breaking news
-
'ఆ ఒక్క పదం తెచ్చిన తంటా'.. వాళ్లిద్దరిపై మండిపడ్డ హీరోయిన్!
ఇటీవల డార్లింగ్ అనే పదంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేశ్ మధ్య ట్వీట్ వార్ కొనసాగిన సంగతి తెలిసిందే. పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలిస్తే వేధింపులకు కిందకు వస్తుందని నభా పోస్ట్ చేసింది. ప్రియదర్శి సైతం లైట్ తీస్కో డార్లింగ్ అంటూ రిప్లై కూడా ఇచ్చారు. తాజాగా వీరిద్దర మధ్య జరిగిన ఇంటరాక్షన్‌లో మరో హీరోయిన్ ఎంటరైంది. అదేంటో ఓ లుక్కేద్దాం. ప్రియదర్శి, నటి నభానటేశ్ గొడవలోకి నటి రీతూవర్మ ఎంట్రీ ఇచ్చింది. నా కామెంట్స్ సెక్షన్లో మీ పంచాయతీ ఏంటి? అని ఆమె ఇద్దరిని ప్రశ్నించింది. అసలేం జరిగిందంటే.. ఇటీవల కొద్ది రోజుల క్రితం హీరోయిన్ రీతూవర్మ ఓ ఫొటోషూట్‌కు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ పోటోలు చూసిన ప్రియదర్శి స్పందించారు. 'వావ్ రీతూ డార్లింగ్.. ఎంత అందంగా ఉన్నావో. నీ అందానికి ముగ్ధుడనయ్యా. మాటలు రావడం లేదు' అని కామెంట్ చేశారు. అయితే ఇది చూసిన నభా నటేశ్ మళ్లీ స్పందించింది. ఇతను మళ్లీ మొదలుపెట్టాడు.. ఆడవాళ్ల కామెంట్ సెక్షన్‌పై ఉన్నట్టుండి ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కరనీ డార్లింగ్ అని పిలవడమేంటని అసహనం వ్యక్తం చేసింది. నేను ఎవరినైనా డార్లింగ్ అని పిలిస్తే నీకేంటని ప్రియదర్శి బదులిచ్చారు. తాజా సంభాషణపై రీతూవర్మ కూడా రియాక్ట్ కావాల్సి వచ్చింది. నా కామెంట్ సెక్షన్లో మీ ఇద్దరి గొడవ ఏంటని నిలదీసింది. ప్రస్తుతం వీరి గొడవ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి నెటిజన్స్‌కు ఫుల్ ఎంటర్టైనింగ్ ఉన్నప్పటికీ ఇందతా సినిమా ప్రమోషన్స్ కోసమేనని చర్చించుకుంటున్నారు. View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) Ahaa! Do not cross the line! Chuskundham.. https://t.co/8mwOpLC0di — Nabha Natesh (@NabhaNatesh) April 17, 2024 -
ప్రియదర్శికి హీరోయిన్ వార్నింగ్! అంత మాట అనేసిందేంటి!
టాలీవుడ్లో గ్లామర్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నభా నటేశ్. ఆమె ప్రస్తుతం నిఖిల్ సరసన స్వయంభూ చిత్రంలో నటిస్తోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త ఓ కథానాయికగా నటిస్తుండగా.. నభా నటేష్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా నభా నటేశ్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రభాస్ డార్లింగ్ అంటూ చెప్పే డైలాగులతో ఓ వీడియోను పంచుకుంది. ఇది చూసిన ప్రియదర్శి పులికొండ.. వావ్ సూపర్ డార్లింగ్.. కిరాక్ ఉన్నావ్ డార్లింగ్.. అంటూ కామెంట్స్ చేశారు. అయితే ప్రియదర్శి చేసిన కామెంట్స్‌పై నభా నటేశ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మిస్టర్.. ఒకరిని కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త, హద్దులు దాటొద్దు.. అంటూ మండిపడింది. అలాగే పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలిస్తే లైంగిక వేధింపులకు కిందకే వస్తుందని గతంలో కోల్‌కతా హైకోర్టు తీర్పునిచ్చిందంటూ దానికి సంబంధించిన వార్త క్లిప్‌ను నభా నటేశ్ షేర్ చేసింది. ఇది చూసిన ప్రియదర్శి సైతం అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. మీరేమో డార్లింగ్ అని పిలవొచ్చు.. మేము పిలిస్తే ఐపీసీ సెక్షన్ పెడతారా? లైట్ తీస్కో డార్లింగ్ అంటూ పోస్ట్ చేశారు. ఇదంతా కేవలం ఫన్నీ కోసమే చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ వీరిద్దరి మధ్య సంభాషణ మాత్రం నెట్టింట హల్చల్ చేస్తోంది. కాగా.. ప్రియదర్శి ఇటీవల సేవ్ ది టైగర్స్-2 సీజన్‌తో ప్రేక్షకులను అలరించారు. Ohoo! Why this Kolaveri 😉🙃 https://t.co/r7DZYWTCtB — Priyadarshi Pulikonda (@PriyadarshiPN) April 17, 2024 WOW Superrrrrr 🤩 Darlinggggg 😍 Kirrrraakkk Unnav Darling😘🤌🏼 https://t.co/fIYSCaCfYo — Priyadarshi Pulikonda (@PriyadarshiPN) April 17, 2024 -
Calcutta High Court: వారిని డార్లింగ్ అనడం లైంగిక వేధింపే
కోల్‌కతా: ఫూటుగా తాగి మహిళా కానిస్టేబుల్‌ను డార్లింగ్ అని పిలిచిన ఓ వ్యక్తిని దోషిగా తేలుస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు వెలువరిచింది. పరిచయం లేని మహిళను అలా పిలవడడాన్ని ‘లైంగిక వేధింపు నేరం’గా పరిగణిస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ సందర్భంగా ఇదే కేసులో గతంలో కింది కోర్టు ఇచి్చన తీర్పును హైకోర్టు సమర్థించింది. భారతీయ శిక్షాస్మృతిలోని 354ఏ (మహిళా గౌరవాన్ని భంగపరచడం), 509 సెక్షన్ల కింద అతడిని దోషిగా తేలి్చంది. మహిళా కానిస్టేబుల్‌ను మద్యం మత్తులో డార్లింగ్ అని పిలిచిన జనక్ రామ్ అనే వ్యక్తికి గతంలో పడిన శిక్షను సమరి్థస్తూ జస్టిస్ జై సేన్ గుప్తా నేతృత్వంలోని ఏకసభ్య హైకోర్టు ధర్మాసనం తాజా తీర్పును వెలువరిచింది. ‘‘ పరిచయంలేని మహిళను తాగిన/తాగని వ్యక్తి నడి వీధిలో డార్లింగ్ అనే పిలిచే ధోరణి భారతీయ సమాజంలో లేదు. నిందితుడు మద్యం మత్తులో ఉంటే అప్పుడు నేరాన్ని మరింత తీవ్రమైనదిగా పరిగణిస్తాం’ అని జడ్జి వ్యాఖ్యానించారు. అండమాన్ నికోబార్ ద్వీపంలోని మాయాబందర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జనాన్ని అదుపు చేస్తున్న మహిళా కానిస్టేబుల్‌ను ‘చలాన్ వేయడానికి వచ్చావా డార్లింగ్?’ అంటూ జనక్‌రామ్ వేధించాడు. -
Prabhas: ‘డార్లింగ్’ వెనుక ఇంత సీక్రెట్ ఉందా?
ప్రభాస్... ఈ పేరు వింటే చాలు.. ఆరడుగుల అందగాడు కళ్లముందు కదులుతాడు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ‘ఏక్ నిరంజన్’లా దూసుకెళ్తున్న ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’ ప్రభాస్. మాస్ ఆడియన్స్‌కు ఆయన ‘రెబల్’. క్లాస్ ఆడియన్స్‌కు ‘డార్లింగ్’.వెండితెరకు ‘బాహుబలి’. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభాస్ చరిత్ర చాలానే ఉంటుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్.. టాలీవుడ్‌కి మాత్రం ఎప్పుడూ ‘డార్లింగే’. తెలుగు ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రముఖులంతా ఆయనను ముద్దుగా ‘డార్లింగ్’అని పిలుస్తుంటారు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే. ఈ సందర్భంగా ‘డార్లింగ్’ పేరు వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. బుజ్జిగాడు సినిమా తర్వాత అందరూ ప్రభాస్‌ని ‘డార్లింగ్’అని పిలవడం స్టార్ చేశారు. ఆ సినిమా ప్రభాస్ డార్లింగ్ ఊతపదం వాడుతాడు. ప్రభాస్ నోటి నుంచి వచ్చిన ఆ పదం.. ఫ్యాన్స్ తెగ నచ్చేసింది. దీంతో ప్రభాస్‌కు ‘డార్లింగ్’అనే నిక్ నేమ్‌ని ఇచ్చేశారు ఫ్యాన్స్. ఈ పేరు తెగ పాపులర్ కావడంతో ప్రభాస్ తరువాతి సినిమాకు ఏకంగా ‘డార్లింగ్’అనే పేరే పెట్టేశారు. అది కూడా సూపర్ హిట్ అయింది. దీంతో ప్రభాస్‌కు డార్లింగ్ అనే పేరు ఫిక్సయిపోయింది. అయితే అందరికి తెలియని విషయం ఏంటంటే.. సినిమాల్లోనే కాదు.. నిజంగా ప్రభాస్ ఊతపదం ‘డార్లింగ్’. బుజ్జిగాడు సినిమాలో నటించకముందు నుంచే తన ఫ్రెండ్స్‌ను ప్రభాస్ డార్లింగ్ అని పిలిచేవాడంట. అయితే ఈ విషయం డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కి తెలియదట. ఒకసారి బుజ్జిగాడు సినిమా సెట్స్‌లో ప్రభాస్ పూరిని డార్లింగ్ అని పిలిచేశాడట. అది నచ్చడంతో సినిమాలో ఆ ఊతపదాన్ని వాడేసినినట్లు పూరి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘బుజ్జిగాడు సినిమా సెట్స్‌లో ప్రభాస్ నన్ను డార్లింగ్ అని పిలిచేవాడు. నన్ను మాత్రమే అలా పిలుస్తున్నాడేమో అని చాలా సంతోషపడ్డా. కానీ వేరేవాళ్లను కూడా ప్రభాస్ డార్లింగ్ అని పిలవడం చూశా. అప్పుడు డార్లింగ్ అనేది ప్రభాస్ ఊతపదం అని నాకు అర్థమైంది’అని పూరి ఓ ఇంటర్యూలో చెప్పాడు. ఈ విషయాన్ని ప్రభాస్ కూడా స్వయంగా ఒప్పుకున్నాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్ ప్రస్తుతం ఓంరౌత్‌తో కలిసి ఆదిపురుష్ , ‘కేజీఎఫ్’ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్, చేస్తున్నాడు. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా, మారుతి దర్శత్వంలోనూ ప్రభాస్ సినిమాలు చేస్తున్నాడు. -
ప్రభాస్ కోసం ఆయన ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
Happy Birthday Prabhas: ప్రభాస్.. నాట్స్ జస్ట్ ఏ నేమ్.. ఇట్స్ ఏ బ్రాండ్ అంటారు డార్లింగ్ ఫ్యాన్స్. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ ప్రభాస్‌కు అభిమానులున్నారు.బాహుబలి సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్‌కు విదేశాల్లోనూ విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమాలు సలార్, ప్రాజెక్ట్ కేల నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.మరోవైపు ప్రభాస్ నటించిన క్రేజీ సినిమా బిల్లా 4కెలో బర్త్‌డే సందర్భంగా రీ రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో నేడు(అక్టోబర్23)న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఆయన వరల్డ్ వైడ్ క్రేజీ ఫ్యాన్స్‌పై ఓ లుక్కేద్దాం. బాహుబలి సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి పాపులారిటీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్లాక్ బస్టర్ రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. ఇక బాహుబలి, భల్లాలదేవ, కట్టప్ప, శివగామి పాత్రలు జనాల మదిలో ఎప్పటికీ నిలిచిపోయేంత క్రేజ్‌ను దక్కించుకున్నాయి. దీన్ని కొన్ని హోటల్స్ తమ ప్రమోషన్స్‌కి ఇప్పటికీ వాడుకుంటున్నాయి. ఇందులో భాగంగానే బాహుబలి థాలీ, దేవసేన పరాఠా, కట్టప బిర్యానీ, భల్లదేవ పాటియాలా లస్సీ, శివగామి షాహి పక్వాన్ వంటి స్పెషల్ వంటకాలను తమ మెనూలో చేర్చారు. ఇప్పటికీ బాహుబలి థాలీకి మంచి డిమాండ్ ఉంది. ప్రభాస్ మిర్చిలాంటి కుర్రాడు. సరిగ్గా ఇదే పాయింట్‌ను తమ బిజినెస్ ప్రమోషన్‌కు వాడేసింది జపాన్‌లోని ఓ హోటల్. అక్కడ దొరికే ఓ స్పైసీ డిష్ ప్యాకేజింగ్‌లో ప్రభాస్ ఫోటోను అతికించి తమ బిజినెస్‌కు ప్రమోట్ చేసుకున్నారు. జపాన్‌లో ప్రభాస్‌కు క్రేజీ ఫ్యాన్స్ ఉండటంతో దీనికోసం అక్కడి ప్రజలు ఎగబడ్డారు. ప్రభాస్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు ఓ ఫ్యాన్ ఏకంగా తన వీపుపై బాహుబలి టాటూను వేయించుకున్నారు. ఈ టాటూ ఫోటో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆరడుగుల అందగాడు ప్రభాస్‌కు అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. రష్యన్‌కు చెందిన ఓ లేడీ ఫ్యాన్ లవ్ ప్రభాస్ అంటూ తన వీపుపై టాటూ వేయించుకుంది. మరికొందరు అమ్మాయిలేమో ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటూ ఇప్పటికీ రిక్వెస్టులు పెడుతూనే ఉంటారు. మరి ఈ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చూడాలి. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలికి పెద్ద వాళ్ల నుంచి చిన్నపిల్లల దాకా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందుకే కొన్ని టాయ్స్ కంపెనీలు బాహుబలి బొమ్మలను రూపొందించి బాగా లాభాపడ్డాయి.ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జపాన్‌లో డార్లింగ్‌కు క్రేజీ గర్ల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఓసారి జపాన్ లేడీ ఫ్యాన్స్ అంతా కేవలం ప్రభాస్‌ను కలవడానికే ఇండియాకు వచ్చారు. స్వయంగా ఆయన ఇంటి ముందు కూడా కొన్ని ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో సలార్, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ కే చిత్రాల్లో నటిస్తున్నాడు. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా, మారుతి దర్శకత్వంలోనూ ప్రభాస్ సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా అప్డేట్స్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019