breaking news
-
అద్భుతమైన సిక్సర్లు.. తండ్రిని గుర్తు చేసిన రాకీ ఫ్లింటాఫ్
ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ చిన్న కొడుకు రాకీ ఫ్లింటాఫ్ తండ్రికి తగ్గ తనయుడనిపించుకుంటున్నాడు. రాకీ.. తండ్రి తరహాలోనే భారీ సిక్సర్లు కొడుతూ శభాష్ అనిపించుకుంటున్నాడు. లాంకాషైర్ రెండో జట్టుకు ఆడుతూ డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాకీ కొట్టిన సిక్సర్లు తండ్రి ఆండ్రూను గుర్తు చేశాయి. రాకీ కొట్టిన సిక్సర్లకు సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తుంది. రాకీ సిక్సర్లు కొట్టిన విధానం తండ్రిని పోలి ఉందని నెటిజన్లు కితాబునిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో రాకీ మూడు సిక్సర్లు బాదగా.. అందులోని ఓ సిక్సర్ ఆండ్రూ ట్రేడ్ మార్క్ సిక్సర్‌కు (పుల్‌షాట్) మక్కీ టు మక్కీగా ఉందని అభిమానులు అనుకుంటున్నారు. రాకీ మెరుపు షాట్లు ఆడుతూ తండ్రి బాటలోనే నడుస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. Rocky Flintoff with 3️⃣ sixes on his way to an unbeaten half-century for the 2nd XI! 💥👏 Our 2nd XI clash with Durham ends in a draw as the rain interrupts once again. Scorecard 📋➡ https://t.co/WieghotbNI 🌹 #RedRoseTogether pic.twitter.com/Rrc2SWUB9t — Lancashire Cricket (@lancscricket) April 18, 2024 డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో తండ్రి తరహాలోనే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రాకీ రెండు బౌండరీలు, మూడు సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో వర్షం మొదలుకావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ సమయానికి లాంకాషైర్ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆండ్రూ ఫ్లింటాఫ్ పెద్ద కొడుకు కోరె ఫ్లింటాఫ్ కూడా లాంకాషైర్కే ఆడటం మరో విశేషం. ఆండ్రూ అలియాస్ ఫ్రెడ్డీ ఇద్దరు కొడుకులు క్రికెట్లో రాణిస్తుండటంతో ఇంగ్లండ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెడ్డీ 20వ శతాబ్దం చివరి నుంచి దాదాపు పదేళ్ల పాటు ఇంగ్లండ్ క్రికెట్‌కు మకుటం లేని మహారాజుగా వెలిగిన విషయం తెలిసిందే. 2005 యాషెస్ సిరీస్‌లో ఫ్రెడ్డీ ఆల్‌రౌండర్‌గా విశేషంగా రాణించాడు. 2009లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం ప్రొఫెషనల్ బాక్సర్‌గా, ఫ్యాషన్ ప్రమోటర్‌గా, కార్ రేసర్‌గా, టీవీ ప్రజెంటర్‌గా పలు రంగాల్లో కాలు మోపిన ఫ్రెడ్డీ ప్రతి రంగంపై తనదైన ముద్ర వేశాడు. 2022లో కారు ప్రమాదానికి గురైన ఫ్రెడ్డీ.. ఇటీవలే క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. 46 ఏళ్ల ఫ్రెడ్డీ ఇంగ్లండ్ వన్డే జట్టుకు జీతం లేకుండా కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. గతేడాది నవంబర్‌లో ఫ్రెడ్డీ హండ్రెడ్ లీగ్‌లోని నార్త్రన్ సూపర్ చార్జర్స్ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గత హండ్రెడ్ ఎడిషన్‌లో ఫ్రెడ్డీ సూపర్ చార్జర్స్ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. -
ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కన్నుమూత
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఐసీసీ మాజీ రిఫరీ రామన్ సుబ్బా రో 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వయసు పైబడటం, దీర్ఘకాలిక అనారోగ్య కారణాల చేత సుబ్బా రో మృతి చెందినట్లు తెలుస్తుంది. భారత మూలాలున్న సుబ్బా రో ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున 1958-61 మధ్యలో 13 టెస్ట్‌లు ఆడి 46.85 సగటున 984 పరుగులు చేశాడు. సుబ్బా రో ఫస్ట్‌క్లాస్ కెరీర్లో సర్రే, నార్తంప్టన్ఫైర్ కౌంటీల తరఫున 260 మ్యాచ్‌లు ఆడి 14182 పరుగులు చేశాడు. ఇందులో 30 శతకాలు, 73 అర్దశతకాలు ఉన్నాయి. సుబ్బా రో కెరీర్ అత్యధిక స్కోర్ 300 పరుగులుగా ఉంది. పార్ట్ టైమ్ లెగ్ స్పిన్ బౌలర్ కూడా అయిన సుబ్బా రో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 87 వికెట్లు తీశాడు. 1981 భారత్, శ్రీలంక పర్యటనల్లో సుబ్బా రో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మేనేజర్‌గా వ్యవహరించాడు. 1985-1990 మధ్యలో సుబ్బా రో ఇంగ్లండ్ టెస్ట్ మరియు కౌంటీ క్రికెట్ బోర్డును చైర్మన్‌గా వ్యవహరించాడు. రామన్ సుబ్బా రో మృతి పట్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, ఐసీసీ సంతాపం తెలిపాయి. ఈసీబీ, ఐసీసీలకు సుబ్బా రో చేసిన సేవలు ఎనలేనివని కొనియాడాయి. కాగా, రామన్ సుబ్బా రో తండ్రి పంగులూరి వెంకట సుబ్బారావు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన వాడు. సుబా రో తల్లి డోరిస్ మిల్డ్రెడ్ పిన్నర్ బ్రిటన్ మహిళ. పంగులూరి వెంకట సుబ్బారావు ఉన్నత చదువుల కోసం లండన్‌కు వెళ్లగా అక్కడ డోరిస్ మిల్డ్రెడ్ పిన్నర్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి, పెళ్లికి దారి తీసింది. వీరిద్దరి సంతానమే రామన్ సుబ్బా రో. -
స్పిన్ దిగ్గజం కన్నుమూత
ఇంగ్లండ్ స్పిన్ దిగ్గజం డెరిక్ అండర్వుడ్ (78) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణంగా డెరిక్ తుదిశ్వాస విడిచాడని తెలుస్తుంది. 1966-82 మధ్య ఇంగ్లండ్ తరఫున 86 టెస్ట్‌ల్లో 297 వికెట్లు పడగొట్టిన డెరిక్.. ఆ జట్టు తరఫున నేటికి అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్ బౌలర్‌గా చలామణి అవుతున్నాడు. అలాగే డెరిక్ ఇంగ్లండ్ తరఫున ఆరో అత్యధిక వికెట్ టేకర్‌గానూ కొనసాగుతున్నాడు. కౌంటీల్లో కెంట్కు సుదీర్ఘకాలం పాటు (1963-87) ప్రాతనిథ్యం వహించిన డెరిక్.. ఆ జట్టు తరఫున 900కు పైగా మ్యాచ్‌లు ఆడి 2523 వికెట్లు పడగొట్టాడు. 17 ఏళ్ల వయసులోనే కెంట్కు ఆడటం మొదలుపెట్టిన డెరిక్.. 25 ఏళ్ల వయసులోపే 1000 ఫస్ట్ క్లాస్ వికెట్లు పడగొట్టి రికార్డుల్లోకెక్కాడు. డెరిక్ కెంట్ తరఫున ఓ సీజన్లో 100కు పైగా వికెట్ల ఘనతను 10 సార్లు సాధించాడు. 1966 సీజన్లో డెరిక్ ఏకంగా 157 వికెట్లు పడగొట్టాడు. డెరిక్ 1966, 1967, 1978, 1979 సంవత్సరాల్లో ఇంగ్లండ్ లీడింగ్ బౌలర్‌గా కొనసాగాడు. డెరిక్ 1969 సెప్టెంబర్ నుంచి 1973 ఆగస్ట్ వరకు ఐసీసీ టెస్ట్ బౌలర్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా చలామణి అయ్యాడు. ఇంగ్లండ్ జాతీయ జట్టుకు వన్డేల్లో సైతం ప్రాతినిథ్యం వహించిన డెరిక్.. ఈ ఫార్మాట్లో 26 మ్యాచ్‌లు ఆడి 32 వికెట్లు పడగొట్టాడు. డెరిక్ 1975 వన్డే వరల్డ్‌కప్‌లోనూ ఇంగ్లండ్‌కు ఆడాడు. వికెట్లు పడగొట్టడమే కాకుండా ఎన్నో అవార్డులు అందుకున్న డెరిక్.. 2009లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్‌గా ఎంపికయ్యాడు. డెరిక్ 2006లో కెంట్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా.. 2008లో ఎంసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. డెరిక్ మరణం కెంట్ క్రికెట్ కుటుంబానికి తీరని లోటు అని క్లబ్ ప్రస్తుత అధ్యక్షుడు సైమన్ ఫిలిప్ సంతాప ప్రకటన విడుదల చేశారు. -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన హ్యారీ బ్రూక్
కౌంటీ ఛాంపియన్షిప్ 2024లో (డివిజన్ 2) భాగంగా లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్, యార్క్‌షైర్ ఆటగాడు హ్యారీ బ్రూక్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 69 బంతుల్లోనే 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం బాదాడు. ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. వ్యక్తిగత కారణాల చేత ఐపీఎల్ 2024 నుంచి తప్పుకున్న తర్వాత బ్రూక్ ఆడిన తొలి మ్యాచ్ ఇదే. ప్రస్తుత సీజన్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్రూక్‌ను 4 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వ్యక్తిగత కారణాల చేత బ్రూక్ ప్రస్తుత సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. బ్రూక్ స్థానాన్ని డీసీ యాజమాన్యం సౌతాఫ్రికా పేసర్ లిజాడ్ విలియమ్స్‌తో భర్తీ చేసింది. బ్రూక్ ఐపీఎల్ నుంచి తప్పుకోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బ్రూక్ ఐపీఎల్ నుంచి ఉద్దేశపూర్వకంగానే తప్పుకుని వ్యక్తిగత కారణాలను సాకుగా చూపాడంటూ ప్రచారం జరుగుతుంది. బ్రూక్‌ను 2023 వేలంలో సన్‌రైజర్స్ 13.25 కోట్లకు సొంతం చేసుకోగా.. తాజాగా సీజన్లో అతనికి ఆ స్థాయి మొత్తం లభించలేదు. ఈ కారణంగానే బ్రూక్ ఐపీఎల్‌ను స్కిప్ చేశాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. మ్యాచ్ విషయానికొస్తే.. బ్రూక్‌తో పాటు ఆడమ్ లిత్ (101) కూడా సెంచరీతో కదంతొక్కడంతో యార్క్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అంతకుముందు లీసెస్టర్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగులకు ఆలౌటైంది. మార్కస్ హ్యారిస్ (56), బెన్ మైక్ (90), టామ్ స్క్రీవెన్ (56) అర్దసెంచరీలతో రాణించారు. యార్క్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన తర్వాత లీసెస్టర్‌షైర్ సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. 26/0 స్కోర్ వద్ద భారీ వర్షం కురువడంతో మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. -
ఐసీసీ అవార్డు గెలుచుకున్న శ్రీలంక సంచలన బ్యాటర్
2024, మార్చి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుల వివరాలను ఐసీసీ ఇవాళ (ఏప్రిల్ 8) ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డును శ్రీలంక సంచలన బ్యాటర్ కమిందు మెండిస్ గెలుచుకోగా.. మహిళల విభాగంలో ఈ అవార్డు ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ మైయా బౌచియర్కు దక్కింది. పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం ఐర్లాండ్ పేసర్ మార్క్ అదైర్, న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ పోటీపడగా.. మెజార్టీ మద్దతు శ్రీలంక ఆల్‌రౌండర్ కమిందు మెండిస్‌కు లభించింది. Kamindu Mendis and Maia Bouchier have won the ICC Player of the Month awards for March 2024. 🌟 pic.twitter.com/h2QClz51SA — CricTracker (@Cricketracker) April 8, 2024 మహిళల విషయానికివస్తే.. ఈ విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లే గార్డ్నర్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్ పోటీ పడగా.. మైయా బౌచియర్ను అవార్డు వరించింది. మెండిస్ మార్చిలో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20, టెస్ట్ సిరీస్‌లో విశేషంగా రాణించాడు. టీ20ల్లో పర్వాలేదనిపించిన కమిందు.. తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. కమిందు తన రెండో టెస్ట్ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 328 పరుగుల తేడాతో విజయం సాధించింది. మైయా బౌచియర్ మార్చిలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో విశేషంగా రాణించింది. ఈ సిరీస్‌లో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచిన ఆమె 55.75 సగటున 223 పరుగులు చేసింది. నాలుగో టీ20లో బౌచియర్ చేసిన స్కోర్ (91) ఆమె కెరీర్లో అత్యుత్తమ స్కోర్‌గా నమోదైంది. ఈ సిరీస్‌ను ఇంగ్లండ్ 4-1 తేడాతో గెలుచుకుంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019