని. నిన్ను వీక్షించే వారు కూడా ఉన్నారు అని మర్చిపోకు." అంటూ వార్నింగ్ ఇచ్చారు. మల్కాజ్‌గిరిలో ఎవరు వచ్చినా.. ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టినా.. గెలిచేది బీజేపీనే అని.. ఈటల రాజేందర్ దీమా వ్యక్తం చేశారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలుతాగినట్టు సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారని ఈటల మండిపడ్డారు. రాహుల్ గాంధీకి ఫండ్స్ పంపించడానికి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులను ఎంత వేధిస్తున్నది, ఎంత బ్లాక్ మెయిల్ చేస్తున్నందంతా రికార్డ్ అవుతుందన్నారు. మల్కాజిగిరిలో ఎవరు వచ్చినా, ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టినా గెలిచేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు. -
ఈటెల రాజేందర్ సీటుపై కేసీఆర్ కసరత్తు
-
ఈటలకు మల్కాజ్గిరి ఫిక్స్!.. బీజేపీ నేతలతో కీలక భేటీ?
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మల్కాజ్గిరి ఎంపీ టికెట్‌ను ఈటల రాజేందర్‌కు కేటాయించినట్టు తెలుస్తోంది. దీంతో, ఆయన పోటీ ఆసక్తికరంగా మారనుంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే మల్కాజ్గిరి లోక్‌సభ స్థానంలో ఈటల రాజేందర్‌ను బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మల్కాజ్గిరి స్థానం ఈటలకు కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. దీంతో, ఈటల శామీర్‌పేటలోని ఆయన నివాసంలో బీజేపీ నేతలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలకు ఈ మేరకు మెసేజ్‌లు వెళ్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతలో భాగంగా బీజేపీ కోర్ కమిటీ తెలంగాణలో పార్టీ బలాబలాలపై రాష్ట్ర నాయకత్వంతో మేధోమథనం చేపట్టింది. పార్టీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు సంబంధించి కసరత్తు నిర్వహించింది. అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా సికింద్రాబాద్–జి.కిషన్‌రెడ్డి, కరీంనగర్–బండి సంజయ్, నిజామాబాద్–ధర్మపురి అర్వింద్, మహబూబ్‌నగర్–డీకే అరుణ, చేవెళ్ల–కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మెదక్–ఎం.రఘునందన్‌రావు, భువనగిరి–బూర నర్సయ్యగౌడ్ అభ్యర్థిత్వాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆయా పేర్లకు నడ్డా, షా ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ఇవి కాకుండా మరో రెండు సీట్లలోనూ విజయావకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 29న జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
మల్కాజిగిరి బరిలో ఈటల?
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతలో భాగంగా బీజేపీ కోర్ కమిటీ తెలంగాణలో పార్టీ బలాబలాలపై రాష్ట్ర నాయకత్వంతో మేధోమథనం చేపట్టింది. పార్టీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు సంబంధించి కసరత్తు నిర్వహించింది. శనివారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సహా ఇతర కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లలో పార్టీ పరిస్థితిపై నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా సికింద్రాబాద్–జి.కిషన్‌రెడ్డి, కరీంనగర్–బండి సంజయ్, నిజామాబాద్–ధర్మపురి అర్వింద్, మహబూబ్‌నగర్–డీకే అరుణ, చేవెళ్ల–కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మల్కాజిగిరి–ఈటల రాజేందర్, మెదక్–ఎం.రఘునందన్‌రావు, భువనగిరి–బూర నర్సయ్యగౌడ్ అభ్యర్థిత్వాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆయా పేర్లకు నడ్డా, షా ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ఇవి కాకుండా మరో రెండు సీట్లలోనూ విజయావకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 29న జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ తర్వాత 8 లేదా 9 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగిందని, గతంలో ఓడిపోయిన స్థానాల్లో పార్టీ బలం పుంజుకుందని ఈ భేటీలో రాష్ట్ర నేతలు పార్టీ పెద్దలకు వివరించినట్లు సమాచారం. ఐకమత్యంతో పనిచేసి రాష్ట్రంలోని 17 స్థానాల్లో విజయం సాధించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని వారు రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారని తెలిసింది. ఈ సమావేశంలో పార్టీ నేతలు బండి సంజయ్, డా. కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు. మెజారిటీ సీట్లు గెలుస్తాం: కె. లక్ష్మణ్ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలుస్తామని.. గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ చెప్పారు. పార్టీ జాతీయ నేతలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో యాత్రలు, సభలపై అగ్రనేతలతో చర్చ జరిగిందని పేర్కొన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019