breaking news
-
ప్రేయసిని నిశ్చితార్థం చేసుకున్న ఆసీస్ మహిళా స్టార్ క్రికెటర్..
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆష్లీ గార్డనర్ తన చిరకాల స్నేహితురాలు మోనికా రైట్ను నిశ్చితార్థం చేసుకుంది. గత మూడేళ్లగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట.. తమ బంధంలో మరో అడుగు ముందుకు వేసింది. శుక్రవారం కొంతమంది సన్నిహితుల మధ్య వీరిద్దరూ ఉంగరాలు మార్చకున్నారు. తమ నిశ్చితార్థ ఫొటోలను గార్డ్నర్ సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు కాబోయే కొత్త జంటకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా గార్డ్నర్, మోనికాలు 2021 నుంచి ప్రేమలో ఉన్నారు. గార్డ్నర్ను సపోర్ట్ చేసేందుకు మోనికా చాలా సందర్బాల్లో స్టేడియం వచ్చేది. 2017లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గార్డనర్ .. ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులో కీలక సభ్యురాలుగా కొనసాగుతోంది. గార్డనర్ తన కెరీర్లో ఇప్పటివరకు ఆరు టెస్టులు, 69 వన్డేలు, 88 టీ20 మ్యాచ్‌ల్లో ఆసీస్‌కు ప్రాతినిథ్యం వహించింది. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్లో 2583 పరుగులతో పాటు 180 వికెట్లు పడగొట్టింది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ జట్టుకు గార్డనర్ ప్రాతినిథ్యం వహిస్తోంది. View this post on Instagram A post shared by Ashleigh Gardner (@ashleigh_gardner97) -
తన లవర్‌బోయ్‌కి అదితి లవ్లీ విషెస్
టాలెంటెడ్ హీరో సిద్ధార్థ పుట్టిన రోజు ఈ రోజు (ఏప్రిల్17) . ఈ సందర్భంగా సిద్ధార్థ్ ప్రేయసి, అందాల తార అదితి రావు హైదరీ స్పెషల్ విషెస్ తెలిపింది. ఈ సందర్బంగా తన కాబోయే భర్తతో లవ్లీ ఫోటోలను షేర్ చేసింది. "హ్యాపీయెస్ట్ బర్త్‌డే నా మేనికార్న్’’ కాబోయే భర్త కోసం పుట్టినరోజుకి విషెస అందించింది. ఎంగేజ్మెంట్ తరువాత ఇది ఫస్ట్ బర్త్‌డే కావడంతో అదితి ఆనందంలో మునిగితేలుతోంది. మురిపెంగా ప్రియుడిని లాటర్, చీర్ లీడర్ అంటూ పొగిడేసింది. కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న సిద్ధార్థ్ ప్రస్తుతం హీరోయిన్ అదితితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. 2021లో 'మహా సముద్రం' తర్వాత నుంచి వీరిద్దరూ డేటింగ్ ప్రారంభించారు.అయితే తెలంగాణలోని వనపర్తిలోని శ్రీరంగనాయక ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు హల్చల్ చేశాయి.అయితే పెళ్లి వార్తలను ఖండించిన సిద్ధార్థ్ తాము రహస్యంగా పెళ్లి చేసుకోలేదనీ, కుటుంబంతో ప్రైవేట్‌గా నిర్వహించిన ఒక పార్టీలో ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిందని వెల్లడించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
బ్యాక్ టు షూట్
దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి నటిగా మేకప్ వేసుకున్నారు ప్రియాంకా చోప్రా. ఇద్రిస్ ఎల్బా, జాన్ సెనా, ప్రియాంకా చోప్రా, జాక్ క్వాయిడ్, స్టీఫెన్ రూట్ ప్రధాన పాత్రధారులుగా హాలీవుడ్లో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ అనే కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఇలియా నైషుల్లర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ అమెరికాలో మొదలైంది. ‘‘..అండ్ వుయ్ ఆర్ బ్యాక్..’’ అంటూ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ సినిమా స్క్రిప్ట్‌ను తన ఇన్‌స్టా స్టేటస్‌లో షేర్ చేశారు ప్రియాంకా చోప్రా. దీంతో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ షూట్లో ఆమె పాల్గొంటున్నారని స్పష్టమైంది. ఇక రెండు నెలల క్రితం తన వ్యక్తిగత పనుల కోసం ప్రియాంకా చోప్రా ఇండియా వచ్చారు. సోదరుడు సిద్ధార్థ్ చోప్రా నిశ్చితార్థం వేడుకలో చురుగ్గా పాల్గొన్నారు ప్రియాంక. ఈ వేడుకతో పాటు మరికొన్ని పనులను చక్కబెట్టుకుని ప్రియాంకా చోప్రా మళ్లీ నటిగా బిజీ అవుతున్నారు. -
స్టార్ హీరోయిన్ సోదరుడి నిశ్చితార్థం.. వధువు ఎవరంటే?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇటీవల హోలీ వేడుకల్లో సందడి చేసింది. తన భర్త నిక్ జోనాస్, కూతురు మాల్టీతో కలిసి హోలీ వేడుకలు సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న భామ కుటుంబ సభ్యులతో పండుగ చేసుకున్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అయితే తాజాగా తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా ఎంగేజ్మెంట్కు హాజరైంది ప్రియాంక చోప్రా. పంజాబీ సంప్రదాయంలో జరిగిన రోకా వేడుకలో సందడి చేసింది. ప్రియాంక సోదరుడైన సిద్దార్థ్.. హీరోయిన్ నీలం ఉపాధ్యాయతో నిశ్ఛితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని ప్రియాంక తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. సిద్ధార్థచోప్రా, నీలం ఉపాధ్యాయ జంటకు మా అందరి ఆశీర్వాదాలు అంటూ రాసుకొచ్చింది. కాగా.. 2019లో సిద్ధార్థ్‌కి ఇషితా కుమార్‌తో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత ఊహింనచి నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు. ఇషిత 2021లో మరొకరిని పెళ్లి చేసుకుంది. వధువు ఎవరంటే.. హీరోయిన్ నీలం ఉపాధ్యాయ తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లో నటించింది. ఆమె తెలుగులో మిస్టర్- 7తో చిత్రంతోనే తెరంగేట్రం చేసింది. ఆ తరువాత ఉన్నోడు ఒరు నాల్ అనే తమిళ సినిమాలో నటించింది. నీలం ఉపాధ్యాయ చివరిసారిగా 2017లో రిలీజైన టాలీవుడ్ చిత్రం తమాషాలో కనిపించింది. View this post on Instagram A post shared by Neelam Upadhyaya (@neelamupadhyaya) -
పెళ్లిపై స్పందించిన సిద్దార్థ్.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన హీరో!
హీరో సిద్దార్థ్- హీరోయిన్ అదితిరావు హైదరీ చాలాకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. డేటింగ్ను ఓపెన్‌గా చెప్పుకోవడానికే ఇష్టపడని సిద్దార్థ్ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తనతో కలిసున్న ఫోటోలను షేర్ చేస్తూ ఉండేవాడు. తాజాగా మార్చి 27న అదితిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. వనపర్తిలోని గుడిలో ఆమెతో ఏడడుగులు వేశాడు. అయితే తన పెళ్లిపై హీరో సిద్ధార్థ్ తొలిసారి స్పందిచాడు. తాజాగా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 'ఆమె ఓకే చెప్పింది.. అందుకే ఎంగేజ్మెంట్ చేసుకున్నాం' అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇప్పటికే వీరిద్దరి పెళ్లి జరిగిపోయిందని ఫ్యాన్స్ భావిస్తుంటే సిద్ధార్థ్ సడన్ షాకిచ్చాడు. ఎంగేజ్మెంట్ పోస్ట్‌తో అభిమానులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చి పడేశాడు. మరి వీళ్లద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే విషయంపై క్లారిటీ లేదు. View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సుస్మితా సేన్ అందానికి దక్కిన కిరీటానికి 30 ఏళ్లు పూర్తి
Multiple cat checj
Check international block
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019