breaking news
-
ఫ్లిప్‌కార్ట్ గుడ్‌న్యూస్.. ఇక హైదరాబాద్‌లోనూ కొత్త ఆఫర్!
హైదరాబాద్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలలో ప్రారంభించిన వీఐపీ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను ఇప్పుడు హైదరాబాద్‌కు విస్తరించింది. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న కస్టమర్లు ఉచిత డెలివరీ, తగ్గింపు వంటి ఆఫర్లను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ వీఐపీ (Flipkart VIP) సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను కొత్తగా హైదరాబాద్‌తోపాటు అహ్మదాబాద్, భువనేశ్వర్, కోయంబత్తూర్, గౌహతి, పాట్నా, పూణే, రాంచీలలో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. కస్టమర్లు సంవత్సరానికి రూ. 499 చెల్లించి ఫ్లిప్‌కార్ట్ వీఐపీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలు ఈ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ లక్షలాది ఉత్పత్తులపై 48-గంటల ఉచిత డెలివరీ, అన్ని ఉత్పత్తులపైనా చెల్లింపుల కోసం సూపర్ కాయిన్స్‌ను ఉపయోగించి 5 శాతం అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. క్లియర్‌ట్రిప్‌లో ఒక్క రూపాయికే ఫ్లైట్ క్యాన్సిల్ లేదా రీషెడ్యూల్ చేసుకోవచ్చు. క్లియర్‌ట్రిప్ హోటల్ బుకింగ్‌లపై అదనపు ఆఫర్లు, 48 గంటలలోపు రిటన్ పికప్. షాపింగ్ ఫెస్టివల్స్‌కు ముందస్తు యాక్సెస్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఇలా ఎలా నమోదు చేసుకోండి.. ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్ లేదా యాప్‌ని సందర్శించండి మీ వివరాలతో లాగిన్ చేయండి. ఒకవేళ మీరు ప్లాట్‌ఫామ్‌కు కొత్త అయితే, మీ వివరాలను అందించి అకౌంట్‌ను క్రియేట్ చేసుకోండి. వీఐపీ ల్యాండింగ్ పేజీకి స్క్రోల్ చేసి, 'గెట్ వీఐపీ బెనిఫిట్స్' బటన్‌పై నొక్కండి చెల్లింపు, తుది ప్రక్రియ కోసం 'కంనిన్వ్యూ' క్లిక్ చేయండి మీకు అనువైన మోడ్ ద్వారా చెల్లింపు వివరాలను నమోదు చేసి ఆర్డర్‌ను కన్ఫర్మ్ చేఏయండి విజయవంతంగా నమోదు చేసుకున్న తర్వాత, వెబ్సైట్ లేదా యాప్‌లో కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. -
కొత్త ఈ-కామర్స్ కంపెనీ.. చవకా.. వీక్నెస్ పట్టేశారు!
దేశంలో సగటు కస్టమర్ల బలహీనతను కంపెనీలు పట్టేస్తున్నాయి. ఇలాంటి కస్టమర్ల కోసం ప్రత్యేక ఈ-కామర్స్ విభాగాలను తెరుస్తున్నాయి. తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులు అంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా "బజార్" అనే పేరుతో కొత్త చవక ఉత్పత్తుల విభాగాన్ని పరిచయం చేసింది. ఈ వినూత్న విభాగం కస్టమర్లకు అతి తక్కువ ధరలలో అన్‌బ్రాండెడ్ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను అందిస్తుంది. భారతీయ వినియోగదారుల విభిన్న అవసరాలు, ప్రాధాన్యతలను తీరుస్తుంది. ఈ కొత్త వెంచర్ ఇప్పుడు అమెజాన్ ఇండియా ఆండ్రాయిడ్ యాప్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంది. ‘ది ఎకనామిక్ టైమ్స్’ ప్రకారం.. ఈ-కామర్స్ దిగ్గజం రూ. 600లోపు ధర కలిగిన దుస్తులు, వాచీలు, బూట్లు, ఆభరణాలు, బ్యాగ్‌లతో సహా బ్రాండెడ్ ఉత్పత్తులను జాబితా చేయడానికి విక్రేతలను ఆన్‌బోర్డింగ్ చేసింది. వీటిని ఆర్డర్ చేసే ప్రైమ్ సభ్యులకు 4-5 రోజుల్లోనే డెలివరీ చేయనుంది. సాధారణంగా చవకైన ఉత్పత్తుల డెలివరీకి ఎక్కువ సమయం పడుతుంది. ‘బజార్’ పరిచయాన్ని అమెజాన్ ఇండియా ప్రతినిధి ధ్రువీకరించారు. ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, భారతదేశం అంతటా ఉన్న తయారీ కేంద్రాల నుండి విక్రేతలు అందించే ఫ్యాషన్, ఇతర వస్తువులను తక్కువ ధరలో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు అని కంపెనీ పేర్కొంది. దేశంలో ఇప్పటికే ఇలాంటి లోకాస్ట్ ఈ-కామర్స్ సంస్థలు కొన్ని ఉన్నాయి. చవక ధర ఉత్పత్తులను విక్రయించడానికి మరో దిగ్గజ ఆన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్ కార్ట్ (Flipkart) కూడా షాప్సీ (Shopsy) పేరుతో వేరే యాప్‌ని నిర్వహిస్తుంది. దీంతోపాటు లోకాస్ట్ ఈ-కామర్స్ మార్కెట్లో పురోగతి సాధిస్తున్న సాఫ్ట్‌బ్యాంక్-మద్దతు గల మీషోతోనూ అమెజాన్ బజార్ పోటీపడనుంది. -
ఉద్యోగులపై అతి నిఘా పెట్టిన కంపెనీ.. భారీ ఫైన్‌తో తిక్కకుదిరింది!
ఉద్యోగులపై అతి నిఘా పెట్టిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు ఫ్రాన్స్ గోప్యతా రక్షణ సంస్థ భారీ జరిమానా విధించింది. తమ వేర్‌హౌస్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల పనితీరు, కార్యాచరణను పర్యవేక్షించడానికి అత్యంత అనుచిత వ్యవస్థను ఉపయోగించినందుకు అమెజాన్‌పై 35 మిలియన్ డాలర్ల (రూ.290 కోట్లు) జరిమానా విధించింది. అమెజాన్ ఉపయోగిస్తున్న మానిటరింగ్ సిస్టమ్ ఫ్రాన్స్ లాజిస్టిక్ విభాగంలోని మేనేజర్లను ఉద్యోగులను చాలా దగ్గరగా పర్యవేక్షించడానికి అనుమతించిందని, ఇది యూరోపియన్ యూనియన్ నిర్దేశించిన గోప్యతా ప్రమాణాలను ఉల్లంఘించిందని ఫ్రెంచ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ (CNIL) తన వెబ్సైట్లో పేర్కొంది. "స్టౌ మెషిన్ గన్" అని పిలిచే స్కానర్లతో ఉద్యోగులను పర్యవేక్షిస్తోంది. ఉద్యోగులు ఈ స్కానర్ల ద్వారా పార్సిళ్లను స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పార్సిళ్లను చాలా త్వరగా అంటే 1.25 సెకన్ల కంటే తక్కువ సమయం చేస్తే వారి పనితీరులో లోపంగా కంపెనీ గుర్తిస్తోంది. ఈ పర్యవేక్షణ పద్ధతి ఉద్యోగి ఉత్పాదకతను, పని అంతరాయాలను కొలవడానికి ఉపయోగిస్తున్నారని సీఎన్ఐఎల్ ఆరోపిస్తోంది. అటువంటి వ్యవస్థను సెటప్ చేయడం యూరోపియన్ యూనియన్ గోప్యతా నియమాల ప్రకారం చట్టవిరుద్ధమని సీఎన్ఐఎల్ వాదిస్తోంది. అయితే ఈ వాదనలను అమెజాన్ తోసిపుచ్చింది. సీఎన్ఐఎల్ చేసిన ఆరోపణలతో తాము తీవ్రంగా విభేదిస్తున్నామని, అప్పీల్ ఫైల్ చేసే హక్కు తమకు ఉందని తెలిపింది. "వేర్‌హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లు పరిశ్రమ ప్రమాణాలు, కార్యకలాపాల భద్రత, నాణ్యత సామర్థ్యాన్ని నిర్ధారించడానికి, సమయానికి, కస్టమర్ అంచనాలకు అనుగుణంగా ప్యాకేజీల నిల్వ, ప్రాసెసింగ్‌ను ట్రాక్ చేయడానికి అవసరమైనవి" అని అమెజాన్ తన ప్రకటనలో వివరించింది. -
అమెజాన్‌తో వాణిజ్య శాఖ ఒప్పందం
న్యూఢిల్లీ: దేశీయంగా 20 జిల్లాల్లోని చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) శిక్షణ కలి్పంచే దిశగా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. దీని ప్రకారం ఈ–కామర్స్ మాధ్యమం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ఇమేజింగ్, డిజిటల్ క్యాటలాగ్‌లను రూపొందించడం, పన్నుల సంబంధమైన అంశాలను తెలుసుకోవడం మొదలైన వాటికి ఈ శిక్షణ ఉపయోగపడగలదని పేర్కొంది. ఎగుమతుల హబ్‌లుగా గుర్తించిన జిల్లాల్లో అమెజాన్, డీజీఎఫ్టీ కలిసి శిక్షణ, వర్క్‌షాప్‌లను నిర్వహిస్తాయి. ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా కార్యక్రమాల కోసం ఫ్లిప్‌కార్ట్, ఈబే, రివెక్సా, షిప్‌రాకెట్, షాప్‌క్లూస్ వంటి వివిధ ఈ–కామర్స్ సంస్థలతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) చర్చలు జరుపుతున్నట్లు వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో వివరించింది. ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా దేశీ సంస్థలు అంతర్జాతీయంగా మరిన్ని ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఒప్పందాలు ఉపయోగపడతాయి. 2030 నాటికి ఈ–కామర్స్ ద్వారా 350 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను ఎగుమతి చేయాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకోవాలని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీíÙయేటివ్ (జీటీఆర్ఐ) ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఇవి 2 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉన్నాయి. ఎగుమతులను సరళతరం చేయడం, 2025 నాటికి ఈ–కామర్స్ ఎగుమతులను 20 బిలియన్ డాలర్లకు చేర్చడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు అమెజాన్ ఇండియా డైరెక్టర్ భూపేన్ వాకంకర్ తెలిపారు. -
పండుగ సీజన్ కోసం 2.5 లక్షల ఉద్యోగాలు.. అట్లుంటది అమెజాన్తోని!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ( Amazon) పండుగ సీజన్ కోసం యూఎస్‌లో భారీగా ఉద్యోగులను నియమించుకోనుంది. కస్టమర్లకు ఉత్పత్తులు కొనుగోలు చేసిన మరుసటి రోజే డెలివరీని అందించే లక్ష్యంతో అమెజాన్ హాలిడే షాపింగ్ సీజన్ కోసం 2,50,000 యూఎస్ వర్కర్లను నియమించుకునే ప్రణాళికలను ప్రకటించింది. ఇది గత రెండేళ్లలో నియమించుకున్న ఉద్యోగుల సంఖ్య కంటే 67 శాతం ఎక్కువ. హాలిడే సీజన్ కోసం అమెజాన్ దూకుడుగా వెళ్తుంటే మరోవైపు యూఎస్‌లోని ఇతర రిటైలర్ల ప్రణాళికలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. 2023 సంవత్సరంలో అమ్మకాలు తగ్గుముఖం పడతాయన్న అంచనాల నేపథ్యంలో తమ స్టోర్లు, వేర్‌హౌస్‌లలో నియామకాలను తగ్గించినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. పెరిగిన ధరల నేపథ్యంలో ఈ సంవత్సరం హాలిడే అమ్మకాలు గత సంవత్సరం కంటే సగానికి చేరుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు. (Tech Jobs: టెక్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. ఇక రానున్నవి మంచి రోజులే..!) అమెరికన్ రిటైల్ సంస్థ ‘టార్గెట్’ అంచనా ప్రకారం, అమెజాన్ హాలిడే షాపింగ్ సీజన్ కోసం 1,00,000 మంది ఉద్యోగులను నియమించుకుంటోంది. టార్గెట్ సంస్థ కూడా అక్టోబర్‌లో కస్టమర్లకు డిస్కౌంట్లను అందించాలని ప్లాన్ చేస్తోంది. కాగా మరో యూఎస్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ఇంకా హాలిడే హైరింగ్ ప్లాన్లను ప్రకటించలేదు. 2022లో ఈ కంపెనీ 40,000 మంది సీజనల్ వర్కర్లను నియమించుకున్నట్లు రాయిటర్స్ నివేదించింది. సేమ్ డే డెలివరీల దిశగా అమెజాన్ ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్లో 50 కొత్త ఫిల్‌ఫుల్‌మెంట్ సెంటర్లు, డెలివరీ స్టేషన్లు ఏర్పాటు చేసింది. అక్టోబర్ 10-11 తేదీల్లో ‘ఫాల్ ప్రైమ్’ ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అమెజాన్ నుంచి భారీ నియామక ప్రణాళిక రావడం గమనార్హం. (Amazon Jobs: అమెజాన్ శుభవార్త! అలాంటి వారికి ట్రైనింగ్‌తోపాటు జాబ్స్..) అమెజాన్ నియమించుకునే కొత్త సీజనల్ వర్కర్లను ఆర్డర్ల ఎంపిక, క్రమబద్ధీకరణ, ప్యాకింగ్, షిపింగ్ పనులకు వినియోగిస్తారు. వీరికి ఎంపిక చేసిన ప్రదేశాలలో 1,000 నుంచి 3,000 డాలర్లు సైన్-ఆన్ బోనస్‌గా చెల్లించనున్నారు. సీజనల్ వర్కర్లకు వారి పని, లొకేషన్‌ను బట్టీ సగటున గంటకు 17 నుంచి 28 డాలర్లు చెల్లించనున్నట్లు అమెజాన్ పేర్కొంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019