breaking news
-
వేసవికి నప్పే.. వింటేజ్ స్టైల్ ఇదే..!
పెరిగే ఉష్ణోగ్రతలకు తట్టుకునేలా ఉండాలి. మిక్స్ అండ్ మ్యాచ్ ఎంపిక క్యాజువల్ అనిపించాలి. పాతకాలపు కాంతులు కట్టిపడేస్తున్నట్టే ఉండాలి. వెస్ట్రన్ టచ్‌తో ఆకట్టుకునేలా ఉండాలి. కాలానికి తగినట్టు, కలర్ఫుల్గా కనిపించాలి. తమవైన నైపుణ్యాలను జోడించే ఫ్యాషన్ ఔత్సాహికులు వింటేజ్ స్టైల్‌ని మెరిపిస్తున్నారు. మట్టి రంగులు.. సాధారణంగా లేత రంగులను ఈ సీజన్‌కి ఎంచుకుంటాం. అయితే, వెస్ట్రన్ వింటేజ్ స్టైల్‌కి ముదురు గోధుమ, ఎరుపు, నారింజ ఈ సీజన్లో మొదటి వరసలో ఉంటాయి. ఈ రంగులు వెస్ట్రన్ వస్త్రధారణకు సహజ సౌందర్యాన్ని జోడించడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ రంగులు ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని వెల్లడిస్తాయి. క్యాజువల్ వేర్కి సొగసును అందిస్తాయి. లేసులు, అల్లికలు.. ఈ సీజన్లో మరో ఆకర్షణగా కనిపించేది డెనిమ్ ఎలిమెంట్స్, లేసులు, అల్లికల అంచులు గల డ్రెస్సులు వెస్ట్రన్ ఫ్యాషన్‌లో మనకు ప్రధానంగా కనిపిస్తుంటాయి. ఇవి, డ్రెస్సులకు ఉల్లాసభరితమైన అలంకరణను జోడిస్తాయి. ముదురు గోధుమ రంగులో ఉండే ప్లెయిన్ స్వెడ్ టాప్ లేదా జాకెట్స్, అంచులతో డిజైన్ చేసినవి ఈ సీజన్ స్టైల్‌కి బాగా నప్పుతాయి. ఇవి మోడ్రన్ టచ్, వింటేజ్ స్టైల్‌తో ఆకట్టుకుంటాయి. డెనిమ్‌తో జత చేసే ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ స్కర్టులు, బ్లేజర్లతో మ్యాక్సీ డ్రెస్సులు ధరిస్తే ఆధునికపు హంగులతో మెరిసి΄ోతారు. స్టెట్సన్ టోపీలు, కౌబాయ్ బూట్లు డ్రెస్సులకు వెస్ట్రన్ లుక్‌ని ఇట్టే తీసుకువస్తాయి. పూసల దండలు, ఇతర ఫ్యాషన్ జ్యువెలరీ, సన్నని హ్యాండల్ గల బ్యాగ్‌తో పూర్తిగా వింటేజ్ లుక్‌తో అట్రాక్ట్ చేస్తారు. ఇవి చదవండి: Srishti Dabas: పగలు ఉద్యోగం... రాత్రి చదువు.. ఇప్పుడు ఐ.ఏ.ఎస్. -
హెల్త్: 'మెగా షేప్ మసాజర్' తో.. ఫిట్నెస్ సెంటర్స్‌కి చెక్!
ఏ డ్రెస్ వేసుకున్నా.. అతికినట్టు సరిపోవాలంటే బాడీ సరైన షేప్‌లో ఉండాలి. అందుకే స్లిమ్ అండ్ ఫిట్ షేప్ కోసం నానాతంటాలు పడేది! ఆ కష్టాన్నించి గట్టెక్కించేదే ఈ మసాజర్. ఇది చక్కటి శరీరాకృతిని అందిస్తుంది. దీన్ని సాధారణ సమయాల్లోనే కాదు.. స్నానం చేస్తున్నప్పుడూ వాడుకోవచ్చు. సాధారణంగా మెషిన్స్‌కి వాటర్ తగిలితే పనిచేయవు. కానీ ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందిన మెషిన్ కాబట్టి.. వాటర్‌ప్రూఫ్‌గా పనిచేస్తుంది. దాంతో స్నానం చేస్తూ కూడా దీన్ని చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు. మొదట ఏదైనా ఆయిల్ లేదా స్కిన్ టైటెనింగ్ క్రీమ్‌ని అప్లై చేసుకుని.. ఈ మసాజర్‌తో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మొత్తం 8 రోలర్లు, 13 ప్రోట్రూషన్ లతో కూడిన ఈ బ్యూటీ మసాజర్.. ఒత్తిడిని దూరం చేస్తుంది. డివైస్‌కి అమర్చుకునే రోలర్స్.. నాలుగు నాలుగు చొప్పున రెండు పార్ట్స్‌గా అమర్చి ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని మార్చుకోవచ్చు. మసాజ్ సమయంలో స్పీడ్ తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. ఇది కొవ్వును తగ్గిస్తూ యవ్వనంగా మారుస్తుంది. ఈ డివైస్‌తో పాటు.. ఎసిటినో 5డి డిజైనింగ్ క్రీమ్ కూడా లభిస్తుంది. దీన్ని విడిగా కూడా మార్కెట్లో కొనుగోలు చేసుకోవచ్చు. ఫిట్నెస్ సెంటర్స్‌కి వెళ్లాల్సిన పని లేకుండానే.. ఈ డివైస్ మిమ్మల్ని నాజూగ్గా, స్లిమ్‌గా మారుస్తుంది. దీనికి 3 గంటల పాటు చార్జింగ్ పెడితే.. సుమారు 30 గంటల పాటు పని చేస్తుంది. కాళ్లు, చేతులు, నడుము, మెడ, పొట్ట భాగాల్లో పేరుకున్న కొవ్వును వేగంగా కరిగిస్తుంది. దీన్ని మెత్తటి క్లాత్ లేదా టిష్యూ సాయంతో క్లీన్ చేసుకోవచ్చు. వినియోగించడం.. ఇతర ప్రదేశాలకు తీసుకుని వెళ్లడం అంతా సులభమే. దీని ధర 207 డాలర్లు. అంటే 17,167 రూపాయలు. ఇవి చదవండి: మిస్ వరల్డ్ పోటీల్లో పింక్ సీక్విన్ గౌనుతో మెరిసిన పూజా హెగ్డే! -
ఫైనల్లీ.. తన క్రష్ ఎవరో బయటపెట్టిన రష్మిక!
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. యానిమల్ మూవీతో రీసెంట్గా బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఎంతో పాపులారిటీని దక్కించుకున్న రష్మిక.. స్టార్ హీరోలకి మించిన ఫాలోయింగ్‌తో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. వరుస హిట్స్‌తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా క్రేజ్ దక్కించుకుంది. అటు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తెగ బిజీగా మారిపోయిందీ బ్యూటీ. ఇక రష్మిక అండే పడి చచ్చే అభిమానులు ఎంతో మంది ఉంటారు. మరి రష్మిక క్రష్ ఎవరో తెలుసా? ఈమధ్యే తన క్రష్‌ని బయటపెట్టింది రష్మిక. సాంప్రదాయ చీరకట్టు అంటే తనకెంతో ఇష్టమని, ఫ్యాన్స్ ఆ ఇష్టాన్ని మరింత పెంచేశారు అంటూ రీసెంట్‌గానే చెప్పుకొచ్చింది. ఇక యానిమల్ ప్రమోషన్స్‌లోనూ దాదాపు చీరకట్టులోనే కనిపించింది ఈ బ్యూటీ. సాంప్రదాయంగా కనిపిస్తూనే ఫ్యాషన్ ట్రెండ్‌ను సెట్ చేయడంలో తగ్గేదేలే అంటుంది రష్మిక. ఇక తన దుస్తుల్లో స్ట్టన్నింగ్గా కంటే కంఫర్ట్‌గా ఉండటాన్నే ఇష్టపడతాను. అందుకే కంఫర్ట్‌గా ఉండే ఔట్ఫిట్సే నా ఫ్యాషన్ స్టయిల్ అంటూ రివీల్ చేసింది. తాజాగా ప్రమోషన్స్‌లో గులాబీ రంగు చీరలో తళుక్కుమంది ఈ బ్యూటీ. ప్రముఖ డిజైనర్ అర్పితా మెహతా డిజైన్ చేసిన ఈ చీర ధర అక్షరాలు రూ. 1,90,000లుగా ఉంది. -
అందరిలో ఒకరిగా ఉండటానికే చీర కట్టు : ఎమ్మెల్సీ కవిత
సాక్షి,హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓ వార్తా సంస్థతో తన పర్సనల్, పొలిటికల్ లైఫ్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మీరు ప్రతిసారి చీరనే ఎందుకు ధరిస్తారన్న ప్రశ్నకు కవిత క్లారిటీ ఇచ్చారు. ‘పొలిటీషియన్‌గా ఉన్న నేను ఒక పద్ధతి ప్రకారం దుస్తులు ధరించాల్సి ఉంటుంది. సామాన్య ప్రజలు నన్ను తమలో ఒకరిగా భావించాలంటే వారిలాగే నేనూ ఉండాల్సి ఉంటుంది. అప్పుడే వారు నన్ను కలవడానికి, సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు. డిఫరెంట్ స్టైల్లో నా డ్రెస్సింగ్ ఉంటే వారు నా వద్దకు ఎందుకు వస్తారు’ అని కవిత సమాధానమిచ్చారు. ఇక లిక్కర్ స్కామ్‌లో విచారణ గురించి అడగ్గా ‘మాది ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం. దర్యాప్తు సంస్థలు నాకు సమన్లు పంపించినపుడు మా ఇంట్లో వాళ్లంతా ఆందోళనకు గురయ్యారు. ఒక కుటుంబ సభ్యురాలు అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు వారికి చాలా కష్టంగా ఉంటుంది’ అని కవిత చెప్పారు. కేరళ సీఎం పినరయి విజయన్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తనకు ఇష్టమైన పొలిటీషియన్లని వారి నుంచి నేర్చుకొని రాజకీయ నేతగా ఇంకా ఎదగడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఇదీ చదవండి..అర్ధరాత్రి హైడ్రామా.. పోలీసులతో మధుయాష్కీ వాగ్వాదం -
విలేజ్ అండ్ వింటేజ్ స్టైల్!
విలేజ్ అండ్ వింటేజ్ స్టైల్‌ని ఇప్పుడు యూత్ ఫాలో అవుతోంది. ఫోక్ సాంగ్స్‌ని ఆనందించినట్టే ఫోక్ డ్రెస్సింగ్‌తో ఆకట్టుకోవాలనుకుంటున్నారు. ట్రెండ్‌ను ఫాలో అవ్వద్దు, ట్రెండ్‌సెట్టర్‌గా ఉండాలి అనే ట్యాగ్‌తో కొంత వెస్ట్రన్ టచ్‌ని జత చేసి మరీ మెరిసిపోతున్నారు. ఈ గణపతి నవరాత్రులకు మనదైన కళతో వెలిగి పోవాలనుకునేవారికి ఈ స్టైల్ సరైన ఎంపిక అవుతుంది. ధోతీ ప్యాంట్స్‌లో ఎన్నో మోడల్స్ వచ్చాయి. ఇవి అబ్బాయిల కోసమే అనేది పాత మాట. ప్రాచీన జానపద మూలాంశాలతో మనదైన సంప్రదాయ కళతో రూపొందింది ఈ స్టైల్. టులిప్ ప్యాంట్‌గా టర్న్ అయిన ఈ స్టైల్ ఈ నవరాత్రి వేడుకలలో హైలైట్ కానుంది. హెవీ ఎంబ్రాయిడరీ, పొట్లీ, షెల్ లేస్ ఉన్న ఫ్లెయిరీ కేడియా టాప్ నవరాత్రి ఉత్సవంలో రాక్ అండ్ రోల్ చేయడానికి పర్ఫెక్ట్ అవుట్‌ఫిట్. ఇవి విదేశాలలోనూ చాలా ప్రాచుర్యం పొందాయి. చందేరీ, మధుబని, బ్లాక్ ప్రింట్లతో కలిపి ఈ ప్రత్యేకమైన దుస్తులను సిద్ధం చేస్తున్నారు డిజైనర్లు. షర్ట్ అండ్ స్కర్ట్ ప్రింటెడ్ స్కర్ట్ లేదా పలాజో స్కర్ట్, కాలర్ నెక్ షర్ట్ సౌకర్యంగానూ ఉంటుంది. విలేజ్ స్టైల్‌కి వెస్ట్రన్ టచ్ ఇచ్చినా సంప్రదాయ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ట్రైబల్ జ్యువెలరీ ధరిస్తే చాలు న్యూ లుక్‌తో మెరిసిపోతారు. చెక్స్ శారీస్.. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా మనదైన సంస్కృతిని ప్రతిబింబించేది చీరకట్టు. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా, పండగలు, ప్రత్యేక రోజుల్లో మాత్రం చీర ధరించడం ఇప్పటికీ చూస్తుంటాం. అయితే.. వింటేజ్, విలేజ్‌తో పాటు ఫోక్ స్టైల్ కూడా కట్టులో తీసుకురావాలంటే మాత్రం చెక్స్ కాటన్ శారీ, సిల్వర్ జ్యువెలరీ మంచి ఎంపిక అవుతుంది. మనవైన హ్యాండ్లూమ్స్ ఇక్కత్, బ్లాక్ ప్రింట్ అనార్కలీ, అంగరఖా, లాంగ్ గౌన్లు విలేజ్ స్టైల్లో ఆకట్టుకుంటాయి. ఘాగ్రా లేదా ఏదైనా పట్టు లెహంగా వంటివి ధరించినప్పుడు పటోలా దుపట్టాలు వేసుకుంటే విలేజ్ స్టైల్‌కి దగ్గరగా ఉన్నట్టే కాదు ప్రత్యేకంగానూ కనిపిస్తారు. (చదవండి: ఏకే ఫ్లవర్ కాదు ఫైర్ బోల్ట్
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019