breaking news
-
బిగ్ బాస్ హౌస్‌లో డేటింగ్.. అప్పుడే బ్రేకప్ చెప్పేసుకున్నారా?
బిగ్ బాస్ సీజన్- 17తో ఫేమస్ అయిన జంట సమర్థ్ జురెల్- ఇషా మాల్వియా. గతేడాది జరిగిన షోలో వీరిద్దరు మరింత రెచ్చిపోయారు. ఏకంగా ఓకే బెడ్‌పై నిద్రించిన వీడియో అప్పట్లో తెగ వైరలైంది. హౌస్‌లో సమర్థ్ జురెల్, ఇషా తీరు దారుణంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. 19 ఏళ్ల వయసులో ఇలా చేయడమేంటి? అంటూ ఇషాను ట్రోల్ చేశారు. అంతే కాకుండా ఇది బిగ్‌బాస్ షోనా.. అడల్ట్ షోగా మార్చేశారా అంటూ మండిపడ్డారు. అదే హౌస్‌లో ఇషా మాజీ భాయ్ ఫ్రెండ్ అభిషేక్ కుమార్ కూడా ఉన్నారు. అయితే ఈ జంటపై గతంలో చాలాసార్లు డేటింగ్ రూమర్స్ వచ్చాయి. ఉదరియన్ అనే సీరియల్లో నటించే సమయంలో వీరి మధ్య రిలేషన్ మొదలైనట్లు తెలుస్తోంది. దీంతో బిగ్‌బాస్ షో ద్వారా తమ రిలేషన్ నిజమేనని ధృవీకరించారు. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక వీరిద్దరు తమ బంధానికి ముగింపు పలకనున్నట్లు టాక్ వినిపించింది. ఈ జంట త్వరలోనే బ్రేకప్ కానుందని నెట్టింట తెగ వైరలైంది. కానీ ఈ రూమర్స్‌పై ఇషా కానీ, సమర్థ్ కానీ స్పందించలేదు. (ఇది చదవండి: 'పెళ్లికి ముందు సహజీవనం'.. ఉచిత సలహాపై మండిపడ్డ నటి!) తాజాగా ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నట్లు అర్థమవుతోంది. వీరిద్దరూ తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ అభిమాను జంట బ్రేకప్ కావడంపై ఫ్యాన్స్ షాకవుతున్నారు. అయితే ఈ జంట బ్రేకప్‌కు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఈ విషయంపై మాత్రం బుల్లితెర జంట నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా.. ఇషా మాల్వియా ఇటీవల పలు మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. -
మెడలో బాయ్‌ఫ్రెండ్ నెక్లెస్.. దేవర భామ డేటింగ్ నిజమేనా!
బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ పరిచయం అక్కర్లేని పేరు. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఆ తర్వాత బుచ్చిబాబు- చెర్రీ కాంబోలో వస్తోన్న మూవీలోనూ ఛాన్స్ కొట్టేసింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమంలో మెరిసింది జాన్వీ. అయితే ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఇటీవలే తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. అదే సమయంలో తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియా కూడా వెంటే ఉన్నారు. అయితే వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. అదే సమయంలో ఇటీవల ఆమె తండ్రి బోనీకపూర్ కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. శిఖర్ చాలా మంచివాడని ప్రశంసలు కురిపించారు. దీంతో వీరిద్దరి డేటింగ్ నిజమేనని హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా జాన్వీ కపూర్ మైదాన్ సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లింది. అదే సమయంలో అక్కడున్న వారి పోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోల్లో జాన్వీ కపూర్ తన భాయ్‌ఫ్రెండ్ పేరు ఉన్న నెక్లెస్‌ను ధరించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. పేరుతో నెక్లెస్ జాన్వీ కపూర్ ధరించిన నెక్లెస్‌పై శిఖు అని రాసి ఉంది. ఈ పేరుతోనే జాన్వీ అతన్ని ముద్దుగా పిలుస్తుందట. అంతేకాదు మంగళవారం ఉదయం నటి శిఖర్ తల్లి స్మ్రుతి షిండేతో కలిసి బాంద్రా ప్రభాదేవిలోని సిద్ధివినాయక ఆలయానికి చెప్పులు లేకుండా నడుస్తూ కనిపించింది. మార్చిలో జాన్వీ తన పుట్టినరోజు సందర్భంగా శిఖర్‌తో కలిసి తిరుపతి బాలాజీ ఆలయానికి నడిచి వెళ్లారు. మోకాళ్లపై ఆలయ మెట్లను కూడా ఎక్కారు. ఇవన్నీ చూస్తుంటే శిఖర్ పహారియాకు జాన్వీ కపూర్ కుటుంబం ఓకే చెప్పినట్లు అర్థమవుతోంది. ఇటీవల జాన్వీ తండ్రి బోనీ కపూర్ మాట్లాడుతూ.. తమ జీవితంలోకి ఇలాంటి యువకుడు ఉన్నందుకు తాము ఆశీర్వదంగా భావిస్తున్నామని తెలిపారు. దీంతో వీరిద్దరి మధ్య డేటింగ్ నిజమేనని తెలుస్తోంది. -
అలాంటి వ్యక్తితో డేటింగ్ చేయడం ఇష్టం : కృతి సనన్
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ వరుస హిట్లతో దూసుకెళ్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ‘తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా'(Teri Baaton Mein Aisa Uljha Jiya) మూవీతో ఓ సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఆమె నటించిన క్రూ(Crew)’ చిత్రం కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఇలా ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ పొడుగుకాళ్ల సుందరీ.. తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. డేటింగ్ కోసం ఓ మగాడు కావాలని, అది భారతీయుడు అయితే మరీ మంచిదని అంటోది ఈ పొడుగు కాళ్ల సుందరి. ‘శ్వేత జాతీయులు హాట్‌గా ఉండొచ్చు. కానీ నేను ఇప్పటి వరకు ఏ విదేశీయుడికి అంతగా ఎట్రాక్ట్ కాలేదు. నాకు భారతీయ మగాళ్లు అంటేనే ఇష్టం. దేశీ అయిన వ్యక్తితో నేను డేటింగ్‌కు ఇష్టపడతాను. హిందీ అర్థం చేసుకునే మగాడు అయితే ఒకే. నేను ప్రతిసారి ఇంగ్లీష్‌లో మాట్లాడలేను. ఇంగ్లీష్ పాటలకు డ్యాన్స్ కూడా చేయలేను. నాతో కలిసి పంజాబీ, హిందీ పాటలకు డ్యాన్స్ చేసే భారతీయ మగాడు కావాలి. అలాంటి వ్యక్తితో డేటింగ్ చేయడానికి నేను ఇష్టపడతాను’ అని కృతి సనన్ చెప్పుకొచ్చింది. కాగా, కృతి సనన్ ఇప్పటికే ఓ వ్యక్తితో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. వయసులో తనకంటే 10 ఏళ్లు చిన్నవాడు, క్రికెటర్ ధోనీకి అత్యంత సన్నిహితుడైన కబీర్ బహియాతో ప్రేమాయణం సాగిస్తుందని బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. -
మా డేటింగ్ మొదలైంది అప్పుడే!
‘నువ్వు కావాలయ్యా...’ అంటూ ‘జైలర్’లోని ప్రత్యేక పాటలో తమన్నా చేసిన డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన పాటల్లో ఇదొకటి. కాగా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ అయితే తమన్నాతో దాదాపు ఇలానే అన్నారట. ‘నీతో ఎక్కువ సమయం గడపాలని ఉంది’ అని చెప్పారట విజయ్. గత ఏడాది కొత్త సంవత్సరం పార్టీలో విజయ్, తమన్నా చాలా క్లోజ్‌గా కనిపించడంతో ఇద్దరూ డేటింగ్లో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. పైగా సినిమాల్లో కూడా చేయనంతగా విజయ్ వర్మతో ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్‌లో ముద్దు సన్నివేశాల్లో నటించారు తమన్నా. ఆ సిరీస్‌లో ఇద్దరి కెమిస్ట్రీ ప్రేమలో ఉన్నారేమోననే అభిప్రాయం పలువురికి కలగజేసింది. అయితే అప్పుడు కాదు.. అసలు డేటింగ్ మొదలైంది ఎప్పుడంటే అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు విజయ్ వర్మ, ఆ ఇంటర్వ్యూలో విజయ్ వర్మ మాట్లాడుతూ – ‘‘లస్ట్ స్టోరీస్ 2’ అప్పుడు మేం డేటింగ్లో లేము. ఆ షూటింగ్ మొత్తం పూర్తయ్యాక ‘ర్యాప్అప్ పార్టీ’ ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అది జరగలేదు. దాంతో తమన్నా, నేను, మరో ఇద్దరు పార్టీ చేసుకున్నాం. ఆ పార్టీలోనే ‘నాకు నీతో ఎక్కువ సమయం గడపాలని ఉంది’ అంటూ నా ఫీలింగ్‌ని తమన్నాతో చెప్పాను. ఆ తర్వాత మా ఫస్ట్ డేట్ సెట్ కావడానికి 20, 25 రోజులు పట్టింది’’ అని పేర్కొన్నారు. సో.. ప్రపోజ్ చేసిన 25 రోజులకు విజయ్, తమన్నాల డేటింగ్ మొదలైందన్న మాట. ఇక ఈ ఇద్దరూ పలు సందర్భాల్లో ఒకరంటే మరొకరికి బాగా ఇష్టమన్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి గురించి మాత్రం క్లారిటీ ఇవ్వడంలేదు. -
యానిమల్ హీరోయిన్‌తో డేటింగ్ చేయాలనుంది: నటుడు షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం యానిమల్. రణ్‌బీర్‌కపూర్, రష్మిక జంటగా నటించిన బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పలువురు ప్రముఖుల నుంచి విమర్శలు ఎదురైనప్పటికీ భారీ వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రంలో రష్మిక లీడ్ రోల్లో కనిపించగా.. బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంది. రణ్‌బీర్ కపూర్ ప్రియురాలిగా జోయా పాత్రలో మెప్పించింది. వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు సైతం ఫిదా అయ్యారు. యానిమల్తో త్రిప్తి డిమ్రీకి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకుంది. అయితే ఈ సినిమాలో మరో నటుడు సిద్ధాంత్ కర్నిక్ కీలక పాత్ర పోషించారు. రణబీర్ కపూర్ బావగా వరుణ్ ప్రతాప్ మల్హోత్రా అనే పాత్రను పోషించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సిద్ధాంత్.. త్రిప్తి డిమ్మీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమెతో డేటింగ్ చేయాలనుకుంటున్నట్లు తన మనసులో మాటను సిద్ధాంత్ వెల్లడించారు. రీల్ లైఫ్ నుంచి నిజ జీవితాన్ని వేరుగా చూడాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కాగా.. సిద్ధాంత్ కర్నిక్ యానిమల్తో పాటు మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2, అమయా, తప్పడ్, ఆదిపురుష్ లాంటి చిత్రాల్లో కనిపించారు. మాహి వే, యే హై ఆషికి, ఏక్ థా రాజా ఏక్ థీ రాణి లాంటి సీరియల్స్‌లో నటించారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019