breaking news
-
ఇకపై రూ.1 లక్ష విత్‌డ్రా చేసుకోవచ్చు.. పీఎఫ్‌లో కీలక మార్పు
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ( EPFO ) చందాదారుల నగదు ఉపసంహరణ విషయంలో కీలక మార్పులు చేసింది. వైద్య ఖర్చుల కోసం చేసే 68జే క్లెయిమ్‌ల అర్హత పరిమితిని రూ. 50,000 నుంచి రూ.1 లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈపీఎఫ్‌వో కొత్త మార్పు ప్రకారం.. చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య చికిత్స ఖర్చుల కోసం ఇకపై రూ.1 లక్ష వరకూ ఉపసంహరించుకోవచ్చు. నెల అంతకంటే ఎక్కువ రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నా, ఆపరేషన్లు చేయించుకున్నా క్లెయిమ్ చేయొచ్చు. పక్షవాతం, టీబీ, క్షయ, క్యాన్సర్, గుండె సంబంధిత చికిత్స కోసం కూడా నగదు విత్‌డ్రాకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. లక్ష పరిమితికి లోబడి ఉద్యోగుల ఆరు నెలల బేసిక్ వేతనంతోపాటు డీఏ లేదా ఈపీఎఫ్‌లో ఉద్యోగి వాటా వడ్డీతో సహా ఏది తక్కువైతే అంత వరకూ మాత్రమే ఉపసంహరించుకోవడానికి క్లెయిమ్ చేయడానికి వీలుంటుంది. ఇందు కోసం ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్లు లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు. -
పీఎఫ్ విత్‌డ్రా చేస్తున్నారా.. ట్యాక్స్ రూల్స్ తెలుసా?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అనేది దేశంలో వేతనాలు పొందే ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన పదవీ విరమణ నిధి. ఇందులో ఉద్యోగులు తమ ప్రాథమిక జీతంలో 12 శాతం వాటాను జమ చేస్తూ ఉంటారు. యాజమాన్యాలు కూడా అదే మొత్తాన్ని ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంటాయి. ఇలా పోగైన మొత్తాన్ని ఉద్యోగ విరమణ తర్వాత, వడ్డీతో పాటు ఉపసంహరించుకోవచ్చు. అయితే, ఇతర ఆదాయాల మాదిరిగానే ఈపీఎఫ్ ఉపసంహరణలు కొన్ని పరిస్థితులలో పన్నుకు లోబడి ఉంటాయి. ఈపీఫ్ విత్‌డ్రా షరతులు ఈపీఎఫ్‌వో సభ్యులు తమ ఖాతాలోని మొత్తాన్ని సాధారణంగా ఉద్యోగ విరమణ తర్వాత పూర్తిగా డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగ విరమణకు ఒక సంవత్సరం ముందు అయితే పీఎఫ్ ఖాతాలోని 90 శాతం నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక నిరుద్యోగం విషయంలో అయితే ఉద్యోగం కోల్పోయిన ఒక నెల తర్వాత 75 శాతం, రెండు నెలల తర్వాత పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఆర్థిక అత్యవసర పరిస్థితులు, ఇతర అవసరాల నిమిత్తం తమ పీఎఫ్ నిధులను ఉపయోగించుకునేందుకు ఈ నియమాలు సౌలభ్యాన్ని అందిస్తాయి. పన్నులేమైనా ఉంటాయా? ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాల్లో జమ చేసే మొత్తంపై సాధారణంగా ఎలాంటి పన్ను ఉండదు. అయితే, మునుపటి సంవత్సరాల్లో జమ చేసిన మొత్తాలపై సెక్షన్ 80C కింద తగ్గింపులను క్లెయిమ్ చేయవచ్చు. అటువంటి సందర్భాలలో, సెక్షన్ 80C గతంలో క్లెయిమ్ చేయకుంటే అదనపు పన్ను వర్తించవచ్చు. ఐదు సంవత్సరాల నిరంతర సర్వీసు పూర్తవ్వని ఉద్యోగులు ఎక్కువ మొత్తంలో పీఎఫ్ నిధులను ఉపసంహరించుకుంటే మూలం వద్ద పన్ను (TDS) మినహాయిస్తారు. అదే ఉపసంహరణ మొత్తం రూ.50,000 కంటే తక్కువ ఉంటే టీడీఎస్ ఉండదు. ఇక ఐదేళ్ల నిరంతర సర్వీసు తర్వాత చేసే ఈపీఎఫ్ ఉపసంహరణలకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఉద్యోగి ఒకటి కంటే కంపెనీల్లో పనిచేసిన సందర్భంలో ఈ ఐదేళ్ల నిరంతర సర్వీసుకు ఉద్యోగి పూర్వ కంపెనీలోని సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. -
పీఎఫ్ అకౌంట్ నుంచి 90 శాతం విత్‌డ్రా.. ఎలాగో తెలుసా?
హోమ్ లోన్ (home loan) వడ్డీ భారం భరించలేకపోతున్నారా.. ముందస్తుగా చెల్లించేందుకు డబ్బు కోసం చూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ సమాచారం. మీ పీఎఫ్ ఖాతా (PF Account) లోంచి డబ్బు తీసుకుని ఎక్కువ వడ్డీ లోన్ చెల్లించేయండి. ఇందుకోసం అత్యధికంగా నగదు విత్‌డ్రా (PF withdraw) చేసుకునే అవకాశాన్ని ఈపీఎఫ్ఓ (EPFO) కల్పిస్తోంది. అయితే ఇది లాభదాయకమా.. కాదా? అన్నది ఆలోచించుకోవాలి. వడ్డీ రేటు, వయసు కీలకం హోమ్ లోన్ వడ్డీ రేటు.. ఈపీఎఫ్ చెల్లించే వడ్డీ రేటు కంటే ఎక్కువగా ఉంటే ఈపీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్ డ్రా చేసి ఈ మొత్తంతో రుణాన్ని ముందస్తుగా చెల్లించవచ్చు. అయితే భవిష్యత్ కోసం దాచుకున్న డబ్బు కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం అవసరం. అయితే కెరీర్ ప్రారంభ దశలో ఉన్న వారు తమ పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకుని లోన్ చెల్లించవచ్చు. ఎందుకంటే డబ్బును కూడబెట్టుకోవడానికి వీరికి చాలా కాలం ఉంటుంది. (ఈపీఎఫ్‌వో అలర్ట్: వివరాల అప్డేషన్కు కొత్త మార్గదర్శకాలు) 90 శాతం వరకు.. గృహ రుణాన్ని తిరిగి చెల్లించడానికి పీఎఫ్ డిపాజిట్ మొత్తంలో గరిష్టంగా 90 శాతం విత్ డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ అనుమతిస్తుంది. అయితే ఇందుకోసం 10 ఏళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి. జాతీయ బ్యాంకులు, రిజిస్టర్డ్ కో-ఆపరేటివ్, నేషనల్ హౌసింగ్ బోర్డ్ వంటి సంస్థల నుంచి హోమ్ తీసుకుని ఉండాలి. హోమ్ లోన్ రీపేమెంట్ స్కీమ్ కింద ఈపీఎఫ్ఓ సభ్యులు వారి ఖాతా నుంచి ఈఎంఐలు కూడా చెల్లించవచ్చు. ఇదీ ప్రాసెస్.. ➤ EPFO e-service పోర్టల్‌కు లాగిన్ చేయండి. ➤ యూనివర్సల్ ఖాతా నంబర్ (UAN), పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి. ➤ ఆన్లైన్ సర్వీసెస్‌పై క్లిక్ చేయండి. ➤ ఫారం 31 ద్వారా క్లెయిమ్ చేయండి. ➤ మీ బ్యాంక్ వివరాలను ధ్రువీకరించండి. ➤ డబ్బు ఉపసంహరణకు కారణాన్ని ఎంచుకోండి. ➤ సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయండి. అత్యవసరమైతేనే డ్రా చేయండి చాలా అవసరం అయితే తప్ప పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయకూడదని మనీ మేనేజ్మెంట్ నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై 8.15 శాతం వడ్డీని ఈపీఎఫ్ఓ చెల్లిస్తోంది.పీఎఫ్ నుంచి ఎంత పెద్ద మొత్తంలో విత్‌డ్రా చేస్తే, రిటైర్మెంట్ ఫండ్‌పై అంత పెద్ద ప్రభావం పడుతుంది. పీఎఫ్ ఖాతాలో ఎంత జమవుతుంది? నిబంధనల ప్రకారం.. ఈపీఎఫ్ సభ్యులు తమ జీతం, డియర్నెస్ అలవెన్స్‌లో 12 శాతం పీఎఫ్ ఖాతాకు జమ చేయడం తప్పనిసరి. అదే సమయంలో కంపెనీ డిపాజిట్ చేసిన మొత్తంలో 3.67 శాతం ఈపీఎఫ్‌లో ఖాతాలో డిపాజిట్ అవుతుంది. మిగిలిన 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS)లో జమవుతుంది. -
పీఎఫ్‌ను ముందస్తుగా వెనక్కి తీసుకోవచ్చా?
నేను ఒక కంపెనీలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నాను. నా సోదరి వివాహం కోసం నా పీఎఫ్ ఫండ్‌ను వాడుకోవాలని అనుకుంటున్నాను. నా సందేహం ఏమిటంటే.. నేను కరోనా లాక్డౌన్ల సమయంలో ఒకసారి పాక్షికంగా ఉపసంహరించుకున్నాను. కనుక మరోసారి పీఎఫ్ ఉపసంహరణకు దరఖాస్తు చేసుకోవచ్చా? పన్ను పడుతుందా? – వేణు ఉదత్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి రెండు సార్లు ఉపసంహరించుకోవచ్చు. పన్నుల అంశానికంటే ముందు తెలుసుకోవాల్సిన ఇతర అంశాలు కూడా ఉన్నాయి. పలు సందర్భాల్లో పీఎఫ్ నుంచి ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు లేదా నిర్మాణం, రుణాల చెల్లింపు, కొన్ని వ్యాధులకు సంబంధించి చికిత్సా వ్యయాల చెల్లింపులకు, వివాహం లేదా పిల్లల ఉన్నత విద్య, రిటైర్మెంట్కు ఏడాది ముందు సందర్భాల్లో ఉపసంహరించుకోవచ్చు. (ఇదీ చదవండి: పెరగనున్న వడ్డీ రేట్లు.. మరో పావు శాతం రెపో పెంపు ఖాయం!) ఈ ప్రత్యేక సందర్భాలకు సంబంధించి ఈపీఎఫ్‌వో సభ్యుడు నిర్ణీత సర్వీసు కాలాన్ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు సభ్యుడు/సభ్యురాలి వివాహం కోసం లేదంటే కుమార్తె, కుమారుడు, సోదరుడు లేదా సోదరి వివాహం కోసం ఉపసంహరించుకోవాలంటే కనీసం ఏడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకోవాలి. ఉద్యోగి వాటా కింద జమ అయి, దానికి వడ్డీ చేరగా సమకూరిన మొత్తం నుంచి 50 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఈ అవసరాల కోసం మూడు సార్లు ఉపసంహరణకు అనుమతిస్తారు. మీరు ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. కనుక మీరు చేసే ఉపసంహరణలపై పన్ను ఉండదు. మీ సోదరి వివాహం కోసం ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నారు. కనుక కనీసం ఏడేళ్ల సర్వీసు ఉండాలి. మీకు ఐదేళ్ల సర్వీసు మాత్రమే ఉంది. ఏడేళ్లు పూర్తి కాకుండా దరఖాస్తు చేసుకుంటే తిరస్కరణకు గురవుతుంది. గతంలో మీరు కోవిడ్ సమయంలో చేసిన ఉపసంహరణ ప్రభావం తాజా ఉపసంహరణలపై ఉండదు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌ను ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకు మార్చుకోవచ్చా..? – రాజేష్ షా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్ మూడేళ్ల తప్పనిసరి లాకిన్ పీరియడ్‌తో వస్తాయి. పెట్టుబడి పెట్టిన తేదీ నుంచి ఈ లాకిన్ పీరియడ్ అమల్లోకి వస్తుంది. ఒక సంస్థ నుంచి ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడిని మరోసంస్థకు చెందిన ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌లోకి మార్చుకోవాలంటే ముందుగా ఉపసంహరించుకోవాలి. మూడేళ్ల లాకిన్ పీరియడ్ వరకు ఉపసంహరించుకోలేరు. (ఇదీ చదవండి: ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా?) మూడేళ్లు నిండిన తర్వాత అప్పుడు మీ పెట్టుబడులు అన్నింటినీ వెనక్కి తీసుకోవచ్చు. మీకు నచ్చిన పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్ కానీ, మరే ఇతర పన్ను ఆదా పథకాలు అయినా తప్పనిసరి లాకిన్ పీరియడ్‌తో వస్తుంటాయి. కనుక లాకిన్ సమయంలో ఉపసంహరణలను అనుమతించరు. ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్! -
ఈపీఎఫ్ఓ మెడికల్ అడ్వాన్స్‌గా రూ.1 లక్ష సాయం
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) కింద రిజిస్టర్ చేసుకున్న ఉద్యోగులు ఇప్పుడు మెడికల్ అడ్వాన్స్ కింద లక్ష రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగులు ఈ మొత్తాన్ని విత్ డ్రా చేయడానికి ముందు ఎటువంటి ఆసుపత్రి బిల్లుల సమర్పించాల్సిన అవసరం లేదు. సెంట్రల్ సర్వీసెస్ మెడికల్ అటెండెంట్(సీఎస్(ఎంఎ) నియమాలు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్ఎస్) కింద కవర్ అయ్యే ఉద్యోగులకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) విడుదల చేసిన సర్క్యులర్ లో పేర్కొంది. ఈ సేవలను ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఈ క్రింద తెలుసుకుందాం. నిబంధనల ప్రకారం రోగిని ప్రభుత్వ/పీఎస్ యు/సీజీహెచ్ఎస్ ఆసుపత్రిలో చేర్చాలి. ఒకవేళ రోగిని ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్చినట్లయితే, అప్పుడు ఒక అధికారి వివరాలను పరిశీలించిన అనంతరం దీన్ని మంజూరు చేస్తారు. ఉద్యోగి లేదా వారి కుటుంబం అడ్వాన్స్ క్లెయిం చేయడం కొరకు ఆసుపత్రి, రోగి వివరాలను తెలియజేస్తూ ఒక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. వారు దరఖాస్తులో బిల్లు అంచనాను రాయాల్సిన అవసరం లేదు. రోగి కుటుంబానికి ఈ డబ్బు అడ్వాన్స్‌గా ఇవ్వవచ్చు లేదా రోగిని చేర్చిన నిర్ధిష్ట ఆసుపత్రికి నేరుగా చెల్లించే అవకాశం ఉంది. ఒకవేళ చికిత్స బిల్లు లక్ష పరిమితిని మించితే మరోసారి అడ్వాన్స్ కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ సందర్భంలో ఆసుపత్రిలో వేసిన అంచనా బిల్లును సమర్పించాల్సి ఉంటుంది. రోగి డిశ్చార్జ్ అయిన 45 రోజుల్లోగా మెడికల్ బిల్లులు ఈపీఎఫ్ కు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సుస్మితా సేన్ అందానికి దక్కిన కిరీటానికి 30 ఏళ్లు పూర్తి
Multiple cat checj
Check international block
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019