breaking news
-
కోతి... కొబ్బరి కాయ!
కోతి చేష్టలన్న మాట మీరెప్పుడైనా విన్నారా? అర్థం పర్థం లేని పనులు చేస్తూంటే వాడతారిలా! కానీ మీరోసారి థాయ్‌లాండ్, మరీ ముఖ్యంగా... దేశం దక్షిణం వైపున ఉన్న కొబ్బరి తోటలకు వెళ్లి చూడండి... మీ అభిప్రాయం తప్పకుండా మార్చుకుంటారు. ఏముంది అక్కడ అని ఆలోచిస్తూంటే కథనాన్ని పూర్తిగా చదివేయండి!! విషయం ఏమిటంటే... థాయ్‌ల్యాండ్‌లో కోతులు కొబ్బరికాయలు కోసే పని చేస్తున్నాయట కొబ్బరికాయలు తెంపడం అంత సులువైన పనేమీ కాదండోయ్. నిట్ట నిలువుగా 30-40 అడుగులున్న కొబ్బరి చెట్లు ఎక్కడం ఒక సవాలైతే.. బ్యాలెన్స్ చేసుకుంటూ కాయలు తెంపడమూ ఓ కళ... నైపుణ్యమే. అయితే ఈ నైపుణ్యం ఉన్న వారు రాను రాను తగ్గిపోతున్నారని కొబ్బరి తోటల పెంపకం దారులు తరచూ వాపోతూంటారు. కూలీలు దొరక్క ఇబ్బందులు పడటమూ మనం చూస్తూంటాం. థాయ్‌ల్యాండ్ రైతులు పరిష్కారం కనుక్కున్నట్టు కనిపిస్తోంది. ఇక్కడ కోతులకు కొబ్బరి కాయలు తెంపడంలో శిక్షణ ఇచ్చి వాటి సేవలను వాడుకుంటున్నారు మరి! కానీ విశేషం ఏమిటంటే... కోతులు ఆ పనులు చాలా చక్కగా పద్ధతిగా చేస్తూండటం. ఎంత పద్ధతిగా చేస్తున్నాయంటే.. మగ కోతులు చెట్లు ఎక్కి కాయలు తెంపుతూంటే... ఆడ కోతులు కిందపడ్డ వాటిని రైతుల వాహనాల్లోకి చేర్చడం వంటివి చేస్తున్నాయి. నాణేనికి మరోవైపు... కొబ్బరి కాయలు తెంపేందుకు కోతుల వాడకం బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. నాణేనికి ఇంకో పార్శ్వమూ ఉన్నట్లు దీనిపై కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, కథనాలను బట్టి చూస్తే థాయ్‌లాండ్ రైతులు ఈ కోతులను కూలీలుగా వాడుకుంటున్నా.. అందుకు తగ్గ ప్రతిఫలమూ వాటికి అందిస్తున్నారు. వాటి ఆకలిదప్పులు తీర్చడం మాత్రమే కాకుండా.. ఇంటి మనిషిగానూ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ కోతుల పట్ల కొంతమంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారని, పనులు చేయనప్పుడు చైన్లతో కట్టిపడేస్తున్నారన్నది జంతు ప్రేమికుల ఆరోపణ. పైగా కాయలు తెంపే కోతులను అడవిలోంచి వేటాడి పట్టుకొస్తున్నారని, చిన్న వయసులోనే అక్రమంగా పట్టుకొచ్చి శిక్షణ ఇచ్చి పని చేయించుకుంటున్నారని పెటా (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ అనిమల్స్) వంటి సంస్థలు విమర్శిస్తున్నాయి. శిక్షణ సందర్భంగానూ కోతులపట్ల సరిగా వ్యవహరించడం లేదని చెబుతున్నారు. దాడులు చేసినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు కోతుల పళ్లు తీసేస్తున్నారని తెలుస్తోంది. ఎగుమతులకు పెట్టింది పేరు... థాయ్‌లాండ్ కొబ్బరి ఎగుమతులకు పెట్టింది పేరు. స్థానికంగానూ కొబ్బరి పాలకు డిమాండ్ ఎక్కువ. పశువుల నుంచి సేకరించే పాలకు బదులుగా ఇక్కడ పచ్చి కొబ్బరి పాలను ఉపయోగిస్తూంటారు. అయితే ఇటీవలి కాలంలో కోతులతో కాయలు తెంపిస్తున్నారన్న వార్తలు ప్రబలడంతో నైతికాంశాల రీత్యా కొంతమంది కొబ్బరి పాల వాడకాన్ని తగ్గించినట్లు తెలుస్తోంది. కొన్ని బహుళజాతి కంపెనీలు కూడా కోతులను కూలీలుగా వాడుతున్న వారి ఉత్పత్తులను కొనరాదని తీర్మానించాయి. ఇదీ థాయ్‌లాండ్ కోతుల చేష్టలు! మీరేమంటారు? కోతులను మనం కూలీలుగా వాడుకోవచ్చా? లేక వాటి మానాన వాటిని వదిలేయాలా? -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్: 51 టెంకాయలు ఆర్డర్.. ‘ఎక్స్’ పోస్ట్ వైరల్!
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగింది. భారత్ విజయం కోసం కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆతృతంగా ఎదురు చూశారు.. అన్ని వర్గాల వారు ఆకాంక్షించారు.. ప్రార్థనలు చేశారు. కానీ అవేవీ ఫలించలేదు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు వరల్డ్ కప్‌లో భారత్ విజయం సాధించి కప్ గెలిస్తే కొట్టడానికి 51 టెంకాయలను థానేకు చెందిన ఓ వ్యక్తి ఫుడ్‌డెలివరీ యాప్ స్విగ్గీలో ఆర్డర్ చేశారు. ఈ సమాచారాన్ని స్విగ్గీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా తెలియజేసింది. థానే నుంచి ఎవరో ఇప్పుడే 51 టెంకాయలు ఆర్డర్ చేశారు. బహుశా వరల్డ్ కప్ ఫైనల్ గెలుపు కోసమే అయిఉండచ్చు. అదే నిజమై భారత్‌కు కప్ రావాలని ఆకాంక్షించింది. కాగా స్విగ్గీ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ ఆర్డర్ చేసింది తానే అంటూ ఓ వ్యక్తి స్విగ్గీ పోస్ట్‌ను రీట్వీట్ చేశారు. భారత్ వరల్డ్ కప్ గెలిస్తే కొట్టడానికే టెంకాయలు ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. టీవీ ముందు టెంకాయలు ఉంచిన దృశ్యాన్ని ఈ ట్వీట్‌కు జత చేశారు. ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. లక్షల్లో వ్యూవ్స్, కామెంట్లు వచ్చాయి. కాగా ఇదే వ్యక్తి భారత్ విజయాన్ని వ్యక్తీకరించడానికి 240 అగరబత్తులను ఆర్డర్ చేశారు. haan bhay yeh someone from thane bhi mai hi hoon, 51 nariyal for unreal manifestation✨ https://t.co/aNa3WACNOp pic.twitter.com/kVuQ6WjCjH — gordon (@gordonramashray) November 19, 2023 -
కొబ్బరి మాత్రమే ఆహారం..ఈ పెద్దాయన డైట్ ప్లాన్ వింటే షాకవుతారు..
‘ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా..’ అంటూ వేడి అన్నంలోకి నెయ్యి, పప్పు, ఆవకాయ, అప్పడాలు ఇలా ఎన్నో రకరకాల వంటకాలను తింటుంటారు భోజన ప్రియలు. అదే ప్రతిరోజూ ప్రతిపూట ఒకే ఆహారం తినాల్సి వస్తే? ఆ బాధ వర్ణించరానిది. అలాంటిది ఒక వ్యక్తి ఎంతో ఇష్టంగా ఒకే ఆహారాన్ని గత రెండు దశాబ్దాలుగా తీసుకుంటున్నాడు. కేరళలోని కాసరగోడ్‌కు చెందిన బాలకృష్ణ పలాయి, గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా కేవలం కొబ్బరి నీళ్లు, కొబ్బరి కాయలు తింటూ జీవితం సాగిస్తున్నాడు.ఎందుకంటే, అతనికి ‘గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లెక్స్ డిసీజ్ (జీఈఆర్డీ). ఈ జబ్బుతో బాధపడేవారి అన్నవాహిక చివర ఉండే కండరం సరిగ్గా మూసుకోదు. దీంతో, ఏ ఆహారం తిన్నా గుండెల్లో మంట, వాంతులు, కడుపు ఉబ్బరంతో నీరసించి, ఒక్కోసారి కుప్పకూలిపోతారు కూడా. బాలకృష్ణకు కూడా ఇదే పరిస్థితి. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ, తక్కువ మొత్తంలో ఆహారం తిసుకునేవాడు. కాలక్రమంలో తనకు కొబ్బరి నీళ్లతో ఏ ఇబ్బంది లేదని గ్రహించాడు. తర్వాత కొంచెం లేత కొబ్బరిని ప్రయత్నించాడు. దాంతో కూడా ఏ ఇబ్బంది లేకపోవడంతో ఇక తన ఆహారం కేవలం కొబ్బరి మాత్రమేనని నిర్ణయించుకున్నాడు. View this post on Instagram A post shared by Travel, Romance, Smiles (@shenaztreasury) కొబ్బరినీళ్లతో బోలెడు ప్రయోజనాలు ► కొబ్బరినీళ్లలో యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి అనేకరకాల వ్యాధులను దూరం చేస్తాయి. ► కొబ్బరినీళ్లలో 94 శాతం నీరు ఉంటుంది. ఇది వ్యార్థాలను తొలగించి శరీరాన్ని డీటాక్స్ చేస్తాయి. ► కొబ్బరినీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ► జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపర్చడమే కాకుండా పొట్ట సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. ► రోజూ కొబ్బరినీళ్లు తాగడం వల్ల అధిక రక్తపోటును నివారిస్తుంది. ► గుండెజబ్బులు, హార్ట్ ఫెయిల్యూర్ రిస్కును తగ్గించడంలో కొబ్బరినీళ్లు ముఖ్య పాత్ర వహిస్తుంది. కొబ్బరిలో ఎన్నో మినరల్స్, కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి, కాబట్టి బాలకృష్ణ ఆరోగ్యంగా ఉన్నాడు. అంతేకాదు, లోకల్ క్లబ్లో తనకెంతో ఇష్టమైన ఫుట్‌బాల్ ఆడుతూ ఫుట్‌బాల్ ప్లేయర్‌గానూ విజయాలు సాధిస్తున్నాడు. -
ఎండుకొబ్బరి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి
ఎండుకొబ్బరిని నిల్వ ఉంచిన కొద్దిరోజులకే కొబ్బరిచిప్ప లోపల బూజులాగా రావడం, కొన్నిసార్లు లోపల తెల్లగా ఉన్నప్పటికీ చేదుగా మారడం చూస్తుంటాం. ఇవేవీ రాకుండా, కొబ్బరిచిప్పలను చింతలేకుండా ఇలా నిల్వచేసుకోండి... మార్కెట్ నుంచి తెచ్చిన ఎండు కొబ్బరి చిప్పలను శుభ్రంగా తుడిచి, ఎండలో ఆరబెట్టాలి. ఆరిన చిప్పలను ఉప్పునీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి. ఇప్పుడు కొద్దిగా కొబ్బరినూనెను వేళ్లతో తీసుకుని చిప్పకు రాసి నిమిషం పాటు రుద్దాలి. ఈ చిప్పలను రెండురోజుల పాటు ఎండలో పెట్టి , కవర్లో మూటకట్టాలి. ఈ మూటను గాలిచొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇలా పెట్టిన కొబ్బరి నెలల పాటు పాడవకుండా ఉంటుంది. టేబుల్ స్పూను పటిక పొడిని కప్పు నీటిలో కలపాలి. పటిక మొత్తం కరిగిన తరువాత ఈ నీటిలో చిన్న గుడ్డను ముంచి కొబ్బరి చిప్పల లోపల, బయటా తుడవాలి. ఇలా తుడిచిన చిప్పలను ఎండలో రెండు రోజుల పాటు ఆరబెట్టి, కవర్లో మూటకట్టాలి. ఈ మూటను గాలిచొరబడని డబ్బాలో నిల్వచేయాలి. ఇలా కూడా ఎక్కువ రోజుల పాటు చిప్పలు తాజాగా ఉంటాయి. -
శివయ్య ప్రసాదం.. మూగజీవులకు ఆహారం
రాజంపేట టౌన్ (అన్నమయ్య జిల్లా): కార్తీక మాసం సందర్భంగా వందలాది మంది భక్తులు శివాలయాలకు తరలి వచ్చి దీపాలను వెలిగించి స్వామివారికి పండ్లను ప్రసాదంగా ఉంచుతారు. ఆ పండ్లను భక్తులు తమ వెంట తీసుకెళ్లకుండా అక్కడే ఉంచి వెళ్లిపోతారు. వందలాది మంది భక్తులు వదిలి వెళ్లే వివిధ రకాల పండ్లు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ప్రధానంగా భక్తులు దీపాలను వెలిగించాక స్వామివారికి అరటి పండ్లను ప్రసాదంగా పెడతారు. ఒక్క రాజంపేట పట్టణంలోని శివాలయంలోనే కార్తీక సోమవారం రోజు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు స్వామివారికి ప్రసాదంగా పెట్టే అరటి పండ్లు వేల సంఖ్యలో ఉంటాయి. ఈ కారణంగా కొన్ని గంటల వ్యవధిలోనే ఆలయ ప్రాంగణమంతా వేల సంఖ్యలో అరటి పండ్లు పడి ఉంటాయి. అయితే ఈ పండ్లు నిరుపయోగమవుతున్నాయని పట్టణంలోని ఈడిగపాళెంకు చెందిన నరసింహా అనే ఎలక్ట్రీషియన్ గుర్తించాడు. పండ్లను మూగజీవులకు ఆహారంగా పెడితే ఒక రోజు అయినా అవి కడుపు నింపుకోగలవన్న ఆలోచన ఆయనలో తట్టింది. అనుకున్నదే తడవుగా తన షాపునకు చుట్టుపక్కల ఉండే చిరు వ్యాపారులు, దినసరి కూలీల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి, భక్తులు శివాలయ ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ వదిలిన అరటి పండ్లను ఏరుకొని మూగజీవులకు ఆహారంగా పెడతామని చెప్పాడు. వారు కూడా నరసింహా ఆలోచన సరైనదేనని భావించి కార్తీక మాసంలో భక్తులు శివాలయంలో స్వామివారికి ప్రసాదంగా పెట్టే అరటి పండ్లతో పాటు కొబ్బెర చిప్పలను మూగజీవులకు ఆహారంగా పెట్టేందుకు ముందుకు వచ్చారు. 2016వ సంవత్సరం నుంచి కరోనా సమయంలో మినహా ప్రతి ఏడాది కార్తీక మాసంలో నరసింహాతో పాటు చిరువ్యాపారులు, దినసరి కూలీలైన వెంకటనరసయ్య, రమణ, బీవీ సురేంద్ర, ఉమాశంకర్‌లు శివాలయంలోని అరటి పండ్లను గోతాల్లో వేసుకొని ప్రత్యేక వాహనంలో రాపూరు ఘాట్‌లో ఉండే కోతులకు ఆహారంగా పెడుతున్నారు. కార్తీక మాసంలో ప్రతి మంగళవారం ఈ చిరు వ్యాపారులు, దినసరి కూలీలు తమ పనులను సైతం మానుకొని ఆటో బాడుగను కూడా వారే భరించి మూగజీవులకు చేస్తున్న సేవకు పట్టణ వాసులచే ప్రసంశలు, అభినందనలు అందుకుంటున్నారు. రాపూరు ఘాట్‌లో కోతులు పెద్ద సంఖ్యలో ఉంటాయని, వాటికి ఎవరు కూడా ఆహారం పెట్టే పరిస్థితి ఉండదని అందువల్ల ప్రతి ఏడాది కార్తీకమాసంలో ఈసేవా కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు. (క్లిక్ చేయండి: వెయ్యేళ్ల అన్నమయ్య ‘కాలి’బాట.. ఎక్కడుందో తెలుసా!)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019