breaking news
-
అమెరికా జట్టులో కోరీ అండర్సన్
న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ కోరీ అండర్సన్ ఇకపై అంతర్జాతీయ క్రికెట్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. కివీస్ తరఫున 13 టెస్టులు, 49 వన్డేలు, 31 టి20లు ఆడిన అండర్సన్ ఆఖరిసారిగా 2018లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 2014లో వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (36 బంతుల్లో)తో వెలుగులోకి వచ్చిన అతను ఆ తర్వాత 2015లో వరల్డ్ కప్ ఫైనల్ చేరిన కివీస్ జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. కెనడాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ కోసం ప్రకటించిన అమెరికా టీమ్‌లో అండర్సన్‌కు చోటు దక్కింది. అయితే ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లి అక్కడి మైనర్ లీగ్‌లో భారీగా పరుగులు సాధించినా...భారత అండర్–19 విజేత జట్టు కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌కు మాత్రం జట్టులో స్థానం లభించలేదు. మరో వైపు భారత దేశవాళీ క్రికెట్లో రాణించిన హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, సౌరభ్ నేత్రావల్కర్లు కూడా టీమ్‌లో అవకాశం దక్కించుకున్నారు. -
సొంత దేశాన్ని వీడి యూఎస్ఏకు ఆడనున్న ఫాస్టెస్ట్ సెంచరీ హీరో
వన్డేల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ (36 బంతుల్లో) సెంచరీ వీరుడు, న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ కోరె ఆండర్సన్ సొంత దేశాన్ని వీడి అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న యూఎస్ఏకు ఆడేందుకు సిద్దమయ్యాడు. త్వరలో కెనడాతో జరుగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం యూఎస్ఏ సెలెక్టర్లు ఆండర్సన్ ఎంపిక చేశారు. 2018 నవంబర్‌లో చివరిసారిగా న్యూజిలాండ్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆండర్సన్.. వ్యక్తిగత కారణాల చేత 2020లో యూఎస్ఏకు షిఫ్ట్ అయ్యాడు. అప్పటి నుంచి అక్కడే దేశవాలీ క్రికెట్ (మైనర్ లీగ్ క్రికెట్) ఆడుతూ ఐదేళ్ల నిరీక్షణ అనంతరం జాతీయ జట్టుకు ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. లోకల్ కేటగిరీలో మేజర్ లీగ్ క్రికెట్ ఆడే అవకాశం దక్కించుకున్న ఆండర్సన్.. ముంబై ఇండియన్స్ న్యూయార్క్ తరఫున మెరుగైన ప్రదర్శనలు చేశాడు. కెనడా సిరీస్ కోసం ఆండర్సన్‌తో పాటు మరికొందరు నాన్ ఆటగాళ్లు కూడా ఎంపికయ్యారు. భారత అండర్-19 ఫేమ్ హర్మీత్ సింగ్ యూఎస్ఏ దేశవాలీ టోర్నీలతో పాటు మేజర్ లీగ్ క్రికెట్లో సియాటిల్ ఆర్కాస్ తరఫున రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. హర్మీత్‌తో పాటు మరో భారత క్రికెటర్ కూడా యూఎస్ఏ జట్టుకు ఎంపికయ్యాడు. ఢిల్లీ మాజీ ఆటగాడు, ఐపీఎల్లో ఆర్సీబీ ప్లేయర్ మిలింద్ కుమార్ అక్కడి దేశవాలీ క్రికెట్లో సత్తా చాటి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. వీరితో పాటు కెనడా జాతీయ జట్టు మాజీ కెప్టెన్, భారత మూలాలున్న నితీశ్ కుమార్ కూడా యూఎస్ఏ జట్టుకు ఎంపికైన వారిలో ఉన్నారు. తాజాగా ప్రకటించిన యూఎస్ఏ జట్టులో భారత అండర్-19 మాజీ క్రికెటర్, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ బ్యాటర్ ఉన్ముక్త్ చంద్‌కు చోటు దక్కలేదు. ఉన్ముక్త్‌కు నితీశ్ కుమార్ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. అంతిమంగా సెలెక్టరు నితీశ్పైపే మొగ్గు చూపారు. కెనడా సిరీస్ కోసం ఎంపిక చేసిన యూఎస్ఏ జట్టు: మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్), కోరె అండర్సన్, గజానంద్ సింగ్, జెస్సీ సింగ్, సౌరభ్ నేత్రావల్కర్, నిసర్గ్ పటేల్, స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్విక్, నోస్తుష్ కెంజిగే, మిలింద్ కుమార్, నితీష్ కుమార్, ఉస్మాన్ రఫిక్ -
వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విధ్వంసం సృష్టించిన ఫించ్.. 4 ఫోర్లు, 5 సిక్సర్లతో..!
యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్ 2023లో ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (కాలిఫోర్నియా నైట్స్) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విధ్వంసం సృష్టించాడు. న్యూజెర్సీ లెజెండ్స్‌తో నిన్న (ఆగస్ట్ 21) జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 8 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో అజేయమైన 75 పరుగులు చేసిన ఫించ్.. ఇవాళ (ఆగస్ట్ 22) మోరిస్విల్లే యూనిటీపై 30 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 63 పరుగులు చేసి, తన భీకర ఫామ్‌ను కొనసాగించాడు. ఫించ్ ఒక్కడే ఒంటరిపోరాటం చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కాలిఫోర్నియా నైట్స్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఫించ్ వరుసగా రెండో మ్యాచ్‌లో అజేయమైన అర్ధశతకం సాధించగా.. జాక్ కలిస్ (9), మిలింద్ కుమార్ (6), సురేశ్ రైనా (6), ఇర్ఫాన్ పఠాన్ (9) విఫలమయ్యారు. మోరిస్విల్లే బౌలర్లలో పియనార్ 3 వికెట్లు పడగొట్టగా.. సావేజ్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సరిపోని ఫించ్ మెరుపులు.. కోరె ఆండర్సన్ ఊచకోత 101 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మోరిస్విల్లే.. మరో 7 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మోరిస్విల్లే బ్యాటర్ కోరె ఆండర్సన్ సుడిగాలి ఇన్నింగ్స్ (5 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ముందు ఫించ్ మెరుపులు సరిపోలేదు. ఛేదనలో ఆరంభంలో నిదానంగా ఆడిన మోరిస్విల్లే.. ఆఖర్లో ఆండర్సన్‌తో పాటు పియనార్ (12 బంతుల్లో 23 నాటౌట్; ఫోర్, సిక్స్), షెహన్ జయసూర్య (17 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో విజయతీరాలకు చేరింది. మోరిస్విల్లే ఇన్నింగ్స్‌లో పార్థివ్ పటేల్్ (9 బంతుల్లో 14; 2 ఫోర్లు), క్రిస్ గేల్ (10 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. కాలిఫోర్నియా బౌలర్లు పవన్ సుయాల్, ఆష్లే నర్స్, రికార్డో పావెల్ తలో వికెట్ పడగొట్టారు. -
చెలరేగిన అండర్సన్.. 8 సిక్స్‌లు, 7 ఫోర్లు.. ఛాంపియన్‌గా వరల్డ్ జెయింట్స్
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో తొలి ఛాంపియన్‌గా వరల్డ్ జెయింట్స్ నిలిచింది. ఒమెన్ వేదికగా ఆసియా లయన్స్‌తో జరిగిన ఫైనల్లో వరల్డ్ జెయింట్స్ 25 పరుగులు తేడాతో విజయం సాధించింది. వరల్డ్ జెయింట్స్ విజయంలో కేవిన్ పీటర్సన్, కోరీ ఆండర్సన్ కీలకపాత్ర పోషించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. కాగా వరల్డ్ జెయింట్స్ బ్యాటర్ కోరీ అండర్సన్ విద్వంసం సృష్టించాడు. కేవలం 48 బంతుల్లో 93 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉన్నాయి. అండర్సన్‌తో పాటు పీటర్సన్(48), బ్రాడ్ హాడిన్(37),సామీ(38) పరుగులతో రాణించారు. ఇక 257 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసియా లయన్స్ 8 వికెట్లు కోల్పోయి 231 పరుగులకే పరిమితమైంది. ఆసియా లయన్స్ బ్యాటర్లలో సనత్ జయసూర్య(38), మహ్మద్ యూసుఫ్(39), దిల్షాన్(25) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. వరల్డ్ జెయింట్స్ బౌలర్లలో ఆల్బీ మోర్కెల్ మూడు వికెట్ల పడగొట్టగా, మాంటీ పనేసర్ రెండు వికెట్లు సాధించాడు. చదవండి: Under 19 World Cup: రవి కుమార్ ‘స్వింగ్’.. సెమీస్‌లో యువ భారత్ -
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
క్రైస్ట్‌చర్చ్: ఒకవైపు తరచూ గాయాల బారిన పడుతుండటం... మరోవైపు కాబోయే భార్యతో అమెరికాలో స్థిరపడే అవకాశం రావడం... వెరసి న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరె అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని... క్లబ్ క్రికెట్లో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు అమెరికాలోని మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)తో అండర్సన్ మూడేళ్లపాటు ఒప్పందం చేసుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున 13 టెస్టులు, 49 వన్డేలు, 31 టి20 మ్యాచ్‌ల్లో పాల్గొన్న అండర్సన్ మొత్తం 2,277 పరుగులు చేశాడు. 90 వికెట్లు తీశాడు. ‘ఈ నిర్ణయాన్ని సులువుగా తీసుకోలేదు. రాబోయే కాలంలో ఏం చేయాలనుకుంటున్నానో ఇప్పుడే నిర్ణయించుకున్నాను. నా కాబోయే భార్య మేరీ మార్గరెట్ అమెరికాలో పుట్టి పెరిగింది. నా కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేసింది. మేజర్ లీగ్ క్రికెట్ రూపంలో అమెరికాలో ఉండేందుకు, వీలైతే అక్కడే స్థిరపడేందుకు నాకు అవకాశం లభించింది. దాంతో భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని 29 ఏళ్ల అండర్సన్ తెలిపాడు. 2014 జనవరి 1న విండీస్‌పై అండర్సన్ 36 బంతుల్లో సెంచరీ సాధించి వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. 2015లో వెస్టిండీస్‌పైనే డివిలియర్స్ 31 బంతుల్లోనే శతకం బాది ఈ రికార్డును బద్దలు కొట్టాడు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019