breaking news
-
మేడిగడ్డ డిజైన్లలో వైరుధ్యాలెందుకు?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పోల్చితే మేడిగడ్డ బ్యారేజీ నిర్మిత స్థలంతోపాటు ర్యాఫ్ట్–ఎగువ/దిగువ కాటాఫ్ వాల్స్ మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లలో వైరుధ్యాలు ఎందుకు ఉన్నాయని నీటిపారుదల శాఖలో కీలకమైన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో)ను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. ఈ విషయంలో సీడీవో తీసుకున్న అంతర్గత నిర్ణయాలకు సంబంధించిన నోట్స్‌ను అందించాలని కోరింది. ‘‘కాఫర్ డ్యామ్ నిర్మాణంలో భాగంగా నది గర్భంలో పాతిన షీట్‌పైల్స్‌ను మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్తిగా తొలగించారా? లేదా? కుంగిపోయిన ఏడో బ్లాక్ పునాదులకు ఎదురుగా కొంతభాగంలో షీట్‌పైల్స్‌ను అలానే వదిలేశారా? అక్కడ భూమి కోతకు గురికావడానికి ఇదే కారణమా?’’ అని నిలదీసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం జరిపి, పరిష్కారాలను సూచించడానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్రంలో రెండోసారి పర్యటించిన కమిటీ.. 52 ప్రశ్నలతో సీడీవో విభాగానికి ప్రశ్నావళి అందించి, త్వరగా బదులివ్వాలని కోరింది. ర్యాఫ్ట్, సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్లపై ఫోకస్ మేడిగడ్డ బ్యారేజీల పునాది (ర్యాఫ్ట్), సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లు, నిర్మాణంపై అయ్యర్ కమిటీ ప్రధాన దృష్టిసారించింది. బ్యారేజీల్లో లోపాలకు ఇవి కూడా ముఖ్యకారణం కావచ్చన్న చర్చ ఉంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఎగువ/దిగువ కాటాఫ్లు–ర్యాఫ్ట్ల మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్‌ను అందించాలని సీడీవోను కమిటీ కోరింది. ‘‘జాయింట్లలో లాకింగ్ ఏర్పాట్లున్నాయా? బ్యారేజీలకు రక్షణ కల్పించాల్సిన అప్రాన్ దెబ్బతిని ర్యాఫ్ట్ కుంగిపోతే, సెకెంట్ పైల్స్–ర్యాఫ్ట్ మధ్య జాయింట్లు విరిగిపోవా? మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్ 2.5 మీటర్ల మందం ఉంటే.. ర్యాఫ్ట్–సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్‌గా వేసిన శ్లాబు మందం 1.5 మీటర్లు మాత్రమే ఉంది. నీటి ఒత్తిడిని జాయింట్ ఎలా తట్టుకుంటుంది?.’’ అని ప్రశ్నించింది. దృఢమైన రాతిపై కటాఫ్వాల్స్ను నిర్మిస్తే.. ర్యాఫ్ట్ కుంగిపోయేందుకు ఉన్న అవకాశాలను ఊహించలేదా? అని అడిగింది. బ్యారేజీలను తేలియాడే కట్టడాలుగా డిజైన్ చేశారా? స్థిరంగా ఉండేలా చేశారా అని ప్రశ్నించింది. సీడీవోలో ఎవరేం చేస్తారు? సీడీవోలో చీఫ్ ఇంజనీర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు అధికారాల శ్రేణి, బాధ్యతలను, విభాగం నిర్మాణ క్రమాన్ని తెలపాలని కమిటీ కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పనలో సీడీవో పాత్ర, ఇతర వివరాలు ఇవ్వాలని అడిగింది. ‘‘బ్యారేజీలకు పరీక్షలను సంతృప్తికర స్థాయిలో జరిపారా? మార్గదర్శకాలకు అనుగుణంగా ఇన్వెస్టిగేషన్లు చేశారా? లోటుపాట్లు ఏమైనా గుర్తించారా?’’ అని ప్రశ్నించింది. డీపీఆర్, ఆ తర్వాత నిర్మాణ దశల్లో ప్రతి బ్యారేజీ విషయంలో నిర్వహించిన సబ్ సర్ఫేస్ జియోలాజికల్/జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ల వివరాలను అందించాలని కోరింది. డిజైన్ ఉల్లంఘనలేమిటి ? సీడీవో కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్‌ను ఉల్లంఘించి ప్రాజెక్టు నిర్మాణ విభాగం జరిపిన నిర్మాణాలేమిటో తెలపాలని నిపుణుల కమిటీ కోరింది. లేఖలు/ సవరణ డ్రాయింగ్స్ ద్వారా ఆ ఉల్లంఘనలకు తర్వాతి కాలంలో అనుమతి ఇచ్చారా? ఇస్తే ఆ సవరణ డ్రాయింగ్స్ జాబితా ఇవ్వండి అని అడిగింది. ‘‘సీడీవో కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్ జారీ చేయడానికి ముందే నిర్మాణ సంస్థలు పనులు ప్రారంభించాయా? దీనివల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో డ్రాయింగ్స్‌ను మళ్లీ సవరించాలనే ఒత్తిడిని సీడీవో ఎదుర్కోవాల్సి వచ్చిందా? బ్యారేజీల నిర్మాణానికి పరిశీలించిన ప్రత్యామ్నాయ స్థలాలేవి? ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు’’ అని ప్రశ్నించింది. బ్యారేజీల గేట్ల నుంచి విడుదలయ్యే వరదతో దిగువన భూమి కోతకు గురవకుండా తగిన మోతాదులో నీరుండేలా టెయిల్ పాండ్‌ను డిజైన్ చేశారా అని.. నిబంధనల ప్రకారమే గేట్లను ఆపరేట్ చేశారా? వివరాలు ఇవ్వాలని కోరింది. -
కాళేశ్వరం అధికారులపై NDSA కమిటీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన అధికారులు, ఇంజనీర్లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ చీఫ్, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ సీరియస్ అయ్యారు. శనివారం ప్రాజెక్టు పరిశీలన అనంతరం జలసౌధలో జరిగిన కీలక సమావేశంలో ఇది చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు తెలుసుకునే క్రమంలో అధికారుల తీరుపై అయ్యర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ భేటీలో కమిటీ అడిగిన ప్రశ్నలకు.. కొంతమంది అధికారులు క్లారిటీ లేని సమాధానాలిచ్చారు. అలాగే పలు ప్రశ్నలకు సమాధానాలు లేవంటూ నేరుగా చెప్పడంతో కమిటీ నిర్ఘాంతపోయింది. ఈ క్రమంలో.. ఇంజనీర్లు ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకోవడంతో చంద్రశేఖర్ అయ్యర్ వాళ్లపై గరం అయ్యారు. ఇలా సమావేశంలో మూడుసార్లు ఆయన అధికారులపై సీరియస్ అయినట్లు సమాచారం. ఈ మీటింగ్‌లో నీటిపారుదల శాఖ అధికారులు, ప్రభుత్వ అధికారులతో పాటు ఈ మూడు బ్యారేజీలకు పని చేసిన వర్క్ ఏజెన్సీలు పాల్గొన్నాయి. అలాగే.. 2016 నుంచి ప్రస్తుతం (ఈనెల 8వ తేదీ దాకా) బ్యారేజీల ఇన్వెస్టిగేషన్, హైడ్రాలజీ, మోడల్ స్టడీస్, డిజైన్లు, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌లో పాల్గొన్నవారు.. ఆయా విభాగాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వారితోపాటు బదిలీ అయినవారు, పదవీ విరమణ చేసినవారు కూడా విధిగా ఈ మీటింగ్‌కు హాజరు కావడంతో ఎన్డీఎస్ఏ కమిటీ కీలక సమాచారాన్నే రాబట్టే ప్రయత్ని చేసినట్లు స్పష్టమవుతోంది. ఇక తమ పర్యటన నేటితో ముగియడంతో ఆరుగురు సభ్యులతో కూడిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) కమిటీ బృందం ఢిల్లీకి పయనం అయ్యింది. అంతకు ముందు.. గురు, శుక్ర వారాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కమిటీ సందర్శించింది. భద్రత నడుమ.. కుంగిన ప్రాంతాలను పరిశీలించడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించింది. నాలుగు నెలల్లో ఈ కమిటీ తమ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. -
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర కమిటీ
-
సీఎం రేవంత్‌రెడ్డికి ధరణి కమిటీ మధ్యంతర నివేదిక
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మధ్యంతర నివేదికను ధరణి కమిటీని అందజేసింది. 2020 ఆర్వోఆర్ చట్టంలో లోపాలు ఉన్నాయని సీఎంకు ధరణి కమిటీ నివేదించింది. సీఎం రేవంత్ మాట్లాడుతూ, ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. 2.45 లక్షల పెండింగ్ సమస్యలను మార్చి మొదటి వారంలో అన్ని ఎమ్మార్వో ఆఫీస్‌లలో సమస్యల పరిష్కారం చూపాలన్నారు. హడావుడి నిర్ణయాలతో కొత్త చిక్కులు వచ్చాయని, ధరణి కమిటీ పూర్తి స్థాయి నివేదిక తర్వాత శాశ్వత పరిష్కారానికి నిర్ణయం తీసుకుంటామన్నారు. 35 మ్యాడ్యూల్స్ ఉన్నప్పటికీ దేనికి దరఖాస్తు చేసుకోవాలో తెలియని పరిస్థితి ఉందని, రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్ల శాఖల మధ్య సమన్వయ లోపం ఉందని సీఎం అన్నారు. కాగా, ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కి అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఆ పోర్టల్‌ను నిర్వహిస్తోన్న ప్రైవేటు ఏజెన్సీ కాలపరిమితి కూడా ముగియడంతో ఈ బాధ్యతలను ఎన్ఐసీకి అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఈ పోర్టల్ నిర్వహణ బాధ్యతలతో పాటు ధరణి ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారంలోనూ వేగంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదీ చదవండి: తుది దశకు బీజేపీ అభ్యర్థుల జాబితా! -
ఎన్ఐసీ చేతికి ధరణి?
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కి అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఆ పోర్టల్‌ను నిర్వహిస్తోన్న ప్రైవేటు ఏజెన్సీ కాలపరిమితి కూడా ముగియడంతో ఈ బాధ్యతలను ఎన్ఐసీకి అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఈ పోర్టల్ నిర్వహణ బాధ్యతలతో పాటు ధరణి ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారంలోనూ వేగంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధరణి కమిటీ సభ్యులు, రెవెన్యూ అధికారులు, వక్ఫ్, దేవాదాయ, అటవీశాఖల అధికారులతో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ధరణి కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్‌కుమార్, రేమండ్‌పీటర్, నవీన్‌మిత్తల్, మధుసూదన్ నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే 22 అంశాలతో నివేదికను ప్రభుత్వానికి ఇచి్చనట్టు తెలుస్తోంది. ఈ అంశాలపై శనివారం జరగనున్న సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. చేవ్రాలే... ప్రాతిపదిక ఈ సమావేశంలో భాగంగా ధరణి పోర్టల్ ద్వారా వచ్చి పెండింగ్‌లో ఉన్న 2.46లక్షల దరఖాస్తులను ఎలా పరిష్కరించాలి? భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా పార్ట్–బిలో చేర్చిన 13.5లక్షల ఎకరాల కు సంబంధించిన భూముల సమస్యలను ఎలా నివృత్తి చేయాలి? అన్న దానిపై నిర్ణయాలు తీసుకో నున్నారు. దీంతో పాటు ధరణి సమస్యల పరిష్కారానికి ఆన్లైన్లో ఉన్న అస్తవ్యస్త రికార్డులను కాకుండా మాన్యువల్ పహాణీలను ప్రాతిపదికగా తీసుకునే అంశంపై కూడా చర్చించనున్నారు. రెవెన్యూ–అటవీ, రెవెన్యూ–దేవాదాయ, రెవెన్యూ–వక్ఫ్ శాఖల మధ్య అంతరాలు ఉన్న భూములపై కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నట్టు తెలిసింది. వీటితో పాటు ధరణి దరఖాస్తులు జిల్లా కలెక్టర్ స్థాయిలో కాకుండా ఆర్డీవో, తహశీల్దార్ స్థాయిలోనే పరిష్కారమయ్యేలా అధికార వికేంద్రీకరణపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్వోఆర్ చట్టంలో ఎలాగూ ఈ అధికారాలు కలెక్టర్లకు బదలాయించకపోవడంతో చట్ట సవరణ కూడా అవసరం లేదని, అధికారిక ఉత్తర్వులతో ఈ వికేంద్రీకరణ సాధ్యమవుతుందని భావిస్తున్నారు. మొత్తంగా నేడు జరగనున్న కీలక సమీక్షలో ధరణి పోర్టల్‌కు సంబంధించి పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019