breaking news
Ad - Sakshi_Home_Sticky
-
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మరో 14 రోజులపాటు పొడిగిస్తూ మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశా రు. మరోవైపు, బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీ వాదనలు వినిపించింది. కుంభకోణంలో కవిత పాత్రను ధర్మాసనానికి వివ రించింది. కవితను అధికారులు వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకీభవించారు. మే 7న ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి విచారణ బుధవారానికి వాయిదా వేశారు. సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పాం.. ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్‌టేకింగ్ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. ఈడీ పరిధి దేశమంతా ఉంటుందని, అందుకే కవిత అరెస్టు విషయంలో ట్రాన్సిట్ ఆర్డర్ అవసరం రాలేదన్నారు. అరెస్టు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఉపసంహరణే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ కేసులో పలువురి వాంగ్మూలాల ఆధారంగానే కవిత పాత్రపై స్పష్టత వచ్చిదని ఆ తర్వాతే అరెస్టు చేశామన్నారు. అరుణ్ పిళ్లై ద్వారా వాటా కలిగి ఉన్నారు.. ఇండో స్పిరిట్స్‌లో 33.5 శాతం వాటాను తన ప్రాక్సీ అరుణ్ పిళ్లై ద్వారా కవిత కలిగి ఉన్నారని జొహెబ్ హొస్సేన్ చెప్పారు. హోల్‌సేలర్లకు కమీషన్లు పెంచుతూ మద్యం విధానంలో మార్పులు చేసి సౌత్‌గ్రూప్‌నకు అనుకూలంగా మారేలా ఒప్పందం జరిగిందని, కుంభకోణంలో రూ.100 కోట్లు లావాదేవాలు జరిగాయన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆమె ఆదేశాల మేరకే రూ.25 కోట్లు ఇచ్చారని, ఈ మేరకు వారిద్దరూ వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఆప్ నేత కేజ్రీవాల్, కవిత మధ్య కుదరిన ఒప్పందం మేరకే రూ.100 కోట్లు ఆమ్ ఆద్మీ పారీ్టకి ఇచ్చారని మరో నిందితుడు దినేష్ ఆరోరా తన వాంగ్మూలంలో చెప్పారన్నారు. నగదు లావాదేవీలకు సంబంధించి కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ చాట్లోనూ సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. ఆర్థిక నేరాల్లో నగదుకు సంబంధించి ఆధారాలు దొరకడం చాలా కష్టమన్నారు. నిందితుల వాంగ్మూలాలు, సాక్ష్యాల ఆధారంగా కోర్టులు తీర్పులిచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో సూత్రధారి, పాత్రధారి అయిన కవితకు సంబంధించి పలు సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు. -
జైల్లో మాజీ సీఎం హేమంత్ సోరెన్.. ఈడీకి స్పెషల్ కోర్టు కీలక ఆదేశాలు
మనీ ల్యాండరింగ్ కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ గత వారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై జార్ఖండ్ ప్రత్యేక పీఎంఎల్ఏ (ప్రివెంటివ్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్) కోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఈడీ ప్రత్యుత్తరం ఇచ్చేందుకు తమకు రెండు వారాలు సమయం కావాలని కోరింది. అయితే ఈడీ నిర్ణయాన్ని సోరెన్ తరుపు న్యాయవాదులు కపిల్ సిబల్, అరుణాభ్ చౌదరి తప్పుబట్టారు. రెండు వారాల సమయం వల్ల తన క్లయింట్ ఎన్నికల ప్రచారానికి దూరం కావాల్సి వస్తుందని వాదించారు. ఇరుపక్ష వాదనలు విన్న కోర్టు సోరెన్ బెయిల్ పిటిషన్‌పై ప్రత్యుత్తరం ఇచ్చేందుకు ఈడీకి వారం రోజుల గడువు మాత్రమే ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను మే 1న చేపట్టనుంది. మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి సోరెన్‌ను ఈడీ జనవరి 31న అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. -
కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా
ఢిల్లీ: లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి(ఏప్రిల్ 24) వాయిదా పడింది. బుధవారం తిరిగి వాదనలు కొనసాగనున్నాయి. మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గంటన్నర సేపు వాదనలు వినిపించింది. ఈడీ వాదనలు: కవితను అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పలేదు మేము కోర్టు ధిక్కరణకు పాల్పడలేదు అరెస్టు చేయబోమని మేము కోర్టుకు అండర్‌టేకింగ్ ఇవ్వలేదు కేవలం పది రోజుల వరకు సమన్స్ ఇవ్వబోమని చెప్పాం ఈ అంశంపై కవిత తాను వేసిన పిటిషన్ ఉపసంహరించుకుంది , అరెస్టు ప్రక్రియ అంతా చట్టబద్దంగా జరిగింది సెక్షన్ 19 ప్రకారం మాకు అరెస్టు చేసే అధికారం ఉంది ఈ స్కామ్‌లో సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చింది కవిత ఆదేశాల మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ 25 కోట్ల రూపాయలు ఇచ్చారు దీనిపై వారు వాంగ్మూలం ఇచ్చారు పాలసీని సౌత్ గ్రూప్‌నకు అనుకూలంగా మార్చారు ఇండో స్పిరిట్ కంపెనీ ద్వారా లంచాల సొమ్ము కవిత తిరిగి రాబట్టుకున్నారు ఈడీ జాతీయ దర్యాప్తు సంస్థ, దీనికి దేశమంతా పరిధి ఉంది ట్రాన్సిట్ రిమాండ్‌లో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు అరెస్టు చేసిన 24 గంటల్లో కవితను కోర్టులో హాజరుపరిచాం పీఎంఎల్ఎ ప్రత్యేక చట్టం కనుక ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు ఈ చట్టం కింద మహిళలకు ప్రత్యేక హక్కులు ఏమీ లేవు అరుణ్ పిళ్లై కవితకు బినామీ ఇండో స్పిరిట్ లో 33.5 అరుణ్ పిళ్లై పేరు మీద కవిత తీసుకున్నారు ఈ వ్యవహారంలో కవిత, కేజ్రీవాల్ మధ్య రాజకీయ అవగాహన ఉంది డీల్ లో భాగంగా 100 కోట్లు ఇచ్చినట్లు దినేష్ అరోరా దర్యాప్తులో అంగీకరించారు బుచ్చి బాబు వాట్సాప్ చాట్‌లో కూడా ఈ విషయం బయటపడింది ఆర్థిక నేరాల కుట్ర గుట్టుగా జరుగుతుంది ఈ కేసుల్లో నేరుగా నగదు వ్యవహారాల ఆధారం దొరికే అవకాశం ఉండదు వివిధరకాల వ్యక్తుల స్టేట్మెంట్స్, ఇతర సాక్షాల ఆధారంగా అక్రమ సొమ్ము ను గుర్తించవచ్చు గతంలో పై కోర్టులు తీర్పు ఇచ్చాయి ఈ కేసు ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు దశలోనే ఉంది కవిత ఈ కేసులో పూర్తి స్థాయిలో సంబంధం ఉందని అనే దానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి -
మూడు మామిడి పండ్లే తిన్నా.. ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ వాదన
న్యూఢిల్లీ: జైలులో తాను తీసుకుంటున్న ఆహారాన్ని ఈడీ రాజకీయం చేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విమర్శించారు. డయాబెటిస్ బాధితుడినైన తనకు జైలులో ఇన్సులిన్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ రౌస్అవెన్యూ కోర్టులో శుక్రవారం వాదనలు కొనసాగాయి. మెడికల్ బెయిల్ పొందడానికి లేదా చికిత్స పేరిట ఆసుపత్రిలో చేరడానికి వీలుగా రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుకోవడానికి కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని ఈడీ గురువారం కోర్టు దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈడీ వాదనపై కేజ్రీవాల్ శుక్రవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జైలులో ఉన్న తనకు ఇప్పటిదాకా 48 సార్లు ఇంటి నుంచి భోజనం పంపగా, కేవలం మూడుసార్లు మాత్రమే మామిడిపండ్లు తిన్నానని కేజ్రీవాల్ తెలిపారు. కేవలం ఒకే ఒక్కసారి ఆలూ పూరీ తీసుకున్నానని, అది కూడా నవరాత్రి ప్రసాదంగా స్వీకరించానని కోర్టుకు తెలియజేశారు. వైట్ రైస్, బ్రౌన్ రైస్ కంటే మామిడి పండ్లలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. షుగర్ లేని స్వీట్లు ఆరుసార్లు తిన్నానని, షుగర్ లేకుండా టీ తాగుతున్నానని వెల్లడించారు. తనకు చికిత్స అందించే రెగ్యులర్ వైద్యుడు సూచించిన డైట్ చార్ట్ ప్రకారమే ఆహారం తీసుకుంటున్నానని వివరించారు. ప్రతిరోజూ 15 నిమిషాలపాటు డాక్టర్‌ను సంప్రదించడానికి అనుమతి ఇవ్వాలంటూ శుక్రవారం మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇన్సులిన్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు ఈ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. -
‘ఆయనేమైనా నేరస్థుడా? గ్యాంగ్‌స్టరా?’.. కోర్టులో కేజ్రీవాల్ తరుపు న్యాయవాది
న్యూఢిల్లీ : తనకు తీహార్ జైల్లోనైనా డయాబెటీస్ ఇన్సులిన్ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు తీర్పును రిజ్వర్‌లో ఉంచింది. ఏప్రిల్ 22న తీర్పును వెలువరించనుంది. మద్యం పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ గత కొన్నేళ్లుగా తీవ్ర మధుమేహంతో బాధపడుతున్నారు. మధుమేహం కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్ పడిపోతున్నాయని, ట్రీట్మెంట్ తీసుకునేందుకు వైద్యుల వీడియో కన్సల్టేషన్ కావాలని ఇప్పటికే పలు మార్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ వచ్చింది. కేజ్రీవాల్‌పై కుట్ర అయితే కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ ఇవ్వకపోవడంపై ఆయన కుటుంబ సభ్యులు,ఆప్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్సులిన్ ఇవ్వకుండా కేజ్రీవాల్‌ను చంపేందుకు జైల్లో కుట్రజరుగుతోందని ఆప్ నేత అతిషి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కోర్టులో కేజ్రీవాల్ మరో పిటిషన్ ఈ తరుణంలో తనకు ఇన్సులిన్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కేజ్రీవాల్ తరుపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈడీ చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు. ఈడీ ఆరోపణల్ని తోసుపుచ్చిన న్యాయవాది కేజ్రీవాల్ జైలులో కేవలం మూడుసార్లు మామిడి పండ్లను తిన్నారని, నవరాత్రి ప్రసాదంగా ఆలూ పూరీని సేవించారని కోర్టుకు తెలిపారు. మెడికల్ బెయిల్ పొందేందుకు ఆప్ అధినేత హై షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నారన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపణలను తోసిపుచ్చారు. మూడు మామిడి పండ్లే తిన్నది కేజ్రీవాల్ డయాబెటిక్ పేషెంట్ కాబట్టి ఇన్సులిన్ వేసుకునేందుకు అనుమతించాలన్న అభ్యర్థనపై సింఘ్వీ కోర్టులో మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ఇప్పటి వరకు 48 సార్లు ఇంటి నుంచి పంపిన భోజనం చేశారు. గ్లైసెమిక్ ఇండెక్స్ వ్యాల్యూ ఆధారంగా మూడు మామిడి పండ్లను మాత్రమే తిన్నారు. మామిడి (51) ,వైట్ రైస్ (73) లేదా బ్రౌన్ రైస్ (68) కంటే తక్కువగా ఉంది అని సింఘ్వీ కోర్టులో వాదించారు. కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న స్వీట్లను తింటున్నారన్న ఈడీ ఆరోపణలపై సంఘ్వీ స్పందించారు. సీఎం ఆరుసార్లు షుగర్ లేని స్వీట్లు తిన్నారని, షుగర్ లేకుండా టీ తాగేవారని, షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్లను వాడారని ఆయన అన్నారు. హాస్యాస్పందంగా ఈడీ తీరు మామిడి పండ్లు తిని మెడికల్ బెయిల్ తీసుకునేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నాంటూ ఈడీ చేసిన వ్యాఖ్యలు అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయని సింగ్వీ అన్నారు. విచారణ సందర్భంగా కేజ్రీవాల్ నేరస్థుడా? గ్యాంగ్‌స్టరా? సంఘ్వీ ప్రశ్నించారు. ఆయన ఇప్పటి వరకు 15 నిమిషాల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యుల సాయంతో ట్రీట్మెంట్ తీసుకోలేకపోయారని విచారం వ్యక్తం చేశారు. ఓసారి మీరే వైద్యులు కేజ్రీవాల్‌కు సూచించిన ఆహారాన్ని చూడండి. ఇందులో తియ్యని పండ్లు, లేదా ఇతర తీపి పదార్ధాల గురించి ప్రస్తావించలేదు’ అని కోర్టుకు విన్న వించుకున్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఏప్రిల్ 22న వెలవరించనుంది. #WATCH | Delhi: Ramesh Gupta, the lawyer for Delhi CM Arvind Kejriwal in the liquor policy case, says, "We have moved a petition requesting the Court to allow Mr Kejriwal to consult his doctor who has been treating him for the last many years. But that request was opposed by the… pic.twitter.com/FDc50cS04t — ANI (@ANI) April 19, 2024
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019