breaking news
-
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మరో 14 రోజులపాటు పొడిగిస్తూ మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశా రు. మరోవైపు, బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీ వాదనలు వినిపించింది. కుంభకోణంలో కవిత పాత్రను ధర్మాసనానికి వివ రించింది. కవితను అధికారులు వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకీభవించారు. మే 7న ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి విచారణ బుధవారానికి వాయిదా వేశారు. సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పాం.. ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్‌టేకింగ్ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. ఈడీ పరిధి దేశమంతా ఉంటుందని, అందుకే కవిత అరెస్టు విషయంలో ట్రాన్సిట్ ఆర్డర్ అవసరం రాలేదన్నారు. అరెస్టు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఉపసంహరణే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ కేసులో పలువురి వాంగ్మూలాల ఆధారంగానే కవిత పాత్రపై స్పష్టత వచ్చిదని ఆ తర్వాతే అరెస్టు చేశామన్నారు. అరుణ్ పిళ్లై ద్వారా వాటా కలిగి ఉన్నారు.. ఇండో స్పిరిట్స్‌లో 33.5 శాతం వాటాను తన ప్రాక్సీ అరుణ్ పిళ్లై ద్వారా కవిత కలిగి ఉన్నారని జొహెబ్ హొస్సేన్ చెప్పారు. హోల్‌సేలర్లకు కమీషన్లు పెంచుతూ మద్యం విధానంలో మార్పులు చేసి సౌత్‌గ్రూప్‌నకు అనుకూలంగా మారేలా ఒప్పందం జరిగిందని, కుంభకోణంలో రూ.100 కోట్లు లావాదేవాలు జరిగాయన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆమె ఆదేశాల మేరకే రూ.25 కోట్లు ఇచ్చారని, ఈ మేరకు వారిద్దరూ వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఆప్ నేత కేజ్రీవాల్, కవిత మధ్య కుదరిన ఒప్పందం మేరకే రూ.100 కోట్లు ఆమ్ ఆద్మీ పారీ్టకి ఇచ్చారని మరో నిందితుడు దినేష్ ఆరోరా తన వాంగ్మూలంలో చెప్పారన్నారు. నగదు లావాదేవీలకు సంబంధించి కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ చాట్లోనూ సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. ఆర్థిక నేరాల్లో నగదుకు సంబంధించి ఆధారాలు దొరకడం చాలా కష్టమన్నారు. నిందితుల వాంగ్మూలాలు, సాక్ష్యాల ఆధారంగా కోర్టులు తీర్పులిచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో సూత్రధారి, పాత్రధారి అయిన కవితకు సంబంధించి పలు సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు. -
ఆమే సూత్రధారి.. పాత్రధారి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకానొక సమయంలో బెదిరింపులకు కూడా పాల్పడ్డారంటూ సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన శరత్‌చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డిలను కవిత భయపెట్టినట్లు కోర్టుకు తెలిపింది. కుంభకోణంలో కవితను సూత్రధారి, పాత్రధారిగా పేర్కొంది. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కవితను ఐదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మూడు రోజులపాటు కవితను సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు తిరిగి కవితను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. విజయ్నాయర్కు హవాలా రూపంలో డబ్బులు లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ కేసులో తీహార్ జైలులో ఉన్న కవితను శుక్రవారం అధికారులు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఐదు రోజుల పాటు కవిత కస్టడీ కోరుతూ సీబీఐ, సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను న్యాయమూర్తి విచారించారు. ఈడీ తరఫు న్యాయవాది పంకజ్ వాదనలు వినిపిస్తూ.. ‘లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన దర్యాప్తులో అనేక సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి. ఈ కేసులో ఒక నిందితుడైన విజయ్ నాయర్ (కేజ్రీవాల్ అనుచరుడు)కు రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు మరో నిందితుడైన దినేష్ అరోరా ద్వారా హవాలా రూపంలో చెల్లించారు. ఈ నేరపూరిత కుట్రకు అనుగుణంగా ఇండో స్పిరిట్స్‌లో 65 శాతం వాటా, రూ.29.29 కోట్లను సౌత్‌గ్రూపులోని నిందితులకు బదిలీ చేశారు. గోవా ఎన్నికల సమయంలో ఆప్ ఎన్నికల ప్రచారం నిమిత్తం రూ.44.45 కోట్లు వినియోగించారు. కవిత మాజీ ఆడిటర్ బుచి్చబాబు ఫోన్ వాట్సాప్ చాట్లు, భూ కొనుగోలు ముసుగులో సొమ్ము లావాదేవీలు బహిర్గతం అయ్యాయి. ఆమ్ ఆద్మీ పారీ్టకి రూ.100 కోట్లు వసూలు చేసి ఇవ్వడానికి పన్నిన నేరపూరిత కుట్రలో కల్వకుంట్ల కవిత కీలక పాత్రధారిగా ఉన్నట్లు సదరు భూ కొనుగోలు డీల్ ద్వారా వెల్లడైంది..’అని చెప్పారు. కవితతో మద్యం వ్యాపారి భేటీ దక్షిణాదికి చెందిన ఓ మద్యం వ్యాపారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారని వెల్లడైంది. ఢిల్లీలో మద్యం వ్యాపారం చేయడానికి తనకు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రిని వ్యాపారి కోరగా.. ఎమ్మెల్సీ కవిత సంప్రదిస్తారని కేజ్రీవాల్ చెప్పినట్లు వెలుగులోకి వచ్చింది. తర్వాత సదరు వ్యాపారి కవితతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే ఆమ్ ఆద్మీ పారీ్టకి రూ.100 కోట్లు సమకూర్చాల్సి ఉందని, దాంట్లో రూ.50 కోట్లు సదరు వ్యాపారి అందజేయాల్సి ఉంటుందని, తద్వారా మీరు వ్యాపార భాగస్వామి అవుతారని కవిత ఆయనకు తెలిపారు. అనంతరం బుచి్చబాబు డిమాండ్ మేరకు తన కుమారుడి ద్వారా కవిత అనుచరులకు రూ.25 కోట్లు వ్యాపారి చెల్లించారు. ఈ చెల్లింపులకు గానూ వ్యాపారి కుమారుడికి ఇండో స్పిరిట్స్‌లో 32.5 శాతం వాటా దక్కింది. విజయ్నాయర్కు రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్లు చెల్లించినట్లుగా మరో నిందితుడు అభిషేక్ బోయినపల్లి తనకు చెప్పాడని అప్రూవర్ దినేష్ అరోరా తన వాంగ్మూలంలో వెల్లడించాడు. అభిõÙక్ బోయినపల్లి ఆదేశాల మేరకు హవాలా మార్గంలో గోవాకు భారీగా నగదు బదిలీ చేసినట్లు అప్పటి కవిత పీఏ అశోక్ కౌశిక్ చెప్పాడు. కౌశిక్ ద్వారా రూ.25 కోట్లు బదిలీ అయినట్లు రికార్డులు నిర్ధారించాయి. ఇండో స్పిరిట్స్‌లో తన ప్రాక్సీ అరుణ్ పిళై ద్వారా కవిత భాగస్వామ్యం కలిగి ఉన్నట్టు బుచ్చిబాబు ఫోను ద్వారా వెల్లడైంది..’అని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. భూ కొనుగోలు డీల్ ముసుగులో రూ.14 కోట్లు! భూ కొనుగోలు డీల్ ముసుగులో శరత్‌చంద్రారెడ్డికి చెందిన సంస్థల ఖాతాల నుంచి కల్వకుంట్ల కవితకు రూ.14 కోట్లు చేరాయి. నగదు బదిలీ ఒప్పందం అయితే జరిగింది కానీ అసలు భూమి బదిలీ కాలేదు. డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించడానికి శరత్‌చంద్రారెడ్డి ఆసక్తి చూపకపోవడంతో ఢిల్లీ, తెలంగాణలో వ్యాపారాలు దెబ్బతీస్తానని కవిత బెదిరించినట్లు వెల్లడైంది. పలువురు స్టేట్మెంట్ల ఆధారంగా కేసులో ప్రధాన కుట్రదారుల్లో కవిత ఒకరిగా తేలింది. దీంతో ఆమెను నిందితురాలిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తదనంతర పరిణామాల్లో కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. తర్వాత కోర్టు అనుమతితో కవితను ఈ నెల 6న తీహార్ జైలులో విచారించాం. కుంభకోణంలో తన పాత్ర గురించి అడిగిన ప్రశ్నలకు ఆమె సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదు. ఐదు రోజులు కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి..’అని పంకజ్ చెప్పారు. న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారు: కవిత న్యాయవాది కవిత అరెస్టు విషయంలో న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారని కవిత తరఫు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు. ఇప్పటికే కస్టడీలో ఉన్న కవితను అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సాక్షుల వాంగ్మూలాలు, ఇతరత్రా రూపంలో ఇప్పటికే తమ వద్ద ఉన్న అంశాలతో అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థ చూపిన కస్టడీ కారణాలు చట్ట విరుద్ధంగా ఉన్నాయన్నారు. కవిత విషయంలో ప్రాథమిక హక్కులు ఉల్లంఘించిన నేపథ్యంలో సీబీఐ పిటిషన్ కొట్టివేయాలని కోరారు. కవిత పిటిషన్ కొట్టివేత ఇరు పక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి కావేరి బవేజా.. తొలుత సీబీఐ పిటిషన్లో తీర్పు రిజర్వు చేశారు. మధ్యాహ్నం కవిత దాఖలు చేసిన సవాల్ పిటిషన్‌ను విచారించారు. కవిత పిటిషన్‌ను కొట్టివేస్తూ 22 పేజీలతో కూడిన ఆదేశాలు జారీ చేశారు. ‘వాస్తవాలు, కేసు పరిస్థితులు, వాదనలు పరిశీలించాక కవితను ఈ నెల 15 వరకూ సీబీఐ కస్టడీకి అనుమతిస్తున్నా. సీబీఐ అరెస్టును రద్దు చేయాలని కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నా. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సీసీ టీవీ పర్యవేక్షణలో కవితను విచారించాలి. ప్రతిరోజూ సాయంత్రం 6– 7 గంటల మధ్య అరగంట సేపు తన న్యాయవాది మోహిత్‌రావుతో మాట్లాడే అవకాశం కవితకు ఇవ్వాలి. భర్త అనిల్‌కుమార్, సోదరుడు కల్వకుంట్ల తారక రామారావు, పీఏ శరత్‌చంద్రలు ఆ సమయంలోనే 15 నిమిషాలు మాట్లాడొచ్చు. నిందితురాలికి ఇంటి భోజనం, జపమాల, దుస్తులు, మేట్రస్, బెడ్ షీట్లు, తువ్వాళ్లు, దిండులను సీబీఐ అధికారులు అనుమతించాలి. ఆమె కోరిన పుస్తకాలు అనుమతించాలి..’అని న్యాయమూర్తి తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. -
‘ఆమ్ ఆద్మీ’ని అంతం చేసే కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దోపిడీ రాకెట్ నడుపుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. అవినీతి అనే పొగతో కప్పేసి ఆప్‌ను అవినీతి పార్టీగా చిత్రీకరించి, అంతమొందించడం ఈడీ లక్ష్యాల్లో ఒకటని చెప్పారు. తాను ఈడీ దర్యాప్తును వ్యతిరేకించడం లేదని అన్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తనను ఈడీ కస్టడీలో ఉంచుకోవచ్చని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఏడు రోజుల కస్టడీ ముగియడంతో సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు గురువారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపర్చారు. తొలుత ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు, న్యాయవాది జొహెబ్హుస్సేన్ వాదనలు వినిపించారు. మద్యం కుంభకోణం కేసులో స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ఇతరత్రా డేటాను పరిశీలించాల్సి ఉందని ధర్మాసనానికి రాజు తెలియజేశారు. ఇతర నిందితులతో కలిపి కేజ్రీవాల్‌ను విచారించాల్సి ఉందన్నారు. గోవా నుంచి సమన్లు అందుకొన్న కొందరితో కలిపి కేజ్రీవాల్‌ను విచారించాలన్నారు. లిక్కర్ కేసులో దర్యాప్తునకు కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా సహకరించడం లేదని ఆరోపించారు. మరో ఏడు రోజులపాటు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి అనుమతించాలని న్యాయమూర్తిని కోరారు. అనంతరం స్వయంగా వాదనలు వినిపించుకోవడానికి కేజ్రీవాల్‌కు అవకాశం ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది గుప్తా కోరగా, న్యాయమూర్తి అనుమతించారు. కేజ్రీవాల్ తన వాదనలు హిందీలో కొనసాగించారు. 2022లో సీబీఐ కేసు నమోదైందని, తనని ఎవరూ అరెస్టు చేయలేదని, ఏ కోర్టు కూడా తనను దోషిగా గుర్తించడం గానీ లేదా ఆరోపణలు చేయడం గానీ జరగలేదని స్పష్టం చేశారు. ట్రాప్ చేయడమే ఈడీ అసలు ఉద్దేశం ఈ కేసులో సీబీఐ ఇప్పటిదాకా 31,000 పేజీలను కోర్టులో ఫైల్ చేసిందని, 294 మంది సాకు‡్ష్యలను విచారించిందని, ఈడీ 162 మందిని విచారించిందని, 25,000 పేజీల రిపోర్టును ఫైల్ చేసిందని చెప్పారు. తన పేరు కేవలం 4 స్టేట్‌మెంట్లలోనే ఉందని తెలిపారు. తననెందుకు అరెస్టు చేశారో చెప్పాలన్నారు. అయితే, ఈ వివరాలన్నీ అఫిడవిట్ రూపంలో ఇస్తే రికార్డుల్లో చేరుస్తానని న్యాయమూర్తి సూచించారు. దీంతో, తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కేజ్రీవాల్ అభ్యర్ధించారు. తాను ముఖ్యమంత్రినని, తన నివాసానికి మంత్రులు వస్తుంటారని, గుసగుసలాడుతుంటారని, దీని ఆధారంగా సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. దీనిపై ఎస్.వి.రాజు అభ్యంతరం వ్యక్తం చేయగా... ‘‘రాజు గారు, మీ ఆశీర్వాదం నాకు కావాలి. నన్ను మాట్లాడనివ్వండి’’ అని కేజ్రీవాల్ కోరారు. ఐదు నిమిషాలు మాత్రమే సమయం ఇవ్వగలనని న్యాయమూర్తి చెప్పడంతో కేజ్రీవాల్ తన వాదనలు కొనసాగించారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరును ప్రస్తావించారు. తనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చే వరకూ అతడి నుంచి స్టేట్మెంట్లు తీసుకుంటూనే ఉన్నారని, దీన్నిబట్టి తనని ట్రాప్ చేయడమే ఈడీ అసలు ఉద్దేశమని అర్థమవుతోందని చెప్పారు. కొంతమంది నిందితులు అప్రూవర్లుగా మారిన అనంతరం ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. మాగుంట రాఘవ ఇచ్చిన స్టేట్మెంట్లను ప్రస్తావిస్తూ... ఆయన ఐదు స్టేట్మెంట్లు ఇచ్చారని తెలియజేశారు. ఈడీ ఏం చెబితే అదే వాంగ్మూలంగా ఇచ్చారని అన్నారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి స్టేట్మెంట్ మార్చుకోగానే ఆయన కుమారుడు మాగుంట రాఘవ బెయిలు పొందారని కేజ్రీవాల్ ఆరోపించారు. స్టేట్మెంట్లలో రాఘవ చెప్పింది ఏదీ కూడా ఈడీ రికార్డుల్లోకి తీసుకోలేదని ఆరోపించారు. ఈడీ కార్యాలయంలో లక్ష పేజీలు ఉన్నప్పటికీ, తనకు అనుకూలంగా ఉన్న ఒక్క అంశాన్ని కూడా రికార్డుల్లోకి తీసుకోలేదన్నారు. రూ.100 కోట్ల కుంభకోణం అంటున్నారని, అయితే ఆ సొమ్ము ఎక్కడా లేదని చెప్పారు. ఈడీ దర్యాప్తు తర్వాతే మద్యం కుంభకోణం అనేది మొదలైందని విమర్శించారు. ఈడీ అంతిమ లక్ష్యం ఆమ్ ఆద్మీ పార్టీని అంతమొందించడమేనని పేర్కొన్నారు. దీనిపై ఈడీ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తంచేశారు. దర్యాప్తు సంస్థలపై ఆరోపణలు చేయడం తగదన్నారు. నా వద్ద ఆధారాలున్నాయి బీజేపీకి శరత్‌చంద్రారెడ్డి రూ.55 కోట్లు విరాళంగా ఇచ్చారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ రాకెట్ నడుస్తోందనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. ఈడీ తనని ఎన్నిరోజులు రిమాండ్‌లో ఉంచుకున్నా అభ్యంతరం లేదన్నారు. ఈడీపై పదేపదే అవే విమర్శలు చేయడం ద్వారా ప్రజల మద్దతు కూడకట్టుకోవాలని కేజ్రీవాల్ ప్రయతి్నస్తున్నారని ఎస్.వి.రాజు ధర్మాసనానికి తెలిపారు. ఈడీ కార్యాలయంలో తనకు అనుకూలంగా పేజీలు ఉన్నాయని కేజ్రీవాల్ ఎలా భావిస్తున్నారు? ఇదంతా ఊహాజనితం అని అన్నారు. లంచం ద్వారా వచ్చిన సొమ్ములు గోవా ఎన్నికల్లో కేజ్రీవాల్ వినియోగించారని తెలిపారు. ఈ సొమ్మంతా హవాలా రూపంలో సౌత్ గ్రూపు నుంచి వచ్చిందేనని, అదంతా ఒక చైన్ లాంటిదని, అందుకే దాని గురించి కేజ్రీవాల్ మాట్లాడడం లేదని తెలిపారు. బీజేపీకి శరత్‌చంద్రారెడ్డి విరాళం ఆరోపణలపై రాజు బదులిస్తూ... దీనికి, మద్యం కుంభకోణానికి సంబంధం లేదన్నారు. ఎందుకంటే ఢిల్లీలో మద్యం విధానాన్ని రూపొందించే హక్కు బీజేపీకి లేదన్నారు. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన వెంటనే క్లీన్చిట్ రాదని, దర్యాప్తును ఎదుర్కోవాలని,సామాన్యుడికి, సీఎంకు అరెస్టు విషయంలో తేడా ఉండదని రాజు పేర్కొన్నారు. మద్యం కుంభకోణం కేసులో ప్రశ్నించడానికి కేజ్రీవాల్‌కు మరో వారం రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగించాలని కోరారు. అనంతరం, రాజు వాదనలకు తాను స్పందించవచ్చా? అని కేజ్రీవాల్ తరపు న్యాయవాది గుప్తా కోరగా.. ఇప్పటివరకూ స్పందించారుగా ఇక అప్రస్తుతం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇది అప్రస్తుతం, అసందర్భం అని ఎలా అంటారని గుప్తా ప్రశ్నించగా... గట్టిగా మాట్లాడొద్దని హెచ్చరిస్తూ అందరి వాదనలు విన్నానని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 4 రోజులపాటు ఈడీ కస్టడీకి మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ ఈడీ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు మరో 4 రోజులపాటు పొడిగించింది. ఆయనను ఏప్రిల్ 1న ఉదయం 11 గంటల్లోగా తమ ఎదుట హాజరుపర్చాలని ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ఈడీ అధికారులను ఆదేశించారు. కేజ్రీవాల్‌ను ఏడు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా, న్యాయమూర్తి నిరాకరించారు. కేవలం 4 రోజలుపాటు కస్టడీకి అనుమతించారు. గత ఐదు రోజులపాటు కేజ్రీవాల్‌ను ప్రశ్నించామని, తప్పించుకొనేలా ఆయన సమాధానాలిచ్చారని రిమాండ్ పిటిషన్లో ఈడీ వెల్లడించింది. -
తీహార్ జైలా ?..కస్టడీ పొడిగింపా ?
-
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
Updates ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు మరో నాలుగు రోజులు ఈడీ కస్టడీ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు ఏడు రోజులు ఈడీ కోరినా నాలుగు రోజులే కస్టడీ పొడిగింపు. ఏప్రిల్ 1 వరకు కస్టడీలోనే కేజ్రీవాల్ సీబీఐ స్పెషల్ కోర్టులో ముగిసిన వాదనలు. కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై తీర్పు రిజర్వు. తీర్పును రిజర్వు చేసిన రౌస్ ఎవెన్యూ కోర్టు. మరో ఏడు రోజులపాటు కస్టడీ పొడిగించాలని కోరిన ఈడీ గోవా ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లతో కలిపి కేజ్రీవాల్‌ను విచారించాలన్న దర్యాప్తు సంస్థ నన్ను అరెస్టు చేయడమే ఈడీ లక్ష్యం : కేజ్రీవాల్ నిందితుడితో బలవంతంగా నా పేరు చెప్పించారు. నిందితుడు 55 కోట్ల రూపాయల ఎలక్ట్రోరల్ బాండ్స్ బీజేపీకి ఇచ్చారు. ఏ కోర్టు నన్ను దోషిగా పరిగణించలేదు. నా అరెస్టుకు తగిన ఆధారాలు లేవు. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి పార్టీ అని చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. నా పార్టీని నిర్మూలించాలనుకుంటున్నారు. నా పేరు కేవలం నాలుగు సార్లు ప్రస్తావనకు వచ్చింది. ఈడీ వాదనలు: ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ 100 కోట్ల లంచం తీసుకున్నారు. ఆయన విచారణకు సహకరించడం లేదు. ఈడీకి అరెస్టు చేసే హక్కు ఉంది. శరత్ చంద్రారెడ్డి 50 కోట్ల రూపాయలు ఎలక్ట్రోలు బాండ్స్ రూపంలో బీజేపీకి ఇచ్చిన నిధులకు ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధం లేదు. ఇది క్విడ్ ప్రోకో కిందికి రాదు. ఆమ్ ఆద్మీ పార్టీ హవాలా డబ్బు ద్వారా గోవా ఎన్నికల్లో ఖర్చు చేసిన వివరాలు మా దగ్గర ఉన్నాయి. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మా వద్ద ఉన్నాయి కోర్టుకు తీసుకు వెళ్లే సమయంలో కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు నా అరెస్ట్ రాజకీయ కుట్ర ఢిల్లీ ప్రజలే గట్టిగా సమాధానం చెబుతారు రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను హాజరుపర్చిన ఈడీ ఢిల్లీ: సీబీఐ స్పెషల్ కోర్టు ముందు కేజ్రీవాల్‌ను ప్రవేశపెట్టిన ఈడీ మరో వారం రోజులపాటు కస్టడీ పొడిగించాలని కోరే అవకాశం కోర్టుకు చేరుకున్న కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు విధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో గురువారం కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపర్చనుంది. ఈడీ కస్టడీ పొడిగింపు కోరుతుందా? లేదంటే రిమాండ్‌కు తరలించాలని కోర్టు ఆదేశిస్తుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ అభియోగాలపై కేజ్రీవాల్‌ను మార్చి 21 ఆయన నివాసంలో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరుసటి రోజు ఆయన్ను ఈడీ రౌస్ అవెన్యూ కోర్టుకు హజరుపరిచి కస్టడీకి కోరింది. దీంతో కోర్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. కస్టడీ ముగియడంతో ఇవాళ కోర్టులో హాజరుపర్చనుంది ఈడీ. ఒకవేళ కస్టడీ పొడగింపునకు కోర్టు అంగీకరించకపోతే మాత్రం ఆయన్ని తీహార్ జైలుకు తరలిస్తారు మరోవైపు తనను ఈడీ చేసిన అరెస్ట్ అక్రమమంటూ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఆయనకు ఊరట లభించలేదు. కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కోరుతూ ఈడీకీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఏప్రిల్ 2లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా తీహార్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019